Karthika Deepam 2 March 26th: జ్యోత్స్న ఆశలపై నీళ్లు.. ఆస్తి పంపకాలపై దశరథ ఊహించని షాక్

Photo Courtesy: JioHotstar

దశరథ, సుమిత్రలను జ్యోత్స్న చంపేసినట్లు పీడకల రావడంతో దీప నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది. ఏం జరిగిందని కార్తీక్ అడగ్గా.. దీప జరిగినదంతా చెప్పి అమ్మానాన్నలని చూడాలని చెబుతుంది. రేపొద్దున్నే తాత ఇంటికి వెళ్తున్నామని ధైర్యం చెబుతాడు కార్తీక్. సుమిత్రకు దశరథ అన్నం తినిపిస్తుండగా ఆమె కంటతడి పెడుతుంది. జ్యోత్స్న‌కి పెళ్లి చేసినా ఇక్కడే ఉంచుకుందాం, ఇల్లరికపు అల్లుడి గురించి వెతకమని చెబుతుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి డాడీ నాతో ఇదివరకటిలా ఉండటం లేదని బాధపడుతుంది.

అందరూ మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ హారిక రావడంతో షాక్ అవుతారు. సుమిత్రని రెగ్యులర్ చెకప్ కోసం నేనే రమ్మన్నానని చెబుతాడు దశరథ. సుమిత్రను పరీక్షించిన హారికకు ఆమె మెంటల్ కండీషన్ ఏం బాలేదని, బాధ కలిగించే ఏ విషయాలు చెప్పొద్దని హెచ్చరిస్తుంది. ఆ మాటలతో కార్తీక్, దశరథ, శివన్నారాయణలు షాక్ అవుతారు. జ్యోత్స్నని పర్సనల్‌గా పిలిచిన కార్తీక్.. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటీ? నీకున్న అనుమానాలు ఏంటీ? శౌర్యను ఎందుకు కిడ్నాప్ చేయించావు? హాస్పిటల్‌లో దీప రూమ్ బయట పారుని ఎందుకు కాపలా పెట్టావు? మా ఇంటికి పారుని ఎందుకు పంపించావు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాతో చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 26వ తేదీ 628వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 628 March 26th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మనిద్దరి జీవితాల్లో తుఫాను ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్లిపోయిందని సుమిత్రతో అంటుంది కాంచన. ఇద్దరు తల్లులకు రెండు బలమైన కోరికలు.. తీరే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ తీరాయి. నేను బ్రతికేశాను, నా వాళ్లందరితోనే నేనే ఉంటాను. నా కూతురి పెళ్లి చూడాలని నేను, నా కొడుకు బిడ్డను చూడాలని వదిన.. అవి రెండు మా కోరికలు. నా కోరిక తీరకుండానే పోతానని అనుకున్నాను. కానీ మన కోరికలు బలమైనవి.. అవి నిజం కావడానికి రెండు ప్రాణాలు నిలబడ్డాయని అంటుంది సుమిత్ర.

జ్యోత్స్న పెళ్లి గురించి అమ్మ బాధపడుతుంటే.. వీలైనంత త్వరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని దశరథకు చెబుతుంది దీప. కానీ పెళ్లయితే ఇప్పట్లో చేసుకోనని చెప్పిందని అంటాడు దశరథ. ఇక్కడ అత్త పగలు ప్రశాంతంగా లేదు, అక్కడ నీ కూతురు రాత్రుళ్లు నిద్రపోవడం లేదు. మీకు ఏదో అయిపోతుందని, జ్యోత్స్న మిమ్మల్ని ఏదో చేసేస్తుందని అర్ధరాత్రి ఉలిక్కిపడుతుంది. ఆవిడ ఎవరినీ ఏం చేయకుండా ఉండాలంటే పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపడమేనని చెబుతాడు కార్తీక్. ఇది అనుకున్నంత తేలికకాదని అంటాడు దశరథ.

కన్నప్రేమ గొప్పదా? పెంచిన ప్రేమ గొప్పదా? అని అడుగుతాడు దశరథ. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదని అంటాడు కార్తీక్. మనల్ని పెంచిన వాళ్లు మన రక్తం కాదు.. అయినాసరే వాళ్ల మీద ప్రేమను పెంచుకుంటాం. శౌర్య అంటే నాకు ప్రాణం.. అత్త కోసం నా కన్నబిడ్డను వదులుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు శౌర్యకు ఆరోగ్యం బాలేదు.. నా ప్రాణం పోయినా పర్లేదు నా కూతురిని కాపాడుకోవాలని అనుకున్నాను. కానీ నా బిడ్డ కోసం త్యాగానికి సిద్ధమయ్యానని చెబుతాడు కార్తీక్.

నా కన్నకూతురు అనుకున్న జ్యోత్స్న.. నా కన్నకూతురు కాదని తెలిసింది. జ్యోత్స్న మంచి కూతురు కాదేమో కానీ నేను మాత్రం మంచి తండ్రినే అంటాడు దశరథ. జ్యోత్స్నని అపురూపంగా పెంచుకున్నాను. తను గొప్పగా ఉండాలి, తను బాగా బతకాలని ఆశపడ్డాను. తన పనులు చూస్తే కోపం వస్తుంది.. తన ముఖం చూస్తే అన్నీ మరిచిపోతాను. నేను మారలేదు.. తనే మారిపోయిందని అంటాడు దశరథ. తను మారలేదు.. తన స్థానం మార్చిందని చెబుతాడు కార్తీక్.

తను ఈ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందోనన్న భయమే.. జ్యోత్స్నని ప్రమాదకరంగా మార్చేసిందని అంటాడు కార్తీక్. తను తల్లిని కాపాడేందుకు ఆపరేషన్ థియేటర్‌కి కూడా వచ్చిందని, త్యాగానికి సిద్ధమైందని చెబుతాడు దశరథ. తనే అసలైన నీ కూతురినని నమ్ముతోంది.. ఈ డైలమా స్టేజ్‌లో తను ఎన్నాళ్లు ఉంటుందో అప్పటి వరకు జ్యోత్స్న మామూలుగానే ఉంటుంది. ఇదంతా నాటకం అని తెలిసిన రోజున తన ఒరిజినాలిటీ బయటపడుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలని అంటాడు కార్తీక్. సుమిత్రకు నిజం చెప్పడానికి తనని మానసికంగా సిద్ధం చేయాలని చెబుతాడు దశరథ.

జ్యోత్స్న పెళ్లి చేసుకుని పిల్లలతో తిరుగుతూ ఉంటే అది కదా ఆనందం అంటే అంటుంది సుమిత్ర. ఈరోజుల్లో పెళ్లి సంబంధాలు కుదరాలంటే మామూలు విషయం కాదని చెబుతుంది సుమిత్ర. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని జ్యోత్స్న చెప్పింది, బిడ్డల జీవితం మనం అనుకున్నట్లుగా లేకపోతే ఆ బాధ భరించలేమని అంటుంది సుమిత్ర. దీపకి బిడ్డ పుట్టాక మీ ఇంట్లో వాతావరణం మారిపోతుందని చెబుతుంది. జ్యోత్స్న పెళ్లి చేసుకునే వరకు మీరు కోరుకున్న విధంగా ఉండలేనని అంటుంది సుమిత్ర. అయితే జ్యోత్స్నని నేను ఒప్పిస్తాను, నువ్వు ఓకే చెబుతావా అని అడుగుతాడు దశరథ. మీరు ఏం చేసినా అది పెళ్లికి ఒప్పుకుంటే చాలని అంటాడు. ఏం చేయబోతున్నావని దశరథని కార్తీక్ అడగ్గా.. నేను చెప్పడం కంటే మీరే చూడండని చెబుతాడు దశరథ.

ఉదయాన్నే లాయర్ రావడంతో అంతా షాక్ అవుతారు. నేను పిలవలేదు కదా? అని శివన్నారాయణ చెప్పగా.. నేనే రమ్మన్నాను, వీలునామా మార్చి రాయించాను అంటాడు దశరథ. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండటం నాకు నచ్చలేదు, దానిని మరొకరి పేరు మీదకి మార్చానని చెబుతాడు దశరథ. దీప అని చెప్పగా అంతా షాక్ అవుతారు. ఏది చెప్పకముందే ఎందుకు కంగారు పడుతున్నారని అంటాడు. ఉన్నట్లుండి వీలునామా మార్చడం ఏంటీ? మనకి తెలియకుండా ఏమైనా అయ్యిందా? అని జ్యోత్స్నని అడుగుతుంది పారు.

ఈ వీలునామాను తన రక్తం పంచుకుని పుట్టిన కూతురి వారసులకు చెందే విధంగా రాశారని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. యావదాస్తి తన కూతురు వారసులకు చెందుతుంది, 15 నెలల లోపు తన కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్లయి సంతానం కలగకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ నిర్ణయంపై దశరథను నిలదీస్తుంది పారు. ఈ ఆస్తి శివన్నారాయణ గారిది, నీ చెల్లెలి మీద కోపంతో ఏదో ఆవేశంతో మొత్తం ఆస్తి నీ పేరు మీద రాశారు. నువ్వు ప్రేమతో నీ కూతురికి రాశావంటే దానికి అర్ధముంది. ఇంకా కూతురికి పెళ్లే కాలేదు, కూతురి పిల్లలకి ఆస్తి రాయడం ఏంటీ? గీత గీసినట్లు 15 నెలలు గడువుపెట్టి, ఆ లోపు కూతురికి పెళ్లి జరిగి పిల్లల పుట్టకపోతే ఆస్తి మొత్తం నా మేనల్లుడి కుటుంబానికి దక్కుతుందంటే ఎలా అని నిలదీస్తుంది పారు.

ఓ కూతురికి తండ్రి చేస్తున్న మోసంగా అర్ధం చేసుకోవాలని అంటుంది జ్యోత్స్న. వీలునామా మార్చి రాసే అధికారం నీకెవరు ఇచ్చారు? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. ఆస్తి నువ్వు అనుభవించాలి అని అంటాడు. నీ కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, 15 నెలల గడువులో నువ్వు అనుకున్నవన్నీ జరగకపోతే ఆస్తి మొత్తం నీ మేనల్లుడికి కట్టబెడదామని అనుకుంటున్నావా? అని మండిపడుతుంది పారు. నువ్వు నా కూతురివి కాదా? నీ పిల్లలకే చెందాలని రాశాను కదా అని అంటాడు దశరథ. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరిగింది కదా? అని కార్తీక్‌పై మండిపడుతుంది జ్యోత్స్న.

మేం వచ్చింది ఆప్తుల కోసం ఆస్తుల్ని కొట్టేయడానికి కాదు.. మావయ్య వీలునామా మారుస్తాడని కాదనీ, దానిలో ఇలాంటి క్లాజ్ పెడతాడని కానీ నాకు తెలియదని అంటాడు కార్తీక్. అందరం హాల్లో‌ ఉంటేనే నువ్వు, దీప మాత్రం మా డాడీ వెంటే ఉన్నారు.. ఏదో చూడటానికి వచ్చినట్లు అత్తా, మావయ్య కూడా వచ్చారు. మీరొచ్చిందని మా మమ్మీని పలకరించడానికి కాదు.. ఆస్తుల్ని కొట్టేయడానికి అంటుంది జ్యోత్స్న. లాయర్ గారు వీలునామాను మార్చి రాయాలని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురివి కాదని చెప్పు.. ఇప్పుడే వీలునామా మారుస్తాను అంటాడు దశరథ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X