Karthika Deepam 2 March 27th:దీపకి ఊహించని గిఫ్ట్.. నోరుజారిన జ్యోత్స్న..అగ్రిమెంట్ నుంచి కార్తీక్‌కి విముక్తి

Photo Courtesy: JioHotstar

ఆపరేషన్ పూర్తయి క్షేమంగా ఇంటికొచ్చిన సుమిత్రని కాంచన, శ్రీధర్ పరామర్శిస్తారు. మనిద్దరి కోరికలు ఒకేసారి నెరవేరాయి.. జ్యోత్స్న పెళ్లి చూడకుండానే చనిపోతానని అనుకున్నా, కొడుకు బిడ్డ ఎక్కడ దూరమవుతుందోనని నువ్వు టెన్షన్ పడ్డాం. కానీ భగవంతుడి దయ వల్ల గండం నుంచి బయటపడ్డాం అని కాంచనతో అంటుంది సుమిత్ర. వీలైనంత త్వరగా జ్యోత్స్నకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేయమని దశరథతో చెబుతుంది దీప. నిజం చెప్పడానికి సుమిత్ర అత్తని మానసికంగా సిద్ధం చేద్దామని కార్తీక్ చెప్పడంతో సరేనని అంటాడు దశరథ. జ్యోత్స్న ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పేసింది.. అది పెళ్లి చేసుకుని పిల్లలతో ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఉందని చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నని పెళ్లికి ఒప్పించడానికి కొంచెం కఠిన నిర్ణయం తీసుకుంటానని దశరథ చెప్పగా.. సరేనని అంటుంది సుమిత్ర.

ఇంతలో ఇంటికి లాయర్ వచ్చి దశరథ గారు వీలునామాను మార్చి రాయించారని చెబుతాడు. దశరథ గారి రక్తం పంచుకుని కూతురికి పుట్టిన బిడ్డకు ఈ ఆస్తి చెందుతుందని, 15 నెలల్లో అలా జరగకపోతే ఆయన మేనల్లుడు కార్తీక్ కుటుంబానికి చెందుతుందని లాయర్ చదివి వినిపించడంతో అంతా షాక్ అవుతారు. మా నాన్నతో నువ్వు, నీ ఫ్యామిలీ కలిసి ఈ పని చేయించారని కార్తీక్‌పై విరుచుకుపడుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 27వ తేదీ 629వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 629 March 27th 2026 Here is full storyKarthika deepam 2 todays episode 629 March 27th Karthika deepam 2 Serial Was Running Successfully on Star Maa Channel Now Lets See This Serial Latest Episode 2 27

Photo Courtesy: JioHotstar

లాయర్ గారు ఇక్కడే ఉండాలి.. వీలునామా ఇప్పుడే మార్చి రాయాలి, దాంట్లో ఉన్న తప్పుల్ని సరిచేయాలని అంటుంది జ్యోత్స్న. దానిలో ఒక్క అక్షరం కూడా మార్చను, నువ్వు నా కూతురివి కాదని చెప్పు ఇప్పుడే వీలునామా మారుస్తానని దశరథ అనడంతో అంతా షాక్ అవుతారు. మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని ఎలా రాస్తావు? రాస్తే మాత్రం వాళ్లు ఎలా తీసుకుంటారు? అని జ్యోత్స్న నిలదీస్తుంది. తేరగా ఆస్తి కలుస్తుంటే వాళ్లెందుకు వద్దు అంటారని పారిజాతం నానామాటలు అంటుంది. నా భార్య కానీ, నా కొడుకు కానీ మీ ఆస్తుల మీద ఆశపడే మనుషులైతే ఈ పంచాయతీ ఏనాడో కోర్టులో జరిగేది అని శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. కాగితాలు తీసుకెళ్లి మరి బతిమలాడాను.. ఒక్క సంతకం పెడితే మా తాత మీద కేసు వేస్తానని అడిగాను. అందుకు నా భార్య కానీ, నా కొడుకు కానీ ఒప్పుకోలేదు, దీప కూడా నా భర్త ఇష్టమే నా ఇష్టమని చెప్పిందని గుర్తుచేస్తాడు శ్రీధర్.

నువ్వు అన్నదే నిజమైతే మేనల్లుడి కుటుంబానికి అన్న క్లాజు ఎందుకు పెట్టావని అత్త మా డాడీని అడిగేదని అంటుంది జ్యోత్స్న. యావదాస్తి కొడుకుకు చెందుతుంది అంటే కొడుకు యువరాజు అయిపోయినట్లేనని అంటుంది పారిజాతం. మామగారికి వెన్నుపోటు పొడిచావని నానామాటలు అనడంతో శ్రీధర్‌ రగిలిపోతాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ పంచాయతీ ఏంటని కొడుకు మీద సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నేను రాసిన వీలునామాను నువ్వు మార్చి రాశావంటే నీకు నా మీద ఎలాంటి గౌరవం ఉందో అర్ధమవుతోందని మండిపడతాడు శివన్నారాయణ. నేను వీలునామాను మార్చడానికి కారణం ఉందని అంటాడు దశరథ. నేనే కూతురిని అయితే ఇప్పుడు ఈయనెందుకు వీలునామా రాయాలని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది.

ఆ వీలునామా ఫైనల్ దానిని చింపడానికి వీల్లేదు.. ఆస్తి రాసింది నా కూతురికి, అంటే నీకు.. అలాగని నీకు అనిపించడం లేదా అని దశరథ అంటాడు. నా కూతురికి చెందాలని రాయలేదు, నా కూతురి పిల్లలకు చెందాలని రాశావు.. జ్యోత్స్న అని ఎందుకు రాయలేదు, దీనినే అన్యాయం అంటారని అంటుంది జ్యోత్స్న. ఇది డాడీ మాట్లాడటం లేదు.. వెనకుండి బావ మాట్లాడిస్తున్నాడని అంటుంది. దాంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. తప్పు వాడిది కాదు.. నీది. అగ్రిమెంట్ పేపర్‌తో ఇంట్లోకి రానిచ్చావు.. ఇప్పుడు ఆస్తి మొత్తానికి ఎసరు పెట్టాడని అంటుంది పారిజాతం. ఈ క్షణమే అగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేస్తున్నానని జ్యోత్స్న సంచలన నిర్ణయం తీసుకుంటుంది. బావకి, అగ్రిమెంట్‌కి సంబంధం లేదని అనడంతో అంతా షాక్ అవుతారు.

అగ్రిమెంట్ అనేది నీకు నాకు మధ్య జరిగింది.. వీలునామా అనేది నీకు మావయ్యకి మధ్య జరిగింది. దీనిలోకి నన్ను లాగొద్దని అంటాడు కార్తీక్. మేం వచ్చింది నీ ఆస్తిని పంచుకోవడానికి కాదు.. ఆ క్లాజు తీసేయండని కార్తీక్ అడగటంతో నువ్వు ఎవడివి నాకు చెప్పడానికి అంటాడు దశరథ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేను అగ్రిమెంట్ రాయించుకుని బావకి అన్యాయం చేశానని అనుకుంటున్నావు.. నువ్వు న్యాయం చేయాలని అనుకుంటున్నావా అని దశరథని నిలదీస్తుంది జ్యోత్స్న. అసలు అగ్రిమెంట్‌కి, వీలునామాకి సంబంధం ఏంటని శివన్నారాయణ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆస్తి మొత్తం దీపకి కట్టబెట్టడానికే ఈ వీలునామా డ్రామా అని అనుకుంటుంది జ్యోత్స్న. నీ మనవరాలికి అన్యాయం జరుగుతుంటే తప్పని చెప్పడం లేదు.. అదే మా మమ్మీ ఇక్కడ ఉండుంటే నా కోసం నిలబడేదని అంటుంది జ్యోత్స్న.

ఇంతలో సుమిత్ర వచ్చి ఇది అన్యాయం కాదని అంటుంది. వీలునామా మార్చడం గురించి నాకు తెలుసు.. నా భర్త నాకు చెప్పే చేశారని చెబుతుంది. నీ కూతురి కంటే నీకు ఆడపడుచు కొడుకే ఎక్కువైపోయాడా అని అంటుంది జ్యోత్స్న. నీకు పుట్టబోయే పిల్లలకు అంటే నీకు ఆస్తిని రాసినట్లే కదా అని అంటుంది సుమిత్ర. దానికి 15 నెలలు గడువు పెట్టడం దీనికి అని నిలదీస్తుంది జ్యోత్స్న. పెళ్లి చేసుకోమంటే ఇప్పట్లో చేసుకోను అన్నావు.. నీ మీద మాకు కొన్ని కలలు ఉండవా? నీకు కొన్ని ఆశలు ఉంటాయి? కొన్ని మనకి దక్కవు అని అర్ధమైనప్పుడు అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని చెబుతుంది సుమిత్ర. నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది.. నా కూతురి పిల్లలకు ఈ ఆస్తి దక్కుతుందని అంటుంది. మీ అమ్మ చెబితేనే నాకు అర్ధమైంది... ఆలోచించకుండా వీడి మీద కూడా కేకలు వేశానని అంటాడు దశరథ.

ఆస్తి మేనల్లుడి కుటుంబానికి దక్కడం అనే పాయింట్ వీలునామాకు ఎందుకు ఎక్కింది? కార్తీక్ గాడు చెప్పాడు కాబట్టి? కార్తీక్ ఎందుకు చెప్పాడు.. దీప కోరుకుంది కాబట్టి అని నానామాటలు అంటుంది పారిజాతం. ఆ మాటలతో దీప సీరియస్ అవుతుంది. నువ్వు పనిమనిషిగా వచ్చి కార్తీక్ గాడిని పెళ్లి చేసుకున్నావు అంటుంది. ఆ మాటలతో కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మీరు ఎన్ని చెప్పినా పనిమనిషి.. పనిమనిషే. అప్పుడప్పుడు దశరథని నాన్న అని పిలుస్తుంది కదా దానిని అడ్డం పెట్టుకుని ఆస్తిని కొట్టేయాలని అనుకుందని అంటుంది పారు. దీప కావాలని అనుకుంటే అని దశరథ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు. జ్యోత్స్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో? ఎప్పుడు పిల్లల్ని కంటుందో తన ఇష్టం మాకు ఎవరి ఆస్తులు అక్కర్లేదని చెబుతాడు. అసలు నేను దశరథ కూతురినేనా అని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. శ్రీధర్ - కాంచన ఇంటికి వెళ్తుండగా.. దీప నేను తర్వాత వస్తామని కార్తీక్ చెబుతాడు. ఆ మాటలతో కాంచన మండిపడుతుంది. వీలునామా రాసింది మీ నాన్న.. నా కొడుకుని, కోడల్ని అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.

స్వప్న కోసం పెళ్లికొడుకుని తీసుకుని వస్తాడు దాస్. దాంతో కావేరి, స్వప్న, కాశీలు షాక్ అవుతారు. స్వప్నని చూసి పెళ్లికొడుకు సంతోషిస్తాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు. నాకు అభ్యంతరం ఉందని కాశీ అంటాడు. నేను డివోర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టినా నా భార్య నాకు కావాలని కోరుకుంటున్నానని చెబుతాడు కాశీ. నువ్వు ఇంకోకరికి దగ్గరైతే మనం ఎప్పటికీ కలవలేం.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పమని అడుగుతాడు. అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమేనని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరిలు షాక్ అవుతారు.

వీలునామా గురించి ఆలోచిస్తూ కంగారుపడుతుంది జ్యోత్స్న. దశరథ కన్నకూతురు దీపేనని అనుకుంటుంది. ఇంతలో దీప వచ్చి అమ్మానాన్నల్ని బాధపెట్టొద్దని చెబుతుంది. నువ్వు ప్రతిదానికి అవసరాన్ని మించి ఆలోచిస్తున్నావని అంటుంది. మా ఇంటి విషయాల్లో మీరు అవసరానికి మించి ఇన్వాల్వ్ అవుతున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. నా కూతురి పిల్లలకు ఆస్తి రాశాను, నువ్వు నా కూతురివేమోనని చిన్నయ్య గారు అడిగితే.. బల్లగుద్ధినట్లు నేను నీ కూతురిని, ఆస్తి నాకు రాస్తే ఏంటీ? నా పిల్లలకు రాస్తే ఏంటీ? అని ఎందుకు చెప్పలేకపోయావు అని నిలదీస్తుంది దీప. ఒక తెలివైనవాడు, గేమ్ తెలిసినోడు.. ఒక గేమ్ స్టార్ట్ చేశాడు.. తెలివైనోడు గెలుస్తాడా? ఆట తెలిసినోడు గెలుస్తాడా? అని జ్యోత్స్న అడుగుతుంది. ఆట తెలిసినోళ్లే గెలుస్తారని అంటుంది దీప. నువ్వు ఆట తెలిసిన దానివి.. నేను తెలివైన దానిని, నేను ఒకటి గెలవాలని ఆడతాను, అది నాకు సొంతం అయ్యేలోపు నువ్వు గెలుచుకుని పోతావు అంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X