Karthika Deepam 2 March 28th: ఆస్తి వదులుకున్న దీప.. షాక్‌లో దశరథ, పారుని ఇరికించేలా కార్తీక్ స్కెచ్
Photo Courtesy: JioHotstar
లాయరు గారు వీలునామాను మార్చి రాయాల్సిందేనని జ్యోత్స్న పట్టుబట్టగా.. ఒక్క అక్షరం కూడా మార్చనని దశరథ తేల్చేస్తాడు. నువ్వు నా కూతురివి కాదా? అని దశరథ నిలదీయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీ చెల్లెలి కుటుంబం కోసం నాకు అన్యాయం చేస్తున్నావని జ్యోత్స్న మండిపడుతుంది. దశరథ బావకి ఆస్తి మొత్తం రాసిచ్చినప్పుడు మావయ్య గారి మీద కేసు వేద్దామని ఎంత అడిగినా కాంచన, కార్తీక్‌లు ఒప్పుకోలేదని.. అలాంటి వారిపై నిందలు వేయొద్దని చెబుతాడు శ్రీధర్. ఆ క్లాజు మార్చేయమని కార్తీక్ చెప్పగా.. అసలు నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటాడు దశరథ.
ఇంతలో సుమిత్ర వచ్చి వీలునామా మార్చాల్సిన అవసరం లేదు.. నా భర్త నాకు చెప్పే చేశారని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న పిల్లలకు ఆస్తి దక్కాలని రాశారంటే.. అది జ్యోత్స్నకి రాసినట్లేనని అంటుంది. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆస్తి జ్యోత్స్నదే అంటుంది సుమిత్ర. అసలు కార్తీక్ బావని అగ్రిమెంట్ పేరుతో ఇంట్లోకి రప్పించడమే నేను చేసిన తప్పు, ఇప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నానని చెబుతుంది జ్యోత్స్న. అందరూ వెళ్లిపోయిన తర్వాత వీలునామా గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న. ఇంతలో దీప వచ్చి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. త్వరగా మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 28వ తేదీ 630వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను గెలవాలని ఆడతాను కానీ అది నాకు సొంతం అయ్యేలోపు.. నువ్వు దానిని గెలుచుకుని వెళ్లిపోతావు. ఆట ఎలా ఆడాలో తెలిసిన నీలాంటి దాని ముందు తెలివైన నాలాంటిది ఓడిపోతూనే ఉందని దీపపై మండిపడుతుంది జ్యోత్స్న. నీ ఆట నువ్వు గెలవాలని ఆడతావు.. కానీ నా ఆటను నా వాళ్లను గెలవాలని ఆడతానని అంటుంది దీప. నీకు భయం రప్పిస్తా, భయం చాలా విలువైనది దానితో ఆడకూడదని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. అమ్మానాన్నలు నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందని చెబుతుంది దీప.
స్వప్నకి పెళ్లిచూపులు ఏర్పాటు చేయడంతో దాస్‌పై కోప్పడతాడు కాశీ. నేను ఇంత కష్టపడుతున్నది స్వప్న కోసమే.. అందుకే ఇక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాను, నువ్వు నీ కొడుకు భవిష్యత్తు కోసం ఏం చేయవా అని మండిపడతాడు. బాగా సంపాదించి నా భార్యను బాగా చూసుకోవాలని అనుకున్నాను. మనం ఎవరి కోసమైతే బతుకుతున్నామో వాళ్లే వెలివేస్తే తట్టుకోలేమని చెబుతాడు కాశీ. నేను నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను, నీ మీద కోపంతో స్వప్న సరే అంది కానీ.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతాడు దాస్. కన్నవాళ్లు కూడా తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు.. తను మాత్రం బాధపడదు. ఇది ఇలా కొనసాగకూడదని ఈ పెళ్లి సంబంధం చూశామని చెబుతాడు దాస్. తనకి ప్రేమను గుర్తుచేయమని చెబుతాడు. ఇంతలో దాస్‌కి కార్తీక్ ఫోన్ చేసి కొందరినీ దారిలోకి తీసుకురావాలంటే ఒక అబద్ధాన్ని నిజమని చెప్పమని అంటాడు. అందరినీ నడిపించే నువ్వు ఉండగా.. మాకు భయమెందుకు, శంఖం పూరిస్తానని చెబుతాడు దాస్. మీ అక్క జ్యోత్స్న కూడా మనిషిలా మారితే బాగుండేదని మనసులో అనుకుంటాడు దాస్.
వీలునామా గురించి దశరథ అన్న మాటల గురించి ఆలోచిస్తున్న జ్యోత్స్నకి జ్యూస్ ఇస్తుంది. జరిగినదంతా చూస్తుంటే.. ఈ వీలునామా మీ అమ్మనాన్న వేసిన స్కెచ్ అని అర్ధమవుతోందని అంటుంది పారు. నువ్వు వీలైనంత త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ ఆస్తి మొత్తం నీది అవుతుందని చెబుతుంది. 15 నెలల గడువులో పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎక్కడ కనాలి? నేను మనిషినా? మెషిన్‌నా అంటూ మండిపడుతుంది జ్యోత్స్న. సడెన్‌గా అగ్రిమెంట్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు? కార్తీక్‌ని దీపని ఇంట్లోంచి గెంటేద్దామని అనుకున్నావా అని అడుగుతుంది పారు. వీలునామాని మార్చి రాయించడానికి అదొక ఎత్తుగడ అంటుంది జ్యోత్స్న. నువ్వు సుమిత్ర కూతురివి అని పారు చెబుతుంది. కొన్ని అనుమానాలు తీరాలంటే సాక్ష్యాలు, రుజువులు కావాలని అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే జీవితం బాగుపడుతుంది, ఆస్తి కూడా నీకే దక్కుతుందని చెబుతుంది పారు.
వీలునామా విషయంపై దశరథపై మండిపడతారు కార్తీక్- దీపలు. మాకు ముందు చెబితే ఏదో ఒకటి చేసేవాళ్లం.. కానీ ఎవ్వరికీ బుర్రలు పనిచేయకుండా చేశావని అంటాడు కార్తీక్. ఒక భర్తగా, ఒక తండ్రిగా నేను నలిగిపోయాను. నా భార్య, నా కూతురి కడుపులోని బిడ్డ కూడా బతికారు. సుమిత్ర గురించి జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలని అనుకున్నాను అందుకే వీలునామా అలా రాయించానని చెబుతాడు దశరథ. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా, కనకపోయినా ఆస్తి తనకే ఇచ్చేయమని చెబుతుంది దీప. ఆస్తుల కోసం మనుషుల్ని వదులుకోలేనని అంటుంది. ఇది అర్ధంకాక జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తోందని చెబుతుంది. రేపు నాకే హానీ తలపెట్టొచ్చు కదా అని దశరథ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.
మనం ఆడుతున్న డ్రామాలన్నీ జ్యోత్స్నకి తెలిసిన రోజున మనల్ని వదిలిపెట్టదని చెబుతాడు దశరథ. నువ్వు ఉండాల్సిన స్థానంలో తనుంది.. లేదంటే నా పిన్ని లాంటి వాళ్లు నిన్ను అనాథవి అనాథవి అంటే చూడలేనని అంటాడు దశరథ. నేను ఉన్నా లేకపోయినా ఆస్తి మీకే దక్కేలా చేశానని చెబుతాడు. నువ్వు లేకపోతే మాకు ఆస్తులెందుకు? నువ్వే మా ఆస్తివి, మన కుటుంబమే మా ఐశ్వర్యమని చెబుతుంది దీప. మీరంతా బాగానే ఉన్నారు.. నేనే ఎటు కాకుండా పోయాను, నేనే ఆస్తిని దక్కించుకోవడానికి నీ చేత వీలునామా రాయించానని అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఈరోజు అంత రెచ్చగొట్టినా, ఏమాత్రం బయటపడలేదంటే జ్యోత్స్న పెద్ద ప్లాన్‌లో ఉందని అంటాడు కార్తీక్. నాకు తెలిసి తను నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని చెబుతాడు.
వీలునామా గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వే ఇదంతా చెప్పి చేయించావా? అని కార్తీక్‌ను అడుగుతుంది. నాన్న చేసిన దానిలో తప్పేముందని దీప అనడంతో కాంచన షాక్ అవుతుంది. జ్యోత్స్న వాళ్ల నాన్న చేసిన దానిలో తప్పేముందని అంటుంది దీప. తప్పులేదు.. కూతురు పెళ్లి చేసుకుంటుంది కాబట్టి.. ఒక కండీషన్ పెట్టి వీలునామా రాశాడు. అది జరగకపోతే ఆస్తి నీకొచ్చేలా రాయడం ఏంటని కాంచన నిలదీస్తుంది. మేనల్లుడి కుటుంబం అన్నాడు కానీ చెల్లెలి కుటుంబం అనలేదని చెబుతుంది కాంచన. సొంత కూతురితో సమానంగా నీ భార్యను ఎలా చూస్తాడని కాంచన అడుగుతుంది. మా పారిజాతం పిన్ని నిన్ను, దీపని ఎన్నెన్ని మాటలందో అంటూ మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











