Karthika Deepam 2 March 30th: దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న జ్యోత్స్న.. కార్తీక్ ఉచ్చులో పారిజాతం
Photo Courtesy: JioHotstar
నేను గెలిచేశాను అనుకున్న ప్రతిసారి నువ్వు వచ్చి నాకు అడ్డు పడుతున్నావని దీపపై మండిపడుతుంది జ్యోత్స్న. అమ్మానాన్నలు నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు, ఆ విషయం గురించి ఆలోచించమని చెబుతుంది దీప. స్వప్నను చూడటానికి పెళ్లి కొడుకుని తీసుకుని దాస్ రావడంతో కాశీ, కావేరీలు షాక్ అవుతారు. తండ్రిని బయటకు తీసుకొచ్చి.. నేను స్వప్నని దక్కించుకోవడానికి ఇంత కష్టపడుతుంటే నువ్వు ఇలా చేస్తావా అని బాధపడతాడు. స్వప్న దారిలోకి రావాలంటే ఇలాంటి షాక్‌లు తప్పవని అంటాడు దాస్.
ఇంతలో దాస్‌కి కార్తీక్ ఫోన్ చేసి ఓ ప్లాన్ చెబుతాడు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ ఆస్తి నీదేనని జ్యోత్స్నకి చెబుతుంది పారు. నాకు మీరిద్దరే ముఖ్యం.. జ్యోత్స్నకి ఆస్తిని ఇచ్చేయమని దశరథతో చెబుతుంది దీప. వీలునామా గురించి కాంచన ఆలోచిస్తూ.. దీని వెనుక ఉన్నది నువ్వేనా అని కొడుకుని అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 30వ తేదీ 631వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మావయ్య ఈ క్లాజ్ పెట్టకుండా ఉంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఆ పారుతో కలిసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతుందని కాంచనతో చెబుతాడు కార్తీక్. ఆస్తులు అనగానే ఆకాశం అంతా సంబరపడిపోయే జ్యోత్స్న... వాళ్లింట్లో పాతచీర కూడా నాకు దక్కకూడదని అనుకుంటుందని అంటాడ కార్తీక్. అసలు ఇవన్నీ చూస్తుంటే జ్యోత్స్న అసలు మా అన్నయ్య కూతురేనా అనిపిస్తుంది. దాని బుద్ధులన్నీ పారిజాతం పిన్నిలాగే ఉంటాయి. మొన్న హాస్పిటల్‌లో బిడ్డల్ని మార్చేసినట్లు ఓ వార్త చూశాను.. జ్యోత్స్న కూడా అలాగే మారిపోయిందేమో అని కాంచన అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అయినా మా వదిన బతికింది దాని వల్లే.. దాని బుద్ధే చెండాలం అంటుంది. ఆ గంజాయి మొక్కని తులసి మొక్కగా నేను మారుస్తానని చెబుతాడు.
జ్యోత్స్న ఎదురుచూస్తున్న రిపోర్ట్స్ రావడంతో పాటు సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ దీప అనే ఆవిడతో మ్యాచ్ అయ్యాయని జ్యోత్స్న తెలుసుకుని షాక్ అవుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఈ రిపోర్ట్స్ ఏంటీ? వచ్చింది ఎవరు? అని అడుగుతుంది. మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా? నేను సీఈవోగా ఉన్నప్పుడు సూపర్‌వైజర్.. నమ్మన బంటు. ఏదో కష్టాల్లో ఉంటే సాయం చేశానని చెబుతుంది. ఇంతలో పారిజాతంకు దాస్ ఫోన్ చేస్తాడు. దీపే సుమిత్ర కూతురు.. నేను అనుకున్నదే నిజమని తేలింది. డాక్టర్‌ను మేనేజ్ చేసి అబద్ధం చెప్పించారని జ్యోత్స్న అనుకుంటుంది. ఈ నిజం డాడీకి తెలుసా? తెలిసే వీలునామా మార్చి రాయించాడా? అది కూడా తెలిస్తే వీళ్లందరినీ ఏం చేయాలో నాకొక క్లారిటీ వస్తుందని అనుకుంటుంది.
దాస్ దగ్గరికి వెళ్లిన పారిజాతం... ఆ రోజు నన్ను మీరంతా మతిలేని దానిని చేశారు. ఎవరు నా మనవరాలు? ఎవరు నీ కూతురు అని నిలదీస్తుంది. కార్తీక్ గాడే పెద్ద మాయలోడు అనుకున్నాను.. నువ్వు అంతకంటే పెద్ద మాయలోడివి అని అడుగుతుంది. నీ మనవరాలు ఎవరో కాదు దీప అని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కుబేర్ ఫోటో చూసి అనసూయ గారిని అడిగితే ఆమె మొత్తం వివరాలన్నీ చెప్పేసిందని అంటాడు దాస్. దీపకి నాకు ఓ పోలిక ఉంది.. నేను కూడా ఆ ఇంట్లో పనిమనిషినే కాబట్టి నాకు కరెక్ట్‌గా సెట్ అయ్యిందని ఎమోషనల్ అవుతుంది పారిజాతం. నువ్వే నా మనవరాలివి అని తెలియక ఎన్ని చిత్రహింసలు పెట్టానోనని బాధపడుతుంది.
వెంటనే నా మనవరాలిని చూడాలని పారిజాతం వెళ్లబోతుండగా దాస్ ఆపుతాడు. దీప నీకు మనవరాలు ఎలా అయ్యింది? ఎప్పుడు అయ్యింది? అని కాంచన అడుగుతుంది. అప్పుడు బిడ్డల్ని ఎందుకు మార్చావని శివన్నారాయణ గారికి తెలిస్తే నిన్ను తుపాకీతో కాల్చిచంపడమే కాదు, అరెస్ట్ చేయిస్తాడని దాస్ చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండాలి.. లేదంటే కార్తీక్ గాడు నిన్ను ఇరికించేస్తాడని వార్నింగ్ ఇస్తాడు దాస్. నేను వెంటనే నా మనవరాలిని చూడాలని కార్తీక్ ఇంటికి బయల్దేరుతుంది.
దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న జ్యోత్స్న... నేను సుమిత్ర కూతురిని కాదన్న విషయం ఎంతమందికి తెలుసు. దీప, దాస్, బావ ఒక్కటైపోయారు. కాంచన అత్తకి కూడా చెప్పారా అని ఆలోచిస్తుంది. ఇది చూసిన దశరథ... భోజనం చేయకుండా చూస్తున్న కూతురిని ఏం జరిగిందని అడుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు, మనుషులు కొత్తగా కనిపిస్తారని అంటుంది. మధ్యాహ్నం జరిగిన విషయమే అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, అత్తారింటికి వెళ్లిపోమని చెబుతుంది సుమిత్ర. పెళ్లి అనేది ఏదో రకంగా కంప్లీట్ చేసేది కాదు, కొంత టైం పడుతుంది అని అంటుంది జ్యోత్స్న.
నువ్వు సరిగ్గా ఉండటంతో మాకు వీలునామా రాసే పరిస్ధితి వచ్చేది కాదు. నీ వల్ల నా ఆడపడుచు ముఖం చూడగలాని అని కూతురిపై మండిపడుతుంది సుమిత్ర. ఆస్తులు తీసుకోవడానికి ఓకే కానీ.. మాటలు పడరా అంటూ సీరియస్ అవుతుంది జ్యోత్స్న. నీ కారణంగా అందరూ విడిపోయే పరిస్ధితి వచ్చిందని మండిపడతాడు దశరథ. నేను మీ అందరితో మాట్లాడాలని అంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నా మీ అమ్మని దృష్టిలో పెట్టుకుని చెప్పమని అంటాడు దశరథ.
కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా.. పారిజాతం తలుపులు కొడుతుంది. ఏం జరిగినా.. ఏం జరగనట్లే ఉండమని దీపతో చెబుతాడు కార్తీక్. డైలీ ఈ టైంకి ఒక ముష్టిది వస్తావు.. అది నువ్వే అనుకున్నానని పారిజాతంతో అంటాడు. ఆ మాటలతో షాకైనా పారు.. కార్తీక్ మాటలు పట్టించుకోకుండా దీప... దీప అంటూ అరుస్తూ ఇళ్లంతా వెతుకుతుంది. ఇంతలో అనసూయ, కాంచన వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. తప్పిపోయిన కూతురి కోసం తల్లి వెతుకుతున్నట్లు దీప అని అడుగుతున్నారని చెబుతుంది అనసూయ. ఇంటి దగ్గర తిట్టాల్సిన తిట్లు మిగిలిపోయాయా అని కాంచన అంటుంది. నేనొచ్చింది తిట్టడానికి కాదు, ప్రక్షాళన చేసుకోవడానికి అనడంతో అంతా షాక్ అవుతారు. దీపని చూడగానే పారిజాతం మనవరాలా అంటూ హత్తుకుని ఎమోషనల్ అవుతుంది. అదంతా చూసిన కాంచన, అనసూయ, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











