Karthika Deepam 2 April 1st: జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం.. షాక్‌లో శివన్నారాయణ, సుమిత్ర
Photo Courtesy: JioHotstar
అర్ధరాత్రి ఇంటికొచ్చిన పారిజాతం.. మనవరాలా అంటూ దీపని హత్తుకోవడంతో కార్తీక్, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. ఉదయం మిమ్మల్ని తిట్టాను కదా సారీ చెప్పాలని వచ్చానని అంటుంది పారు. కుబేర ఎంతో గొప్పవాడు.. బస్టాండ్‌లో పడివున్న దీపని కన్నకూతురిలా చూసుకున్నాడని ఎమోషనల్ అవుతుంది. ఇంతలో శౌర్య రావడంతో ఆమెను గట్టిగా హత్తుకుంటుంది పారిజాతం. మమ్మీ ఆపరేషన్ బాగా జరిగింది కాబట్టి మన బంధువులు, స్నేహితులను పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని అంటుంది జ్యోత్స్న. దీనికి శివన్నారాయణ, సుమిత్ర, దశరథలు కూడా సరేనని చెబుతారు.
అర్ధరాత్రి కావొస్తున్నా పారు రాకపోవడంతో జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురుచూస్తారు. పారు వచ్చేసరికి శివన్నారాయణ ఉండటంతో ఎక్కడికి వెళ్లొస్తున్నావని నిలదీస్తాడు. వాకింగ్‌కి వెళ్లానని అబద్ధం చెబుతుండగా.. కార్తీక్ పంపిన వీడియోను చూపిస్తాడు పెద్దాయన. ఇంతలో కార్తీక్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇలాంటి పనులన్నీ చేసేది, మమ్మల్ని ఇరికించేది వీడేనని సీరియస్ అవుతుంది పారు. రేపు మా ఇంట్లో పార్టీ ఉంది మీ ఫ్యామిలీ అంతా రావాలి.. దీప ఖచ్చితంగా ఉండాలని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. అసలు దీప దగ్గరికి ఎందుకు వెళ్లావని పారును జ్యోత్స్న నిలదీయగా.. నా ఇష్టమని వార్నింగ్ ఇస్తుంది పారు. తాత ఇంట్లో ఏదో పార్టీ ఉందని కార్తీక్ చెప్పడంతో కాంచన, అనసూయ, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 1వ తేదీ 633వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న బుద్ధి సరైనది కాదు.. ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రకమని మండిపడుతుంది అనసూయ. అక్క చెబుతున్నది నిజమేరా? లాయర్‌ని పిలిపించి అన్నయ్య పెట్టిన నిబంధనకు, మీకు ఏ సంబంధం లేదని సంతకం పెట్టించే ఛాన్స్ ఉందని భయపడుతుంది. అయినా అక్కడ అన్ని మాటలు అన్న పిన్ని ఇంటికొచ్చి మరి క్షమాపణలు చెప్పిందని అంటుంది కాంచన. మనం నెగిటివ్‌గా ఆలోచించాల్సిన పనిలేదు.. మనతో పాటు చాలామందిని పిలిస్తుంది అక్కడ వీలునామా గురించి మాట్లాడుతుందని అనుకోవడం లేదు అంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ చేస్తుందని కార్తీక్‌కు అనుమానం వస్తుంది.
చిన్నప్పటి నుంచి నేను, నాన్న మాత్రమే ఉండేవాళ్లం. నాకు ఆడవాళ్ల మనసు తెలియదు, స్వప్నని ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. నేను తనకి ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నానని కావేరితో బాధపడతాడు కాశీ. నేను మాత్రమే నా ప్రేమను మోస్తున్నాను, మా ఇద్దరి మధ్య ప్రేమను పెంచే బాధ్యత మీరే తీసుకోవాలని అడుగుతాడు. ఇంతలో స్వప్న వచ్చి రేపు మార్నింగ్ త్వరగా వస్తావా? అని అడగటంతో కావేరి, కాశీలు షాక్ అవుతారు. మేం ఇద్దరం గుడికి వెళ్తామని చెబుతూనే.. నాకు కాబోయే భర్తని పికప్ చేసుకుని రమ్మని చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. పెళ్లికి ముందు ఒకరినొకరం అర్ధం చేసుకోవాలి అందుకే వసంత్‌ని గుడికి రమ్మన్నానని చెబుతుంది స్వప్న. మీ ఇష్టం మేడం.. డ్రైవర్‌ని కదా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను? ఎవరిని పికప్ చేసుకోమంటే వాళ్లని చేసుకుంటానని చెబుతాడు కాశీ.
ఆ మాటలతో కావేరి షాక్ అవుతుంది. దానికి బుద్ధి లేదు, నీకేమైంది.. వాళ్లిద్దరినీ గుడికి తీసుకెళ్తావా అని కాశీపై సీరియస్ అవుతుంది. రోజులు బాలేదు అత్తయ్య.. ఆడపిల్లకి తోడు కావాలని అంటాడు కాశీ. భర్తకి మించిన తోడు భార్యకు ఏముంటుందని చెబుతాడు. ఇంత మంచి మనిషిని మన అమ్మాయి ఎలా దూరం చేసుకుంటుందని శ్రీధర్‌ని అడుగుతుంది. మనం వాడిని అర్ధం చేసుకున్నాం, అప్పటి వరకు మనం ఎదురుచూస్తామని చెబుతాడు దాస్. నేనైతే నా కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయనని చెబుతాడు శ్రీధర్. బావని చూస్తుంటే వసంత్‌తో పెళ్లిని క్యాన్సిల్ చేయించేలా చూడాలని అనుకుంటాడు దాస్.
కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా దీపకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది.. మీ ఆయనతో ఏకాంతంగా ఉంటే డిస్ట్రబ్ చేశానా అని వెటకారంగా మాట్లాడుతుంది. గొడవ గురించి ఆలోచిస్తున్నావా? అని అడుగుతుంది జ్యోత్స్న. రేపు మా ఇంట్లో గెట్ టూ గెదర్ పార్టీ గురించి బావ నీకు చెప్పాడా? లేదా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేనే నిన్ను స్పెషల్‌గా పిలుస్తున్నాను అంటుంది జ్యోత్స్న. ఖచ్చితంగా వస్తానని చెబుతుంది దీప. ఫోన్ చేసి మరి పిలిస్తే రాకుండా ఎందుకు ఉంటానని అంటుంది దీప. నీ ఇంటికి నువ్వు రాకపోతే ఎలా అని జ్యోత్స్న అన్నదంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉందని డౌట్ పడతాడు కార్తీక్. జ్యోత్స్నకి ఏదో తెలిసింది.. అందుకే ఏదో ప్లాన్ చేస్తుందని అంటాడు.
దీపని పిలిచావా? లేదా? అని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. ఏమైంది గ్రానీకి ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తుంది, దీపని స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంది అని అనుకుంటుంది జ్యోత్స్న. రేపటితో ఈ దీప కథ క్లోజ్ అనుకుంటుంది. ఉదయాన్నే దీప కోసం వెయిట్ చేస్తూ సందడి చేస్తుంది. అది చూసి శివన్నారాయణకు అనుమానం వస్తుంది. వాళ్లు గుమ్మంలోకి వస్తేనే సరిగా పట్టించుకోవు.. ఇప్పుడేంటీ ఇంత హడావుడి చేస్తున్నావని అడుగుతాడు. ఈ పార్టీలో ఏదైనా తేడా జరిగితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నువ్వు చేసే ఓవరాక్షన్‌కి దొరికిపోయేలా ఉన్నావని పారుకి వార్నింగ్ ఇస్తాడు దాస్. మీ అమ్మ ప్రతిభను నువ్వు తక్కువగా అంచనా వేయొద్దని అంటుంది పారు. నిజం బయటపడకుండా జాగ్రత్తగా ఉంటానని చెబుతుంది. నా మనవరాలికి మామూలు మర్యాద చేయకూడదని అంటుంది.
ఇంతలో దీప- కార్తీక్‌లు ఇంటికి రావడంతో వాళ్లని చూసి పారిజాతం మురిసిపోతుంది. మెడ బోడిగా ఉందని నా నెక్లెస్ మీ మెడలో వేసుకోమని ఇవ్వబోతుండగా వద్దు అంటుంది దీప. పరాయిదానిలా పారిజాతం గారు అని పిలుస్తావేంటీ? నానమ్మ అని పిలవమని చెబుతుంది పారు. అది చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. మనిషి పాతదే బుద్ధే కొత్తగా మారిందని అంటాడు జ్యోత్స్న. ఇంతలో దశరథ, జ్యోత్స్నలు వచ్చి లోపలికి రమ్మని పిలుస్తారు. నువ్వు అనే మాటలు దగ్గరివాళ్లని కూడా బాధపెడతాడయిన అంటాడు శ్రీధర్. జ్యోత్స్న తరపున నేను క్షమాపణలు చెబుతున్నానని అంటుంది సుమిత్ర. మనమంతా ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి.. ఈరోజును ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మార్చండి, జరిగినదంతా మరిచిపోండి అంటుంది జ్యోత్స్న. దీపని చేయి పట్టుకుని తీసుకెళ్తున్న పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. ఈ గ్రానీకి ఏమైంది? దీప మీద ఇంత ప్రేమ చూపిస్తుందని అంటుంది పారు.
మా అమ్మకి అబద్ధం చెప్పి తప్పు చేశానా? అని బాధపడతాడు దాస్. దీపని పారు రోజు తిడుతుంది.. అలాగని నేను కూడా తిట్టలేను. అందుకే ఇలా ప్లాన్ చేశానని దాస్‌తో అంటాడు కార్తీక్. దీపని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టిన పారు.. శౌర్యని ఐస్‌క్రీమ్ తెచ్చుకోమని పంపిస్తుండగా జ్యోత్స్నకి తగిలి పడిపోతుంది. దాంతో శౌర్యని పైకి లేపి ఎలా ఉందని అడుగుతుంది పారు. దాంతో జ్యోత్స్నపై పారు సీరియస్ అవుతుంది. చూసి డ్యాష్ ఇచ్చినా, చూడకుండా డ్యాష్ ఇవ్వకపోయినా శిక్ష ఒక్కటేనని జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










