Karthika Deepam 2 April 2nd: కార్తీక్ కంటపడ్డ జ్యోత్స్న రిపోర్ట్స్... దీప హత్యకు ముహూర్తం పెట్టిన జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

ఆస్తి దక్కించుకోవడానికి జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని కాంచనను, కార్తీక్‌ను హెచ్చరిస్తుంది అనసూయ. నాకు కూడా అదే అనుమానంగా ఉంది.. లాయర్‌ని పిలిపించి కార్తీక్‌తో సంతకం పెట్టిస్తుందేమోనని కాంచన కూడా భయపడుతుంది. అయితే పారిజాతం పిన్ని ఇంటికొచ్చి సారీ చెప్పింది కాబట్టి పార్టీకి వెళ్లకతప్పదని అంటుంది. కాశీని పిలిచిన స్వప్న.. రేపు ఉదయం త్వరగా వస్తే గుడికి వెళ్దామని అంటుంది. కాశీ సంతోషించేలోపే.. నాకు కాబోయే భర్త వసంత్‌ని పికప్ చేసుకుని రమ్మని చెప్పడంతో అతను షాక్ అవుతాడు. వీళ్లద్దరూ కలిస్తే ఓకే.. లేదంటే నా కూతురి ఇష్టప్రకారమే నేను ముందుకెళ్తానని శ్రీధర్ తేల్చేస్తాడు.

దీపకి జ్యోత్స్న ఫోన్ చేసి రేపు ఉదయం పార్టీకి ఖచ్చితంగా రావాలి, నువ్వు నా స్పెషల్ గెస్ట్‌వని చెబుతుంది. దాంతో జ్యోత్స్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని కార్తీక్ అనుమానిస్తాడు. దీపని పార్టీకి పిలిచావా? లేదా? అని జ్యోత్స్నపై మండిపడుతుంది పారు. ఉదయాన్నే కార్తీక్, దీపలు రావడంతో మురిసిపోతుంది పారిజాతం. దీప మెడ బోసిగా ఉందని ఆమెకు తన నెక్లెస్ ఇవ్వబోతుండగా .. వద్దు పారిజాతం గారు అంటుంది దీప. పేరు పెట్టి పిలవకూడదు.. నానమ్మ అని పిలవాలని చెబుతుంది పారు. శౌర్యను ముద్దులాడుతూ ఐస్‌క్రీమ్ తెచ్చుకోమని పంపిస్తుండగా శౌర్యకి జ్యోత్స్న అడ్డుతగలడంతో పాప కిందపడిపోతుంది. దాంతో జ్యోత్స్నని గట్టిగా పీకి శౌర్యకి సారీ చెప్పమని అంటుంది పారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 2వ తేదీ 634వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 634 April 2nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

శౌర్యకు సారీ చెప్పేది లేదని జ్యోత్స్న తేల్చేస్తుంది. పారిజాతం వదిలిపెట్టకపోవడంతో మొత్తం కుటుంబం నిలదీస్తుంది. దాంతో శౌర్యకు సారీ చెబుతుంది జ్యోత్స్న. మా పిన్నికి ఏమైంది? ఇలా మారిపోయింది? అని కాంచనను అడుగుతాడు శ్రీధర్. రాత్రి కూడా మా ఇంటికి వచ్చి హడావుడి చేసింది. దీపని అస్సలు వదిలిపెట్టలేదని చెబుతుంది కాంచన. మీ అమ్మకి, మీ అమ్మాయికి గొడవ పెడతానని దాస్‌తో అంటాడు కార్తీక్. జ్యూస్ తీసుకుని వచ్చిన పారిజాతాన్ని చూసి.. ఎంతైనా జ్యోత్స్న అంటే పారుకి చాలా ఇష్టం అందుకే, ఇప్పుడే తిట్టి అప్పుడే జ్యూస్ తీసుకొచ్చిందని అంటాడు కార్తీక్. కానీ జ్యూస్‌ని దీపకి ఇవ్వడంతో జ్యోత్స్న సహా అంతా షాక్ అవుతారు.

మనవరాలికి తీసుకురాలేదా? అని శివన్నారాయణ అడగ్గా.. మనవరాలికే తీసుకొచ్చా? అంటుంది పారు. కొడుకు కూతురు మనవరాలు అయినప్పుడు, మనవడి భార్య కూడా మనవరాలే అవుతుందని అంటుంది పారు. దీప జ్యూస్ వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా పారు ఇస్తుంది. దీనికి అసలే మొహమాటం ఎక్కువ, అన్నీ నానమ్మ పోలికలు అని అనడంతో అంతా షాక్ అవుతారు. మా అమ్మ ఇరుక్కుపోయిందని దాస్ అనగా.. ఎలా కవర్ చేస్తుందో చూద్దామని అంటాడు కార్తీక్. పిన్నికి ఏమైంది? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు దశరథ. దీపకి నీ పోలికలు ఎందుకు వస్తాయని శ్రీధర్ అడుగుతాడు.

నేను చాలా ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఏం చేసేదాన్నో, దీప అదే చేస్తుందని అందుకే నా పోలికలతో చెప్పానని అంటుంది పారిజాతం. ఆ దెబ్బకు అంతా షాక్ అవుతారు. మరి ఇన్నిరోజులు ఈ బుద్ధి ఏమైందని శివన్నారాయణ అడుగుతాడు. దానికి ఏదేదో చెప్పి కవర్ చేస్తుంది పారు. జ్యో గ్రానీకి మా అమ్మ అంటే ఎందుకు అంత ప్రేమని అడుగుతుంది శౌర్య. అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది జ్యోత్స్న. ఇక్కడ నువ్వు జ్యూస్ తాగొద్దు.. దిష్టి తగులుతుంది, పైకి వెళ్లి తాగమని చెబుతుంది పారు.

జ్యూస్ తాగుతున్న దీప దగ్గరికి వచ్చిన జ్యోత్స్న.. మీరంతా కలిసి మా గ్రానీకి కోరలు పీకేశారు. అందుకే ఎప్పుడూ లేనిది నీ మీద ప్రేమ కురిపిస్తోంది, వింతగా ప్రవర్తిస్తోందని అంటుంది. మనుషులు మారతారు.. ఆ మార్పు అందరిలో వస్తే మంచిదని అంటుంది దీప. నువ్వు సమర్ధురాలివి ఎవరినైనా ప్రేమిస్తావు, ఎవరినైనా కాపాడగలవు అని అంటుంది జ్యోత్స్న. నువ్వు మీ అమ్మనాన్నలను కాపాడావు కదా అని దీప చెబుతుంది. మీ అమ్మనాన్నలు బతికే ఉన్నారని జ్యోత్స్న చెప్పగా.. ఈ విషయం నాకు కూడా తెలుసు అంటుంది. అయితే ఎక్కడున్నారని జ్యోత్స్న అడగ్గా.. వాళ్లెవరో తెలుసుకోవాలని ఎదురుచూస్తుంది. మా అమ్మనాన్నలు ఎవరో తెలుసుకున్నాక ఫస్ట్ నీకే చెబుతానని అంటుంది దీప. అయితే అప్పటి వరకు నువ్వు ఉండవని అంటుంది జ్యోత్స్న.

మీ అమ్మనాన్నలు తెలిసేటప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండవు, మా ఇంట్లో పనిమనిషిగా ఉండవు కదా అంటుంది జ్యోత్స్న. నిన్న నేను ఒకటి చూశా.. అందుకే ప్రేమను కురిపిస్తున్నానని చెబుతుంది. ఈరోజు అందరినీ తనివీతీరా చూసుకో, మా అమ్మనాన్నల్ని మీ అమ్మనాన్నలుగా అనుకో అంటుంది. ముందు కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. నేను ఇక్కడే ఉంటే ఏదో ప్రమాదం తలపెట్టేలా ఉందని దీప భయపడుతుంది. నా బిడ్డను నేను కాపాడుకోగలనని చెప్పి వెళ్లిపోతుంది. నీ బిడ్డ సంగతి తర్వాత ముందు నిన్ను నువ్వు కాపాడుకో.. ఈరోజు నీ చావుకు ముహూర్తం పెట్టా, నీ ఫోటోకు దండవేసి.. కుబేరా ఫోటో పక్కన పెడతానని అనుకుంటుంది జ్యోత్స్న.

శౌర్యకు బోల్డెన్నీ చాక్లెట్స్ ఇచ్చి ముద్దులు పెడుతుంది. మనిద్దరం దొంగ పోలీస్ ఆడుకుందామని శౌర్య చెప్పగా... జ్యో తిడుతుంది ఆ రూమ్‌లో నేను దాక్కొనని అంటుంది. నేనుండగా జ్యో నిన్ను ఏం చేయలేదని చెప్పి జ్యోత్స్న గదిలోకి తీసుకెళ్తుంది పారు. బెడ్ చాలా బాగుందని శౌర్య ఆడుకుంటూ ఉండగా.. బెడ్ కింద జ్యోత్స్న దాచిన రిపోర్ట్స్ కనిపించడంతో అదంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో అది చదవమని శౌర్యకి ఇస్తుంది. శౌర్య నా వల్ల కాదని చెప్పి వెళ్లిపోవడంతో అదేంటో తెలుసుకుందామని పారు బయటకు వెళ్తుండగా శివన్నారాయణ ఎదురై ఆ పేపర్లు ఏంటో చూద్దామని అడుగుతాడు. ఇవి చిత్తు పేపర్లు నేను వీటిని డస్ట్ బీన్‌లో వేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.

ఈ పేపర్‌లో ఏముందో తెలుసుకోవడం ఎలా అని అనుకుంటూ ఉండగా.. కార్తీక్ కనిపించడదంతో అది చదివి చెప్పమని అడుగుతుంది. రిపోర్ట్స్‌లో సుమిత్ర కూతురు దీప అని ఉండటంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప ఎవరో జ్యోత్స్న నిజం తెలుసుకుందని కార్తీక్‌కి అర్ధమైపోతుంది. జ్యోత్స్నకి ఈ విషయం చెప్పొద్దని అంటుండగా.. జ్యోత్స్న రావడంతో కార్తీక్- పారులు షాక్ అవుతారు. నేను నీతో మాట్లాడాలని చెబుతుంది జ్యోత్స్న.. ఇంతలో పారు తన గదిలోకి వెళ్లడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. లోపలికి వెళ్లి చూడగా.. రిపోర్ట్స్ ఎవరో తీసినట్లుగా అనిపిస్తుంది. బావకి నిజం తెలిసిపోయింది, నేను అనుకున్నది చూడాలని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X