Karthika Deepam 2 April 3rd: జ్యోత్స్న కుట్ర భగ్నం.. దీప ప్రాణాలని కాపాడిన కార్తీక్

Photo Courtesy: JioHotstar

శౌర్యను ఢీకొట్టిన జ్యోత్స్నకి చెంప పగుల గొడుతుంది పారు. దాంతో అంతా షాక్ అవుతారు. మర్యాదగా శౌర్యకు సారీ చెబుతావా లేదా? అంటూ పారిజాతం వార్నింగ్ ఇవ్వడంతో సారీ చెబుతుంది జ్యోత్స్న. దీప కోసం పారు జ్యూస్ తీసుకుని రాగా నీకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం, ముందుకొట్టినా తర్వాత జ్యూస్ తీసుకొచ్చావని పారుని ఇరికిస్తాడు కార్తీక్. పారిజాతంలో వచ్చిన మార్పుతో శివన్నారాయణ ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. దీప దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న నీ ఆరోగ్యం బాగానే ఉందా? పార్టీలో బాగా ఎంజాయ్ చేయ్.. అందరినీ తనివి తీరా చూసుకోమని చెబుతుంది. జ్యోత్స్న మాటలు తేడాగా ఉండటంతో దీపకి అనుమానం వస్తుంది.

శౌర్యకి ఓ ప్యాకెట్ నిండా చాక్లెట్స్ ఇస్తుంది పారిజాతం. మనిద్దరం దొంగా పోలీస్ ఆట ఆడుకుందామని.. కానీ జో రూమ్‌కి వెళితే ఊరుకోదని అంటుంది శౌర్య. నేనుండగా నిన్ను ఎవరూ ఏం చేయలేరని జ్యోత్స్న రూమ్‌కి తీసుకెళ్తుంది పారు. అక్కడ శౌర్యతో ఆడుకుంటూ ఉండగా.. దిండు కింద దాచిన మెడికల్ రిపోర్ట్స్ పారుకి కనిపిస్తాయి. జ్యోత్స్న సీక్రెట్‌గా ఈ రిపోర్ట్స్ ఎందుకు దాచిందో అర్ధం కాక దానిని తీసి చూడగా అంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో కార్తీక్‌తో చదివించుకుంటుంది. అవి డీఎన్ఏ రిపోర్ట్స్ కావడంతో పాటు జ్యోత్స్నకి అసలు నిజం తెలియడంతో కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్న వచ్చేలోపు రిపోర్ట్స్ తిరిగి దిండు కింద పెట్టేస్తుంది పారు. అయితే రిపోర్ట్స్ ఎవరో ఓపెన్ చేసినట్లు గ్రహించిన జ్యోత్స్న.. ఇక లేట్ చేయకూడదు దీపని లేపేయాలని అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 3వ తేదీ 635వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 635 April 3rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర అత్తకు తను డీఎన్ఏ టెస్ట్ చేయించలేదని జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. సుమిత్ర అత్తకు, దీప బ్లడ్ శాంపిల్స్ సంపాదించి డీఎన్ఏ టెస్ట్ చేయించిందని దాస్‌తో చెబుతాడు కార్తీక్. ఆ మాటలు వినగానే దాస్ షాక్ అవుతాడు. ఆ రిపోర్ట్స్‌లో ఏముందో తెలుసుకునేలోపు జ్యోత్స్న రావడంతో పారు వాటిని లోపల దాచేసిందని, జ్యోత్స్న ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉందని అంటాడు కార్తీక్. అసలైన వారసురాలు దీపేనన్న సంగతి మా ఇద్దరికీ తెలిసిందని జ్యోత్స్నకు తెలిసిపోయింది.. అంటే హాస్పిటల్‌లో మనం ఆడిన డ్రామా కూడా తెలిసిపోయి ఉంటుంది. అన్ని తెలిసే సైలెంట్‌గా ఉంది.. పార్టీకి నువ్వు రావాలని స్పెషల్‌గా దీపని పిలిచింది. అంటే దీప డేంజర్‌లో ఉందని తనని కాపాడాలని చెబుతాడు కార్తీక్. వెంటనే జ్యోత్స్నని ఆపాలని బయల్దేరతాడు దాస్.

దీప మేడ మీద పూలు కోస్తుండగా ఆమెను ఫాలో అవుతూ వెళ్తుంది జ్యోత్స్న. దీప మెడ మీదకి వెళ్లిందని తనని చంపడానికి జ్యోత్స్న వెళ్లిందని తెలుసుకున్న దాస్, కార్తీక్‌లు వెంటనే పైకి వెళ్తారు. నువ్వు చస్తే ఇంటికి వారసురాలిగా ఎప్పటికీ నేనే ఉంటానని అనుకుంటూ దీపని తోయబోతుండగా దాస్, కార్తీక్ వచ్చి ఆపుతారు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని జ్యోత్స్నని అడుగుతుంది దీప. ఎక్కడ నువ్వు కళ్లు తిరిగిపోతావో పట్టుకుందామని అనుకున్నానని అంటుంది జ్యోత్స్న. దీపని నేను కిందకి తోసేస్తున్నానని అనుకున్నావు కదా.. అదే నిజమని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న.

మీరిద్దరూ ఎందుకు ఆయాసపడుతూ ఇక్కడికి వచ్చారని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది ఇక్కడితో ఆపేయమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. నేను ఏం చేసినా ఆపడానికి నువ్వు ఉన్నావు కదా అంటుంది జ్యోత్స్న. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. రుచికరమైన భోజనం అందరికీ తెప్పించానని చెబుతుంది. ఈరోజు ఏదో జరగబోతోంది దానిని ఎలా ఆపాలో నేను చూసుకుంటానని దాస్‌తో చెబుతాడు కార్తీక్. భోజనాలు చేద్దామని శివన్నారాయణ అడగ్గా.. మనందరికీ స్పెషల్‌గా చేయించానని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న భోజనంలో విషం కలిపిందని కార్తీక్‌కు అనుమానం వస్తుంది. కార్తీక్ మాత్రం భోజనం చేయొద్దని ఆపుతాడు కార్తీక్.

పారిజాతం మాత్రం దీపని భోజనం చేద్దామని పిలుస్తుంది. ఆమె హడావుడి చూసి శివన్నారాయణకు ముచ్చటగా ఉంటుంది. అందరినీ ఒకేసారి చంపడానికి భోజనంలో విషం కలిపిందా అని అనుమానిస్తాడు కార్తీక్. నువ్వు ఇప్పటికే లేట్ అయిపోయావు, దీపకి టైం దగ్గర పడిందని చెబుతుంది జ్యోత్స్న. కుటుంబం మొత్తానికి జ్యోత్స్న దగ్గరుండి భోజనం వడ్డిస్తుంది. దీపని స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటే మేం అతిథులం కదా అని మండిపడతాడు శ్రీధర్. దీప మా అమ్మ ప్రాణాలు కాపాడిందని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నీ కూతురు నాతో ఆడుకుంటోందని దాస్‌తో అంటాడు కార్తీక్. ఇంకా చేతులు కట్టుకుని కూర్చోవడం ఎందుకు, నిజం చెప్పేద్దామని అంటాడు దాస్. జ్యోత్స్నే సుమిత్ర అత్త కూతురని, తనే ఆవిడని కాపాడిందని మనమే నమ్మించాం.. ఇప్పుడు నిజం చెబితే మనమే ఫూల్స్ అవుతామని అంటాడు కార్తీక్.

దీపే మా అమ్మ ప్రాణాలు కాపాడిందని నేను అంటున్నాను.. దానికి కారణం నువ్వు చెప్పాలని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. ఈరోజు అన్నింటికీ నేనే క్లారిటీ ఇస్తాను.. కాకపోతే నేను చెప్పే వరకు ఎవరూ తినకూడదు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ దీపే కాబట్టి తనే మొదటి ముద్దని తింటుందని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్, దాస్ షాక్ అవుతారు. అవసరమైతే నేనే తినిపిస్తానని జ్చోత్స్న చెప్పగా.. అవసరం లేదని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న చెప్పడం కాదు.. నేనే రెండు ముద్దలు తినిపిస్తానని పారిజాతం చెప్పడంతో అంత వరకు ఉండదని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న దాస్, కార్తీక్ షాక్ అవుతారు. దీపని చంపడానికి జ్యోత్స్న విషయం కలిపిందని దాస్, కార్తీక్‌లకు అనుమానం వస్తుంది. ఆమెను ఎలా కాపాడాలోనని కార్తీక్‌కి అర్ధం కాదు.

దీపకి పారు భోజనం తినిపిస్తుండగా.. కార్తీక్ ఆపుతాడు. నువ్వు దీపకి తినిపించడంలో ఎలాంటి స్పెషల్ కనిపించడం లేదు.. అదే దీప జ్యోత్స్నకి తినిపిస్తే బాగుంటుందని అంటాడు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. విందుతో పాటు ఈ వినోదాన్ని కూడా ఆస్వాదిద్దామని అంటాడు శ్రీధర్. నువ్వే నీ చేతులతో జ్యోత్స్నకి ఒక ముద్ద కలిపి పెట్టమని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు.. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానని అనుకుంటాడు కార్తీక్. అయితే ఆ ముద్ద తిన్నప్పటికీ జ్యోత్స్నకి ఏం కాకపోవడంతో కార్తీక్ షాక్ అవుతాడు. దాంట్లో విషం ఉంటే జ్యోత్స్న తినదు కదా అంటాడు దాస్. ఇంకోక ముద్ద పెట్టమని అడిగిమరి పెట్టించుకుంటుంది జ్యోత్స్న.

మీ బావ మరదల్ల సరసాల వల్ల ఓ మంచి జరిగింది. ఉప్పు- నిప్పులా ఉండే జ్యోత్స్న- దీపలు అక్కాచెల్లెళ్ల మాదిరిగా తినిపించుకున్నారని చాలా సంతోషంగా ఉందని అంటుంది సుమిత్ర. నీ కూతురు ఎప్పుడు నీ సంతోషాన్నే కోరుకుంటుందని అంటుంది జ్యోత్స్న. ఈరోజు ఇంకా స్పెషల్స్ మిగిలే ఉన్నాయిని చెప్పడతో కార్తీక్ షాక్ అవుతాడు. అమ్మానాన్నల కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ఏంటని జ్యోత్స్న అడగ్గా.. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అంటుంది సుమిత్ర. ఓకే నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పెళ్లి కొడుకు ఎవరు అని అడగ్గా.. బావే నా పెళ్లి కొడుకు అని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బావే నాకు కాబోయే పెళ్లికొడుకుని సెలెక్ట్ చేస్తారని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బావలాంటి వాడిని వెతికిపెట్టమని మీ అన్నయ్యకి చెప్పమని అంటుంది జ్యోత్స్న. ఆ జ్యోత్స్న పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. దీపని దత్తత తీసుకునేలా ప్లాన్ చేసి ఈ ఇంటికి వారసురాలిని చేస్తానని అంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X