Karthika Deepam 2 April 4th: కేక్ మార్చేసిన కార్తీక్.. తప్పించుకున్న దీప, కార్తీక్‌తో జ్యోత్స్న యుద్ధం
Photo Courtesy: JioHotstar
దీపే సుమిత్ర అత్త కూతురని జ్యోత్స్నకి తెలిసిపోయింది.. ఇప్పుడు దీప ప్రమాదంలో ఉంది, తనను రక్షించాలని దాస్‌తో చెబుతాడు కార్తీక్. దీప మేడపై పూలు కోస్తుండగా వెనుక నుంచి జ్యోత్స్న ఆమెను తోసేయాలని అనుకుంటుంది. దీప కోసం ఇల్లంతా వెతికిన కార్తీక్, దాస్‌లు ఆమె మేడ మీదకి వెళ్లిందని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. దీప అని కార్తీక్ గట్టిగా అరవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది ఇక్కడితో ఆపేయమని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు ఊహించిన దానికంటే నేను ప్రమాదకరమైన దానిని అని అంటుంది జ్యోత్స్న.
ఇంతలో అందరూ భోజనాలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మన ఫ్యామిలీ వరకు సెపరేట్‌గా మెనూ సిద్ధం చేశానని చెబుతుంది జ్యోత్స్న. అందరికి విషం పెట్టి జ్యోత్స్న చంపాలని అనుకుంటుందని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. భోజనాల దగ్గర అందరికంటే తొలి ముద్ద దీపే తినాలని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అయితే తొలి ముద్దని దీపే నీకు తినిపిస్తుందని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఒక ముద్ద కాదు రెండు ముద్దలు తింటానని తింటుంది జ్యోత్స్న. అయినా ఆమెకు ఏం కాకపోవడంతో కార్తీక్, దాస్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 4వ తేదీ 636వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్ర కట్ చేయాల్సిన కేక్‌లో విషం కలుపుతుంది జ్యోత్స్న. ఈ కేక్‌ని నేనే స్వయంగా డెకరేట్ చేశా.. ఇది నాకు చాలా స్పెషల్ అంటుంది జ్యోత్స్న. నా కూతురి మాటలు వింటుంటే అనుమానంగా ఉందని కార్తీక్‌తో అంటాడు దాస్. నువ్విలా టెన్షన్ పడుతుంటే చూడటానికి నాకు చాలా బాగుందని అనుకుంటుంది జ్యోత్స్న. ఆ వెంటనే సుమిత్ర కేక్ కట్ చేయగా.. దానిని జ్యోత్స్నకు తినిపించబోతుండగా ఆమె టెన్షన్ పడుతుంది. అయితే దశరథ ఆమెను అడ్డుకుని ముందు దీపకు పెట్టమని చెప్పడంతో జ్యోత్స్న ముఖం వెలిగిపోతుంది. ఇదంతా గమనిస్తున్న కార్తీక్‌కి మొత్తం సినిమా అర్ధమవుతుంది. నా మనసులో ఏదైతే అనుకున్నానో అదే నువ్వు కూడా చేశావని అంటుంది జ్యోత్స్న.
ముందుగా నా భార్యకు ఎందుకు తినిపించాలి? జ్యోత్స్నకే పెట్టొచ్చు కదా అని కార్తీక్ అడుగుతాడు. నా భార్య బతికుండటానికి జ్యోత్స్న ఎంత కారణమో? దీప కూడా అంతే కారణం అంటాడు దశరథ. దీప నా పెద్ద కూతురు, జ్యోత్స్న నా చిన్నకూతురు.. తల్లి ముందుగా పెట్టాల్సింది కూడా పెద్ద కూతురికేనని చెబుతాడు. అయినప్పటికీ కార్తీక్ వినిపించుకోకపోవడంతో దీప వెళ్లి ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందా అని కార్తీక్‌ని అడుగుతుంది. పారిజాతం కూడా దీపకే తినిపించాలని చెప్పడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు.
ఈ కేక్‌లో నేను మామూలు విషం కలపలేదు. ఇది తిన్న 10 సెకన్లకే దీప చస్తుంది. నిజం బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక లోలోపలే నువ్వు భయంతో చచ్చిపోతుంటే నాకు బలే సరదాగా ఉందని అనుకుంటుంది జ్యోత్స్న. దీపని కాపాడాలని కార్తీక్ వస్తుండగా అతనికి అడ్డుగా నిలబడుతుంది. ఇంతలో దీపకి కేక్ తినిపిస్తుంది సుమిత్ర. అది చూసి కార్తీక్, దాస్‌లు షాక్ అవుతారు. నేను అనుకున్నది అయిపోయింది బావ అని అంటుంది జ్యోత్స్న. అయితే దీపకి ఏం కాకపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.. ఆమెను పక్కకి తోసేసి నాకు కూడా తినిపించమని చెబుతాడు కార్తీక్. ఇద్దరికీ ఏం కాకపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు కేక్‌లో విషం కలపడం నేను చూశా... సింపుల్‌గా కేక్ మార్చేశానని చెబుతాడు.
కేక్‌లో జ్యోత్స్న ఒకటి కలిపిందని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మన మీద తనకున్న ప్రేమను ఇందులో కలిపింది, అందుకే కేక్ ఇంత టేస్ట్‌గా ఉందని చెబుతాడు. దీపని సుమిత్రకు కేక్ తినిపించమని అంటాడు కార్తీక్. ఆ తర్వాత దశరథకు శ్రీధర్ కేక్ తినిపించి సెల్ఫీ దిగుతారు. దీపని, శౌర్యని తీసుకెళ్లమని శ్రీధర్‌కు చెబుతాడు. నువ్వు కూడా వచ్చేయొచ్చు కదా అని దీప అడగ్గా.. నాకు జ్యోత్స్నతో మాట్లాడే పని ఉందని అంటాడు కార్తీక్. నీతో మాట్లాడాలని జ్యోత్స్నని పక్కకి తీసుకెళ్తాడు.
కారులో వెళ్తుండగా స్వప్న చీరను చూసి వసంత్ చాలా బాగుందని చెబుతాడు. అది తన బర్త్ డేకు నేనే గిఫ్ట్‌గా ఇచ్చానని అంటాడు కాశీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను.. ఆన్సర్ చెబుతారా అని అడుగుతాడు వసంత్. స్వప్నలో ఉన్న గుడ్ క్వాలిటీస్, అలవాట్లు గురించి చెప్పమంటాడు. ఉదయం లేవగానే ఇంటిముందు ముగ్గులా కనిపిస్తుంది. బ్రెష్ చేసుకుని రాగానే వెచ్చని కాఫీలా పలకరిస్తుంది. స్నానం చేసి రాగానే సాంబ్రాణి దీపంలా పరిమళిస్తుంది. అలాంటి మనిషిని జీవితంలో ఒకసారే కలవగలం, ఈ ప్రపంచం మొత్తం తన ఆలోచనలతో నిండిపోతే పక్కన ఖాళీ ఎందుకుంటుంది. ఈ భూమ్మీద నేను బతికి ఉన్నంత వరకు అంటాడు కాశీ. ఆ మాటలతో స్వప్న పొంగిపోతుంది.
నువ్వు మొదలుపెట్టు నేను ముగిస్తానని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నిజాలు తెలిసినా, తెలియనట్లు నటించడం చాలా కష్టమని అంటుంది జ్యోత్స్న. లోపల ఏడ్చేంత బాధపెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం అది ఇంకా బాధ.. ఇలాంటి బాధను మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నారు కదా? నాకు దీనిపై నిన్ననే క్లారిటీ వచ్చిందని అంటుంది జ్యోత్స్న. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన తర్వాత అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అయితే డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూశావన్న మాట. నీ బ్రెయిన్ ఒక స్కానింగ్ మిషన్.. అది అన్ని స్కాన్ చేసి ఏది ఎక్కడ దాచుకున్నా కనిపెట్టేస్తుంది. డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీ హాస్పిటల్ డ్రామా మొత్తం బయటపడిందని అంటుంది జ్యోత్స్న.
ఇంతలో దాస్ వచ్చి ఎవరిది డ్రామా అని మండిపడతాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి వీళ్లెంత కష్టపడ్డారో తెలుసా? అందుకు వీళ్లు ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డారో తెలుసా? అని అంటాడు. మీరంతా ఒక్కటైపోయారని నాకు అర్ధమైపోయింది.. నువ్వు నా పుట్టుక గురించి బావకి, దీపకి, మా డాడీకి కూడా చెప్పేశావని అంటుంది జ్యోత్స్న. మీ నాన్నకు నీ గురించి తెలియదని కార్తీక్ చెప్పడంతో దాస్ షాక్ అవుతాడు. తెలిస్తే ఆస్తిని దీప పేరు మీదనో, దీప పిల్లల పేరు మీదనో రాసేవాడు కదా అంటాడు కార్తీక్. కూతురి పిల్లలకి అని రాశాడు.. 15 నెలలు టైమ్ ఇచ్చాడు కదా అని అంటాడు కార్తీక్.
ఈ 15 నెలల్లో నేను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనకపోయినా ఆస్తి దక్కేది నీకే కదా అంటుంది జ్యోత్స్న. మావయ్య ఆస్తి నాకు అవసరం లేదని కార్తీక్ చెప్పగా.. మేనల్లుడు అని రాశాడు కదా అంటుంది జ్యోత్స్న. తెలివిగా మేనల్లుడి కుటుంబమని రాశాడంటే, దీప కూతురు కాబట్టి ఈ రకంగా కూతురికి న్యాయం చేయాలని అనుకున్నాడని చెబుతుంది జ్యోత్స్న. నీలాంటి మోసగాడిని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉందని అంటుంది జ్యోత్స్న. నువ్వు నీచుడివి, ఈ నిజం ఎవరికీ చెప్పనని కూతురు మీద ఒట్టేశావు. నువ్వు ఒట్టు దాటి కూతురిని చంపేశావు.. కూతురిని చంపుకున్న తండ్రి నీచమైన వాడు అంటుంది.
మరి కన్నతల్లిలా పెంచిన మా అత్తని చంపాలనుకున్న నిన్ను ఏమనాలని అంటాడు కార్తీక్. నేను ఎవరినీ చంపాలని అనుకోలేదని కవర్ చేస్తుంది జ్యోత్స్న. మరి నన్ను మరిచిపోయావు అని దాస్ అడగ్గా.. ఆ రోజు నాకున్న టెన్షన్‌లో ఏం చేయాలో తెలియక నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావేమోనని కర్ర తీసుకుని కొట్టా.. కింద పడ్డావు అంటుంది. మా మమ్మీ డాడీ విషయంలోనూ నాకు ఇదే గిల్ట్ ఉందని అంటుంది. మరి దీప ఏం చేసిందని చంపాలని అనుకున్నావని నిలదీస్తాడు కార్తీక్. నేను దీపని ఈ ఇంటికి తీసుకురాకపోయుంటే దీప తన కూతురిని వేసుకుని రోడ్డు మీద అడుక్కు తింటూ ఉండేదని అంటుంది జ్యోత్స్న.
నువ్వు ఇక్కడికి తీసుకురాకముందే దీప నాకు తెలుసు అంటాడు కార్తీక్. నువ్వొక చేతకాని తండ్రివి, పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయినా నీకేం పట్టదు, నేను ఈరోజు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఎవరి వల్ల దీప వల్లే. దీప రాకపోయుంటే నేను బావకి పెళ్లాన్ని అయ్యుండేదానిని. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఆస్తి అంతా అనుభవిస్తూ.. చచ్చే వరకు ఒక రాణిలా బతికేదానిని అంటుంది జ్యోత్స్న. నేను నీ కూతురిని అని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఒక్క జత బట్టలు కొన్నావా? నా స్థాయి బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాలని చెబుతుంది. బట్టలే కొనలేని వాడివి, నువ్వు నాకు మంచి బతుకు ఇస్తావా థూ అని ఉమ్మేస్తుంది జ్యోత్స్న. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నది మా నాన్నమ్మ కోరిక అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











