Karthika Deepam 2 April 6th: నన్ను పెళ్లి చేసుకో దీపని, ఆస్తిని వదిలేస్తా.. జ్యోత్స్న కండీషన్‌కి కార్తీక్ షాక్

Photo Courtesy: JioHotstar

సుమిత్ర చేత కేక్ కట్ చేయించాలని ఏర్పాట్లు చేస్తుంది జ్యోత్స్న. ఈ కేక్‌ని నేనే దగ్గరుండి రెడీ చేశానని అంటుంది. దాంతో కేక్‌లో విషం పెట్టి అందరినీ చంపాలని అనుకుంటుందా అని కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే ఊహించని విధంగా కేక్ కట్ చేసి సుమిత్ర తినిపిస్తుండగా జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఇంతలో దశరథ ఆమెను ఆపి జ్యోత్స్నకు బదులు దీపకి కేక్ తినిపించమని చెబుతాడు. నాకు దీప, జ్యోత్స్న ఇద్దరూ ఒకటే.. దీప నా పెద్ద కూతురు ఆమె నా భార్య ప్రాణాలు కాపాడిందని చెబుతాడు దశరథ.

దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తుండగా కార్తీక్ అడ్డుకోబోతుండగా జ్యోత్స్న అడ్డు తగులుతుంది. దీప, కార్తీక్‌లకి కేక్ తిన్నప్పటికీ ఏం కాకపోవడంతో జ్యోత్స్నకి ఏం అర్ధం కాదు. నువ్వు కేక్‌లో విషయం కలుపుతుండగా చూసి కేక్ మార్చేశానని చెబుతాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వసంత్, స్వప్నలను కారులో గుడికి తీసుకెళ్తాడు కాశీ. మధ్యలో స్వప్న గురించి తన మనసులో మాటను చెబుతాడు. బంధువులంతా వెళ్లిపోయాక కార్తీక్. జ్యోత్స్న, దాస్‌లు మాట్లాడుకుంటారు. నువ్వు చేతకాని తండ్రివి.. నీ వల్ల మా బతుకులు ఇలా ఉన్నాయని దాస్‌పై కేకలు వేస్తుంది జ్యోత్స్న. దీప నాకు ప్రతి దానిలోనూ అడ్డుపడుతోంది. బావని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఈ ఇంటి వారసురాలిగా ఆస్తిని కొట్టేయాలని చూస్తోంది.. దానిని వదిలేది లేదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 6వ తేదీ 637వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 637 April 6th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నదే నా కోరిక. కాదు అది మా నానమ్మ కల అని అంటుంది జ్యోత్స్న. తెలిసి కూడా అడ్డుపడాల్సింది ఎవరు? నువ్వు? ఆరోజే నువ్వు అడ్డు పడొచ్చు కదా అని దాస్‌ని నిలదీస్తుంది జ్యోత్స్న. ఈరోజు నా మీద అరిచినట్లు, ఆరోజు మీ అమ్మ మీద అరిచి ఉంటే నా బతుకు ఎలా ఉండేదో.. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకంటే నీ కూతురు కోట్లలో బతకడం నీకు కూడా ఇష్టమే. కానీ కొన్నేళ్ల తర్వాత నీకు జ్ఞానోదయం అయ్యింది.. సరిదిద్దుకోవడానికి తయారయ్యాడు. వారసురాలు ఎవరా అని ఆరా తీస్తే.. ఎవరైతే నా బావని నాకు కాకుండా చేసిందో అదే ఈ ఇంటి వారసురాలు. నిజం చెబుతానంటూ నువ్వు దిగావని సీరియస్ అవుతుంది జ్యోత్స్న.

అందరినీ చంపుతావా అంటూ దాస్ మండిపడతాడు. ఇప్పుడు దీప కూతురు శౌర్యని.. తన కూతురు కాదని శౌర్యని తీసుకెళ్తే శౌర్య వెళ్తుందా? కంఫర్ట్. బావ చూసకున్నంత గొప్పగా శౌర్యని ఏ తండ్రి చూసుకోలేడు. నేను కూడా అంతే. ఇది నా ఇల్లు. దశరథ- సుమిత్ర మా అమ్మనాన్న, నేను శివన్నారాయణ గారి మనవరాలిని. ఇది నా ఆస్తి అని తేల్చేస్తుంది జ్యోత్స్న. వారసురాలిని అంటూ ఇప్పుడు ఎవరో వస్తే పూలు జల్లి స్వాగతిస్తానా? దానిని స్వాగతించి నేను బ్యాగులో నాలుగు బట్టలు వేసుకుని నీతోపాటు వచ్చేస్తానా అంటుంది.

నేను ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తానని దాస్ అనగా.. నేను మేడ మీద నుంచి దూకి చస్తానని బెదిరిస్తుంది జ్యోత్స్న. నువ్వు కిందకి వెళ్లేలోపు నా చావు కేక మా మమ్మీకి వినిపిస్తుంది.. ఆవిడ గుండె ఆగి చచ్చిపోతుందని అంటుంది జ్యోత్స్న. బాధతో మా డాడీ, బెంగతో మా తాత అందరూ పోతారని చెబుతుంది జ్యోత్స్న. నా కూతురిని చూస్తుంటే భయంగా ఉంది.. ఏదో ఒకటి చేయమని కార్తీక్‌ని బతిమలాడతాడు దాస్. దాంతో కార్తీక్ తన మావయ్యకి నచ్చజెప్పి.. నేను చూసుకుంటానని చెబుతాడు. నాకు నా కూతురంటే చాలా ఇష్టం.. నాకు నా కూతురు కావాలని అంటాడు దాస్.

పార్టీలో కేక్‌ని దీపకే తినిపించాలని దశరథ చెప్పడం గురించి ఆలోచిస్తుంది కాంచన. నా కొడుకు నాకు అర్ధం కావడం లేదు, అన్నింటికీ కంగారు పడుతున్నాడని చెబుతుంది. అందరిలో ఉన్నాడు కానీ వాడు దేనీ గురించో టెన్షన్ పడుతున్నాడని అంటాడు శ్రీధర్. కార్తీక్ ఏమైనా చెప్పినా సరే దీప మనతో చెప్పదని అంటుంది కాంచన. భార్యాభర్తలిద్దరిదీ ఒకటే మాట.. అన్నీ నేనే తెలుసుకోవాలని చెబుతుంది. కొన్ని విషయాలు మీరు బాధపడకూడదని, కొన్ని విషయాలు మీరు తట్టుకోలేరని మేమిద్దరం చెప్పమని అంటుంది దీప. తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో మగాడు గాయపడ్డ సైనికుడిగానే మిగిలిపోతున్నాడని అంటాడు శ్రీధర్. మాకు అన్నీ అర్ధమవుతాయి.. కానీ అన్నీ చూస్తూ ఉండటమే బెటర్ అని చెబుతాడు. బావ ప్రవర్తన చూస్తే జ్యోత్స్న గురించి బావకి ఏదో తెలిసినట్లుగా ఉంది. తనతో ఏం మాట్లాడటానికి ఆగాడని అనుకుంటుంది దీప.

యుద్ధం అన్నావుగా మొదలుపెట్టు అని కార్తీక్‌తో సవాల్ చేస్తుంది జ్యోత్స్న. అది ఎప్పుడో మొదలైంది.. ఈరోజు దానిని ఆపాలని చెబుతాడు కార్తీక్. ఆపాలంటే నిజం చెప్పాలి.. నేను చచ్చినా నీకేంటీ? మా నాన్నంటే నా మీద కొంచెం ప్రేమ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్‌ని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తుంటా. కానీ నువ్వు దేనికీ లొంగవు కదా అని అంటుంది జ్యోత్స్న. ఇవన్నీ దేనికీ నువ్వు నిజం ఒప్పుకోవచ్చు కదా అని అంటాడు కార్తీక్. నేను ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ అందరి ముందు ఒప్పుకుంటా? కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నన్ను నీ భార్యను చేసుకున్నావంటే నేను మంచిదానిగా మారిపోతానని చెబుతుంది జ్యోత్స్న.

దీప ఇప్పుడు నా భార్యగా ఉందని కార్తీక్ చెప్పగా.. దీపకి కూడా పెళ్లయ్యింది, అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావుగా అంటుంది జ్యోత్స్న. దీపని తప్పించి నా భార్యగా ఎవరినీ ఊహించుకోలేనని చెబుతాడు కార్తీక్. నేను కూడా నన్ను ఈ ఇంటి వారసురాలిగా తప్ప దాస్ కూతురిగా ఊహించుకోలేను, నువ్వెలా నీ భార్యకు భర్తగా ఉండలేనని అనుకుంటున్నావో, నా ఆస్తికి వారసురాలిగా ఉండాలనుకుంటున్నాను, నేను కూడా నిజం ఒప్పుకోనని చెబుతుంది. నేనే వెళ్లి అందరికీ నిజం చెబుతానని కార్తీక్ చెప్పగా.. అప్పుడు నేను చస్తానని అంటుంది జ్యోత్స్న. నా ప్రాబ్లమ్ అని కార్తీక్ అనగా.. నేను చస్తాను, చచ్చే ముందు దీపని చంపే చస్తానని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

నా ప్రాణమంటే నీకు లెక్కలేదు, కానీ దీప ప్రాణమంటే నీకు లెక్కే... నువ్వు కోరుకునేది భయమైతే ఆ భయాన్ని నీకే పరిచయం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నేను కాదు.. నీ అంతట నువ్వే నేను ఈ ఇంటి వారసురాలిని కాదు అని చెప్పిస్తానని అంటాడు. అయితే తేల్చుకుందామని ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక.. నేను నీ కూతురిని కాదు, దీపే నీ కూతురని సుమిత్ర అత్తతో అందరి సమక్షంలో చెప్పేలా చేస్తానని అంటాడు. అయితే అప్పటి వరకు నువ్వు కానీ, దీప కానీ, నీ మావయ్య దాస్ కానీ ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని అంటుంది జ్యోత్స్న. నీతోనే నిజం చెప్పిస్తానని అన్నాక.. మేమెందుకు చెబుతామని అంటాడు కార్తీక్. విలన్‌గా ఉన్న నిన్ను కమెడియన్‌గా మారుస్తానని చెబుతాడు.

నీకు ఇంకా కార్తీక్‌ గాడి మీద ఆశ చావలేదు కదా అని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. కార్తీక్ గాడితో ఆ మంతనాలు ఏంటీ? అని మండిపడుతుంది. దీపకి ఏమైనా చెడు చేయాలని అనుకుంటున్నావా? కార్తీక్ లాంటి వాడే కావాలని అడిగావు కదా అని అంటుంది పారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది.. ఇక సంబంధాలు చూడటమేనని దశరథ అంటాడు. వీలునామాల కోసం జరిగిన గొడవలో మళ్లీ నేను మా కూతురు ముఖం చూడలేకపోయా.. కానీ నువ్వు అందరినీ కలిపావని జ్యోత్స్నని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. నా వల్ల ఏ తప్పు జరిగినా అది నేనే సరిదిద్దుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. కూతురి గురించి మురిసిపోతుంది సుమిత్ర. ఇది నా మనవరాలు దీపకి ఏదో చెడో చేయబోతోందని భయపడుతుంది పారిజాతం. మాతో రాకుండా నువ్వు అక్కడే ఎందుకు ఆగిపోయావని కార్తీక్‌ని అడుగుతుంది కాంచన. ఇంతలో కార్తీక్ వంటగదిలోకి వెళ్లి భార్యకు దిష్టి తీస్తాడు కార్తీక్. ఇదంతా చూసిన కాంచన, శౌర్యలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X