Karthika Deepam 2 April 7th: కార్తీక్- దీపల పెళ్లిరోజు... శివన్నారాయణ ఇంట్లో దీప హత్యకు జ్యోత్స్న స్కెచ్

Photo Courtesy: JioHotstar

ఈ ఇంటికి వారసురాలు ఒకరే ఉండాలి.. అది నేనే అయ్యుండాలని కార్తీక్, దాస్‌లతో తేల్చి చెబుతుంది జ్యోత్స్న. నేను ఇప్పుడే వెళ్లి ఇంట్లో వాళ్లందరికీ నిజం చెబుతానని దాస్ అంటాడు. అప్పుడు నేను వెంటనే చస్తాను.. నా చావు కేక మా అమ్మ విని గుండెపగిలి చచ్చిపోతుంది. భార్య మరణంతో మా నాన్న, కొడుకు చావుతో మా తాత అందరూ చస్తారని జ్యోత్స్న బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నా కూతురిని చూస్తుంటే నాకు భయంగా ఉంది.. ఏదో ఒకటి చేయ్ నా కూతురు నాకు కావాలని కార్తీక్‌తో అంటాడు దాస్. మావయ్యని ఇంటికి పంపేసిన కార్తీక్.. జ్యోత్స్నతో గొడవ పడతాడు.

దీపని, ఆస్తిని అన్నింటిని వదిలేస్తాను.. నువ్వు నా మెడలో తాళి కట్టి, నా భార్యను చేసుకోమని కార్తీక్‌ను అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో షాకైన కార్తీక్.. దీప ఉండగా మరొకరిని ఆ స్థానంలోకి తీసుకురానని తేల్చేస్తాడు. నేను కూడా అంతే.. ఈ ఇంటికి వారసురాలిననే స్థానాన్ని మరొకరికి ఇవ్వలేనని చెబుతుంది జ్యోత్స్న. అయితే నీ నోటితో నువ్వే నేను నీ కూతురిని కాదని చెప్పిస్తానని కార్తీక్ సవాల్ విసురుతాడు. అది నేను కూడా చూస్తానని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. బయటికొచ్చిన జ్యోత్స్నకి దశరథ, శివన్నారాయణలు థ్యాంక్స్ చెబుతారు. నీ వల్లే నా కూతురి ముఖం నేను చూడగలిగానని చెబుతాడు శివన్నారాయణ. పార్టీలో కార్తీక్ ప్రవర్తన తేడాగా ఉండటంతో దీపని నిలదీస్తారు కాంచన, శ్రీధర్. ఇంతలో కార్తీక్ వచ్చి దీపకి దిష్టి తీయడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 7వ తేదీ 638వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 638 April 7th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపకు కార్తీక్ దిష్టి తీయడంతో ఎందుకు అని అడుగుతుంది కాంచన. కడుపుతో ఉన్న భార్య గడప దాటితే ఎన్నో కళ్లు ఆమె మీద ఉంటాయి. అందుకే దిష్టి తీశానని చెబుతాడు కార్తీక్. అయితే అతని మాటలతో దీప, కాంచనలకు ఏదో అనుమానం వస్తుంది. అయితే రాత్రి పడుకునే ముందు కార్తీక్‌ను దీప నిలదీస్తుంది. జ్యోత్స్న నువ్వు ఏం మాట్లాడుకున్నారు? అని అడుగుతుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతుంది. ఆస్తుల గురించే గొడవ జరిగింది.. వీలునామాతో సంబంధం లేదు.. నువ్వే సుమిత్ర అత్తకు అసలైన కూతురవని చెప్పానని అంటాడు కార్తీక్. అయితే దీప ఈ మాటలు నమ్మదు. జ్యోత్స్న సంగతి మనకి తెలిసిందే కదా? అలాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెబుతాడు కార్తీక్. కానీ బలవంతంగా ఆమెను నిద్రపుచ్చుతాడు కార్తీక్.

జ్యోత్స్న నీ స్థానంలోకి రావాలని అనుకుంటోంది. నా మీద ప్రేమ ఒక కారణమైతే, ఆస్తి ఎటూ పోకూడదనేది మరో కారణమని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‌కు పారు ఫోన్ చేస్తుంది. మనవరాలు నిద్రపోతుందా అని అడుగుతుంది. నా భార్య పడుకుందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశావా? నీ మనవరాలు జ్యోత్స్న కోసం ఫోన్ చేశావా అని నిలదీస్తాడు. ఈ పారిజాతం పవిత్ర హృదయాన్ని శంకించకురా అంటుంది పారు. మా భయాలు మాకుంటాయి.. ఎందుకంటే మేం పేదోళ్లం, మీరు రిచ్ అంటాడు కార్తీక్. నువ్వు పేదోడివి కాదు.. ఈ పారిజాతం మనవరాలి మొగుడివి అంటుంది పారు. ఇంతకీ దీపకి దిష్టి తీశావా? అని అడగ్గా.. నా భార్య దిష్టి గురించి నీకెందుకు అని కార్తీక్ నిలదీస్తాడు. కడుపుతో ఉన్న ఆడపిల్ల కదా? ఇక్కడ ఎన్ని కళ్లుపడ్డాయో అంటుంది పారిజాతం.

ఆ జ్యోత్స్న నిన్ను వదిలిపెట్టేలా లేదని వార్నింగ్ ఇస్తుంది పారు. మరి దానికి ఏం చేయాలో చెప్పమని కార్తీక్ అడగ్గా.. ఒంగోలుగిత్త లాంటి నీలాంటి వాడిని చూసి పెళ్లి చేసేయడమే అంటుంది పారు. దానికి ఒక సంబంధం చూడు.. నీకు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తానని చెబుతుంది పారు. మనమంతా కలిసి జ్యోత్స్న తాట తీద్దామని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నే నీ అసలైన మనవరాలు అని తెలిసిన రోజున నువ్వు ఏ నూతిలోనో దూకేస్తావని అంటాడు కార్తీక్. ఇంతలో దీప కలవరిస్తూ రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అని అడుగుతుంది. గుర్తుందని చెబుతాడు కార్తీక్.

మరోవైపు దీప, కార్తీక్‌ల పెళ్లిరోజు ఫోటోలు చూస్తూ జ్యోత్స్న రగిలిపోతుంది. సరిగ్గా రేపటి రోజునే నా బావ నీ మెడలో తాళి కట్టాడు, నా కళ్ల ముందే నీ పెళ్లి జరిగింది. నా మెడలో కట్టమని తెచ్చిన నా తాళిని నీ మెడలో కట్టాడు. నువ్వు పుట్టకముందే కాంచన అత్త నిన్ను కోడలిని చేసుకుందామనుకుంది. కానీ దరిద్ర్యం నీ జాతకంలోనే ఉంది. నువ్వు పుట్టగానే నీ స్థానంలోకి నేనొచ్చాను. నాకు ఈ నిజాలు తెలియవు కాబట్టి.. బావ మీద ఆశలు పెట్టుకుని బతికాను. కానీ నువ్వొచ్చి నా ప్రేమను ఒక్క పసుపు తాడుతో దూరం చేశావు. నాకు ఈ బతుకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. నాకు ఈ ఆస్తి కావాలి, ఈ ఇంటి వారసురాలిని అన్న పేరు కావాలి, అలాగే భర్తగా బావ కావాలి. నీ మొదటి పెళ్లిరోజు కదా జీవితంలో మరిచిపోలేని కానుక ఇస్తాను, ఇదే నీకు ఫస్ట్, ఇదే నీకు లాస్ట్ అనుకుంటుంది జ్యోత్స్న.

పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే శ్రీధర్- కాంచనల ఆశీర్వాదం తీసుకుంటారు కార్తీక్- దీప. నాకు నువ్వే ఆదర్శంగా నిలిచావు.. పెళ్లయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినవాళ్లే సర్వస్వం అనుకునే నీకు.. నువ్వే తోడు అనుకునే దీపలాంటి మనిషిని ఇచ్చాడని మెచ్చుకుంటాడు శ్రీధర్. నాకు భగవంతుడి దీవెనలు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయని చెబుతాడు కార్తీక్. ఈ కార్తీక దీపానికి ప్రతి వసంతం నవ వసంతం అని చెబుతాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుంది. అమ్మానాన్నల పెళ్లిరోజుకి నేను చిన్న కానుక ఇస్తున్నానని తను వేసి బొమ్మ తీసుకొచ్చి ఇస్తుంది శౌర్య.

డ్యూటీకి వెళ్తామని కార్తీక్ చెప్పడంతో.. ఈరోజు మీ పెళ్లిరోజు ఇవాళ ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెబుతాడు శ్రీధర్. తాత ఇంట్లో అందరినీ ఆశీస్సులు తీసుకుని వచ్చేస్తానని చెబుతాడు కార్తీక్. నా భయమంతా ఆ జ్యోత్స్న గురించే.. వీళ్ల పెళ్లిరోజుని దానికి తెలియగానే మనసుని కష్టపెట్టే ఏదో ఒక మాట అంటుందని చెబుతుంది కాంచన. కార్తీక్- దీపలు వచ్చేసరికి ఇళ్లంతా నెయ్యి పోస్తుంది. మనిషిని చంపడానికి కత్తులు అవసరం లేదు.. చిన్న చిన్న వాటితోనే చంపొచ్చని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం డ్యాన్స్ వేస్తూ సందడి చేస్తుంది. ఈ వయసులో ఇలాంటివేవి వద్దని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి నువ్వు ఇరగదీసేయ్.. నేను చూసుకుంటానని అంటాడు.

నువ్వు ఒక్కడివే వచ్చావు.. దీప ఎక్కడ అని అడుగుతుంది జ్యోత్స్న. రోజూ నీళ్లు పోసే గులాబీ మొక్కకు నీళ్లు పోసి గులాబీ పువ్వుని తలలో పెట్టుకుని వస్తుందని చెబుతాడు కార్తీక్. ఇంతలో దీప కనిపించడంతో రా దీప.. నీ గురించే ఎదురుచూస్తున్నానని అనుకుంటుంది జ్యోత్స్న. ఈరోజు కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యావని అడుగుతుంది పారు. ఇంతలో దీప నెయ్యి మీద కాలు వేసి జారిపడిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X