Karthika Deepam 2 April 8th: కార్తీక్‌ను దక్కించుకునేందుకు జ్యోత్స్న పన్నాగం.. కార్తీక్‌- దీపల మధ్య చిచ్చు

Photo Courtesy: JioHotstar

దీపకి దిష్టి తీయడంతో ఎందుకు తీశావని కార్తీక్‌ను అడుగుతుంది కాంచన. దీప కడుపుతో ఉంది.. పార్టీలో ఎన్ని కళ్లు పడ్డాయో ఏంటో? అని తీశానని చెబుతాడు కార్తీక్. కానీ కాంచనకు జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. జ్యోత్స్నతో ఏం మాట్లాడావు? ఎందుకు ఆగిపోయావని కార్తీక్‌ను అడుగుతుంది దీప. వీలునామా గురించి గొడవపడ్డామని అబద్ధం చెబుతాడు కార్తీక్. రేపు మన పెళ్లిరోజు గుర్తుందా అని దీప అడగ్గా.. అస్సలు మరిచిపోలేదని చెబుతాడు కార్తీక్. మరోవైపు.. దీప- కార్తీక్‌ల పెళ్లి ఫోటోలను చూస్తూ రేపటి రోజున నా బావని నాకు కాకుండా చేశావు, ఇప్పుడు వారసురాలిగా ఆస్తిని ఎత్తుకుపోవడానికి రెడీ అయ్యావని దీప హత్యకు కుట్ర పన్నుతుంది జ్యోత్స్న.

పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే శ్రీధర్ - కాంచనల ఆశీస్సులు తీసుకుంటారు కార్తీక్- దీప. ఇంతలో శౌర్య వచ్చి తల్లిదండ్రులకు పెళ్లిరోజు కానుకగా ఒక డ్రాయింగ్ ఇస్తుంది. ఆ వెంటనే మేం తాత ఇంటికి వెళ్తామని కార్తీక్ చెప్పడంతో వద్దని అంటుంది కాంచన. అయినప్పటికీ వినిపించుకోకుండా కార్తీక్, దీపలు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. దీప వచ్చేసరికి గుమ్మం దగ్గర నెయ్యి పోస్తుంది జ్యోత్స్న. ఉదయాన్నే పారిజాతం డ్యాన్స్ చేసుకుంటూ రావడంతో శివన్నారాయణ, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇంతలో కార్తీక్ పట్టుబట్టల్లో రావడంతో విశేషం ఏంటీ? అని అడుగుతారు శివన్నారాయణ కుటుంబ సభ్యులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 8వ తేదీ 639వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 639 April 8th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప నెయ్యి మీద కాలు జారిపడిపోతుండగా జ్యోత్స్న పట్టుకుంటుంది. నువ్వు పట్టుకోకపోతే తల గుమ్మానికి తగిలేదని అంటాడు శివన్నారాయణ. ఎంతైనా దీప అదృష్టవంతురాలని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు మా ఇంట్లో జారిపడితే మా అత్త ఊరుకోదని అంటుంది. కడుపుతో ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకోవడం రాదా అని కార్తీక్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. అందరూ ఊహించింది చేస్తే నేను జ్యోత్స్నని ఎందుకు అవుతాను, నా స్ట్రాటజీ వేరే ఉందని అనుకుంటుంది జ్యోత్స్న. ఎప్పుడూ దీపని చూస్తే మండిపడే జ్యోత్స్న.. దీపని కాపాడటం ఏంటని దశరథకు అనుమానం వస్తుంది.

దీప కిందపడిపోయిందే నా వల్ల .. కానీ నేను కాపాడినట్లు అనుకుంటున్నారని నవ్వుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి.. పిల్లి పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటుంది. కానీ అది పిల్లి కాదు, నక్క అని అందరికీ తెలియదని సెటైర్లు వేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరూ ఫ్లోర్ మీద పడింది వాటర్ అనుకుంటున్నారు, కానీ అది ఆయిల్ అని నాకు మాత్రమే తెలుసు. కడుపుతో ఉన్న ఆడమనిషిని కిందపడేయటానికి ఈ దొంగ పిల్లి ఇంతకీ తెగించిందని తెలిసిందని తాట తీస్తానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నీ ప్లాన్ మార్చుకున్నావా? నాకు బెదిరింపా? నాకు హెచ్చరింపా? అని అడుగుతాడు కార్తీక్.

బెదిరించే దాన్నే అయితే ఓ మంచి వాటంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లే దానిని అంటుంది జ్యోత్స్న. మరెందుకు ఈ దొంగనాటకాలు అని కార్తీక్ అడగ్గా.. ఈరోజు పడకుండా పట్టుకున్నానని వదిలేస్తానని అనుకున్నావా అని మండిపడుతుంది జ్యోత్స్న. దీపకి కానీ, కడుపులో బిడ్డకు కానీ ఏదైనా జరిగితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు ఏమైనా చేసుకో.. దీప అడ్డు తొలగించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. నేను ఇప్పటికే దిగజారిపోయాను, ఇంతకన్నా మెట్లు దిగను.. నా ఎజెండా ఒకటే నీ చేత తాళి కట్టించుకోవడమేనని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి చెప్పు తెగుద్దని వార్నింగ్ ఇస్తుంది.

నువ్వు వెళ్లి దీప సంగతి చూడు.. దీని తుక్కు రెగ్గొడ్డతానని అంటుంది పారు. నూనె వలికిందో, వలికించావో తెలుసుకులేనంత చిన్నదానిని కాదని చెబుతుంది. ఏం చేసినా ఆలోచించి చేస్తే అందరికీ మంచిది, సర్వేజనా సుఖీనో భవంతు అని వెళ్లిపోతాడు కార్తీక్. ఈ 1940 నూనె పోసే అలవాట్లు మానేసి బుద్ధిగా ఉండు, నీ మంచికే చెబుతున్నాను.. దీప జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తుంది పారు. నీకు బుర్ర సగమే పనిచేస్తోందని మండిపడుతుంది జ్యోత్న్స. నేను దీప జోలికి వెళ్లను, బావ జోలికి వెళ్తాను. మీ అందరికీ చిన్న సర్‌ప్రైజ్ ఉంది.. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటుంది.

కిచెన్‌లోకి వెళ్లిన కార్తీక్.. నువ్వు ఈరోజు ఈ పనులన్నీ చేయకూడదని చెబుతాడు కార్తీక్. పారు కూడా వచ్చి ఈరోజు అన్ని పనులు నేను చేస్తానని చెబుతుంది. ముందు మీ ఇద్దరికీ దిష్టి తీస్తాను, మీ ఇద్దరు కొత్త పెళ్లి జంటల్లా మెరిసిపోతున్నారని అంటుంది పారిజాతం. వెంటనే దీప, కార్తీక్‌లను తీసుకుని వెళ్లి శివన్నారాయణ ఫ్యామిలీకి చెబుతుంది. వీళ్లిద్దరినీ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందని అంటాడు శివన్నారాయణ. కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదని దశరథ బాధపడతాడు. వదిన కూడా చెప్పలేదని సుమిత్ర సీరియస్ అవుతుంది. పనివాళ్ల పుట్టినరోజులు, పెళ్లిరోజులు యజమానులు ఎందుకు గుర్తుపెట్టుకుంటారని అడుగుతాడు కార్తీక్. ఆ మాటలు మాట్లాడితే కొడతానని అంటారు దశరథ, సుమిత్ర.

ముందే చెబితే కేక్ తెప్పించేవాడినని అంటాడు దశరథ. ఇప్పుడే తెప్పిస్తానని అంటాడు. అనంతరం శివన్నారాయణ- పారు, దశరథ- సుమిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు కార్తీక్- దీప. కనీసం రాత్రి చెప్పినా ఇళ్లంతా డెకరేట్ చేసేదానిని అంటుంది పారిజాతం. మా మొదటి పెళ్లిరోజు మేం ఏం కోరుకుంటాం.. మన రెస్టారెంట్‌లో భోజనం చేసి, పక్కనే ఉన్న థియేటర్‌లో సినిమా చూసి సాయంత్రం మా అమ్మకి కబుర్లు చెబితే చాలని అంటాడు కార్తీక్. ఎంత సామాన్యమైన జీవితాన్ని కోరుకుంటున్నావని అంటాడు శివన్నారాయణ. వీడు రాజ్యాలు సంపాదించిన రాజు కాదు.. మనుషుల్ని సంపాదించిన రాజు అంటాడు దశరథ. ఈ జంట జీవితాంతం ఇలాగే ఉండాలని చెబుతాడు.

పెళ్లిరోజు అని చెప్పలేదు కాబట్టి వీళ్లకు పనిష్మెంట్ ఇస్తున్నాను.. వీళ్లకి లీవ్‌తో పాటు నా కారు కూడా ఇస్తున్నాను, రేపు ఉదయం 9 గంటల వరకు కనిపించొద్దని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్- దీపలు బయల్దేరి వెళ్తుండగా జ్యోత్స్న శారీ కట్టుకుని వచ్చి మరి ఆపుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. గుడికి తీసుకెళ్లమని జ్యోత్స్న అడగటంతో అంతా ఉలిక్కిపడతారు. జ్యోత్స్న ఏదో కొత్త డ్రామా మొదలుపెట్టినట్లుగా ఉందని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. కార్తీక్- దీపలకి విష్ చేస్తుంది. ఈలోపు నువ్వు వంట చేస్తూ ఉండు.. నేను, బావ గుడికి వెళ్తామని చెబుతుంది. ఈరోజు స్వామివారికి పాలాభిషేకం చేస్తే నాకు పెళ్లి జరుగుతుంది. అయితే నేను నిన్ను తీసుకెళ్తానని చెబుతాడు దశరథ. నేను బావని తీసుకెళ్తానని సంకల్పించుకున్నాను .. బావే తీసుకెళ్తాడని అంటుంది జ్యోత్స్న. ఎవరు చెప్పినా జ్యోత్స్న వినిపించుకోకపోవడంతో సుమిత్రను వాడుకుంటుంది. ఆ మొక్కు ఫలించి దీనికి మంచి సంబంధం వచ్చి పెళ్లి జరిగితే బాగుంటుందని సుమిత్ర అంటుంది. ఆ మాటలతో కార్తీక్- దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X