Karthika Deepam 2 April 9th: కార్తీక్‌తో తాళి కట్టించుకునేలా జ్యోత్స్న స్కెచ్.. మనవరాలికి పారు సూపర్‌ ట్విస్ట్

Photo Courtesy: JioHotstar

ఫ్లోర్‌పై ఉన్న నూనెను చూసుకోకుండా కాలు జారిపడబోతున్న దీపని జ్యోత్స్న పట్టుకోవడంతో అంతా షాక్ అవుతారు. ఎప్పుడూ ఉప్పు- నిప్పులా ఉండే జ్యోత్స్న- దీపలు ఇలా కనిపించడంతో దశరథ, కార్తీక్‌లు షాక్ అవుతారు. దీపని తీసుకుని పారిజాతం వెళ్లిపోగానే.. నా అసలు ప్లాన్ వేరే ఉందని నవ్వుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి.. అందరూ ఫ్లోర్ మీద ఉన్నది నీళ్లు అనకుంటున్నారు, కానీ అది నూనె అని నాకు తెలుసు అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడితో ఆపకపోతే నాతో వార్ తట్టుకోలేవని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఆ వెంటనే పారిజాతం వచ్చి.. ఫ్లోర్ మీద నూనె పోసి దీపకి కీడు చేయాలని చూస్తావా అంటూ మండిపడుతుంది. దీప జోలికి వస్తే ఊరుకోనని ఫైర్ అవుతుంది.

కిచెన్‌లో కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం వచ్చి మీరిద్దరూ ఈరోజు చాలా బాగున్నారని చెప్పడంతో ఈరోజు మా పెళ్లిరోజని కార్తీక్ అంటాడు. దాంతో పారు ఇంట్లో వాళ్లందరికీ ఈ విషయం చెబుతుంది. మాకు ముందే ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు కార్తీక్- దీపలపై మండిపడతారు. ఆ వెంటే కార్తీక్ దంపతులు పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడంతో దీప చాలా సంతోషిస్తుంది. ఈరోజు మీ ఇద్దరికీ లీవ్ ఇస్తున్నాను.. నా కారు తీసుకుని ఎంజాయ్ చేయమని శివన్నారాయణ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న వచ్చి నన్ను గుడికి తీసుకెళ్లమని కార్తీక్‌తో గొడవ పడుతుంది. దీనికి సుమిత్ర కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 9వ తేదీ 640వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 640 April 9th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప- కార్తీక్‌ల పెళ్లిరోజును చెడగొట్టాలని ప్లాన్ చేసిన జ్యోత్స్న.. కార్తీక్‌తో తనను గుడికి తీసుకెళ్లాలని పట్టుబడుతుంది. దీనికి సుమిత్ర కూడా సపోర్ట్ చేస్తుండగా.. గుడికి దీపని కూడా తీసుకెళ్లమని దశరథ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈరోజు వాళ్ల పెళ్లి రోజు కదా అర్చన చేయించుకుంటారని అంటాడు. ముగ్గురం వెళ్లకూడదని చెప్పావు కదా అని జ్యోత్స్న చెప్పగా.. నేను మీ వెంట వస్తానని అంటుంది పారు. అందరితో కలిసి వెళ్లి పూజ చేయించుకుంటే నా పూజ ఫలించదని చెబుతుంది జ్యోత్స్న. అయితే సుమిత్ర మాత్రం జ్యోత్స్నని తీసుకెళ్లమని చెప్పడంతో కార్తీక్ ఒప్పుకుంటాడు. తన పథకం పారినందుకు జ్యోత్స్న సంతోషిస్తుంది. దీని యవ్వారం తేడాగా ఉందని పారుకి అనుమానం వస్తుంది.

గుడి దగ్గర లోపలికి రాకుండా కార్తీక్ బయటే ఉండిపోవడంతో లోపలికి రమ్మని మారాం చేస్తుంది జ్యోత్స్న. నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసని లోపలికి వెళ్తుంది. పూజారి గారితో ఈరోజు నా పెళ్లిరోజు.. అభిషేకం చేయించుకోవాలని వచ్చాను, కానీ మా ఆయన నా మీద అలిగి బయటే ఉండిపోయాడని చెబుతుంది. నేను మా ఆయనని లోపలికి రప్పిస్తాను, మీరు భార్యాభర్తలకు చేసినట్లుగా పూజ చేయండి అంటుంది. వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేసి కారులో పూజా సామాగ్రిని మరిచిపోయాను తీసుకురమ్మని అంటుంది. నేను తీసుకురాను, నువ్వు తెచ్చుకో అంటాడు కార్తీక్. ఒకసారి గుడిలోకి వచ్చిన తర్వాత పూజ అయ్యే వరకు బయటకు రాకూడదని అంటుంది జ్యోత్స్న. దాంతో మా మమ్మీకి ఫోన్ చేసి చెబుతానని బెదిరించడంతో కార్తీక్ సరేనని లోపలికి తీసుకెళ్తాడు.

గుడికిలోకి వెళ్లిన తర్వాత పూజారి గారు కార్తీక్‌పై మండిపడతాడు. పెళ్లి రోజు నాడు పెళ్లాన్ని దూరం పెట్టకూడదు.. నీ కోసం ఈమె ఎంత బాధపడుతుందో చూడు అంటాడు. దాంతో ఈవిడ మా ఆవిడ కాదు అంటాడు కార్తీక్. ఈ దెబ్బకి పూజారికి, మిగిలిన వారికి కోపం వస్తుంది. కార్తీక్‌ని నలుగురు నానామాటలు అంటారు. భార్య అనే వాహనానికి భర్త డ్రైవర్ అంటారు. ఆడవాళ్ల మీద నోరు చేసుకోవడం తప్పని పూజారి మండిపడతాడు. ఆవిడ నా భార్య కాదు.. తాళి చూపించమని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నీ అర్ధాంగి ఎవరు అని పూజారి అడగ్గా.. అది నేనే చెబుతానని పారు రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే దీపని పిలుస్తుంది పారు. దీపని చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈవిడ పేరు దీప.. ఈవిడే నా సతీమణి కార్తీక్ చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇలాంటి అపార్ధాలు చోటు చేసుకుంటాయనే నేను వచ్చానని అంటుంది పారు. ఈ దెబ్బకి జ్యోత్స్న కోసం వచ్చిన మనుషులు కూడా పారిపోతారు. కార్తీక్‌, దీపలు కలిసి గుడిలో ప్రదక్షిణలు చేస్తారు. దీప నుదిటిపై కార్తీక్ బొట్టు పెట్టడం చూసిన జ్యోత్స్న రగిలిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటుంది దీప.

ఇంట్లో దీప, పారిజాతం కనిపించకపోవడంతో ఎక్కడ అని అడుగుతాడు శివన్నారాయణ. ఈరోజు కార్తీక్- దీపల పెళ్లిరోజు కావడంతో దీపని తీసుకుని గుడికి వెళ్లిందని శివన్నారాయణకి చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్న తన వెంట ఎవ్వరినీ రావొద్దని చెప్పింది కదా? పారిజాతం.. దీపని ఆ గుడికే తీసుకెళ్తే గొడవ చేస్తుందని అంటాడు శివన్నారాయణ. ఈ మధ్య మీ పిన్నిలో వచ్చిన మార్పును చూసి ఆనందపడాలో? అనుమానపడాలో అర్ధం కావడం లేదని చెబుతాడు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా? దీపని అత్తయ్యగారు ఎప్పుడూ మనిషిలా చూడలేదు, మాట్లాడితే కొట్టినట్లుగా ఉండేది. కానీ తనని సొంత మనవరాలిగా చూసుకుంటున్నారని చెబుతుంది సుమిత్ర. కార్తీక్ ఏదో చేసినట్లుగా ఉన్నాడని దశరథకు అనుమానం వస్తుంది.

కొడుక్కి సారీ చెప్పిన శివన్నారాయణ.. వీలునామా మార్చి రాసినప్పుడు నిన్ను నానామాటలు అన్నాను, 15 నెలల టైం పెట్టావంటే నీకు ఏదో అయ్యింది అనుకున్నాను. కానీ జ్యోత్స్నలో వస్తున్న మార్పును చూసి నువ్వు చేసింది సరైన పని అనిపిస్తోంది. పెళ్లి త్వరగా జరగాలని దేవుళ్లకి మొక్కుతోంది.. ఇప్పుడు నా మనవరాలు, మీ పిన్ని కూడా నాకు నచ్చుతోందని చెబుతాడు శివన్నారాయణ. ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు.. మనకి మంచి రోజులు మొదలయ్యాయని చెబుతాడు.

తన ప్లాన్ మొత్తం పాడు చేశావంటూ పారిజాతంపై మండిపడుతుంది జ్యోత్స్న. మెడలో తాళిబొట్టు లేదు, పాపిట్లో బొట్టు లేదు, కాలికి మెట్టలు లేవు.. నీకు పెళ్లయ్యింది అంటే పూజారిగారు ఎలా నమ్మారు అని నిలదీస్తుంది పారు. ఆడుకునే వయసులో బావని చూపించి నీ మొగుడు వాడే అని చెప్పారు.. అప్పుడు ఏం చూసి బావే నీ భర్తని చెప్పావు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. కార్తీక్- దీపల జోలికి వెళ్లొద్దు, దీప కాపురంలో నిప్పులు పొయొద్దని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. నా ప్లాన్స్‌కి అడ్డురావొద్దని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నిన్ను బావ ఏదో చేశాడని.. ఊహా ప్రపంచంలో బతుకుతున్నావని చెబుతుంది. అయితే నీతో నాకు యుద్ధం తప్పదని అంటుంది జ్యోత్స్న.

ఒక అడ్రస్ లేని దాని కోసం సొంత మనవరాలికి అన్యాయం చేస్తావా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు సీరియస్ అవుతుంది.. అసలు దీప ఎవరో తెలుసా అని చెప్పబోతుండగా దాస్ మాటలు గుర్తొచ్చి పారు ఆగిపోతుంది. అయితే నాతో తలపడతానని అంటావని జ్యోత్స్న అడగ్గా.. సమరానికి సై అంటుంది పారు. ఓ మనవరాలి చేతిలో ఓడిపోయిన నానమ్మగా మిగిలిపోతావని చెబుతుంది జ్యోత్స్న. ఒక మనవరాలి చేతిలో ఓడిపోయిన మనవరాలిగా నువ్వు మిగిలిపోతావని అంటుంది పారు. దానికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను తన భర్త అని చెప్పుకుంటుందని జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది దీప. మేం రావడం ఆలస్యమైతే జ్యోత్స్నకి నీకు అర్చన చేసేవాళ్లని అంటుంది దీప. మీ అమ్మవల్లే వచ్చానని కార్తీక్ చెప్పగా.. జ్యోత్స్న అమ్మకి బలహీనత అయిపోయిందని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X