Karthika Deepam 2 April 10th: సుమిత్రతో జ్యోత్స్న బ్లాక్‌మెయిల్.. కార్తీక్, దీపలకు కొత్త చిక్కులు
Photo Courtesy: JioHotstar
సుమిత్ర మాట కాదనలేక జ్యోత్స్నని తీసుకుని గుడికి వెళ్తాడు కార్తీక్. గుడి బయటే ఉన్న కార్తీక్‌ని లోపలికి తీసుకురావడానికి డ్రామాలు ఆడుతుంది జ్యోత్స్న. కావాలని పూజా సామాగ్రిని కారులోనే మరిచిపోయి, కార్తీక్‌తో తెప్పిస్తుంది. పంతులు గారితో ఈరోజు నా పెళ్లిరోజు.. మా ఆయన నా మీద కోపంతో నా మీద అలిగి బయటే ఉన్నాడు, మీరే మా ఇద్దరి పేరు మీదా అభిషేకం చేయాలని చెబుతుంది జ్యోత్స్న. దాంతో పూజారి సరేనని అంటాడు. కార్తీక్ లోపలికి రాగానే.. భార్య మీద అలిగి బయట ఉండకూడదని కోప్పడతాడు. ఈవిడ మా ఆవిడ కాదని కార్తీక్ ఎంత చెబుతున్నా పూజారి వినిపించుకోడు.. జ్యోత్స్నకు మద్ధతుగా కొందరు మహిళలు కూడా గొడవ చేస్తారు.
ఈవిడ మా ఆవిడ అయితే మెడలో తాళిబొట్టు ఏదని కార్తీక్ ప్రశ్నించగా.. అందర తెల్లముఖాలు వేస్తారు. ఇంతలో దీపని తీసుకుని పారు వస్తుంది. ఈవిడే నా మనవడి అసలు భార్య అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ దగ్గర దీపకు ఆశీర్వాదం ఇప్పించి, నుదిటిన బొట్టు పెట్టిస్తుంది పారు. నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టావు.. నిన్ను బావ వాడేసుకుంటున్నాడు, నా దారికి అడ్డురావొద్దని పారుకి వార్నింగ్ ఇస్తుంది. ఇకపై నువ్వు నేను చూసుకుందామని ఇద్దరూ సవాళ్లు విసురుకుంటారు. దీప- పారులు కనిపించకపోవడంతో ఇద్దరూ ఎక్కడికి వెళ్లారని శివన్నారాయణ అడుగుతాడు. గుడికి వెళ్లారని సుమిత్ర చెప్పడంతో .. వీలునామా మార్చి రాసి మంచి పని చేశావని దశరథను మెచ్చుకుంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 10వ తేదీ 641వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కూతురికి ఏదైనా జరిగితే మా అమ్మ తట్టుకునేలా లేదని దీప అనగా.. అలాంటిది తన కూతురే కాదని తెలిస్తే అని కార్తీక్ చెప్పగా.. మా అమ్మ గుండె ఆగిపోతుందని అంటుంది దీప. మనం అత్తని ఈ స్టేజ్ నుంచి బయటికి తీసుకురావాలి, అత్తకి జ్యోత్స్న మీదున్న ప్రేమే.. జ్యోత్స్న బలం. జ్యోత్స్న తన కూతురు కాదని చెప్పినా అత్త తట్టుకోగలదని తెలిసిన రోజున మనం ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని అంటాడు కార్తీక్. వీరి మాటలన్నీ దొంగచాటుగా వింటున్న జ్యోత్స్న.. నా బలం, బలహీనతలు ఏంటో నీకు తెలుసు కదా అనుకుంటుంది. జ్యోత్స్నకి ఏదో అనుమానం వచ్చినట్లుగా ఉంది.. మాటల్లో తేడా కనిపిస్తోందని అంటుంది దీప.
జ్యోత్స్న ఇలా ప్రవర్తించడానికి కారణం ఉందని కార్తీక్ చెబుతుండగా.. జ్యోత్స్న వచ్చి తల తిరుగుతుందని, కారులో ఇంటికి వెళ్దామని అడుగుతుంది. వాడి డ్యూటీ అయిపోయింది, నేను నిన్ను తీసుకెళ్తానని అంటుంది పారు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానని జ్యోత్స్న వెళ్తుండగా.. నీకు ఏదైనా అయితే మీ అమ్మ గుండె పట్టుకుంటుంది, మీ తాత నా పీక పట్టుకుంటాడని కంగారు పడుతుంది పారిజాతం. దానిని ఆసుపత్రిలో చూపించి.. ఇంటి దగ్గర దించేయమని కార్తీక్‌కి చెబుతుంది పారు. అయితే నేను కూడా వస్తానని అంటుంది దీప. పారు మాట కాదనలేక జ్యోత్స్నని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు కార్తీక్. నిన్ను దీపకి ఎలా దూరం చేయాలో నాకు తెలుసని అనుకుంటుంది జ్యోత్స్న.
దారిలో కొబ్బరి బొండం కావాలని అడగటంతో తీసుకొచ్చి జ్యోత్స్నకి ఇస్తాడు కార్తీక్. ఈరోజు మా మొదటి పెళ్లిరోజు.. నా భార్యతో గడపకుండా చేస్తున్నావని మండిపడతాడు. నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇల్లు నీకు అత్తారిల్లే కాదా అని జ్యోత్స్న అనగా.. పట్టపగలు కలలు కనొద్దని అంటాడు కార్తీక్. ఈరోజు మా పెళ్లిరోజు మా ఇద్దరినీ ఎలా విడదీయాలా అని గుడికి, ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చావని సీరియస్ అవుతాడు. ఇంతలో దీప ఫోన్ చేసి ఏ హాస్పిటల్‌కి వెళ్లారు? ఎక్కడున్నారు? అని అడుగుతుంది. దానిని వదిలేసి నువ్వు వచ్చేయమని చెబుతుంది దీప. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న బావ రాడు, రానివ్వనని సవాల్ చేస్తుంది.
కారు యూ టర్న్ తిప్పి మణికొండకు వెళ్లమని అడుగుతుంది జ్యోత్స్న. నేను ఇంటికి వెళ్లాలని కార్తీక్ అడగ్గా.. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతానికి శివన్నారాయణ ఫోన్ చేసి ఇంకా రాలేదని అడుగుతాడు. మీరిద్దరూ జ్యోత్స్న వెళ్లిన గుడికే వెళ్లారు? ఇద్దరూ కలిసే వస్తున్నారా అని శివన్నారాయణ అడగ్గా.. దీపని ఇంటి దగ్గర దించేశాను, జ్యోత్స్న కార్తీక్‌ని తీసుకుని వెళ్లిందని చెబుతుంది పారు. జ్యోత్స్న ఆసుపత్రికి వెళ్లిందని చెప్పడంతో శివన్నారాయణ కంగారుపడతాడు. ఈ మాటలు విన్న సుమిత్ర టెన్షన్ పడతుంది.
నా కూతురికి ఏమైందని సుమిత్ర అడగ్గా.. గుడిచుట్టూ ప్రదిక్షిణలు చేసి అలిసిపోవడంతో తల తిరుగుతున్నట్లుగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్‌కి చెప్పి వెళ్లిందని అంటుంది పారు. ఇది ఎండాకాలం.. ఏసీలో ఉండే పిల్ల, ఎండలోకి వస్తే ఇలాగే ఉంటుంది నువ్వేం కంగారుపడొద్దని చెబుతుంది. జ్యోత్స్న ఎక్కడుందో ఏంటో? ఒకసారి ఫోన్ చేయమని సుమిత్ర ఏడుస్తుంది. కార్తీక్‌ని తీసుకుని వెళ్లడం ఏంటీ? అనుకోకుండా జరిగిందా? కావాలనే జరుగుతుందా? అని దశరథకు అనుమానం వస్తుంది.
ఈరోజు మీ పెళ్లిరోజని బయటికి వెళ్లొద్దని మా అమ్మ చెప్పినా వినిపించుకోలేదు.. అనుభవిస్తున్నానని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు కార్తీక్. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది.. నువ్వు ఏం చెప్పినా చేస్తానని అంటాడు. ఇంతలో పారు ఫోన్ చేసి దానిని అక్కడే వదిలేసి ఇంటికొచ్చేయమని చెబుతుంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరో ఒకరిని గుద్ధితే .. మా తాత అడిగితే నీ పేరే చెబుతానని బెదిరించడంతో పారు కంగారుపడుతుంది. మీ నాన్నని పంపిస్తానని చెప్పగా.. నాకు బావే కావాలని రగిలిపోతుంది. దారిలో పుల్ల ఐస్‌క్రీమ్ కావాలని కొంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పినట్లు నేను ఆడలేను.. నిన్ను ఇప్పుడే వదిలేసి వెళ్లిపోతానని కార్తీక్ చెప్పగా.. ఇంట్లోంచి తీసుకొచ్చిన నువ్వే నన్ను తీసుకెళ్లమని అడుగుతుంది.
కార్తీక్‌ని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొచ్చిన జ్యోత్స్న... నువ్వు చేసిన ఛాలెంజ్ ప్రకారం దీపని శివన్నారాయణ వారసురాలిగా చూడాలి ఇదే లక్ష్యమని అంటాడు కార్తీక్. నీకోసం నేను గిఫ్ట్ ప్లాన్ చేశాను, అదే ఇస్తానని చెబుతుంది జ్యోత్స్న. కారులోంచి గిఫ్ట్ తీసుకొచ్చి గెస్ చేయమని అడుగుతుంది. అది నేను గెస్ చేయలేకపోతున్నాను.. నువ్వే చూపించమని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ చేతిలో తాళిబొట్టు పెట్టడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే బహుమతిగా తీసుకోమని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలకు ఏం చేయాలో అర్ధంకాక కార్తీక్ ఖంగుతింటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











