Karthika Deepam 2 April 11th: కార్తీక్‌తో జ్యోత్స్న మైండ్ గేమ్.. కూతరికి షాకిచ్చిన దశరథ

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నకి ఏమైనా జరిగితే మీ అమ్మ తట్టుకునేలా లేదని దీపతో అంటాడు కార్తీక్. అలాంటిది జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అమ్మ గుండె పగిలిపోతుందని చెబుతుంది దీప. అత్త బలహీనతను, జ్యోత్స్న తన బలంగా మార్చుకుంటోందని.. దీని నుంచి మీ అమ్మని దూరం చేయాలని అంటుండగా వీరి మాటలను జ్యోత్స్న వింటుంది. వెంటనే వాళ్ల దగ్గరికి వచ్చి నాకు తల తిరుగుతోంది.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్‌ను అడుగుతుంది. నేను తీసుకెళ్తానని పారు చెబుతుండగా.. బావే తీసుకెళ్లాలని జ్యోత్స్న మారాం చేయడంతో కార్తీక్ ఒప్పుకుంటాడు.

ఆసుపత్రికి తీసుకెళ్లమంటూ కార్తీక్‌ని ఊరంతా తిప్పుతుంది జ్యోత్స్న. ఇంతలో దీప ఫోన్ చేసి దానిని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేయమని చెబుతుంది. నువ్వు నా బానిసవి, నేను ఏం చెబితే అదే చేయాలని అంటుంది జ్యోత్స్న. ఆ వెంటనే పారు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ జ్యోత్స్న వినిపించుకోదు. గుడికి వెళ్లినవారు ఎంతకూ రాకపోవడంతో పారుకు ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి హెల్త్ బాలేదని పారు చెప్పగానే సుమిత్ర, శివన్నారాయణ కంగారుపడతారు. ఎవరూ లేని ప్లేస్‌కి కార్తీక్‌ని తీసుకొచ్చిన జ్యోత్స్న.. నా మెడలో తాళికట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని తాళిబొట్టు అతని చేతిలో పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 11వ తేదీ 642వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 642 April 11th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఇంత అద్భుతమైన పెళ్లి కానుక నువ్వు ఊహించి ఉండవు కదా? నీ మొదటి పెళ్లిరోజే, నీ రెండో పెళ్లి.. నీకు పెళ్లి అయ్యిందని నువ్వు అనోచ్చు. కానీ ఆ పెళ్లిని నేను పట్టించుకోను. కార్తీక్ జీవితంలో ఒక్కరే భార్య ఉంటుంది.. అది జ్యోత్స్న మాత్రమే. ఇదంతా ఇప్పటికిప్పుడు నేను ప్లాన్ చేయలేదు. రాత్రి ప్లాన్ చేసుకన్నాను.. అందుకే నీ కోసం అందమైన చీర కట్టుకున్నాను అంటుంది జ్యోత్స్న. మేళాలు, మంగళ వాయిద్యాలు, ముహూర్తాలు అక్కర్లేదు.. నువ్వే నా మెడలో తాళి కడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతుంది. ఆ మాటలతో సీరియస్ అవుతాడు కార్తీక్. నీలాంటి వాళ్లకి నా స్టైల్‌లోనే సమాధానం చెబుతానని వార్నింగ్ ఇస్తాడు.

కార్తీక్ వెళ్లిపోతుండగా జ్యోత్స్న కారులో నుంచి గన్ తీసి నన్ను నను కాల్చుకుంటాను, నాకు ఏదైనా అయితే మీ అత్త బతకదని చెబుతుంది. దాంతో కార్తీక్‌కు చెమటలు పడతాయి. తాళి కడతావా? ట్రిగ్గర్ నొక్కమంటావా? అని అడుగుతుంది. నీ కోసం నేను చచ్చిపోయినా నేను హ్యాపీయే. నేను చనిపోయాక మీ అత్త బతకదు. దీపని కూతురిగా ఎవరికీ పరిచయం చేస్తావు? ఊపిరి వదిలేసిన సుమిత్ర శవానికా? జీవచ్చవంలా బతికే నా తండ్రికా? ఎవరికీ పరిచయం చేస్తావని అడుగుతుంది. మూడు లెక్క పెట్టేసరికి నువ్వు తాళి కట్టకపోతే ట్రిగ్గర్ నొక్కుతానని బెదిరిస్తుంది.

కాశీకి కావేరి కాఫీ ఇస్తుండగా.. స్వప్న పుస్తకం చదువుతూ ఉంటుంది. మనుషులు కలవడానికి మించిన ముగింపు ఏముంటుంది? అని అడుగుతుంది స్వప్న. నువ్వు 100 నవలలు చదివినా గొడవలు పడకుండా ఉన్న జంటలు కనిపించవు. ఒకరి తప్పుల్ని మరొకరు క్షమించడమే జీవితం అంటాడు కాశీ. తప్పుల్ని క్షమించొచ్చు... కానీ మోసాల్ని భరించలేం, నీ ప్రేమను నాకు ఎలా ఇవ్వగలవు, నీది ప్రేమ కాదు స్వార్ధమని చెబుతుంది స్వప్న.

జ్యోత్స్న మాటలు, ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తాడు దశరథ. కార్తీక్‌ని, దశరథను వేరు చేయడానికి జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని అనుకుంటాడు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన జ్యోత్స్నకి తల తిరగడం ఏంటీ? కార్తీక్‌ని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లడం ఏంటీ? ఇదంతా చూస్తుంటే జ్యోత్స్నే ఇదంతా కావాలని చేస్తున్నట్లుగా ఉందని చెబుతాడు శివన్నారాయణ. ఇంతలో సుమిత్ర వచ్చి అంత అవసరం జ్యోత్స్నకి ఏముంది? జ్యోత్స్న, దీపలు అక్కాచెల్లెళ్లుగా కలిసిపోయారని చెబుతుంది సుమిత్ర. కార్తీక్- దీపల పెళ్లిరోజని తెలిసికూడా కావాలని కార్తీక్‌ను తీసుకువెళ్లడం ఏంటీ అని అడుగుతాడు శివన్నారాయణ. ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఒకరిని అనుమానించలేం.. అది నిజంగా తప్పు చేస్తే నేనే క్షమించనని చెబుతుంది సుమిత్ర.

ఏదో చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చి స్వప్న.. స్వప్న అని పిలుస్తాడు కాశీ. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలింగ్ బెల్ కొట్టాలని నీకు తెలియదా? అంటూ కాశీపై మండిపడుతుంది స్వప్న. కోర్టులో విడాకులు కన్ఫర్మ్ అయ్యేవరకు మీరిద్దరూ భార్యాభర్తలే అని చెబుతుంది కావేరి. నేను మాత్రం అతనికి స్వేచ్ఛను ఇవ్వనని అంటుంది స్వప్న. ఉదయం నాకు ప్రేమ లేదని చెప్పావు కదా? అయితే చూడమని వసంత్‌ని పిలుస్తాడు. అతనిని చూసి స్వప్న షాక్ అవుతుంది. నేను రెండ్రోజులు ఆఫీస్ పనిమీద కాశ్మీర్ వెళ్తున్నాను, రెండ్రోజులు నిన్ను చూడకుండా ఉండలేనని బ్రదర్‌కి చెబితే.. వెంటనే ఇక్కడికి రమ్మన్నాడని అంటాడు వసంత్.

వస్తూ వస్తూ నీకోసం ఛార్మినార్ నుంచి మట్టిగాజులు తీసుకొచ్చా.. ఇప్పుడే నా కళ్లముందే వీటిని వేసుకోవాలని వసంత్ పట్టుపడతాడు. దాంతో గాజులు వేసుకోవడానికి స్వప్న ఒప్పుకుంటుంది. అయితే ఈ గాజులు నా చేతితో నేనే స్వయంగా వేస్తానని చెబుతాడు వసంత్. దాంతో స్వప్నకి గతంలో కాశీ చేతుల మీదుగా గాజులు వేయించుకున్న రోజులు గుర్తొచ్చి బాధపడుతుంది. వసంత్ చేయి పట్టుకోగానే స్వప్న చేతులు వణికిపోతాయి. నీ చేతితోనే గాజులు ఇవ్వమని వసంత్ అడగ్గా.. నా చేతులు అంత మంచివి కావని చెబుతాడు కాశీ. దాంతో వసంత్ స్వయంగా గాజులు వేస్తుండగా ఈరోజు మంచి రోజు కాదని తర్వాత వేసుకుంటానని చేయి వెనక్కి లాగేస్తుంది. దాంతో తనపై స్వప్నకు ప్రేమ చావలేదని అనుకుంటాడు కాశీ.

జ్యోత్స్నతో కలిసి కార్తీక్ బయటకు వెళ్లడం, ఇంకా ఇంటికి రాకపోవడంతో దీపపై మండిపడుతుంది కాంచన. వీళ్లిద్దరూ నా ప్రాణానికి ఎక్కడ దొరికారంటూ ఫైర్ అవుతుంది. వెంటనే ఫోన్ చేయమని దీపకి చెబుతుంది. మరోవైపు.. జ్యోత్స్న గన్‌తో కాల్చుకుంటూ ఉండగా కార్తీక్ లాగి కిందపడేస్తాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోయేది. నీ కళ్ల ముందు ఒక ప్రాణాన్ని అంత తేలికగా పోనివ్వవని నాకు తెలుసు అంటాడు కార్తీక్. నీ చావు నీతోనే పోదు.. సుమిత్ర, దశరథ, దాస్ వీళ్లంతా నీకోసమే బతుకుతున్నారు. నువ్వు ఎప్పటికైనా మంచి కూతురిలా తన దగ్గరికి వస్తావని దాస్ మావయ్య ఎదురుచూస్తున్నాడని చెబుతాడు కార్తీక్.

వాళ్లంతా నన్ను ప్రేమించినట్లే.. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్‌కి దీప ఫోన్ చేయగా.. ఆ ఫోన్ లాక్కుంటుంది. మా బావకి ఫోన్ ఇవ్వు... ఆయన్ని ఇంటికి పంపించమని చెబుతుంది దీప. పంపను, అయినా ఆయన నీ బావ కాదు.. నా బావ అని సీరియస్‌గా చెబుతుంది జ్యోత్స్న. నీ మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడుంటే అప్పుడు చెప్పేదానిని అంటుంది జ్యోత్స్న. దాంతో ఆమెకు బుద్ధిచెప్పి.. కారులో కూర్చోబెడతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X