Karthika Deepam 2 April 13th: జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప.. కార్తీక్ కోసం అక్కాచెల్లెళ్ల పంచాయతీ

Photo Courtesy: JioHotstar

నా మెడలో తాళి కడతావా లేదంటే గన్‌తో కాల్చుకుని చనిపోమంటావా? అంటూ కార్తీక్‌ను బెదిరిస్తుంది. గన్‌తో కాల్చుకోబోతుండగా ఆమెను కాపాడతాడు. నా ప్రాణాలంటే నీకు లెక్కలేదు.. అదే నేను చస్తే మా అమ్మ చనిపోతుంది, బెంగతో మా నాన్న, తాతలు పోతారు. వీరందరినీ చంపుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా తేల్చుకోమని డెడ్‌లైన్ పెడుతుంది. జ్యోత్స్న కార్తీక్‌ను ఎక్కడికి తీసుకెళ్లింది? ఇంతసేపు ఇద్దరూ ఏం చేస్తున్నారని దశరథని అడుగుతాడు శివన్నారాయణ.

జ్యోత్స్నలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందని.. ఒకవేళ అదే తప్పు చేస్తే నేను ఊరుకోనని సుమిత్ర చెబుతుంది. వసంత్‌ ఇంటికొచ్చి స్వయంగా తన చేతులతో గాజులు వేస్తుండగా వద్దని వెళ్లిపోతుంది స్వప్న. ఆమె మనసులో తానే ఉన్నానని తెలుసుకుని కాశీ చాలా సంతోషిస్తాడు. తాళి సంగతి.. ఇంటి దగ్గర తేల్చుకుంటానని జ్యోత్స్నని తీసుకుని బయల్దేరతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 13వ తేదీ 643వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 643 April 13th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కార్తీక్ ఎంతకు ఇంటికి రాకపోవడంతో కాంచన తన కొడుకు మీద రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు మీ పెళ్లిరోజు.. ఇంటి పట్టున ఉండమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆశీర్వాదం తీసుకొస్తానని వెళ్లారు.. దీప వచ్చింది, వీడు రాలేదు. పెళ్లిరోజున కూడా సంతోషంగా ఉండకుండా ఆ జ్యోత్స్న ఎక్కడెక్కడ తిప్పుతుందో ఏంటో అంటూ మండిపడుతుంది కాంచన. ఇంతలో దీప.. దీప అని అరిచినా ఆమె కనిపించకపోవడంతో శౌర్యను పిలిచి అడగమని చెబుతుంది. ఇంట్లో అమ్మలేదని శౌర్య చెప్పడంతో కోడలు ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతుంది కాంచన.

నీ పెళ్లిరోజును పాడు చేశానని బాధపడుతున్నావా? అని అడుగుతుంది జ్యోత్స్న. ఈ పనిష్మెంట్ నీకు కాదు.. దీపకి అని చెబుతుంది. ఇంతలో కార్తీక్- జ్యోత్స్నల కారుకి అడ్డుగా స్కూటీ వేసుకుని నిలబడుతుంది దీప. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇందాక ఫోన్‌లో రెచ్చగొట్టావు కదా దాని రిజల్ట్ ఇది అని అంటాడు కార్తీక్. అయితే దీపకి సర్‌ప్రైజ్ ఇవ్వాలని కారు దిగి వెళ్తుంది జ్యోత్స్న. వీళ్లద్దరి మధ్య గొడవ జరగకుండా చైనా వాల్‌లా ఆపాలని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో దీపని రెచ్చగొట్టాలని కార్తీక్‌కి ముద్దు పెట్టబోతుండగా.. జ్యోత్స్న చెంప పగలగొడుతుంది దీప. దాంతో జ్యోత్స్న రగిలిపోతుంది.

జ్యోత్స్నని ఆఫీస్‌కి తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తుంది దీప. రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుని ఇంటి పరువు తీయడం ఎందుకని ఆఫీస్‌కి తీసుకొచ్చానని చెబుతుంది దీప. తను తెలియనితనంతోనో, అమాయకత్వంతోనో చేయలేదు. కావాలనే నన్ను ఫోన్‌లోనే కాకుండా, డైరెక్ట్‌గా రెచ్చగొట్టాలనే నీకు ముద్దు పెట్టాలనుకుంది. మేడం గారికి నేనంటే మంట.. ఒక భార్య ముందు తన భర్తని పరాయి ఆడది ముద్దు పెట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చూపించాలని ట్రై చేసింది. అందుకే ఒక భార్య కోపం ఎలా ఉంటుందో నేను రుచి చూపించాను. ఇలాంటివి ఇకపై మానితే మంచిదని వార్నింగ్ ఇస్తుంది దీప.

మానకపోతే అనే జ్యోత్స్న గొడవపడుతుంది. నా కడుపులో బిడ్డ నిద్రపోతుంది.. దానిని డిస్ట్రబ్ చేయొద్దని అంటుంది దీప. కార్తీక్ నచ్చచెప్పాలని చూడగా.. నువ్వు మధ్యలోకి రావొద్దని చెబుతుంది దీప. ఈ మనిషిని ఈరోజు సరిచేయాలని అంటుంది. ఇది సరిచేయడానికి నీ వంట గది కాదు.. నీ చేతులతో నువ్వు నాశనం చేసిన జీవితమని చెబుతుంది జ్యోత్స్న. దేవుడు మనకి ఇవ్వని దాని గురించి బాధపడకుండా.. ఇచ్చిన దాని గురించి సంతోషపడితే అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని అంటుంది దీప. దేవుడు నాకు ఏమిచ్చాడు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు.. ప్రాణంగా చూసుకునే అమ్మానాన్నల్ని, గర్వంగా చెప్పుకునే వంశ ప్రతిష్టల్ని, మూడు తరాలు కూర్చొని తిన్నా ఆస్తిని ఇచ్చాడు. ఇవన్నీ వదిలేసి నీకు దక్కని ఏదో ఒకదాని వెంట మతిలేని దానిలా పరిగెడుతున్నావు. నువ్వు పొందాలనుకున్నది నీకు ఎప్పటికీ దొరకదని చెబుతుంది దీప.

నిన్ను అడ్డు తప్పించైనా నేను దక్కించుకుంటానని జ్యోత్స్న చెప్పగా.. అది నీ వల్ల కాదని అంటుంది దీప. అది నా వల్ల అవుతుంది సుమిత్ర కన్నకూతురా అని జ్యోత్స్న అనడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఈ నిజం దీనికేలా తెలిసిపోయిందని అనుకుంటున్నావా? నీ కన్నతల్లికి వచ్చిన రోగాన్ని అడ్డుపెట్టుకుని హాస్పిటల్‌లో మీరంతా ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు. మా ఇంట్లో పార్టీ పెట్టినరోజే బావకి ఈ నిజం తెలుసు అని చెబుతుంది జ్యోత్స్న. ఈ నిజం నీకు తెలియదనుకుని నీకు బంగారం లాంటి కుటుంబం, ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు లాంటి డైలాగులు చెబుతుంది. భుజాన సంచి వేసుకుని గాలికి తిరిగే ఒక తండ్రి, పెళ్లాం దగ్గర డ్రైవర్‌గా పనిచేసే సాఫ్ట్‌వేర్ తమ్ముడు, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియని హాఫ్ మైండ్ నానమ్మ.. ఇది నా ఫ్యామిలీ అని చెబుతుంది జ్యోత్స్న.

నీ గురించి డీఎన్ఏ టెస్ట్ చేయించి మరి కన్ఫర్మ్ చేసుకున్నాను.. నీ మీద ప్రేమ ఎక్కువై బావ నిజం దాచాడని చెబుతుంది జ్యోత్స్న. మనందరి డ్రామాలు ఇక్కడితో ఆపేద్దాం.. పెళ్లి చేసుకుని హ్యాపీగా దూరంగా వెళ్లిపో అని చెబుతుంది. అప్పుడు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు యావదాస్తిని అనుభవిస్తూ ఇక్కడే ఉంటారా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నా జీవితంలో సంతోషాన్ని నువ్వు ఎక్కడ మిగిల్చావు.. నా మెడలో పడాల్సిన తాళి అనుకున్న ముహూర్తానికి జరిగుంటే వారం ముందే నా మొదటి పెళ్లి రోజు జరిగుండేదని బాధపడుతుంది.

ఈ మెడలో తాళి పడటానికి నేను, బావ కారణం కాదని చెబుతుంది దీప. సగం తప్పులు బావని నా వాడిని చేసుకోవడానికి చేస్తే, సగం తప్పులు నా పుట్టుక గురించి నిజాలు బయటపడకుండా చేశాను. మొత్తం తగలబెట్టింది.. ఈ గొడవలన్నింటికీ కారణం మీ ఆయనే అని చెబుతుంది జ్యోత్స్న. మనిద్దరి జీవితాలు పోల్చుకుంటే ఎక్కువ అన్యాయం జరిగింది నాకు, అమ్మానాన్నలకు దూరమైంది నేను అని చెబుతుంది దీప. దానికి, నాకు ఏంటీ సంబంధం.. మా నానమ్మ ప్రతీకారమే నన్ను నీ స్థానంలో నిలబెట్టింది. నువ్వెలా నీ కన్నతల్లికి దూరమయ్యావో, నేను కూడా అంతే.. అన్యాయం ఇద్దరికీ జరిగింది. మా నాన్న, మా గ్రానీ కలిసి కూతురు చచ్చిపోయిందని మా అమ్మకి చెప్పారు. నువ్వు కావాలనుకుంటే నీ తల్లి దగ్గరికి వెళ్లిపోవచ్చు.. కానీ నాకు కన్నతల్లి లేదు చచ్చిపోయిందని బాధపడుతుంది జ్యోత్స్న.

బావని మొగుడు అని పరిచయం చేశారు.. వాడే నీ హీరో, వాడికి నువ్వే హీరోయిన్ అని చెప్పారు. అప్పటి నుంచి బావే నా ప్రపంచం, మరో కల కనడానికి కూడా నా కళ్లు ఒప్పుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఏరోజైనా చెప్పలేదు. అనుకోకుండా కుటుంబాల మధ్య కాశీ పెళ్లితో గొడవలు జరిగాయి, దానికి కారణం కూడా నువ్వే. మా పెళ్లితో రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని బావ చేత నా మెడలో తాళి కట్టించడానికి తాళి కూడా తీసుకెళ్లాను, అదే తాళి నా మెడలోనూ కట్టాడు. తనే నా జీవితం అనుకున్న మనిషి నీకు సొంతమైతే కోపం రాదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. పేరెంట్స్, లైఫ్ పార్ట్‌నర్ అనేవి ఒక ఆడదాని జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. మంచి తల్లిదండ్రులు ఉంటే.. మంచి లైఫ్ పార్ట్‌నర్‌తో అవసరం ఉండదు, కానీ మంచి తల్లిదండ్రులు లేకపోయినా మంచి భర్త దొరికితే మిగిలిన జీవితమంతా సంతోషంగా ఉంటుంది.

నువ్వొచ్చావు.. బావ పోయాడు, పోనీ పేరెంట్స్ అయినా మిగులుతారు అనుకుంటే అసలైన వారసురాలివి కూడా నువ్వే. ఆ నిజం తెలియనంత వరకే నేను కూతురిగా ఉండేది, తెలిసిన మరుక్షణం లగేజీ సర్దుకుని మా నాన్న దగ్గరికి పోవాల్సిందే. నేను కూడా ఆయనలాగే బస్టాండ్‌లో పొడుకోవాలని బాధపడుతుంది జ్యోత్స్న. నేనొక అన్యాయం అయిపోయిన ఆడదానిని, నా జీవితానికి వెలుగునివ్వడానికి ఎదురుచూడను. నేనొక నానమ్మ చేతిలో మోసపోయాను, తండ్రి చేతిలో మోసపోయాను, బావ చేతిలో మోసపోయాను. అన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఆడదానిని అంటుంది జ్యోత్స్న. నీకొక మంచి జీవితాన్ని నేనిస్తానని కార్తీక్ చెబుతాడు. అయితే నన్ను పెళ్లి చేసుకోమని జ్యోత్స్న అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. కాలం నీకు అనుకూలంగా ఉందని కాళ్లబేరానికి వస్తానని అనుకున్నావా? ఎలా బతికిందో, అలాగే చస్తుంది.. నా రక్తంలో రాజసం లేకపోవచ్చు, కానీ నా ఎదుగుదలలో రాజసం ఉందని చెబుతుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X