Karthika Deepam 2 April 14th: దీపకి జ్యోత్స్న ఊహించని ఆఫర్.. పారిజాతం హత్యకు జ్యోత్స్న కుట్ర

Photo Courtesy: JioHotstar

తనతో తాళి కట్టించుకోవాలని చూసిన జ్యోత్స్నని తీసుకుని ఇంటికి బయల్దేరతాడు కార్తీక్. నీ పెళ్లి రోజంతా వేస్ట్ అయిపోయింది కదా అని కార్తీక్‌ను రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఇది నీకిచ్చిన పనిష్మెంట్ కాదు.. దీపకి వేసిన శిక్ష అంటుంది. ఇంతలో రోడ్డుపై దీప అడ్డంగా నిలబడుతుంది. కారు దిగి దీపతో కార్తీక్ మాట్లాడుతుండగా అతనిని ముద్దు పెట్టుకోవాలని దగ్గరికొస్తుండగా లాగిపెట్టి కొడుతుంది దీప. ఆ వెంటనే ముగ్గురూ కలిసి శివన్నారాయణ ఆఫీసులో పంచాయతీ పెట్టుకుంటారు. నువ్వు, మా నాన్న, బావ ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు.. ఎందుకంటే నువ్వే సుమిత్ర కూతురివి అనడంతో దీప షాక్ అవుతుంది. బావకి ఈ నిజం తెలిసినా నీకు చెప్పలేదా? అని నిలదీస్తుంది.

నీ జీవితం, నా జీవితం ఒకేసారి మొదలయ్యాయి. నువ్వు తిరిగి వస్తే నీకు అమ్మ ఉంది.. నాకు ఎవ్వరూ లేరు. నువ్వే అసలైన వారసురాలివని తెలిసిన రోజున నేను ఇంట్లోంచి బయటకి వచ్చేయాలి. చేతికి సంచి తగిలించుకుని తిరిగే తండ్రి, హాఫ్ మైండ్ నానమ్మ, పెళ్లాం ఇంట్లో డ్రైవర్‌గా చేసే సాఫ్ట్‌వేర్ తమ్ముడు తప్ప నాకు ఎవరూ లేరని చెబుతుంది జ్యోత్స్న. నీకు మంచి జీవితాన్ని మేం ఇస్తాం.. మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెబుతారు దీప, కార్తీక్. బావని తప్ప మరొకరిని నేను భర్తగా ఊహించుకోలేనని తేల్చేస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 14వ తేదీ 644వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 644 April 14th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఈ జ్యోత్స్న ఎలా బతికిందో అలాగే చస్తుంది.. నా రక్తంలో రాజం లేకపోవచ్చు, కానీ నా ఎదుగుదలలో రాజసం ఉంది. అది బతికినంత కాలం అలాగే ఉంటుంది. నీ దయా దాక్షిణ్యాల మీదో, కరుణా కటాక్షాల మీదో ఈ జ్యోత్స్న బతకదు. నాకేం కావాలో నాకు తెలుసు. నేను ఎలా బతకాలో నాకు తెలుసు.. బావ నీ మెడలో తాళి కట్టినా నేను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. బావకి భార్యనంటే అదే నేనే.. బావ జీవితంలో ఉండబోయేది కూడా నేనే అంటుంది జ్యోత్స్న. తొందరలోనే బావ చేతులతో నా మెడలో మూడు ముళ్లు వేయించుకుంటాను అని చెబుతుంది. బావ చేత నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జ్యోత్స్నే కాదు అంటుంది.

ఓడిపోతానన్న భయంతో ఇలా మాట్లాడుతోంది.. పట్టించుకోవద్దని దీపకి చెబుతాడు కార్తీక్. ఎవరిది భయం.. నేను సుమిత్ర కూతురు కాదు అయితే భయపడాలా? మీ నాన్న, మీ తాత, మీ అమ్మ నా దగ్గర ఉన్నారు.. నీ కుటుంబం, నీ వంశం, నీ ప్రతిష్ట అన్నీ నా దగ్గర ఉన్నాయని చెబుతుంది జ్యోత్స్న. నీ దగ్గర ఏమున్నాయి.. నువ్వొక అనాథవి అంటుంది. దాంతో కార్తీక్‌ని పట్టుకుని బావ ఉన్నాడు.. ఎవరి కోసమైతే నువ్వు బతుకుతున్నానని అంటున్నావో ఆ మనిషి నా దగ్గర ఉన్నాడు, నా కడుపులో ప్రతిరూపంలా వెలుగుతున్నాడు, నా పాపిట్లో సింధూరంలా మెరుస్తున్నాడు, నా మెడలో మంగళ సూత్రంలా నా గుండెల్ని అంటి పెట్టుకుని ఉన్నాడు.. ఎవరు నిజమైన అనాథ అని చెబుతుంది దీప.

మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం.. నా దగ్గరున్నది నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గరున్నది నాకు ఇవ్వు అని ప్రపోజల్ పెడుతుంది జ్యోత్స్న. నువ్వే అసలైన వారసురాలివని చెబుతుంది.. మా మమ్మీడాడీని, ఆస్తిని అన్నింటినీ నీకు ఇచ్చేస్తాను. నువ్వు బావకి నాకు పెళ్లి చేసేయ్ అని అడుగుతుంది జ్యోత్స్న. నాకు ఇవన్నీ వద్దు.. బావ ఒక్కడిని ఇస్తే చాలు అంటుంది. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇవ్వడానికి నువ్వు ఎవరు? నీకంటూ మిగిలింది నీ పేరొకటే.. అన్నీ దీపవే అని చెబుతాడు కార్తీక్. నాకు, బావకి పుట్టబోయే బిడ్డకు కూడా నీపేరే పెట్టుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు నీ పేరెంట్స్‌తో హాయిగా బతుకు, నేను బావ ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతామని అంటుంది.

నేను కూతురిని కాదని తెలిస్తే నీ కన్నతల్లి చచ్చిపోతుందని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. తెలియని వయసులో ఒక తల్లిని చంపుకున్నావు.. ఇప్పుడు అన్నీ తెలిసి కన్న తల్లిని చంపుకుంటావా? అని భయపెడుతుంది జ్యోత్స్న. అత్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసని కార్తీక్ చెప్పగా... నీకు దమ్ముంటే ట్రై చేయమని సవాల్ విసురుతుంది జ్యోత్స్న. నేనే పోతానని అనుకుంటే నేను ఎవ్వరినీ ఉండనివ్వనని అంటుంది. ఏం చేసినా దీప వాళ్ల అమ్మ బతకదు.. బ్రతకాలి అంటే కూతురిగా నేనే ఉండాలి. ఇప్పుడు నీ తల్లికి కూతురిని మాత్రమే కాదు.. ఊపిరినీ కూడా, నా ఆఫర్‌కు ఒప్పుకోవడం తప్పించి నీకు మరో ఆప్షన్ లేదని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు పుట్టింటికి... నేను హానీమూన్‌కి ఎలా ఉంది నా ఆఫర్ అంటుంది.

ఇన్నిరోజులు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం.. ఇప్పుడు ముగ్గురం ఓపెన్ అయిపోయామని చెబుతుంది జ్యోత్స్న. నువ్విలా స్వార్ధంగా ఆలోచిస్తే నష్టపోయేది నువ్వే.. నేను మళ్లీ నీ కథలోకి వస్తానని నువ్వు అనుకున్నావా? ఎప్పుడో చిన్నప్పుడు బస్టాప్‌లో పడేశారు.. నా వాళ్లేవరో తెలుసుకున్నాను, నా ఇంట్లోకి నేను కూతురిగా వస్తాను. బావతో తాళి కట్టించుకోవడం కాదు కదా.. నా బావ చిటికెన వేలిని కూడా తాకనివ్వనని చెబుతుంది దీప. ఆ మాటలతో కార్తీక్ విజిల్స్ వేస్తాడు. నీ జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూసుకోమని చెబుతుంది జ్యోత్స్న. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో కార్తీక్, దీపలు వెళ్లిపోతారు.

అర్ధరాత్రి ఇంటికి వచ్చిన జ్యోత్స్నకు సుమిత్ర క్లాస్ పీకుతుంది. పెళ్లి రోజు నా కూతురిని, అల్లుడిని విడదీయడానికే జ్యోత్స్న ఈ పని చేసిందని దశరథ అనుమానిస్తాడు. కార్తీక్ బావ ఇంటికెళ్లిపోయాడు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చానని చెబుతుంది జ్యోత్స్న. బావని దీప తీసుకెళ్లింది.. నేను ఇంటికి వచ్చేశానని అంటుంది. అయితే జ్యోత్స్న చెంప మీద ఎర్రగా ఉండటంతో సుమిత్ర, శివన్నారాయణలకు అనుమానం వస్తుంది. పెళ్లిరోజు నాడు భర్తని దూరం చేసినందుకు దీప బహుమతి ఇచ్చినట్లుగా ఉందని అనుకుంటాడు దశరథ. అయితే పారిజాతానికి మాత్రం అనుమానం వస్తుంది.

దీప కొట్టిన దెబ్బని చూసుకుంటూ రగిలిపోతుండగా జ్యోత్స్న దగ్గరికి వస్తుంది పారిజాతం. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమంటే.. దీప మొగుడి వెంట పడుతున్నావా అని నిలదీస్తుంది. గుడిలో కార్తీక్ నా భర్త అని చెప్పావు, అది కుదరకపోయేసరికి కళ్లు తిరుగుతున్నాయని వాడిని బయటకు తీసుకెళ్లావు. అది నా బావని నాకు కాకుండా చేసిందని జ్యోత్స్న అంటుంది. దీనింతటికీ కారణం మీ తాత.. మీ తాత కనుక శ్రీధర్‌ను కొట్టకపోయుంటే ఈరోజు ఈ కథ వేరేలా ఉండేదని చెబుతుంది పారిజాతం. బావే నా భర్త అన్న మాటని నిజం చేస్తాను.. దీపని బతకనివ్వనని అంటుంది జ్యోత్స్న . నేను బతికుండగా అది జరగదు.. దీపని చంపడం కాదు కదా? దాని ఒంటి మీద నీ గోరు గీత పడినా నరికేస్తానని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం.

కార్తీక్ పక్కన భార్యగా నిలబడే అర్హత దీపకి మాత్రమే ఉంది.. దీప జోలికొస్తే నువ్వు సుమిత్ర కూతురివి అని కూడా చూడనని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. నీకు ఏం మందుపెట్టి మార్చేశారు.. దీప మీద ఈగ కూడా వాలనిచ్చేలా లేవు, దీప కంటే ముందు ఈ గ్రానీని ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. ఈ చెంప దెబ్బని మాత్రం మరిచిపోను, ఇంతకుమించిన అవమానం, నీకు ఎలా చేయాలో నాకు తెలుసు అని రగిలిపోతుంది జ్యోత్స్న. మరోవైపు.. పెళ్లిరోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లిపోయావని కొడుకుని ప్రశ్నిస్తుంది కాంచన. మన జీవితాలకు జ్యోత్స్న ఒక పీడకలలా తయారైంది. పారిజాతం పిన్ని అన్నీ చెబుతూనే ఉంది, అందుకే ఉదయం మిమ్మల్ని ఎక్కడికి వెళ్లొద్దని చెప్పానని అంటుంది కాంచన.

దీప ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కి జ్యోత్స్నకి సెట్ అయిపోయిందని అంటాడు కార్తీక్. బావని అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? ఇంటికి వచ్చేశాడు కదా అని అంటుంది దీప. అయినా నా బాధ మీకెప్పుడు అర్ధమవుతుంది? ఆ జ్యోత్స్న మీతో ఆడుకుంటుంది. మీరెందుకు ఇంతలా భరిస్తున్నారని నాకు అర్ధం లేదు. జ్యోత్స్నతో పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు తన మైండ్‌ తేడాగా ఉందని చెబుతుంది కాంచన. నీ కొడుకు చేయి పట్టుకున్నా, చిటికెన వేలు పట్టుకున్నా అది నేనే అంటుంది దీప. జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని చెబుతుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X