Karthika Deepam 2 April 15th: కార్తీక్ భార్యగా జ్యోత్స్న.. పీడకలతో ఉలిక్కిపడ్డ కాంచన, జ్యోత్స్నపై పారు యుద్ధం
Photo Courtesy: JioHotstar
నేను ఎలా బతికానో అలాగే చస్తుంది. మీ దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదని కార్తీక్ - దీపలకు చెబుతుంది జ్యోత్స్న. బావ చేతులతో నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జ్యోత్స్నే కాదంటూ ఛాలెంజ్ విసురుతుంది. నీకు ఆస్తి, అమ్మనాన్న, తాతయ్య, వంశ ప్రతిష్ట అన్నీ నా దగ్గర ఉన్నాయి.. నీ దగ్గర ఏం ఉన్నాయని దీపని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు కోరుకున్న వ్యక్తి నా దగ్గర ఉన్నాడని కార్తీక్‌ని పట్టుకుంటుంది దీప. నువ్వే సుమిత్ర కూతురివని అందరికీ చెప్పేస్తాను, నీ ఆస్తినీ నీకు ఇచ్చేస్తాను.. బావని నాకిచ్చేయమని ఆఫర్ ఇస్తుంది జ్యోత్స్న.
నేను తన కూతురిని కాదని తెలిస్తే నీ తల్లి చచ్చిపోతుంది, చిన్నప్పుడు పెంచిన తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడు కన్నతల్లిని చంపుకుంటావా అని బ్లాక్‌మెయిల్ చేస్తుంది జ్యోత్స్న. నేనే పోతానని అనుకుంటే నేను ఎవ్వరినీ వదిలిపెట్టనని చెబుతుంది. జ్యోత్స్నని వదిలేసి కార్తీక్, దీపలు ఇంటికి వెళ్లిపోతారు. ఒక్కటే ఇంటికొచ్చిన జ్యోత్స్నని చూసి సుమిత్ర మండిపడుతుంది. చెంపపై ఎర్రగా కమిలిపోవడంతో ఏం జరిగిందని అడుగుతుంది. ఎండ వల్ల అలా అయ్యిందని కవర్ చేస్తుంది జ్యోత్స్న. దీప జోలికి రావొద్దని జ్యోత్స్నకి మరోసారి వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. పెళ్లిరోజున ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోయావంటూ కార్తీక్‌కి క్లాస్ తీసుకుంటుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 15వ తేదీ 645వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న అన్న మాటల గురించి ఆలోచిస్తుంటుంది దీప. ఇంతలో కార్తీక్ రావడంతో దీపకి నిజం తెలిసిందని నాతో ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది. డీఎన్ఏ టెస్ట్ చేసి నిజం తెలుసుకుంది.. నేను నీ గురించే కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించాలని అంటాడు కార్తీక్. నిన్ను చంపడానికి కేక్‌లో విషం కలిపింది అది నేను చూశాను కాబట్టి కేక్ మార్చేశానని చెబుతాడు. నిన్ను చంపాలనుకున్నది నా కోసం కాదని అంటాడు కార్తీక్. జ్యోత్స్నకి ఆస్తి కావాలి.. అంతకంటే ముందు నువ్వు కావాలని చెబుతుంది దీప. కార్తీక్ జీవితంలోంచి నువ్వు వెళ్లిపో అనే మాట నీకు నచ్చిందా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ మాట తను కోపంతో కాదు.. బాధలో చెప్పిందని అంటుంది దీప.
తను అడిగేది నా సౌభాగ్యాన్ని కాదు.. తన హక్కుని. ఒక మనిషి మీద మనకున్న కోపం.. అతను చెప్పే మంచి మాటల్నీ కూడా విననివ్వదు. నేను కార్తీక్ భార్యలా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచిస్తే జ్యోత్స్న చెప్పే దానిలో తప్పేముందని అంటుంది దీప. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్న నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.. ఇలా మాట్లాడుతున్నావేంటీ అని మండిపడతాడు. మెడలో తాళి కట్టమని గన్‌తో కాల్చుకుని చచ్చిపోతానని బ్లాక్‌మెయిల్ చేసింది. నేను ఆపకపోతే ఫోటోకి దండ పడేదని చెబుతాడు కార్తీక్. అయితే జ్యోత్స్న చెప్పే మాటలన్నీ నిజమే.. తను నిన్ను ప్రేమిస్తోంది, నీతో కలిసి బతకాలని ఆశపడుతోంది. నిన్ను తప్ప భర్తగా ఎవరినీ ఊహించుకోలేకపోతోందని చెబుతుంది దీప. ఆ మాటలతో షాకైన కార్తీక్.. నీకు దిష్టి తీయడం కాదు, నిమ్మకాయల దండ వేస్తానని అంటాడు.
నీ విషయంలో జ్యోత్స్న మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదు.. తప్పు పెద్దవాళ్లది. ముఖ్యంగా పారిజాతం గారిది, ఊహా తెలిసిన దగ్గరి నుంచి జ్యోత్స్నకి నువ్వు భర్తగా పరిచయం అయ్యావు. మీరిద్దరూ భార్యాభర్తలు.. కార్తీకే నీ భర్త, నువ్వు కార్తీక్ భార్యవని ఎక్కించి మైండ్ పాడు చేశారు. నువ్వు నా మెడలో తాళి కట్టావని జ్యోత్స్న తన మనసు చంపేసుకుంటుందా అని అంటుంది దీప. నువ్వు త్యాగాలు లాంటివి ప్లాన్ చేయడం లేదు కదా అని కార్తీక్ అడగ్గా.. నేను నిన్ను వదులుకుంటానా అని అంటుంది దీప. జ్యోత్స్న ఇలా తయారవ్వడానికి కారణం మీరందరే అని చెబుతుంది జ్యోత్స్న. దాంతో వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తాడు కార్తీక్.
జ్యోత్స్న ఉండగా మేం సంతోషంగా ఉండేలా కనిపించడం లేదు. పెళ్లిరోజు మేమిద్దరం ఎంజాయ్ చేయకుండా నా పెళ్లానికి, నన్ను దూరం పెట్టింది. అదేంటని అడగటానికి వచ్చిన దీపని నోటికొచ్చినట్లు తిట్టింది, దీప గుక్కపెట్టి ఏడుస్తోందని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. నేను గొంతు విప్పి కొన్ని నిజాలు చెప్పానంటే, కొందరికీ గుండెల్లో మంటలు రేగుతాయని అంటుంది పారు. నీ మనవరాలు మా కాపురంలో నిప్పులు పోస్తోందని, అనాథ కాబట్టి దీపని ఏడిపిస్తున్నారని అంటాడు కార్తీక్. దీప అనాథ కాదు.. నేనున్నాను అంటుంది పారు
దీపని జ్యోత్స్న నానామాటలు అన్నది.. జ్యోత్స్న ప్రశాంతంగా పడుకుంది, నా భార్య మాత్రం ఆకలితో ఏడుస్తోందని చెబుతాడు కార్తీక్. కష్టాలు పనిమనుషులకు కాదు.. ఈసారి యజమానులకు వస్తాయి, జ్యోత్స్నని ప్రశాంతంగా ఉండనివ్వనని చెబుతుంది పారు. దీప ఇలా తయారు కావడానికి పారిజాతం గారే కారణమని నువ్వే చెప్పావు కదా? అందుకే గురువు చేతే పాఠాలు చెప్పిస్తున్నానని అంటాడు కార్తీక్. పారు నిన్నే తన సొంత మనవరాలు అనుకుంటోంది. ఇప్పుడు నేను ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కి జ్యోత్స్నకి ఈరాత్రి శివరాత్రే అంటాడు కార్తీక్. పారిజాతం గారు ఏం గొడవ చేస్తారోనని దీప టెన్షన్ పడుతుంది.
దీప కొట్టిన చెంప దెబ్బకి మందు రాసుకుంటూ పడుకుంటుంది జ్యోత్న్న. ఇంతలో బెడ్‌పై పారు కనిపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప నుంచి నీకు ఏదో ఇన్ఫర్మేషన్ అందినట్లుంది, ముందు నువ్వు బెడ్ మీద నుంచి వెళ్లిపో అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు నాకు గోతులు తీయాలని చూస్తే నువ్వే ఇబ్బందుల్లో పడతావని చెబుతుంది. నేను ఈ కుటుంబానికి మంచి పని చేయబోతున్నానని అని అంటుంది పారు. నువ్వు బావ కలిసి నాకు పెళ్లి సంబంధం తీసుకొస్తున్నారా? దీపని దత్తత తీసుకోబోతున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. రేపు మన ఫ్యామిలీ అంతా కలిసి ఓ చోటికి వెళ్తున్నామని చెబుతుంది పారు. గ్రానీని అడ్డుపెట్టుకుని నన్ను ఆడుకుంటున్నావ్.. ఏదో ఒకరోజు నీ చేతులో నా మెడలో మూడు ముళ్లు వేయించుకుంటానని అనుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లుగా కాంచనకి కల రావడంతో ఆమె ఉలిక్కిపడి లేస్తుంది. ఇంతలో శౌర్య లేచి మంచినీళ్లు ఇవ్వగా గ్లాసు పగిలిపోతుంది. ఈ కల ఎప్పటికీ నిజం కాకూడదని అనుకుంటుంది కాంచన. ఉదయాన్నే ఈ విషయాన్ని శ్రీధర్‌కు చెబుతుంది. ఆ వెంటనే కార్తీక్ రావడంతో నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్లు మీ అమ్మకి కల వచ్చిందని అంటాడు శ్రీధర్. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నువ్వు నీ మేనకోడల్ని కోడలిగా చేసుకోవాలని అనుకున్నావు.. కానీ దీప కోడలైంది, మనందరికీ తెలిసిన నిజం ఏంటంటే? జ్యోత్స్నకి కార్తీక్ మీద ఆ ప్రేమ అలాగే ఉంది. అగ్రిమెంట్ పేరుతో కార్తీక్‌ని ఇంట్లో పెట్టుకోవడానికి కారణం కూడా ఇదేనని అంటాడు శ్రీధర్. జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టడం అనేది ఎప్పటికీ కలేనని తేల్చేస్తాడు.
మీరేం తక్కువ కాదు కదా? రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా అని శ్రీధర్‌పై మండిపడుతుంది కాంచన. మీదే కాదు, వాడి తాత వారసత్వం వచ్చినా రెండు పెళ్లిళ్లు అవుతాయి కదా అని అంటుంది. దేవుడి సమక్షంలో నువ్వు జ్యోత్స్నని పెళ్లి చేసుకున్నట్లు కల వచ్చిందని చెబుతుంది కాంచన. అలా ఎప్పటికీ జరగదని అర్ధం లేని భయాలు పెట్టుకోవద్దని చెబుతాడు కార్తీక్. ఈ మాటలన్నీ వింటూ దీప ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











