Karthika Deepam 2 April 16th: జ్యోత్స్న క్రూరమైన ప్లాన్.. సుమిత్రకు దూరమైన దీప, షాక్‌లో కార్తీక్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న అన్న మాటల్లో నిజం ఉందని.. నా వల్లే తను నీ భార్య కాలేదని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. కొంపతీసి నువ్వు త్యాగాలు లాంటివి ప్లాన్ చేయడం లేదు కదా అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోనని చెబుతుంది దీప. కానీ జ్యోత్స్న ఇలా కావడానికి పారిజాతం గారే కారణం.. ఆమె చిన్నప్పటి నుంచి నిన్ను భర్తలా పరిచయం చేసిందని చెబుతుంది దీప. ఆ మాటలతో గురువు చేతే శిష్యురాలికి బుద్ధి చెప్పిస్తానని చెప్పి పారుకి కాల్ చేస్తాడు కార్తీక్. జ్యోత్స్నని దీప చెంపదెబ్బే కొట్టింది.. కానీ నీ మనవరాలు దీప గుండెలపై కొట్టింది. దీప అనాథ కాబట్టి తన కాపురం నాశనం చేయాలని చూస్తోందని అంటాడు.

ఆ మాటలతో పారిజాతం కంటతడి పెడుతుంది. నీ మాటలతో గుచ్చేస్తున్నావు రా.. దీపకి నేనున్నాను, తనకు అన్యాయం జరగనివ్వను నేనేంటో చూపిస్తానని చెబుతుంది పారు. దీప కొట్టిన దెబ్బకి మందు రాసుకుంటూ పడుకున్న జ్యోత్స్న పక్కనే పారు పడుకుంటుంది. దీప జోలికి రావొద్దని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు.. రేపటి నుంచి నీకు టార్చర్ చూపిస్తానని అంటుంది పారు. జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కడుతున్నట్లుగా పీడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. ఉదయాన్నే ఈ విషయాన్ని శ్రీధర్‌కు చెప్పగా.. అలా ఎప్పటికీ జరగదని అంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి ఏదో చెబుతుండగా ఈ మాటలన్నీ విన్న దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 16వ తేదీ 646వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 646 April 16th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కల రావడంతో దాని గురించి శ్రీధర్, కార్తీక్‌లకు చెబుతుంది కాంచన. దాని గురించి కార్తీక్ మాట్లాడుతుండగా దీప విని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆమెకు ఎలా నచ్చజెప్పాలో అర్ధం కాక కార్తీక్ తలపట్టుకుంటాడు. అది చూసి బాధపడిన కాంచన కూడా అలుగుతుంది. నువ్వు ఇలాంటివి పట్టించుకోవద్దని కొడుక్కి నచ్చచెబుతాడు కార్తీక్. వాళ్లెందుకు అలుగుతారో తెలియదు, సారీ మనమే చెప్పాలని అంటాడు. నీ వల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి రావొద్దని మండిపడతాడు కార్తీక్. ముందు నువ్వు వెళ్లి దీపని ఓదార్చమని చెబుతాడు శ్రీధర్.

కార్తీక్ వెళ్లి చూసేసరికి దీప ఏడుస్తూ ఉంటుంది. బావ చేత నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జ్యోత్స్సే కాదని అది నా మీద సవాల్ చేసింది. ఈ విషయం అత్తకి తెలుసా? మనిద్దరికీ మాత్రమే తెలుసు. కానీ జ్యోత్స్న మెడలో నువ్వు తాళి కడుతున్నట్లు అత్తకి కలొచ్చింది. అంటే దీనిని ఏమని అర్ధం చేసుకోవాలి.. ఇది నిజంగా జరిగి తీరుతుందని అంటుంది దీప. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇలాంటి మాటలు మాట్లాడేది నువ్వేనా? అంటూ సీరియస్ అవుతాడు. నేను జ్యోత్స్న మెడలో తాళి కడతానా అని అనబోతుండగా నువ్వు ఏడుస్తూ బయటకు వచ్చేశావని అంటాడు. అత్తయ్య కోరికలు, కలలు నిజమవుతాయి.. మన పెళ్లి అత్తయ్య కోరిక, నీ పెళ్లి అత్తయ్య కల అంటుంది దీప.

ఆ జ్యోత్స్న అసలే ఒంటి కన్ను రాక్షసి.. దానిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయినాసరే ఈ భూమీ అంతా గాలించి దాని మొగుడిని చేస్తానని చెబుతాడు కార్తీక్. అది నువ్వే అయ్యేలా ఉన్నావని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అత్తయ్యకి అలాంటి కల రావడం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది. నిజం కంటే ఊహ చాలా భయంకరమైనది, నిజాలు మనిషిని ఏం చేస్తాయో తెలియదు ఊహాలు నాశనం చేస్తాయని అంటాడు కార్తీక్. రాత్రేమో జ్యోత్స్న బాధకు అర్ధముందని అన్నాను.. కానీ నువ్వు వెళ్లి తాళి కట్టమని చెప్పలేదు కదా అని అంటుంది దీప. ఆ జ్యోత్స్న మన జీవితాల్లోకి అడుగుపెట్టి నీకు, నాకు గొడవ పెడుతోందని అంటాడు కార్తీక్. ఈసారి కనుక నిన్ను పెళ్లి చేసుకుంటాననే మాట జ్యోత్స్న నోటి వెంట వస్తే చాలా పెద్ద గొడవ అవుతుందని చెబుతుంది దీప.

దానిని మనింటి వాకిట్లోకి కూడా అడుగుపెట్టనివ్వనని కార్తీక్ అంటుండగా.. శివన్నారాయణ కుటుంబం మొత్తం కార్తీక్ ఇంటికి వస్తుంది. రాత్రి నాతో గొడవపడి పొద్దున్నే అత్తింటికి తీసుకొచ్చావని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. మనం చేసిన పాపాలు కడుక్కోవాలి కదా అంటుంది పారు. నేను చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి.. అన్నీ పూర్తయ్యాక అప్పుడే కడుక్కుంటానని చెబుతుంది జ్యోత్స్న. శివన్నారాయణ కుటుంబాన్ని చూడగానే శ్రీధర్ షాక్ అవుతాడు. ఇంతలో కాంచన వచ్చి తన వాళ్లని చూసుకుని మురిసిపోతుంది. జ్యోత్స్నని కార్తీక్‌కి ఇచ్చి పెళ్లి చేయమని అడగటానికి రాలేదు కదా అని కాంచన టెన్షన్ పడుతుంది.

కార్తీక్‌ని పిలవమని శివన్నారాయణ, దశరథ అడగటంతో కాంచన షాక్ అవుతుంది. నాలాగే వీళ్లకి కూడా జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి గురించి కల వచ్చిందా అని టెన్షన్ పడుతుంది. దీపని, కార్తీక్‌ని తీసుకొచ్చేందుకు పారిజాతం వెళ్తుండగా ఆమెను ఆపి .. నేను తీసుకొస్తానని చెబుతుంది జ్యోత్స్న. హాల్‌లో జరిగినదానికి నువ్వు బాధపడుతున్నావని, అమ్మానాన్న అనుకుంటున్నారని దీపని బతిమలాడతాడు కార్తీక్. జ్యోత్స్న మెడలో నువ్వు తాళి కట్టినట్లు అత్తయ్యకి తెల్లవారుజామునే కలొచ్చిందని చెబుతుంటే బాధపడకుండా ఎలా ఉంటానని అంటుంది దీప. ఈ మాటలు విన్న జ్యోత్స్న షాక్ అవుతుంది. నీ భార్యగా ఈ మాట తీసుకోవడం కష్టంగా ఉందని అంటుంది. జ్యోత్స్న మీద నాకు చాలా కోపం వస్తుందని అంటుంది.

జ్యోత్స్న లోపలికి వెళ్లి బావ, దీపలు లేరని చెబుతుంది. బావ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి సరదాగా ఆటపట్టిద్దామని కార్తీక్‌కి కాల్ చేస్తుంది జ్యోత్స్న. అది చూసిన కార్తీక్, దీపలు షాక్ అవుతారు. కార్తీక్ ఫోన్ తీసుకుని దీప సీరియస్‌గా మాట్లాడుతుంది. డ్యూటీకి టైం ఉంది కదా? డ్యూటీ టైంలో తప్పించి మామూలు టైంలో ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది దీప. ఇంతలో పారు పెద్దగా మాట్లాడుతూ మీ ఇంట్లోనే ఉన్నామని చెబుతుంది. అది విన్న కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినట్లే.. జ్యోత్స్న కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి ఉంటుందని అంటాడు కార్తీక్. తన ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది.

దీప మాటలతో శివన్నారాయణకు అనుమానం వస్తుంది. నీ భార్య ఇలా మాట్లాడుతుందని తెలియక వచ్చామని కార్తీక్‌తో సీరియస్ అవుతుంది సుమిత్ర. నువ్వు మాట్లాడిన ప్రతిమాట మేమంతా విన్నామని.. నా కూతురిని పట్టుకుని అన్నేసి మాటలు అంటావా? అని మండిపడుతుంది. ఏం జరిగిందో మనం తెలుసుకోవాలని దశరథ చెబుతాడు. మాట విసిరేసిన రాయి లాంటిది, అది ఎక్కడ తగులుతుందో తగిలిన వాళ్లకి తెలుస్తుందని అంటుంది. నీ మీద నేను గెలవాలంటే నీ సానుభూతిపరుల్ని దూరం చేయాలని అనుకుంటుంది జ్యోత్స్న. దీప తరపున నేను క్షమాపణ చెబుతానని అంటుంది పారిజాతం. ఇంతలో దాస్, అనసూయలు వస్తారు. మేం దీపకి పుట్టింటి సారే తీసుకొచ్చామని పారు చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

కడుపుతో ఉన్న ఆడపిల్ల సంతోషంగా ఉండాలి.. ఎందుకంటే తనకు దీపకి పుట్టిల్లు లేదు అనుకుంటుంది కాబట్టి. ఆ లోటును తీర్చడానికి చలిమిడి కార్యక్రమం ఏర్పాటు చేయించానని చెబుతుంది పారిజాతం. మా అత్తయ్య గారు సీజన్‌కు ఒకలా మాట్లాడుతుంటారని అంటాడు శ్రీధర్. దశరథ- సుమిత్రల చేతుల మీదుగా పెళ్లి జరిగింది కాబట్టి.. తల్లి స్థానంలో సుమిత్ర నిలబడి ఈ కార్యక్రమం అంతా చేయాలని చెబుతుంది పారు. దీపని కూర్చోబెట్టి... సుమిత్ర చేతుల మీదుగా పుట్టింటి సారె ఇప్పిస్తుంది పారిజాతం. మా అమ్మ ఎక్కడ నిజం చెబుతుందోనని టెన్షన్‌గా ఉందని కార్తీక్‌తో అంటాడు దాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X