Karthika Deepam 2 April 18th: సుమిత్ర కోసం నిజం దాచిన దశరథ.. జ్యోత్స్న అంతానికి వైరా కుట్ర

Photo Courtesy: JioHotstar

తనకు తల్లి స్థానంలో నిలబడి పుట్టింటి సారె పెడుతోన్న సుమిత్ర ఆశీర్వాదాలు తీసుకోవడానికి దీప ముందుకు వంగగా.. సుమిత్ర వెనక్కి జరుగుతుంది. నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయని చెబుతుంది సుమిత్ర. ఆ వెంటనే దీప కోసం ప్రత్యేకంగా కొన్న నెక్లెస్‌ను జ్యోత్స్న చేతుల మీదుగా వేయిస్తుంది పారిజాతం. నా చేతే దీప మెడలో నెక్లెస్ వేయిస్తావా? దానిని ఏడిపిస్తానంటూ పారుపై రగిలిపోతూ కొత్త స్కెచ్ వేస్తుంది జ్యోత్స్న. నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను.. నేను ఇందాక పెరట్లో కార్తీక్- దీపలను చూసి కావాలని అబద్ధం చెప్పాను. ఆ సమయంలో నా మెడలో కార్తీక్ బావ తాళికట్టినట్లుగా కాంచన అత్తకు కల వచ్చిందని దీప చెబుతుండగా విన్నాను. అందుకే నా మీద కోపంతో దీప తిట్టిందని చెబుతుంది జ్యోత్స్న.

ఆ మాటలు విన్న అందరూ షాక్ అవుతారు. కాంచనను అడగ్గా ఆమె కూడా నిజమేనని ఒప్పుకుంటుంది. దాంతో కార్తీక్ జోక్యం చేసుకుని.. ఎప్పటికీ దీపే నా భార్య, ఆమె లేకుండా ఉండలేనని చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. దీపే నా మనవరాలని పారు ఎక్కడ చెబుతుందోనని దాస్ బయటికి తీసుకెళ్లి వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే కార్తీక్‌ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది పారు. దీప- జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 18వ తేదీ 648వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 648 April 18th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే కావేరికి కూరగాయలు తీసుకొచ్చి ఇస్తాడు కాశీ. కార్తీక్ బావ ఇంట్లో ఏదో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లుగా ఉంది.. మీరెందుకు వెళ్లలేదని అడుగుతాడు. స్వప్న రాను అని చెప్పింది.. అందుకే మీ మావయ్య ఒక్కరే వెళ్లారని చెబుతుంది కావేరి. అంత బిజీగా ఉన్నావా? వెళ్లొచ్చు కదా అని స్వప్నపై మండిపడతాడు కాశీ. అక్కడికి వెళితే.. మనం గతంలో వెటకారంగా మాట్లాడిన వాళ్లు, ఇప్పుడు మన గురించి వెటకారంగా మాట్లాడతారని అంటుంది. మీ నానమ్మ అస్సలు వదిలిపెట్టదు, ఎందుకంటే మనవడితో విడాకులు తీసుకుంటున్నానని కదా అని చెబుతుంది స్వప్న. అవమానాలు ఎదురవుతాయని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతావా అని ప్రశ్నిస్తాడు కాశీ. మన దగ్గర సమాధానం ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేరు.. దానికి సమాధానం నా పెళ్లి అని చెబుతుంది స్వప్న. ఆ మాటలతో కాశీ షాక్ అవుతాడు. అలా అయితే ఈ పెళ్లి జరగదు, వసంత్ నీ మెడలో తాళి కట్టడు. ఎందుకంటే నువ్వు కట్టించుకోలేవు, నీ పెళ్లిని నువ్వే ఆపుకుంటావని చెబుతాడు కాశీ.

జైళ్లో నుంచి విడుదలైన వైరా పగతో రగిలిపోతుంటాడు. నిన్ను జైళ్లో పెట్టించిన జ్యోత్స్నని ఏదో ఒకటి చేసేవాడివని రెచ్చగొడతాడు అసిస్టెంట్. దానిని వదిలేయలేదు, అస్సలు మరిచిపోలేదు. దేనికైనా టైం రావాలని అంటాడు. దానిని కూడా బతికినా చచ్చిన దానితో సమానంగా మారుస్తాను, ఎవరినీ వదిలిపెట్టనని కోపంగా చెబుతాడు వైరా. బాస్ పని మీద ఉన్నాడని సాగర్‌తో చెప్పమని అసిస్టెంట్‌తో అంటాడు వైరా. తన బాస్ పగతో రగిలిపోతున్నాడని తెలిసి అసిస్టెంట్ చాలా సంతోషిస్తాడు.

దాస్‌ని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది జ్యోత్స్న. కూతురి ముందు నటించేందుకు నీకు సిగ్గులేదా అని మండిపడుతుంది జ్యోత్స్న. ప్రేమించడం అంటే కూతురు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం కాదని చెబుతుంది. కష్టం నీకొస్తే తండ్రిగా బాధపడతాడను, కష్టాన్ని నువ్వే తీసుకొచ్చుకుంటే అని ప్రశ్నిస్తాడు దాస్. మీరంతా ఉత్తములు నేనొక్క దానినే చెడ్డదాన్ని అంటుంది జ్యోత్స్న. ఈ ప్రపంచం చెడ్డవాళ్లతో ఏనాడో నిండిపోయింది.. అందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్లు బతుకుతారు. నా గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోను, నా ఒరిజినాలిటీ అందరికీ తెలిసిన రోజున నన్ను అసహ్యించుకోవచ్చు, చీదరించుకోవచ్చు. కానీ నేను దానిని పట్టించుకోను.. నేను ఎలాంటి దానినో నా గురించి నాకే తెలియదు. మీరంతా నేను ఓడిపోతే చూడాలని అనుకుంటున్నారని అంటుంది జ్యోత్స్న.

మనది కాని దాని గురించి పోరాడే ఎవరైనా సరే చివరికి ఓడిపోవాల్సిందేనని చెబుతాడు దాస్. నా మాట విని పెళ్లి చేసుకుంటే, రేపు నువ్వు ఎవరన్నది తెలిసినా నీకు పెద్దగా నష్టం జరగదని చెబుతాడు. పెళ్లయిన ఏ ఆడదానికి తల్లిదండ్రులు సొంతం కారని అంటాడు. నువ్వు దీప - కార్తీక్‌ల జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తాడు దాస్. నా మెడలో తాళి కట్టేది బావే, కలలో కూడా పెళ్లి జరుగుతుందని అంటుంది జ్యోత్స్న. అత్తకి వచ్చిన కలను నిజం చేస్తానని చెబుతుంది. భగవంతుడు నీకో మంచి జీవితాన్ని ఇచ్చాడు.. దానిని నాశనం చేసుకునే వరకు ఆగేలా లేవని అంటాడు దాస్. భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్పించి.. నువ్వు సాధించింది ఏం లేదు, నీ కొడుకు జీవితం అలాగే తగలడింది.. నీ కూతురి జీవితం అలాగే తగలడింది. ఇద్దరికీ నువ్వు నమ్మకం లేని భవిష్యత్తుని ఇచ్చావని అంటుంది జ్యోత్స్న.

నీ తమ్ముడికి ఏం కాదు.. వాడికి దేవుడు నీలాంటి బుద్ధి ఇవ్వలేదు. వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకుంటున్నాడు, దాని విలువ నీకు తెలియదని చెబుతాడు దాస్. నువ్వు, బావ, దీప మీరు ముగ్గురు ఒక పార్టీ. ఏం చెప్పి గ్రానీనీ మీ పార్టీలోకి మార్చేశారు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మేం ఏ పార్టీ పెట్టలేదు, ఎవరినీ మార్చలేదని దాస్ చెబుతాడు. ఆశపెట్టారా? భయపెట్టారా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను ఎవరినీ భయపెట్టలేదు, ఎవరికీ ఆశపెట్టలేదు.. కార్తీక్- దీపల మంచితనమే మా అమ్మని మార్చేసిందని అంటాడు దాస్. మీరెవరూ నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుంటే ఓ తండ్రిగా చూడాలని ఉందని అంటాడు దాస్. ఏదో ఒకరోజు నేను బావతో తాళి కట్టించుకుంటాను, అక్షింతలతో రెడీగా ఉండమని చెబుతుంది జ్యోత్స్న.

వసంత్ నీకు గాజులు వేస్తున్నప్పుడు నువ్వెందుకు గాజులు వేయించుకోలేదు అని స్వప్నని అడుగుతాడు కాశీ. మనిద్దరి మధ్య ఉన్న ఏదో సంఘటన నీకు గుర్తొచ్చింది.. అందుకే చేయి వెనక్కి లాగేశావు, ఒట్టేసి చెప్పామని ప్రశ్నిస్తాడు కాశీ. అయితే ఈరోజు వసంత్‌ని మళ్లీ పిలుస్తా.. గాజులు వేయించుకోమని కాశీ చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. నువ్వు నా మీద కోపంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నావు.. కావాలంటే మళ్లీ వసంత్‌ని పిలుస్తాను, గాజులు వేయించుకోమని చెబుతాడు కాశీ. వసంత్ నీ ముందున్నాడే కానీ నీ మనసులో లేడు, నీ జీవితంలోకి రాలేడు. మన ప్రేమ తాలూకా ప్రతి జ్ఞాపకాన్ని నువ్వు ప్రతిక్షణం గుర్తుచేసుకుంటున్నావు.. ఈ పెళ్లిని నువ్వే ఆపుకుంటావని చెబుతాడు కాశీ. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నన్ను మోసం చేసినట్లే.. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు కాశీ.

దీప నిజస్వరూపం తెలిసిపోయింది. జ్యోత్స్న అంటే దీపకి ఇష్టం లేనట్లే కదా అని దశరథతో అంటుంది సుమిత్ర. నువ్విలా తప్పుగా అనుకోవాలనే జ్యోత్స్న రెచ్చగొట్టిందని అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న గతంలో దీప విషయంలో కొన్ని తప్పులు చేసింది. అలాగే దీప కూడా జ్యోత్స్న విషయంలో చాలా తప్పులు చేసింది. కానీ ఇప్పుడు అందరం కలిసిపోయాం కదా? అయినా ఇంకా జ్యోత్స్నని దీప ఎందుకు ద్వేషిస్తోంది. జ్యోత్స్న మంచితనం వల్లే దీప ఈ ఇంట్లో అడుగుపెట్టగలిగిందని అంటుంది సుమిత్ర. దీపే మన కూతురని సుమిత్రకు చెప్పే సమయం వచ్చిందని దశరథ అనుకుంటాడు.

ఎవరి మీద ఎవరు జాలి చూపించాలి, రావాలని రాసిపెట్టాలి కాబట్టే వచ్చిందని అంటాడు. జ్యోత్స్నతో దీప అలా మాట్లాడటం నాకు నచ్చలేదని అంటుంది. జ్యోత్స్న మీద అంత మమకారం పెంచుకోవద్దని అంటాడు సుమిత్ర. తను నా కన్నకూతురని సుమిత్ర అనగా.. కాదని తెలిస్తే అని దశరథ అనడంతో ఆమె షాక్ అవుతుంది. ఈ మాట పొరపాటున కూడా అనొద్దు.. దాని మీద మాట పడ్డా నేను తట్టుకోలేను, నేను బతికేదే దాని కోసమని చెబుతుంది సుమిత్ర. నువ్వు జ్యోత్స్న మీద ఇంత ప్రాణం పెట్టుకోబోట్టే నీకు నిజం చెప్పలేకపోతున్నానని అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న గురించి అలాంటి మాట ఎందుకు అన్నావని నిలదీస్తుంది సుమిత్ర. పెళ్లయితే నీ కూతురు నీ నుంచి వెళ్లిపోవాలి కదా అని అంటాడు దశరథ.

అందరు కూతుళ్ల లాగా జ్యోత్స్న నాకు దూరం కాకూడదు.. పెళ్లయినా జ్యోత్స్న నా కళ్ల ముందే ఉండాలి. జ్యోత్స్నని నాకు దూరం చేసే పని ఎప్పుడూ చేయనని మాటివ్వమని అడుగుతుంది సుమిత్ర. నిన్ను కాపాడుకోవాలంటే, నేను జ్యోత్స్నని కూడా కాపాడుకోవాలని అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న ఎక్కడుంది? ఏం చేస్తుందో చూడమని కార్తీక్‌కి చెబుతుంది దీప. మనం మీ అమ్మ కోసం ఇవన్నీ భరించాల్సిందేనని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న విషయంలో పారునే హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉండగా.. పారు రావడంతో జ్యోత్స్న మీద ఓ కన్నేసి ఉంచమని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X