Karthika Deepam 2 April 20th: వైరాతో జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా.. కుప్పకూలిన సుమిత్ర, షాక్‌లో కార్తీక్, దశరథ

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే కూరగాయలు తీసుకుని కావేరికి ఇస్తాడు కాశీ. కార్తీక్ బావ ఇంట్లో ఏదో సెలబ్రేషన్స్ ఉన్నట్లుగా ఉన్నాయి.. మీరు వెళ్లలేదా అని కావేరిని అడుగుతాడు కాశీ. స్వప్న రాను అని చెప్పింది, అందుకే వెళ్లలేదని అంటుంది కావేరి. దీనిపై స్వప్నని అడగ్గా.. అక్కడికి వెళితే నలుగురితో మాటలు పడాల్సి ఉంటుందని, ముందు మీ నానమ్మ సెటైర్లు వేస్తుందని చెబుతుంది స్వప్న. నా మెడలో తాళి పడితేనే కానీ వీటన్నింటికీ చెక్ పడదని చెబుతుంది. జైలు నుంచి రిలీజైన వైరా తనను దెబ్బకొట్టిన జ్యోత్స్న అంతుచూడాలని ప్లాన్ చేస్తుంటాడు.

దాస్‌ని పక్కకి తీసుకొచ్చిన జ్యోత్స్న.. మీరంతా ఏం చేసి గ్రానీనీ మార్చేశారని అడుగుతుంది. కార్తీక్- దీపల మంచితనమే అమ్మని మార్చేసిందని దాస్ చెబుతాడు. మీరెవ్వరూ నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటాను.. కార్తీక్ బావ చేతులతో నా మెడలో తాళి కట్టించుకుంటానని సవాల్ చేస్తుంది జ్యోత్స్న. వసంత్‌ని నువ్వు పెళ్లి చేసుకోలేవు, నువ్వే ఈ పెళ్లి ఆపేస్తావని స్వప్నతో అంటాడు కాశీ. జ్యోత్స్న గురించి దీప అలా మాట్లాడటం నాకు నచ్చలేదని దశరథతో చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నకు పెళ్లయినా అది నా కళ్ల ముందే ఉండాలని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 20వ తేదీ 649వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 649 April 20th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న కారులో వస్తుండగా రోడ్డుపై కారు అడ్డుగా ఉంటుంది. అదేంటనీ అడిగి చూసేసరికి అందులో వైరా కనిపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీతో నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి వెళ్దామా అని అడుగుతాడు. నీలాంటి వేస్ట్ ఫెలోస్‌తో మాట్లాడను అని జ్యోత్స్న అంటుండగా.. వైరా వచ్చి కారులో కూర్చొంటాడు. దాంతో కారులో గన్ తీసి వైరాని బెదిరిస్తుంది.. దాంతో ఆమె చేతిలోని గన్ లాక్కొని గురి పెడతాడు వైరా. నిన్ను మోసం చేసింది నేను కాదు మా బావ అంటుంది జ్యోత్స్న. నేను పువ్వులు దేవుడి పాదాల దగ్గర పెడతాను.. నా చెవిలో పెట్టుకోను, నక్కకి కూడా నాటకాలు నేర్పించే టాలెంట్ నీది అంటాడు వైరా.

నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను, కారు పోనివ్వమని బెదిరిస్తాడు వైరా. దాంతో కారుని నడుపుతూ వెళ్తుంది జ్యోత్స్న. ఆ వెంటనే జ్యోత్స్నని తన డెన్‌లో కట్టేస్తాడు వైరా. నేను శివన్నారాయణ గారి మనవరాలిని, మా డాడీకి తెలిసిందంటే అంటూ వార్నింగ్ ఇస్తుంది. అసలు నీకేం కావాలని జ్యోత్స్న అడగ్గా.. 20 కోట్ల రూపాయలు కావాలని చెబుతాడు వైరా. నాకెప్పుడు డబ్బులు అవసరమైనా మా నాన్నని అడిగేవాడిని, ఈరోజు నువ్వే మా డాడీవి అంటాడు వైరా. పిల్లలు చేసిన తప్పులకు పెద్దవాళ్లకే పనిష్మెంట్ ఇవ్వాలి.. నీ వల్ల నా కింగ్డమ్ అంతా కుప్పకూలిపోయింది. డాన్‌లా బతికిన నన్ను బఫూన్‌ని చేశావు. నీతో చేతులు కలిపి మీ డాడీ మీద పగ తీర్చుకుందామని అనుకున్నాను, కానీ నువ్వు నాకు బోడీ గుండు కొట్టేశావు. ఓ 20 కోట్లు ఇస్తే మళ్లీ బిజినెస్ స్టార్ట్ చేస్తానని అంటాడు వైరా.

నిన్ను చంపేస్తానంటే మీ డాడీ డబ్బులు ఇవ్వడా? 20 కోట్లు కావాలి? లేదంటే నీ కూతురు చస్తుందని చెబుతాను. గన్ నీ వైపే గురి పెట్టి ఉంటుంది.. నా పేరు చెబితే నిన్ను చంపేస్తానని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు వైరా. శివన్నారాయణ, దశరథ మాట్లాడుకుంటూ ఉండగా వైరా ఫోన్ చేసి నీ కూతురిని నేను కిడ్నాప్ చేశానని చెబుతాడు. ఆ మాటలతో దశరథ, శివన్నారాయణ దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నా కూతురు ఇంట్లోనే ఉంది.. ఇప్పుడే పిలుస్తానని అంటాడు. జ్యోత్స్న ఇంట్లో లేదని పారు చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. నేనొక వీడియో పంపిస్తాను, చూసి కన్ఫర్మ్ చేసుకోమని అంటాడు వైరా.

ఆ వెంటనే జ్యోత్స్నకి ఫోన్ చేయమని కార్తీక్‌కు చెప్పగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అంతా కంగారుపడతారు. జ్యోత్స్న ఏ షాపింగ్‌కో వెళ్లి ఉంటుంది.. ఈ మధ్య ఇలాంటి ఫేక్ కాల్స్ ఎక్కువ అయ్యాయని అంటాడు కార్తీక్. ఇంతలో దశరథకు వీడియో పంపిస్తాడు వైరా. అది చూసిన శివన్నారాయణ కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అని అడుగుతాడు దశరథ. నాకేం కావాలో తర్వాత చెబుతాను అక్కడ వీళ్ల అమ్మ గారు ఉన్నారా? నీ కూతురు వాళ్లమ్మతో మాట్లాడాలట ఆవిడని రెడీగా పెట్టుకోమని చెబుతాడు వైరా. ఈ గ్యాప్‌లో మీ తెలివితేటలు ఉపయోగించి నెంబర్లు ట్రేస్ చేయడం, పోలీసులకు ఫోన్ చేయడం లాంటి టాలెంట్ చూపించొద్దు. నేనే దొరికిపోతానని అనుకుంటే మీ కూతురిని ఎందుకు బ్రతకనిస్తానని వార్నింగ్ ఇస్తాడు వైరా.

కూతురు కళ్లు తిరిగి ఆసుపత్రికి వెళ్లిందంటనే సుమిత్ర తట్టుకోలేకపోయింది. అలాంటి మనిషితో జ్యోత్స్న కిడ్నాప్ అయ్యిందని ఎలా చెప్పాలి. మనం చూసిన వీడియో సుమిత్ర చూసిందంటే... ముందు సుమిత్రను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంటాడు. కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా పారు వచ్చి ఆ కిడ్నాప్ చేసింది ఎవరు అని అడుగుతుంది. వాడి గొంతు కూడా చాలా డిఫరెంట్‌గా ఉందని చెబుతాడు కార్తీక్. వాడు జ్యోత్స్నని ఎందుకు కిడ్నాప్ చేశాడు? సుమిత్రతో మాట్లాడాలని అంటున్నాడు? అని దీప, పారులు ప్రశ్నిస్తారు. అత్తతో మాట్లాడటానికి ఈ కిడ్నాప్‌కి ఏదో సంబంధం ఉందని అంటాడు కార్తీక్.

జ్యోత్స్న కిడ్నాప్ గురించి సుమిత్రకు ఏం చెప్పొద్దని దీపకి చెబుతుంది పారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జ్యోత్స్న గురించి కాదు.. సుమిత్ర గారి గురించి. కూతురికి ఏమైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని వెళ్లిపోతుంది దీప. నువ్వు నా కంటే చాలా మంచిదానివి అని పారు అనుకుంటుంది. ఇంతలో కార్తీక్‌కి దాస్ నుంచి ఫోన్ రావడంతో విషయం చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నని కిడ్నాప్ చేయడం ఏంటీ? ఎవరో నాటకాలు ఆడుతున్నారని అంటాడు దాస్. కన్నతండ్రిని కిడ్నాప్ చేసిన పాపం ఊరికే పోదు.. జ్యోత్స్న అత్తతో మాట్లాడతానని చెప్పిందని కిడ్నాపర్ అన్నాడు. ఈ విషయం అత్తతో ఎలా చెప్పాలా? అని మావయ్య భయపడుతున్నాడని చెబుతాడు కార్తీక్.

నువ్వు ఈ మధ్యన ఎవరితోనైనా గొడవ పడ్డావా? అని కొడుకుని అడుగుతాడు శివన్నారాయణ. ఆ ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న ల్యాండ్ కోసం నాకు, బిల్డర్ రాజశేఖర్‌కి మధ్య గొడవ జరిగిందని దశరథ చెబుతాడు. అయితే ఈ పని వాడే చేసుంటాడని కార్తీక్ అనుమానిస్తాడు. వాడికి అంత సీన్ లేదు.. వాడే చేసుంటే డైరెక్ట్‌గా ల్యాండ్ గురించే బెదిరించేవాడని అంటాడు శివన్నారాయణ. ముందు మనం పోలీస్ కంప్లయంట్ ఇద్దామని కార్తీక్ చెప్పగా.. ఈ ఇంటి ఆడపిల్ల వాడి చేతిలో ఉంది, తేడా వస్తే జ్యోత్స్న ప్రాణాలకి ప్రమాదమని శివన్నారాయణ భయపడతాడు.

ఇంతలో సుమిత్ర రావడంతో అంతా టెన్షన్ పడతారు. అందరూ ఇక్కడే ఉన్నారు జ్యోత్స్న ఏది అని అడుగుతుంది సుమిత్ర. అత్తని కూర్చోబెట్టి నీకో వీడియో చూపిస్తాను టెన్షన్ పడకుండా చూడమని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నని కట్టేసి ఉంచిన వీడియో చూడగానే సుమిత్ర కంగారు పడుతుంది. ఏం జరిగిందని అడగ్గా.. జ్యోత్స్నని ఎవరో కిడ్నాప్ చేశారని కార్తీక్ చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. వైరా వీడియో కాల్ చేయడంతో జ్యోత్స్నతో మాట్లాడుతుంది సుమిత్ర. వాళ్లకేం కావాలో అడగమని సుమిత్ర చెప్పడంతో నా ప్రాణాలు అని జ్యోత్స్న అంటుంది. వీళ్లు నన్ను బతకనివ్వరని నాకు అర్ధమవుతుందని చెబుతుంది జ్యోత్స్న. నా పెళ్లి చూడాలని నువ్వు ఆశపడ్డావు.. కానీ అది నెరవేరుతుందో లేదో నేను చెప్పలేనని అంటుంది జ్యోత్స్న.

నీ ప్రాణాలను నేను కాపాడగలిగాను, నీ కన్నకూతురిగా నీ రుణం తీర్చుకున్నారు. వచ్చే జన్మలోనూ నీ కూతురిగానే పుట్టాలని ఉందని అంటూ ఫోన్ కట్ చేస్తుంది. నా కూతురిని కాపాడమని దశరథను పట్టుకుని ఏడుస్తుంది. మీ కూతురు మీకు కావాలంటే 30 కోట్ల రూపాయలు ఇవ్వమని వైరా చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను అడిగింది ఇవ్వకపోతే నీ కూతురిని చంపి ఇంటికి పార్శిల్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు వైరా. ఆ వెంటనే అమ్మ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అని జ్యోత్స్నని అడుగుతాడు వైరా. నువ్వు 30 కాదు.. 50 కోట్లు అడిగినా ఇస్తారని చెబుతుంది జ్యోత్స్న. నీకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి.. నీతో కలిసిపోతే నాక్కూడా లాభమే కదా అంటుంది జ్యోత్స్న. ఆస్తి మొత్తం నీదే కదా? నీకెందుకు ఈ కక్కుర్తి అని ప్రశ్నిస్తాడు వైరా. నీకు సమాధానం కావాలా? డబ్బులు కావాలా? అని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X