Karthika Deepam 2 April 21st: దీపని మెడపట్టి గెంటేసిన సుమిత్ర.. దాస్, పారులపై శివన్నారాయణ అనుమానం
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న కారులో వస్తుండగా రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి ఉంటుంది. ఇంతలో వైరా వచ్చి జ్యోత్స్న కారులో కూర్చోవడంతో జ్యోత్స్న వణికిపోతుంది. వెంటనే తన దగ్గరున్న గన్‌ని తీసి వైరాకు గురిపెడుతుంది. అయితే వైరా ఆ గన్ లాక్కుని జ్యోత్స్నకి ఎక్కుపెట్టి మేం నిన్న కిడ్నాప్ చేశాం.. నేను చెప్పిన చోటికి పోనివ్వమని చెబుతాడు. అనంతరం వైరా మనుషులు .. జ్యోత్స్నని కుర్చీకి కట్టేస్తారు. నీ వల్ల నా సామ్రాజ్యం మొత్తం పోయింది. మళ్లి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 20 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, అందుకే నిన్ను కిడ్నాప్ చేశామని చెబుతాడు.
వెంటనే దశరథకు ఫోన్ చేసి మీ అమ్మాయి నా దగ్గరే ఉందని వీడియో తీసి పంపిస్తాడు. అది చూసిన దశరథ, శివన్నారాయణ షాక్ అవుతారు. ఈ విషయం పోలీసులకు చెప్పినా, నా నెంబర్ ట్రేస్ చేసినా మీ అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తాడు వైరా. ఈ విషయాన్ని సుమిత్రకు ఎలా చెప్పాలో తెలియక అంతా తలపట్టుకుంటారు. ఇంతలో సుమిత్ర రావడంతో జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వీడియో చూపిస్తాడు కార్తీక్. దాంతో సుమిత్ర కంగారుపడుతుంది. ఆ వెంటనే వైరా వీడియో కాల్ చేసి జ్యోత్స్నతో మాట్లాడిస్తాడు. మీ అమ్మాయి మీ ఇంటికి సేఫ్‌గా రావాలంటే 30 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. నీ వల్ల నాకు కూడా డబ్బులు వస్తాయి.. నువ్వు 20 కోట్లు తీసుకో, నేను 10 కోట్ల రూపాయలు తీసుకుంటానని వైరాతో చెబుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 21వ తేదీ 650వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పోలీసులకు చెప్పకుండా జ్యోత్స్న కిడ్నాప్ విషయాన్ని తేల్చాలని వాళ్లు అడిగిన డబ్బు ఇచ్చేయాలని దశరథతో అంటుండగా దాస్ పోలీసులను వెంటబెట్టుకుని వస్తాడు. దాంతో దాస్, కార్తీక్‌లపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. దీప నచ్చచెప్పాలని చూస్తుండగా ఆమెను బయటకు గెంటేయబోతోంది సుమిత్ర. దాంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. నీ భార్యకు నా కూతురు అంటే ఇష్టం ఉండదు.. ఇలాంటి వారు నలుగురు నా చుట్టూ ఉంటే నా కూతురు బయటకు రాదని బాధపడుతుంది. ఈ దీప మీద నాకు ఎలాంటి గౌరవం లేదు. నోటి మాట ఎంతో గొప్పది.. మంచికైనా, చెడైనా మాటలు చాలు. నా కూతురి అవసరం లేనివాళ్లు నాకు అవసరం లేదు. ఈరోజు నీకు మంచి జీవితం ఉందంటే నా కూతురి వల్లేనని గుర్తుచేస్తుంది సుమిత్ర. ఆ రోజు ఆసుపత్రిలో నీ చేయి పట్టుకుని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెబుతుంది. దీపకి సపోర్ట్‌గా పారు మాట్లాడుతుండగా ఆమెపైనే సీరియస్ అవుతుంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఫైర్ అవుతుంది సుమిత్ర.
నువ్వు మనసులో ఏం కోరుకున్నావో ఏంటో అందుకే నా కూతురిని ఎవరో వెధవ కిడ్నాప్ చేశాడు. జ్యోత్స్నకి ఏం కాదని కార్తీక్ అంటుండగా అయితే నా కూతురిని తీసుకుని రా అంటూ సీరియస్ అవుతుంది కార్తీక్. ఇంతలో శ్రీధర్ రావడంతో నీకెవ్వరు చెప్పారని అడుగుతాడు శివన్నారాయణ. నేనే చెప్పానని దాస్ అనడంతో అంతా సీరియస్ అవుతారు. జ్యోత్స్నని కిడ్నాప్ చేసే వాళ్లు ఎవరు.. తనే కిడ్నాప్ అయి డబ్బుల కోసం డ్రామా ఆడుతోందని దాస్, పారులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు విన్న శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఈ ఆస్తి మొత్తం తనదే.. అది అడిగితే ఎంతైనా ఇస్తానని చెబుతాడు శివన్నారాయణ.
ఈ ఇంటి వారసురాలు కనిపించడం లేదని మేమంతా ఇంత బాధపడుతుంటే నోటికొచ్చినట్లుగా మాట్లాడతావా అంటూ సీరియస్ అవుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న నీ సొంత మనవరాలు కాదు కాదా? నీకెందుకు ప్రేమ ఉంటుంది. అదే దాస్‌కి ఒక కూతురుండి, తనని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఇళ్లంతా దొర్లి దొర్లి ఏడ్చేదానివి అంటాడు శివన్నారాయణ. మీరు అంటున్నది నిజమే సరే.. జ్యోత్స్న నా కూతురని మనసులో అనుకుంటాడు దాస్. జ్యోత్స్న తిరిగొచ్చే వరకు నువ్వు మాట్లాడొద్దని పారుకి వార్నింగ్ ఇస్తాడు దాస్.
వైరా నుంచి మరో వీడియో వస్తుంది. వీళ్లు నన్ను కొడుతున్నారు, కాపాడండి అంటూ జ్యోత్స్న డ్రామా ఆడుతుంది. కూతురి బాధ చూసిన సుమిత్ర కుప్పకూలిపోతుంది. అంత డబ్బు ఇచ్చిన తర్వాత అమ్మాయిని వాళ్లు సేఫ్‌గా పంపిస్తాడా అని శ్రీధర్ అడగటంతో అంతా షాక్ అవుతారు. అందుకే నేను స్పెషల్ ఆఫీసర్‌ని మాట్లాడానని శివన్నారాయణ చెప్పడంతో అతను ఇంటికొస్తాడు. ఆ వీడియో అంతా చూసిన స్పెషల్ ఆఫీసర్.. ఈ పని చేసింది బయటివాళ్లే మీ కుటుంబానికి సంబంధించిన వాళ్లు కాదని అంటాడు ఆఫీసర్. మీకు తెలిసినవాళ్లు అయితే కనుక మీ అమ్మాయి వెంటనే గుర్తుపట్టేసేదని చెబుతాడు. మీ ఫోన్ నెంబర్లని ట్రేస్ చేస్తున్నాం.. కిడ్నాపర్లతో కాస్త ఎక్కువ సమయం మాట్లాడమని చెబుతాడు ఆఫీసర్.
ఇంతలో వైరా నుంచి ఫోన్ రావడంతో డబ్బు రెడీ అయ్యిందని చెబుతాడు దశరథ. నేను, నా భార్య నా కూతురితో మాట్లాడాలని అనుకుంటున్నామని చెబుతాడు దశరథ. నా నెంబర్ ట్రేస్ చేయాలంటే నాతో కాసేపైనా మాట్లాడాలి కదా అని వైరా అనడంతో అంతా షాక్ అవుతారు. పోలీసులకు చెబితే మీ అమ్మాయి బతకదదని ముందే చెప్పాను.. ఆశ వదిలేసుకోండని వైరా అనడంతో అంతా షాక్ అవుతారు. దాంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది. నీ యాక్టింగ్ ఇరగదీస్తున్నావు.. అక్కడ పోలీసులు ఉన్నట్లు నీకెలా తెలుసు అని వైరాని అడుగుతుంది జ్యోత్స్న. ఇప్పుడు మీ నాన్న గొంతులో భయం లేదు, కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అంటే పోలీసులు పక్కనే ఉన్నారని అంటాడు వైరా.
ఇలాంటి ప్రయత్నాలు ఏమీ వద్దు.. వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నా కూతురిని వదిలేస్తారు కదా? అని శివన్నారాయణపై సీరియస్ అవుతుంది వైరా. ఇలాంటి క్రిమినల్స్‌ని అంత తేలికగా వదిలేయొద్దని చెబుతాడు స్పెషల్ ఆఫీసర్. దాంతో ఆయనని తీసుకుని దశరథ బయటకు వెళ్తాడు. జ్యోత్స్నకి ఫుడ్ తినిపిస్తాడు వైరా. నేను నిన్నే ఫాలో అవుతానని జ్యోత్స్నకి చెబుతాడు. ఇప్పుడే ఫోన్ చేయొద్దని మార్నింగ్ వరకు రాకపోతే అప్పుడు నా గురించి బాగా టెన్షన్ పడుతూ.. నువ్వు ఎంత అడిగితే అంత పంపిస్తారని చెబుతుంది జ్యోత్స్న. గతంలో ఇలాగే గుడ్డిగా నమ్మి జైలు పాలయ్యావని అసిస్టెంట్ వార్నింగ్ ఇస్తాడు. ఈసారి అలా ఫాలో అవ్వను.. జ్యోత్స్న తప్పించుకునా, డబ్బు చేతికి రాకపోయినా చంపేయని ఆర్డర్స్ వేస్తాడు వైరా.
సుమిత్రని టాబ్లెట్ వేసుకోమని కార్తీక్ చెప్పగా.. నీ కూతురిని కూడా ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తే అప్పుడు నా బాధ నీకు అర్ధమయ్యేదని అంటుంది సుమిత్ర. నా కూతురు నన్ను కాపాడుకుంది కానీ, నా కూతురిని నేను కాపాడుకోలేకపోతున్నాను చెబుతుంది. ఒక్కగానొక్క కూతురు.. మీ కూతురి మీద ఆశలు వదిలేసుకోండని వాడు చెబుతున్నాడని అంటుంది. దీప నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుండగా.. నువ్వు కాసేపు నాకు కనిపించొద్దు, డబ్బుతో పోయే సమస్యని మీ ఆయన ప్రాణాల పోయే వరకు తీసుకొచ్చాడని సీరియస్ అవుతుంది సుమిత్ర. దాంతో కార్తీక్ ఆమెకు సారీ చెప్పి.. నేను దాస్ మావయ్యకి చెప్పకుండా ఉండాల్సింది, నా వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చింది కాబట్టి జ్యోత్స్నని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదేనని అంటాడు కార్తీక్.
దీపని తీసుకుని శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. జ్యోత్స్నని కిడ్నాప్ చేసి, 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, దాస్ కంగారుపడి పోలీసులను తీసుకొచ్చాడని కాంచనకు చెబుతాడు శ్రీధర్. ఇప్పుడు మా అన్నయ్య పరిస్ధితి ఏంటని కాంచన అడగ్గా.. బావ బాగానే ఉన్నాడు కానీ సుమిత్ర తట్టుకోలేకపోయిందని చెబుతాడు శ్రీధర్. 24 గంటల్లో జ్యోత్స్నని తీసుకురాకపోతే సుమిత్ర బతకదేమోనని అనిపిస్తోందని అనడంతో కాంచన షాక్ అవుతుంది. నువ్వు కూడా కార్తీక్‌కి సాయంగా అక్కడే ఉండాల్సిందని అంటుంది కాంచన. దీప మీద సుమిత్ర చాలా కోపంగా ఉంది. జ్యోత్స్న ఫోన్ చేసినప్పుడు దీప తిట్టింది కదా? ఆ బాధంతా దీప మీద చూపిస్తోందని చెబుతాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications