Karthika Deepam 2 April 22nd: జ్యోత్స్నకి షాకిచ్చిన వైరా... దశరథ కారు మాయం, సుమిత్ర కోసం కార్తీక్ రిస్క్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పకుండా డీల్ చేయాలని దశరథ- శివన్నారాయణ మాట్లాడుకుంటూ ఉండగా పోలీసులను వెంటబెట్టుకుని వస్తాడు దాస్. అది చూసిన శివన్నారాయణ.. పోలీసులను తీసుకుని రావడానికి నువ్వు ఎవడ్రా అంటూ సీరియస్ అవుతాడు. దీప నచ్చజెప్పాలని చూస్తుండగా నువ్వు మా ఇంట్లో ఉండొద్దంటూ మెడపట్టి గెంటేస్తుంది సుమిత్ర. కార్తీక్ ఎంత ఓదార్చినా వినిపించుకోదు. నా కూతురికి ఏదో ఒకటి జరగాలని నీ భార్య కోరుకుని ఉంటుంది.. అందుకే ఇలా అయ్యిందని నానామాటలు అంటుంది సుమిత్ర. ఆ వెంటనే శ్రీధర్ రావడంతో నీకెవరు చెప్పారని శివన్నారాయణ అడగ్గా.. దాస్ చెప్పాడని అనడంతో ఇంకా రగిలిపోతాడు పెద్దాయన.
జ్యోత్స్న కావాలని కిడ్నాప్ డ్రామా ఆడుతోందని దాస్- పారులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఈ ఆస్తికి జ్యోత్స్న ఏకైక వారసురాలు.. అది కావాలనుకుంటే ఎంతైనా ఇస్తాను, డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాల్సిన అవసరం దానికెంటీ? అంటూ మండిపడతాడు. ఇంతలో జ్యోత్స్న వీడియోను పంపిస్తాడు వైరా. ఆ వెంటనే ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చి జ్యోత్స్న గురించి ఆరా తీస్తాడు. వైరా ఫోన్ చేయడంతో దశరథ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడటంతో అతనికి అనుమానం వస్తుంది. పోలీసులకు ఎందుకు చెప్పారు? మీ అమ్మాయి మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పడంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది. దీపను తీసుకుని ఇంటికెళ్లిన శ్రీధర్.. జరిగినదంతా కాంచనకి చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 22వ తేదీ 651వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న కనిపించకుండా పోవడంతో దాస్ ఏడుస్తాడు. ఇప్పటి వరకు అది నాటకం ఆడుతుందని అనుకుంటున్నానని చెబుతాడు దాస్. 30 కోట్ల రూపాయలే కాదు.. నా ఆస్తి మొత్తం జ్యోత్స్న కోసం రాసిస్తానని చెబుతాడు దశరథ. ఎలాగైనా నా కూతురిని కాపాడమని దాస్ ఏడుస్తుండటంతో ఈ మాటలు విన్న శివన్నారాయణ షాక్ అవుతాడు. మావయ్య ఏదో బాధలో ఉండి అలా మాట్లాడుతున్నాడని చెబుతాడు కార్తీక్. పోలీసులను తీసుకొచ్చినందుకు దాస్ మావయ్య బాధపడుతున్నాడు.. అందుకే నీ కూతురిని కాపాడమని ఏడుస్తున్నాడని చెబుతాడు కార్తీక్. ఇదంతా మా ఖర్మ.. ఇలా జరగాలని రాసింది అంతే అంటాడు పెద్దాయన. నువ్వేం బాధపడకు, ఈ రాత్రి గడవనీ ఏం జరుగుతుందో చూద్దామని దాస్‌కి ధైర్యం చెబుతాడు శివన్నారాయణ.
జ్యోత్స్న కోసం దాస్ ఏడుస్తుండటంతో పారిజాతానికి అనుమానం వస్తుంది. నిజం చెప్పరా.. జ్యోత్స్న నీ కూతురే కదా? ఎందుకు అబద్ధం చెప్పావని పారు నిలదీస్తుంది. అన్నయ్య కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను. ఈ ఇంటికి మనం చాలా రుణపడి ఉన్నామని చెబుతాడు దాస్. నాకు కూడా సుమిత్ర బాధ చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెబుతుంది పారిజాతం. మరోవైపు.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జ్యోత్స్న గారి ఆచూకీ తెలియడం లేదని పోలీసులు చెబుతారు. మీరు వెతకాల్సిన అవసరం లేదని.. నేనే వెతుక్కుంటానని చెబుతుంది సుమిత్ర. ఇంతలో డబ్బులున్న బ్యాగ్ తీసుకుని శ్రీధర్ రావడంతో .. మీరు క్యాష్ ఇవ్వడానికి రెడీ అయిపోయారా? అని పోలీసులు ప్రశ్నిస్తారు.
నాకు వేరే దారి లేదు.. నా మనవరాలు కిడ్నాప్ అయి 20 గంటలు గడిచిపోయింది. తను కిడ్నాప్ అయినట్లు ఏ సీసీ కెమెరాలోనూ రికార్డ్ కాలేదని చెబుతాడు శివన్నారాయణ. కిడ్నాపర్ డబ్బులు ఎక్కడికి పంపించాలో చెప్పడానికి తప్పకుండా అడ్రస్ చెబుతారు. అక్కడికి వేరే టీమ్‌ని పంపిస్తానని చెబుతారు పోలీసులు. అప్పుడు మా అమ్మాయిని నిజంగానే చంపేస్తారని బాధపడుతుంది సుమిత్ర. ఆమె పడిపోతుండగా దీప పట్టుకోవడంతో సుమిత్ర చేయి విదిలించుకుంటుంది. నేనేం పడిపోనులే.. నిజంగా నేను చనిపోవాల్సి వస్తే అది నా కూతురిని చూసిన తర్వాతే అంటుంది సుమిత్ర. జ్యోత్స్నని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నావు.. ఎక్కడ నా కూతురు అని కార్తీక్‌పై మండిపడుతుంది.
కిడ్నాప్ చేసినవాడు పెద్ద క్రిమినల్‌లా ఉన్నాడు.. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడోనని పోలీసులు చెబుతారు. అయినప్పటికీ సుమిత్ర మాత్రం డబ్బులు పోయినా పర్లేదు.. నా కూతురు నా కళ్ల ముందుకు రావాలని చెబుతుంది. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను వేడుకుంటుంది సుమిత్ర. మరోవైపు.. మా డాడీకి కాల్ చేసి డబ్బులు అడగమని వైరాను రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఇప్పుడొద్దు రాహుకాలమని వైరా అసిస్టెంట్ చెప్పడంతో జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. వడ్డీతో సహా రాబడతానని వైరా అనడంతో .. లేట్ చేస్తే డబ్బులు రావని చెబుతుంది జ్యోత్స్న. నువ్వసలు దశరథకి సొంత కూతురివేనా? వైరా అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఆ వెంటనే దశరథకి వైరా ఫోన్ చేయడంతో నా కూతురు ఎలా ఉందని దశరథ అడుగుతాడు. పక్కన పోలీసులను పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు.. నాకు ఎవరి గొంతు వినిపించినా మీ కూతురు గొంతు కోసేస్తానని చెబుతాడు వైరా. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెబితే తీసుకొస్తానని అంటాడు దశరథ. అనవసరమైన తెలివితేటలు వాడితే మీ కూతురి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తాడు వైరా. మేం కూడా వస్తామని పోలీసులు చెప్పడంతో వద్దని ఒంటరిగా వెళ్తాడు దశరథ. నేను కూడా వస్తానని కార్తీక్ అడగ్గా.. వద్దని చెబుతాడు దశరథ. ఆ వెంటనే దాస్, పోలీసులు ఆ కారును వెంబడిస్తారు. అటు కార్తీక్‌తో కలిసి పారు కూడా కిడ్నాపర్ల దగ్గరికి బయల్దేరుతుంది.
జ్యోత్స్నని కుర్చీకి ఇంకా గట్టిగా కట్టడంతో ఆమెకు అనుమానం వస్తుంది. ఎందుకు నన్నింత గట్టిగా కట్టేస్తున్నావని వైరాని అడుగుతుంది. ఈ సీన్ పండాలంటే ఆ మాత్రం ఏర్పాట్లు చేయాలి కదా అని అంటాడు. డబ్బు ఇక్కడికే వస్తుందన్న గ్యారంటీ ఏంటీ? అని జ్యోత్స్న అడగ్గా.. ఆల్రెడీ డబ్బులు తీసుకుని మీ నాన్న బయల్దేరాడు. దానికి వేరే ప్లాన్ ఉందని అంటాడు వైరా. నేను మా డాడీతో కలిసి వేరే కారులో వెళ్లిపోతే నా వాటా డబ్బులు ఎలా తీసుకోవాలని అడుగుతుంది జ్యోత్స్న . అన్నింటికీ వేరే ప్లాన్‌లు ఉన్నాయని చెబుతాడు వైరా. నువ్వు నాకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నావని వైరా, జ్యోత్స్నలు గొడవపడతారు. భయపడాల్సింది కాస్తా బెదిరిస్తోందని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు వైరా.
జ్యోత్స్నని కాపాడటానికి పారు, కార్తీక్‌లు వెళ్తారు. కార్తీక్ డ్రైవ్ చేస్తుండగా బిస్కెట్, యాపిల్ తింటూ మనవడికి కూడా పెడుతుంది పారు. నువ్వు దీప మొగుడివి నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటుంది పారు. జ్యోత్స్నకి ఏమైనా అయితే అత్త తట్టుకోలేదు.. అత్త కోసమైనా జ్యోత్స్నని సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్లాలని చెబుతాడు కార్తీక్. ఇంతలో వైరా నుంచి దశరథకు కాల్ వస్తుంది. కారుని పక్కకి ఆపమని చెప్పి.. కారు దిగమంటాడు వైరా. కారుకు దూరంగా వెళ్లమని చెప్పగా.. ఇంతలో కారును ఎవరో తీసుకుని వెళ్లిపోతారు. దాంతో దశరథ షాక్ అవుతాడు. ఆ వెంటనే దాస్, పోలీసులు వచ్చి దశరథని కారు ఎక్కించుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications