Karthika Deepam 2 April 23rd: కార్తీక్‌ని కాల్చేసిన వైరా.. ఇంటికి చేరిన జ్యోత్స్న, భర్త కోసం దీప విలవిల

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న కనిపించకపోవడంతో దాస్ ఏడుస్తాడు. ఎలాగైనా నా కూతురిని కాపాడమని కార్తీక్‌ని దాస్ బతిమలాడుతుండటంతో శివన్నారాయణ విని షాక్ అవుతాడు. నీ సొంత కూతురు అయినట్లుగా ఎందుకంత ఏడుస్తున్నావని ప్రశ్నిస్తాడు. అన్నయ్య కూతురు నాకు కూడా బిడ్డే.. అందుకే ఏడుస్తున్నానని అంటాడు దాస్. ఈ మాటలు విన్న పారుకి కూడా దాస్ మీద అనుమానం వస్తుంది. జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా అని అడగటంతో ఈ ఇంటికి మనం చాలా రుణపడి ఉన్నామని చెబుతాడు దాస్.

కిడ్నాపర్ కాల్ కోసం దశరథ ఎదురుచూస్తుంటాడు. ఆ కిడ్నాపర్ చెప్పినట్లు డబ్బులిస్తే వాడు మరింత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడని పోలీసులు హెచ్చరిస్తారు. మా అమ్మాయి సేఫ్‌గా మా ఇంటికి వచ్చాక మీరు వాడిని ఏమైనా చేసుకోమని బతిమలాడుతుంది సుమిత్ర. ఇంతలో వైరా నుంచి దశరథకు ఫోన్ వస్తుంది. డబ్బులు తీసుకుని కారు నడుపుకుంటూ రమ్మని చెబుతాడు. దాంతో దశరథ ఒంటరిగా డబ్బులు తీసుకుని బయల్దేరతాడు. అతనిని ఫాలో చేస్తూ దాస్, పోలీసులు, కార్తీక్, పారులు వెళ్తారు. ఒకచోటికి రాగానే దశరథను కారు దిగేయమని వైరా ఫోన్ చేయగానే అతని మనుషులు కారు తీసుకుని వెళ్లిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 23వ తేదీ 652వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 652 April 23rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దశరథ కారును ఫాలో అవుతూ పోలీసులు, కార్తీక్ వస్తారు. అయితే అక్కడ కారు మాత్రమే ఉంటుంది.. కిడ్నాపర్లు కానీ, డబ్బు కానీ కనిపించవు. కిడ్నాపర్లు అడిగిన డబ్బు మీరు ఇచ్చేశారు కాబట్టి మీ అమ్మాయిని వాళ్లు ఏం చేయరు. మీరు ఇంటికి వెళ్లిపోండి.. మీ అమ్మాయిని మేం తీసుకొస్తామని చెబుతారు పోలీసులు. దాంతో దాస్, దశరథలు ఇంటికి బయల్దేరతారు. జ్యోత్స్న కోసం ఎదురుచూస్తున్న సుమిత్రకు దీప మందులు తీసుకొచ్చి ఇవ్వడంతో తనే జ్యోత్స్న అనుకుని భ్రమ పడటంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. నా కూతురి కోసం నా మనసు మతి లేకుండా తయారైంది. నా ఆరోగ్యం గురించి నీకెందుకు, నాకు దూరంగా ఉండమని దీపపై మండిపడుతుంది సుమిత్ర. నా కూతురిని చూసేవరకు నేను మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటుంది. జ్యోత్స్న నీకు బలహీనత అయిపోయింది.. తను నీ కూతురు కాదని తెలిస్తే నువ్వు బతకవని అర్ధమైందని అనుకుంటుంది దీప.

దశరథ కారులోంచి వైరా మనిషి డబ్బు తీసుకుని వస్తాడు. అది చూసి వైరా, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇప్పటికైనా నమ్ముతావా? నేనంటే మా మమ్మీకి ఎంతో ఇష్టమో చూశావా? అని అంటుంది జ్యోత్స్న. నాకు రావాల్సిన పది కోట్లు వేరే బ్యాగ్‌లో పెట్టి.. నన్ను మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేయ్, ఇంటికి ఎలా వెళ్లాలో అక్కడ ఏం చేయాలో నేను చూసుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. దాంతో వైరా అతని మనుషులు నవ్వుకుంటారు. నేను నిన్ను మోసం చేశాను, దీనినే మన భాషలో వెన్నుపోటు అంటారని అంటాడు వైరా. నా డబ్బు నాకు ఇవ్వకపోతే నిన్ను వదిలిపెట్టనని అంటుంది జ్యోత్స్న. నేను నిన్ను వదిలిపెట్టను కదా అంటాడు వైరా. జ్యోత్స్నను మోసం చేస్తే జీవితంలో ఘోరంగా దెబ్బతింటావని వార్నింగ్ ఇస్తుంది.

ఇప్పటికే ఘోరంగా దెబ్బతిన్నాను కాబట్టే.. 20 కోట్లతో పాటు బోనస్‌గా ఇంకో 10 కోట్లు కూడా తీసుకున్నానని అంటాడు వైరా. నీ పది కోట్లు నేను తీసుకున్నాను కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నానని చెబుతాడు. తన మనుషుల చేత మాస్క్‌లు వేయించి ఎవరికి దొరకకూడదని చెబుతాడు. ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని ఇంత మోసం చేస్తావా అని జ్యోత్స్న నిలదీస్తుంది. నువ్వు ఆడపిల్లవి కావు.. ఖిలాడీ పిల్లవి. నీలాంటి దానిని మోసమే చేయాలి, జైళ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఇలాగే మండిందని అంటాడు వైరా. తాళ్లతో కట్టేసిన ఆడపులిని కాపాడటానికి ఏ హీరో రాడని అంటాడు వైరా.

అతని మనుషులు తలుపు తీస్తుండగా ఎవరో కొట్టడంతో అక్కడ టోపీ పెట్టుకుని పారిజాతం కనిపిస్తుంది. అది చూసి జ్యోత్స్న సంబరపడిపోతుంది. పాప కోసం వాళ్ల నానమ్మ వచ్చింది. ఒక్కటి పీకి పక్కన పడేయమని ఆర్డర్ వేస్తాడు వైరా. పారును కొట్టబోతుండగా కార్తీక్ అడ్డొచ్చి వైరా మనుషుల్ని చితకబాదుతాడు. ఆ వెంటనే జ్యోత్స్న కట్లు విప్పుతుంది పారు. డబ్బును మిస్ కానివ్వకూడదని అనుకుంటుంది జ్యోత్స్న. వైరాని గుర్తుపట్టిన కార్తీక్.. ఈసారి నీకు కోటప్పకొండ తిరునాళ్లే అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. డబ్బులున్న బ్యాగ్‌ని వైరా తీసుకెళ్తుండగా జ్యోత్స్న తలపై లాగిపెట్టి కొడుతుంది. నిన్ను చంపినా తప్పులేదని జ్యోత్స్న అంటుండగా.. ఆ పని నేనే చేస్తానని జ్యోత్స్న మీద వైరా కాల్పులు జరపగా కార్తీక్ అడ్డొస్తాడు.

వాడు అడిగిన డబ్బులు ఇచ్చినప్పుడు వాడు జ్యోత్స్నని ఏం చేయడని సుమిత్రని దశరథ ఓదారుస్తుంటాడు. మీరు ఏ నమ్మకంతో జ్యోత్స్న ఇంటికి వస్తుందని చెబుతున్నారని ప్రశ్నిస్తుంది సుమిత్ర. కార్తీక్, పారులు కనిపించకపోవడంతో ఎక్కడ అని దాస్ అడుగుతాడు. పోలీసుల మాదిరిగానే వీళ్లిద్దరూ కూడా ఫాలో అవుతున్నారని దశరథ అనుమానిస్తాడు. ఎవరూ ఈ విషయంలో కలగజేసుకోవద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. చివరికి నేను భయపడినట్లుగానే జరిగింది. మీ వెంట పోలీసులు రావడం, కిడ్నాపర్ గమనించే ఉంటాడు. అందుకే మిమ్మల్ని కారు దిగమని వాళ్లు తీసుకుని వెళ్లిపోయారని మండిపడుతుంది సుమిత్ర.

మీరెవ్వరూ వద్దు.. నేనే వెళ్లి నా కూతురిని తెచ్చుకుంటానని సుమిత్ర వెళ్తుండగా జ్యోత్స్న లోపలికి వస్తుంది. దాంతో అందరూ సంతోషిస్తారు. నువ్వు ఎలా వచ్చావు? నిన్ను ఎవరు తీసుకొచ్చారని సుమిత్ర అడగ్గా.. జ్యోత్స్న చేతులకు రక్తం ఉండటంతో షాక్ అవుతారు. బావని గన్‌తో షూట్ చేశారని చెబుతుంది జ్యోత్స్న. మా బావ ఎక్కడున్నాడు? ఇప్పుడు తను ఎలా ఉన్నాడని దీప అడుగుతుండగా కార్తీక్ వస్తాడు. భర్త చేతికి కట్టు ఉండటంతో దీప వణికిపోతుంది. ఏం జరిగిందని శివన్నారాయణ అడగ్గా.. వైరా కాల్పులు జరపడం , దానికి కార్తీక్ అడ్డురావడం, వైరా తప్పించుకుని పారిపోవడం గురించి చెబుతాడు కార్తీక్. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి కిడ్నాపర్ తప్పించుకున్నాడని చెబుతారు.

బావే నా ప్రాణాలు కాపాడాడు. తను అడ్డురాకపోతే బావకి తగిలిన బుల్లెట్ నాకు తగిలేదని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీ అదృష్టం బాగుండి బుల్లెట్ ఓ రెండు అంగుళాలు పక్కకి వెళ్లింది. లేదంటే కార్తీక్ ప్రాణాలతో ఉండేవాడు కాదని పోలీసులు చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. వీళ్లు రావడం వల్ల ఆ కిడ్నాపర్ తప్పించుకున్నాడు.. లేదంటే ఆ కిడ్నాపర్‌ని మేం పట్టుకునే వాళ్లమని చెబుతారు పోలీసులు. అసలు నువ్వేందుకు వెళ్లావని కార్తీక్‌పై శివన్నారాయణ మండిపడతాడు. నువ్వు వెళ్లడం వల్ల నా మనవరాలి ప్రాణాలు రిస్క్‌లో పడ్డాయని అంటాడు. వాడు డబ్బు కోసం కిడ్నాప్ చేశాడు. డబ్బులిస్తే అంతటితో అయిపోయేదని అంటాడు దశరథ. కిడ్నాప్ చేసింది డబ్బు కోసం కాదు.. పగతో అని కార్తీక్ చెబుతాడు. మనం కేసు పెట్టి జైలుకు పంపించిన వైరానే ఇదంతా చేశాడని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో శివన్నారాయణ కోపంతో గన్ తీసుకుని వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X