Karthika Deepam 2 April 24th: శివన్నారాయణ డబ్బు కాపాడిన కార్తీక్..షాక్‌లో వైరా, కార్తీక్‌తో జ్యోత్స్న రొమాన్స్
Photo Courtesy: JioHotstar
కిడ్నాపర్లు ఎత్తుకెళ్తిన దశరథ కారును ఫాలో అవుతూ పోలీసులు, కార్తీక్ వెంబడిస్తారు. కానీ అక్కడ కారు మాత్రమే ఉంటుంది డబ్బు కనిపించదు. దాస్- దశరథలు ఇంటికి వెళ్లిపోగా.. పారు, కార్తీక్‌లు మాత్రం డబ్బును వెతుకుతూ వెళ్తారు. సుమిత్రకు దీప మందులు తీసుకొచ్చి ఇవ్వగా.. జ్యోత్స్న వచ్చింది అనుకుని మురిసిపోతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి ప్రశ్నించడంతో వచ్చింది దీప అని తెలుసుకుని ఆమెపై రంకెలు వేస్తుంది. నా కూతురి గురించి ఆలోచించి మతి తప్పేలా ఉందని అంటుంది సుమిత్ర.
పోలీసులకు మస్కా కొట్టి డబ్బు తీసుకుని వస్తారు వైరా మనుషులు. సూట్‌కేస్ చూడగానే నా వాటా కూడా ఇవ్వమని అడుగుతుంది జ్యోత్స్న. నేను నిన్ను మోసం చేస్తున్నా.. తప్పలేదని చెబుతాడు వైరా. నాలాంటి ఆడపిల్లను మోసం చేస్తే నీకు పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంతలో పారు, కార్తీక్‌లు ఎంట్రీ ఇస్తారు. బావని చూడగానే ధైర్యం తెచ్చుకున్న జ్యోత్స్న.. వైరాని వెనుక నుంచి లాగిపెట్టి కొడుతుంది. దాంతో రగిలిపోయిన వైరా.. ఆమెను కాల్చబోతుండగా కార్తీక్ అడ్డురావడంతో భుజానికి బుల్లెట్ తగులుతుంది. జ్యోత్స్న ఇంటికి రావడంతో సుమిత్ర సహా శివన్నారాయణ కుటుంబం సంతోషిస్తుంది. ఇంతలో కార్తీక్ భుజం మీద గాయంతో రావడంతో అక్కడ జరిగినదంతా చెబుతుంది జ్యోత్స్న. కిడ్నాప్ చేసింది వైరా అని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ కోపంతో ఊగిపోతూ గన్ తీసుకుని వస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 24వ తేదీ 653వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
వైరాని చంపడానికి ఆవేశంగా వెళ్తున్న శివన్నారాయణని కుటుంబ సభ్యులు ఆపుతారు. గాయానికి గాయమే సమాధానమన్న యుద్ధనీతి, ధర్మం. నేను ఇంత వరకు ఎవరి జీవితాలు నాశనం చేయలేదు. కానీ నా కుటుంబం జోలికి వస్తే నేను ఏం చేయగలనో వాడికి తెలియాలని ఆవేశంగా వెళ్తుండగా కార్తీక్ ఆపుతాడు. నువ్వు వెళ్తగనే చంపడి శివన్నారాయణ గారు అని నీ ఎదురుగా వస్తాడా? ఆకలితో ఉన్న సింహం కంటే పగతో ఉన్న పాము చాలా ప్రమాదకరం. వైరాని చట్టప్రకారమే శిక్షించాలని చెబుతాడు కార్తీక్.
వైరా గాడు ఒకప్పుడు నా ఫ్రెండ్. ఆ తర్వాత నా శత్రువు. మా రెస్టారెంట్స్ దివాళా తీయించాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత మేం జైలుకి పంపించాము.. ఇప్పుడు ఆ పగతోనే నా కూతురిని కిడ్నాప్ చేశాడని పోలీసులకు చెబుతాడు దశరథ. మీరు మాత్రం తొందరపడి ఏం చేయకండి.. వాడిని పట్టుకునే బాధ్యత మాది అని చెబుతారు పోలీసులు. కార్తీక్ - దీప ఎక్కడికి వెళ్లారని పారుకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. బుల్లెట్‌కి ఎదురెళ్లి మరి జ్యోత్స్నని కాపాడాడని పారు చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. జ్యోత్స్నని కాపాడబోతే కార్తీక్ చేతికి బుల్లెట్ తగిలిందని చెబుతుంది పారు. దాంతో వెంటనే శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. నాకు ఈరోజు మూడింది.. ఈ గండం ఎలా గడుస్తుందోనని అనుకుంటుంది పారు.
మీ అమ్మకి నేను ఏమని సమాధానం చెప్పాలని కార్తీక్‌ని అడుగుతుంది సుమిత్ర. నా కూతురైతే ఒకటి నువ్వయితే ఒకటా? మీ ఇద్దరిలో ఎవరికేం జరిగినా నాకు బాధే కదా. కాంచన వదిన అలా అనుకోదని అంటుంది సుమిత్ర. ఇంతలో శ్రీధర్ వచ్చి నీకు బుల్లెట్ తగిలిందని అత్తయ్య గారు చెప్పారని అనడంతో .. బుల్లెట్ తగలడానికి కారణం కూడా నేనే అని మీ అత్తయ్య గారు చెప్పారా? అని అడుగుతాడు శివన్నారాయణ. ఈవిడగారికి జ్యోత్స్న అంటే ఎంతో ప్రేమ కదా.. దాంతో పోలీసులు రావొద్దని చెబుతున్నా వినిపించుకోకుండా కార్తీక్ గాడిని తీసుకుని వెనకే వెళ్లింది. దశరథ మాత్రమే వెళ్లుంటే సరిపోయేది, పోనీ పోలీసులకే వదిలేసుంటే డబ్బు , అమ్మాయి రెండూ క్షేమంగా ఇంటికొచ్చేవి. మీరు ఇన్వాల్వ్ అయ్యారు డబ్బు పోయిందని అంటాడు శివన్నారాయణ.
డబ్బు పోతే పోయింది.. కానీ వాడు జ్యోత్స్నని చంపాలని అనుకున్నాడు.. కాపాడబోతుంటే ఆ బుల్లెట్ కార్తీక్‌కి తగిలిందని చెబుతాడు శివన్నారాయణ. వైరా గాడు సూట్‌కేసు తీసుకుని పారిపోయాడు. నా ఫ్యామిలీ కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడాలని ప్రయత్నించా.. కానీ ఆ వైరా గాడు చంపాలని ప్రయత్నించాడు. ఈపాటికి ఆ బ్యాగ్‌లో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకునే ఉంటాడని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. ఇంతలో బ్యాగ్ చూసుకుంటూ మురిసిపోతాడు వైరా. పోలీసులకు, కార్తీక్‌కి దొరక్కుండా.. ఆ జ్యోత్స్నకి వాటా ఇవ్వకుండా 30 కోట్లు కొట్టేశానని అంటాడు వైరా. ఇంతలో వాడి అసిస్టెంట్ పెద్ద బిల్లు వాడికి ఇచ్చి.. నాకు సెటిల్ చేయమంటూ గోల చేస్తాడు. వాళ్లు బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో ఇటుకలు కనిపించడంతో వైరా, వాడి అసిస్టెంట్ షాక్ అవుతారు.
కార్తీక్ ఎంట్రీ ఇచ్చినప్పుడే నీ సీటు చినిగిపోతుందని అనుకున్నా.. వాడు అంత తేలిగ్గా వదిలేసే రకం కాదని అంటాడు వైరా అసిస్టెంట్. జ్యోత్స్నని మాత్రం వదిలిపెట్టనని చెబుతాడు వైరా. అసలు ఆ డబ్బు ఎలా మిస్ అయ్యిందని వైరా అనుకుంటూ ఉండగా.. కార్తీక్ గాడే కొట్టేసి ఉంటాడని చెబుతాడు అసిస్టెంట్. ఆ డబ్బు ఏమైందని జ్యోత్స్న అడగ్గా.. డబ్బు మూటని తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది పారు. అది చూసి శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. నన్ను, ఆ వైరా గాడిని నువ్వు ఫూల్స్‌ని చేశావని జ్యోత్స్న అనుకుంటుంది. కిడ్నాపర్ వైరా అని తెలుసుంటే కథ వేరుగా ఉండేది.. కానీ వాడు చివరి వరకు తెలియకుండా మెయింటైన్ చేశాడు. వాడి ముఖం నువ్వు చూశావు కదా? నువ్వు వీడియో కాల్ మాట్లాడినప్పుడు వాడి పేరు చెప్పుంటే ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేసేవాళ్లమని అంటాడు కార్తీక్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
చెబుతానంటే చంపేస్తానని బెదిరించాడని జ్యోత్స్న కవర్ చేస్తుంది. డబ్బు కోసం ఇంత రిస్క్ చేయడం అవసరమా అని శివన్నారాయణ అడగ్గా.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, దీంట్లో ఒక్క రూపాయి పడినా బాధపడతానని అంటుంది శివన్నారాయణ. వైరా నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేశాడని కార్తీక్ అడగ్గా.. బావ కథ మొత్తం బయటకు లాగేలా ఉన్నాడని అనుకుంటుంది జ్యోత్స్న. వెంటనే జరిగింది ఒక పీడకలగా మరిచిపోదాం, నీ ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ కార్తీక్‌ని హత్తుకుంటుంది జ్యోత్స్న. అది చూసి అందరూ షాక్ అవుతారు. నా కృతజ్ఞతని ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పాలో అర్ధం కాలేదని దీపని చూస్తూ అంటుంది జ్యోత్స్న.
రాతని ఎవరూ తప్పించలేరు.. కొన్ని ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతాయని సెటైర్లు వేస్తుంది దీప. కార్తీక్, దీపలని తీసుకుని శ్రీధర్ ఇంటికి బయల్దేరతాడు. దాని కోసం నువ్వు ప్రాణాలు పొగొట్టుకుంటావా అంటూ కార్తీక్‌పై కాంచన సీరియస్ అవుతుంది. జ్యోత్స్న కోసం నిన్ను ఎవరు వెళ్లమన్నారు.. దానిని అదుపులో పెట్టుకోవడం మా అన్నయ్యకి తెలియడం లేదని మండిపడుతుంది. ఎలా బతకాల్సిన కొడుకు ఎలా బతుకుతున్నాడు.. ఆ జ్యోత్స్న మీ జీవితాల్లో సంతోషం లేకుండా చేయాలని చూస్తోంది. నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావని సీరియస్ అవుతుంది కాంచన. మన ఫ్యామిలీ కోసం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారని అంటాడు కార్తీక్.
శ్రీధర్‌కి ఒళ్లంతా చెమటలు పట్టడంతో అంతా కంగారుపడతారు. దెబ్బ నాకు తగిలితే, నొప్పి నీకు వస్తుందేంటీ అని అడుగుతాడు కార్తీక్. నీ కూతురికి ఏమైనా జరిగితే నువ్వు తట్టుకోగలవా? నేను కూడా నీలాంటి తండ్రినే. నా కొడుకు చేసే ప్రయాణంలో ప్రమాదాలు ఎదురైన ప్రతిసారి మా గుండె వేగంగానే కొట్టుకుంటుందని. పారిజాతం అత్తయ్య ఫోన్ చేసి నీకు బుల్లెట్ తగిలిందని చెప్పగానే.. నిన్ను చూసేవరకు ఏం జరిగిందో నాకు అర్ధం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల ముఖాల మీద నవ్వులు చూడాలని అనుకుంటాం కానీ, గాయాలు చూడలేం. మరోసారి ఇలాంటి తొందరపాటు పనులు చేయొద్దని మాట తీసుకుంటాడు శ్రీధర్. ఇదంతా చూసి కాంచన కూడా ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications