Karthika Deepam 2 April 25th: జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా తెలుసుకున్న కార్తీక్... పారుకి శివన్నారాయణ గిఫ్ట్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వైరాని చంపేస్తానంటూ గన్ తీసుకుని బయల్దేరుతున్న శివన్నారాయణని ఆపేస్తాడు కార్తీక్. వాడిని హత్య చేసి నువ్వు హంతకుడు కావొద్దని బతిమలాడతాడు. వైరా సంగతి మేం చూసుకుంటామని పోలీసులు చెప్పడంతో శివన్నారాయణ శాంతిస్తాడు. కార్తీక్‌కి బుల్లెట్ తగిలిందని పారిజాతం చెప్పడంతో శ్రీధర్ పరుగు పరుగున శివన్నారాయణ ఇంటికి వస్తాడు. కొడుకు చేతికి కట్టుని చూడగానే శ్రీధర్ తల్లడిల్లిపోతాడు. అసలు నీ వల్లే కార్తీక్ రిస్క్ చేశాడని పారిజాతంపై మండిపడతాడు శివన్నారాయణ. దశరథ వెళ్లుంటే సేఫ్‌గా అమ్మాయిని తీసుకొచ్చేవాడు.. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యుంటే డబ్బు, అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేవని అంటాడు.
నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని కాపాడాలని ఎంతో ప్రయత్నించాను.. అందుకే ఆ వైరా గాడు నన్ను చంపాలని అనుకున్నాడని చెబుతుంది జ్యోత్స్న. ఆ డబ్బు ఎక్కడికి పోలేదని నేను, పారు కలిసి వైరా గాడికి మస్కా కొట్టామని డబ్బు మూటని చూపిస్తాడు కార్తీక్. తన ప్రాణాలను కాపాడినందుకు కార్తీక్‌ని అందరి ముందు హత్తుకుంటుంది జ్యోత్స్న. అది చూసి దీప రగిలిపోతుంది. కార్తీక్, దీపలని తీసుకుని ఇంటికొస్తాడు శ్రీధర్. కొడుకు చేతికి గాయం చూడగానే కాంచన కంటతడి పెడుతుంది. ఆ జ్యోత్స్న కోసం నీ ప్రాణాలెందుకు రిస్క్‌లో పెట్టాలని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 25వ తేదీ 654వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
స్వప్న పెళ్లి గురించి ఏం ఆలోచించారు అని శ్రీధర్‌ని అడుగుతుంది కావేరి. అది తన ఇష్టమని అంటాడు శ్రీధర్. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది కావేరి. ఇంతలో వసంత్ వచ్చి స్వప్నని పిలుస్తాడు. ఎల్లుండి చాలా మంచిరోజు.. మనం లేట్ చేయకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రిగారు చెప్పారని అంటాడు వసంత్. మేం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. అప్పుడే ఎంగేజ్‌మెంట్ ఏంటీ అని అడుగుతుంది కావేరి. స్వప్నకి, నాకు ఇష్టమైనప్పుడు మధ్యలో మీ నిర్ణయంతో నాకు పనేముందని అంటాడు వసంత్. తను నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం కావాలని అంటుంది కావేరి. నీకు ఆలోచించుకోవడానికి టైం కావాలా అని వసంత్ అడుగుతాడు.
నాకు ఈ పెళ్లి ఇష్టమేనని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరిలు షాక్ అవుతారు. రెండ్రోజుల్లో ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేస్తానని.. నేను వెళ్లి మా అమ్మనాన్నలతో ఈ విషయం చెబుతానని అంటాడు వసంత్. స్వప్న నిర్ణయంతో కావేరి మండిపడుతుంది. ఒక్కసారి నీ మెడలో మూడు ముళ్లు పడ్డాయంటే నిర్ణయం మార్చుకోలేవని హెచ్చరిస్తుంది. మొదటిసారి పెళ్లి చేసుకునే ముందే నువ్వు ఈ మాట చెప్పుంటే చాలా బాగుండేది. నాన్న డ్రింక్ చేస్తారని ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, తాగాలని ఆలోచన మొదలైనప్పుడు అది సరదా.
ఒక వయసు తర్వాత ఈ సరదాలు అలవాట్లుగా మారతాయి. అప్పుడే చేసేది తప్పని తెలిసినా వదులుకోలేం. నా రెండో పెళ్లిలో నా ఇష్టం కంటే బాధ్యతే ఎక్కువగా ఉంది.. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని శ్రీధర్‌కి చెబుతుంది స్వప్న. ఈ మాటలతో అంతా షాక్ అవుతారు. నా కూతురి ఇష్టమే నా ఇష్టమని చెబుతాడు శ్రీధర్. స్వప్న పెళ్లి చేసుకుంటే చేసుకోని.. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోమని చెబుతుంది కావేరి. కానీ స్వప్న మాత్రం ఎప్పటికీ నా భార్యగానే ఉంటుందని చెప్పి వెళ్లిపోతాడు కాశీ.
దాస్ బాధపడుతూ ఉండటంతో జ్యోత్స్న చూసి నవ్వుకుంటుంది. నీకు ఏడుపు కూడా వస్తుందా? నేను చావనందుకా? లేకపోతే నీ మేనల్లుడికి బుల్లెట్ తగిలినందుకా? అని జ్యోత్స్న నానామాటలు అంటుంది. తండ్రి బాధ కూతురికి తెలియాలంటే తను తల్లి అవ్వాలి అప్పుడే పిల్లల గురించి అమ్మానాన్న ఎలా బాధపడతారో తెలుస్తుందని అంటాడు దాస్. నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని తెలియగానే నేనెంత బాధపడ్డానో తెలుసా అని అంటాడు దాస్. బావ చేతికి తగలాల్సిన బుల్లెట్ నాకు తగిలుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేదానిని అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే నీలాంటి తండ్రికి కూతురిని అయినందుకు, నువ్వు ఒక అసమర్ధుడివి, పిల్లల ఇష్టాల కోసం ఏం చేయలేని ఒక చేతకాని తండ్రివి. కూతురు ఏడుస్తుంటే ఆనందపడే సైకో తండ్రివి అంటుంది.
నువ్వు సుమిత్ర కూతురివి కాదని నువ్వే నీ అమ్మతో చెప్పేసేయమని అంటాడు దాస్. నా దగ్గరకి వస్తే ఏం చేస్తానో చూడు చెబుతుంది. నేను చచ్చుంటే మా అమ్మ ఆ మాట వినగానే పైకి పోయేది. ఆ బాధ కూడా నేనే అనుభవిస్తున్నానని అంటుంది. నువ్వు కనిపించకుండా పోయావని తెలియగానే అని దాస్ అంటుండగా.. చచ్చిపోవాలని అనిపించిందా అని అంటుంది జ్యోత్స్న. నువ్వు అంత తేలిగా చావవు, నువ్వు చాలా చూడాలి. ఈ ఆస్తికి వారసురాలిని అవ్వడం, బావ నా మెడలో తాళి కట్టడం నువ్వు చూడాలి అంటుంది జ్యోత్స్న. నా చావు కూడా నన్ను మార్చలేదని చెబుతుంది జ్యోత్స్న.
స్వార్ధంతో కూరుకుపోయిన దీప లాంటి వాళ్లు, నమ్మించి మోసం చేసే బావ లాంటి వాళ్లు కళ్లముందే కూతురు దూరమైపోతున్నా.. చచ్చిపోయిందని నీ కన్నతల్లి అబద్ధం చెప్పినా అలాగే ఉండిపోయిన నువ్వు కూడా తండ్రిలా ఫీల్ అవుతున్నావంటే సిగ్గు చేటని అంటుంది జ్యోత్స్న. నీ మంచి కోసమే చెబుతున్నాను.. పెళ్లి చేసుకో, హ్యాపీగా కాపురం చేసుకోమని చెబుతాడు దాస్. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి.. నీ మాటలు విని తథాస్తు దేవతలు తథాస్తు అనే ఉంటారని చెబుతుంది జ్యోత్స్న. నీ నాటకాలు నాకు తెలుసు.. కానీ నేను మాత్రం మారను. ఏదైతే చేస్తానని మీరు భయపడుతున్నారో అదే చేస్తానని అనుకుంటుంది జ్యోత్స్న.
నీకు బుల్లెట్ తగిలిందని తెలిసినప్పటి నుంచి లోలోపల ఏడుస్తున్నానని కార్తీక్‌పై మండిపడుతుంది దీప. అందరికీ చెప్పినట్లు నాకు చెప్పొద్దు.. ఇది నువ్వు ఇచ్చిన బ్రతుకు. నీకు ఏమైనా అయితే మేమంతా అనాథలమైపోతాం. మా కోసం ఆలోచించాలి కదా అని అంటుంది. అది నాతో ఛాలెంజ్ చేయడం, అత్తమ్మకి కల రావడం, కనిపించకుండా పోవడం, నీకు గాయం అవ్వడం ఇదంతా చూస్తుంటే ఊహించని ప్రమాదమేదో భవిష్యత్తులో జరగబోతోందని అనిపిస్తుందని అంటుంది దీప. ఆ జ్యోత్స్నని నమ్మడానికి వీల్లేదు.. మా అమ్మను అడ్డుపెట్టుకుని తనకి నచ్చినట్లుగా ఆడుకుంటోందని అంటుంది. ఇంతలో వైరా కాల్ చేస్తాడు.
నీ కారణంగా రెండు సార్లు మోసపోయానని చెబుతాడు వైరా. నేను దొంగనే ఒప్పుకుంటాను.. కానీ నీ మరదలు చాలా పెద్ద దొంగ అంటాడు వైరా. కాళ్ల దగ్గర వరకు వచ్చిన డబ్బులు చేతి వరకు వచ్చేసరికి నోరు అదుపు తప్పుతుందా అని మండిపడతాడు కార్తీక్. నేను పోలీసులకు దొరికితే నీ మరదలు కూడా కోర్ట్‌కి రావాల్సి ఉంటుందని అంటాడు వైరా. ఈ కిడ్నాపే పెద్ద డ్రామా.. అదంతా జ్యోత్స్న ప్లాన్ అని వైరా చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నాకు జరిగిన అన్యాయానికి నీ మరదల్ని కిడ్నాప్ చేసి ఓ 20 కోట్లు వసూలు చేద్దామని అనుకున్నాను.. కానీ నీ మరదలు చాలాపెద్ద ఖిలాడి. తనని ఒకసారి నేల మట్టం అయిపోయాను, అయినా మళ్లీ నమ్మాను.
మా వాళ్లు ఎంత అడిగినా ఇస్తారు.. నువ్వు 30 కోట్లు అడిగితే.. నీకు 20 కోట్లు, నాకు 10 కోట్లని బేరం ఆడిందని చెబుతాడు. ఎలా ఫోన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలనే స్కెచ్ మొత్తం నీ మరదలిదేనని చెబుతాడు వైరా. కానీ చేతికి డబ్బు రాగానే మొత్తం కొట్టేయాలని చూసింది.. చివరికి నన్నే లేపేయాలని చూసిందని చెబుతాడు. ఆ కోపంతోనే జ్యోత్స్నని షూట్ చేశా.. నువ్వు అడ్డుపడకపోతే నీ మరదలి ఫోటోకి దండ పడేది. నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్.. అసలు అది నీ ఫ్యామిలీనే కాదు. ముందు దానిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి. అది నీ ఇంటి దొంగ.. నా లాంటి కంత్రీనే రెండుసార్లు బోల్తా కొట్టించిందని చెబుతాడు వైరా. జ్యోత్స్నని నేను కిడ్నాప్ చేయలేదు.. అదే నన్ను కిడ్నాప్ చేసిందని చెబుతాడు వైరా. రివెంజ్ తీర్చుకోవడానికి మళ్లీ వస్తానని చెబుతాడు. నిజం తెలిశాక దానిని ఏం చేయకుండా వదిలేది లేదని.. జ్యోత్స్న పాపాల చిట్టా నిండిపోయింది. మేడం గారి లెక్కలన్నీ సరిచేయాల్సిందేనని దీపతో చెబుతాడు కార్తీక్.
పారిజాతాన్ని పిలిచిన శివన్నారాయణ నీకు పారితోషికం ఇస్తానని అంటాడు. ఆ మాటలతో పారు సంతోషిస్తుంది. మీరు ఇవ్వాలని అనుకుంటున్న ఆ పారితోషికం ఇవ్వమని చెబుతుంది పారు. దాంతో వెంటనే నోట్ల కట్ట తీసి పారు చేతిలో పెడతాడు శివన్నారాయణ. 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా వందసార్లు ఆలోచిస్తారు అడగకుండానే 50 వేలు ఇచ్చారని సంతోషిస్తుంది. నువ్వు, కార్తీక్ కలిసి ఈరోజు పెద్ద సాహసం చేశారు. వాడి చేతికి గాయం తగిలిందన్న బాధ తప్పించి.. మిగతాది బాగానే జరిగింది, జ్యోత్స్న సేఫ్‌గా ఇంటికొచ్చిందని అంటాడు పారు. ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయమని అడుగుతుంది పారు. అదంతా వాడి చేతిలోనే ఉందని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications