Karthika Deepam 2 April 27th: జ్యోత్స్న అడ్డు తప్పించేలా కార్తీక్ స్కెచ్... కార్తీక్, దీపలపై కాంచన అనుమానం
Photo Courtesy: JioHotstar
స్వప్న పెళ్లి గురించి ఏం ఆలోచించారని శ్రీధర్‌ని అడుగుతుంది కావేరి. ఇంతలో వసంత్ వచ్చి స్వప్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనని రెండ్రోజుల్లో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటానని అంటాడు. స్వప్న తనకు ఇష్టమేనని చెప్పడంతో కావేరి, కాశీలు షాక్ అవుతారు. జ్యోత్స్న కిడ్నాప్ అయి క్షేమంగా ఇంటికి రావడంతో దాస్ బాధపడుతూ ఉంటాడు. నేను చస్తే బాగుండేదని నువ్వు అనుకుని ఉంటావని తండ్రిని నానామాటలు అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని దాస్ చెప్పగా.. నేను ఈ ఇంటికి వారసురాలిగా, బావకి భార్యను కావడం నువ్వే చూస్తావని అంటుంది. ఈ మాటలతో దాస్ బాధపడుతూ వెళ్లిపోతాడు.
అసలు జ్యోత్స్నని కాపాడటానికి ఎందుకు వెళ్లావని కార్తీక్‌తో గొడవ పడుతుంది దీప. ఇంతలో కార్తీక్‌కి వైరా ఫోన్ చేసి.. అసలు కిడ్నాప్ డ్రామా అంతా జ్యోత్స్నదే. ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? అన్ని తనే గైడ్ చేసింది.. జ్యోత్స్నతో జాగ్రత్త అని వైరా చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. జ్యోత్స్నని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు పారిజాతానికి 50 వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 27వ తేదీ 655వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే డ్యూటీకి వెళ్తానని కార్తీక్ చెప్పడంతో కాంచన మండిపడుతుంది. చేతికి అంతపెద్ద గాయమైనా సరే డ్యూటీకి వెళ్తానని అనడంతో కాంచన క్లాస్ తీసుకుంటుంది. నువ్వు ఆ ఇంటికి అల్లుడివి కాదు.. డ్రైవర్‌వి. కూర్చోబెట్టి మర్యాదలు చేయరు.. నువ్వు కారు డ్రైవ్ చేయాలి లేదంటే అక్కడికి వెళ్లడం ఎందుకు అని మండిపడుతుంది. నేను చూసుకుంటానని దీప చెప్పగా.. నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివి, నీకే మరొకరు సేవలు చేయాలి. నువ్వు నా కొడుకుని ఏం చూసుకుంటావని ఫైర్ అవుతుంది. మీరు దాచే నిజాలు .. మీ నిర్ణయాలు లాంటివి, అవి జరిగిన తర్వాతే మాకు తెలుస్తున్నాయని అంటుంది. జ్యోత్స్న కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కదా? పోలీసులు వస్తే నేను అందుబాటులో ఉండాలని చెబుతాడు కార్తీక్. పోలీసులు ఇక్కడికి వస్తారు. అవసరమైతే ఫోన్లు ఉన్నాయని చెబుతుంది కాంచన. ఎంత చెప్పినా కార్తీక్ వినిపించుకోకపోవడంతో కాంచన బాధపడుతుంది. వీళ్లిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారని కాంచనకు అనుమానం వస్తుంది.
ఉదయాన్నే కార్తీక్‌ని బైక్‌పై ఎక్కించుకుని దీప రావడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. ఆమెను చూడగానే ఫోనులో వైరా చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి కార్తీక్‌కి. బావకి బుల్లెట్ తగిలింది కదా? డ్యూటీకి రారు అని అనుకున్నాను అంటుంది జ్యోత్స్న. నీ కోసం నేను ఎక్కడికి వరకైనా వస్తానని చెబుతుంది. బావ తన ప్రాణాలు లెక్కచేయకుండా నన్ను కాపాడాడు. నువ్వంటే మా బావకి ప్రాణం.. కానీ నా కోసం కూడా బావ ప్రాణాలు ఇవ్వడానికి కూడా లెక్కచేయలేదు అంటుంది. నిన్ను క్షేమంగా తీసుకొస్తానని అత్తకి మాటిచ్చాను.. బుల్లెట్ నాకు తగిలింది కాబట్టి అత్త బాధపడలేదు. అదే బుల్లెట్ నీకు తగిలుంటే మా అత్త హాస్పిటల్‌లో ఉండేదని అంటాడు కార్తీక్.
మా మమ్మీకి నేనంటే అంత ప్రేమ అని జ్యోత్స్న అనగా.. నీకు మాత్రం ఒక్క శాతం ప్రేమ కూడా మా అత్త మీద లేదని ఫైర్ అవుతాడు కార్తీక్. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే వైరా గాడితో చేతులు కలిపేదానివే కాదని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకు ఎక్కడ ఏమవుతుందోనని మేమంతా బాధపడుతుంటే.. నువ్వు మాత్రం నచ్చినవి తింటూ, నీకొచ్చే వాటా కోసం కలలు కన్నావని ఫైర్ అవుతాడు కార్తీక్. నువ్వు అసలు మనిషివేనా? నా కన్నవాళ్లు నీ కన్నవాళ్లు కాకపోవచ్చు.. కానీ పెంచిన ప్రేమైనా ఉండాలి కదా అని జ్యోత్స్నపై మండిపడుతుంది దీప. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చానన్న కృతజ్ఞత .. నువ్వు చూపించావా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది.
మీరు పాటించే మానవతా విలువలు నాకు వర్తించవు.. నేను నా స్వార్ధం కోసమే బతుకుతాను, నా కోసమే బతుకుతాను అంటుంది జ్యోత్స్న. ఈ విషయం మా అమ్మతో చెబితే అని దీప అనగా.. నువ్వు ఆ మాట చెప్పగానే నా కూతురి మీద లేనిపోని నిందలు వేస్తావా అని మెడపట్టుకుని బయటికి గెంటేస్తుందని చెబుతుంది జ్యోత్స్న. అత్తకి నువ్వు బలహీనత, అదే నీ బలమని అంటుంది కార్తీక్. కానీ నేను మాత్రం బావ మీద నాకున్న ప్రేమ గురించే ఆలోచిస్తున్నాను.. బావ నా కోసం ప్రాణాలు ఇవ్వబోయాడు అంటుంది జ్యోత్స్న. నేను కాపాడింది నీ మీదున్న ప్రేమతో కాదు.. నువ్వు కనిపించకపోతేనే భరించలేని అత్త, నీకేమైనా అయితే తట్టుకోలేదని అంటాడు కార్తీక్.
నేను వైరాతో చేతులు కలిపినట్లు నీకెవరు చెప్పారని జ్యోత్స్న అడగ్గా.. వాడే మొత్తం చెప్పాడని అంటాడు కార్తీక్. నేను బావని నీ ముందే హగ్ చేసుకున్నాను, రేపు బావతో తాళి కట్టించుకున్నా కూడా నువ్వు ఏం చేయలేవని అంటుంది జ్యోత్స్న. వచ్చే నెలలో ఇది డేట్‌కీ నీ మెడలో తాళి పడుతుంది.. కానీ కట్టేది నేను కాదని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. నేను మా ఆవిడ దగ్గరుండి కట్టిస్తామని మాటిస్తున్నామని అంటాడు కార్తీక్. నెల రోజుల్లో మంచి కుర్రాడిని చూసి నీకు కొంగు ముడి వేసే బాధ్యత నాది అని కార్తీక్ అనగానే పారు వచ్చి విజిల్స్ వేస్తుంది. మీరేం చేస్తారో మీరు చేసుకోండి.. నేనేం చేయాలో నేను చేస్తానని చెబుతుంది జ్యోత్స్న.
నన్ను నానమ్మ అని పిలవమని పారు అడగ్గా.. అది నా వల్ల కాదని దీప చెప్పడంతో పారు సీరియస్ అవుతుంది. అందరిముందు జ్యోత్స్న నీ మొగుడిని కౌగిలించుకుంది.. నువ్వేమైనా చేయగలిగావా? అని ప్రశ్నిస్తుంది పారు. జ్యోత్స్నకి పెళ్లి కాదు.. దాని జాతకమే అంత. నీతో పెళ్లి కాలేదు.. ఆ గౌతమ్ గాడిని తీసుకొచ్చారు వాడితో కూడా పెళ్లి కాలేదు. జ్యోత్స్న జాతకంలో ఏదో దోషం ఉందని అంటుంది పారు. ఆ దోషం మనిషిని కుదురుగా ఉండనివ్వదు.. ఎవరో ఒకరి వెంట పడుతూనే ఉంటుందని మండిపడుతుంది పారు. ఇంతలో జ్యోత్స్న వచ్చి నా గురించి లేనిపోనివి చెబుతావా అంటూ సీరియస్ అవుతుంది. మీరు నన్ను ఏం చేయలేరని వెళ్లిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్నకి పెళ్లి చేయడానికి దీప, పారు, కార్తీక్‌లు చేతులు కలుపుతారు. ఆపరేషన్ జ్యోత్స్న.. తొందరలోనే పెళ్లి అని హాల్‌లో ఆట మొదలెడతారు.
వైరా గురించి సీరియస్‌గా దశరథకి వార్నింగ్ ఇస్తుండగా పంతులు గారు రావడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న జాతకం చూపించడానికి నేనే రమ్మన్నానని చెబుతాడు కార్తీక్. పెళ్లి బాధ్యతలు మా భుజాలపై పెట్టారు కదా? అందుకే ఆవిడకి పెళ్లయ్యే వరకు నిద్రపోమని చెబుతుంది దీప. పదే పదే దీప తలుపు కొట్టడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పంతులుగారు వచ్చారు.. మిమ్మల్ని రమ్మంటున్నారని చెబుతుంది దీప. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేశారు అని జ్యోత్స్న అడుగుతుంది. అందరూ కలిసుంటే బాగుంటుందని కోరుకునే మనిషిని నేను.. ఎవరూ లేకపోతే అంతా నాకే దక్కుతుందని అనుకునే మనిషివి నువ్వు అంటుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications