Karthika Deepam 2 April 28th: జ్యోత్స్న జాతకంలో షాకింగ్ ట్విస్ట్... దీపపై కాంచనలో మొదలైన అనుమానం
Photo Courtesy: JioHotstar
చేతికి బుల్లెట్ గాయం ఉన్నా సరే శివన్నారాయణ ఇంటికి వెళ్తానని కార్తీక్ చెప్పడంతో కాంచన మండిపడుతుంది. నువ్వు ఆ ఇంటికి డ్రైవర్‌వి, ఈ గాయంతో కారు ఎలా నడుపుతావు? ఇంట్లో పనులు ఎలా చేస్తావని అడుగుతుంది కాంచన. ఇంతలో దీప వచ్చి నేను చూసుకుంటానని అంటుంది. ఎంత చెబుతున్నా కొడుకు, కోడలు అక్కడికి వెళ్లడానికి సిద్ధపడటంతో కాంచన సీరియస్ అవుతుంది. కార్తీక్‌ని బైక్ మీద ఎక్కించుకుని తీసుకొచ్చిన దీపని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. బావకి నేనంటే ప్రాణం.. అందుకే తన ప్రాణాలు రిస్క్ చేసి నా ప్రాణాలు కాపాడాడని అంటుంది జ్యోత్స్న.
నేను మా అత్త ప్రాణాలు కాపాడటానికి నిన్ను కాపాడాను కానీ, అంతకుమించి ఏం లేదని అంటాడు కార్తీక్. వైరా గాడితో చేతులు కలిపి కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేసి, నీ వాటా కోసం ఎదురుచూశావని మండిపడతాడు కార్తీక్. ఈ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ విషయాలు నీకు ఎలా తెలుసని అడుగుతుంది. వాడే ఫోన్ చేశాడని చెబుతాడు కార్తీక్. నీకు పెంచిన ప్రేమ ఏమాత్రం లేదని జ్యోత్స్నపై మండిపడుతుంది దీప. నేను నా కోసమే బతుకుతాను, నా స్వార్ధం కోసమే బతుకుతాను. త్వరలోనే బావతో తాళి కట్టించుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. వచ్చే నెల ఇదే తారీఖు లోగా నీ మెడలో తాళి పడేలా చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వీరికి పారు కూడా సాయం చేస్తుంది. ఇంతలో ఇంటికి పంతులుగారు వచ్చి జ్యోత్స్న జాతకం కావాలని అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 28వ తేదీ 656వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్ డ్యూటీకి వెళ్లినట్లు తెలియడంతో కాంచనపై సీరియస్ అవుతాడు శ్రీధర్. జ్యోత్స్నకి అగ్రిమెంట్‌కి, దీపకి ఏదో సంబంధం ఉందని అంటుంది కాంచన. దీపకి హెల్త్ బాలేనప్పుడే కదా కార్తీక్ చేత జ్యోత్స్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుందని చెబుతాడు శ్రీధర్. కానీ అంతకుమించిన బలమైన కారణం ఉంది. కార్తీక్ గాడు .. మా నాన్నకి స్వయానా మనవడు కాబట్టి ఆ ఇంట్లో వాళ్లపై అప్యాయత చూపించడంలో అర్ధముంది. కానీ దీపకి ఆ ఇంటికి ఏ విధమైన బంధం లేదు.
ఏ ఆడదానికైనా భర్త తర్వాత ఎవరైనా అంటుంది దీప. బాగా చదువుకున్న తన భర్త.. డ్రైవర్‌గా బతుకుతుంటే దీప ఏ మాత్రం అడ్డుపడలేదని అంటుంది కాంచన. నా పుట్టిల్లు అంటే తన పుట్టిల్లు అన్నంతగా ఫీల్ అవుతోంది.. ఏదో ఒక పెద్ద గొడవ పెట్టి ఆ ఇంటికి వెళ్లకుండా కార్తీక్‌ని ఆపాలి. కానీ అలా చేయలేదు.. అందుకే దీప మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అగ్రిమెంట్ వెనుక ఏదో రహస్యముందని అంటుంది కాంచన. మీరు నీరసంగా కనిపిస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్లమని శ్రీధర్‌పై మండిపడుతుంది కాంచన. మీకు మీ కొడుక్కి పని తప్పించి వేరే ధ్యాస ఉండదని చెబుతుంది.
ఇంటికొచ్చిన పంతులు గారు.. జ్యోత్స్న జాతకం చూస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నావా అని కార్తీక్ గురించి మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ జాతకం ప్రకారం అమ్మాయికి ఈ పాటికే పెళ్లయి పోయి ఉండాలని పంతులుగారు అనడంతో అంతా షాక్ అవుతారు. అయితే ఇది నా మనవరాలి జాతకం కాదు.. నాది అని పారిజాతం చెప్పడంతో శివన్నారాయణ కోప్పడతాడు. పంతులు గారు సరిగా చెబుతారో లేదోనని టెస్ట్ చేశానని అంటుంది పారు. జ్యోత్స్న జాతకం చూసిన పంతులుగారు.. సరిగ్గా నెలరోజుల్లో పెళ్లి జరుగుతుందని చెబుతారు పంతులుగారు. ఆ మాటలు విని జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఒకేవళ నెల రోజుల్లో పెళ్లి జరగకపోతే జీవితాంతం ఈమె కుమారిగానే మిగిలిపోతుందని పంతులు గారు చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. దీనికి పరిష్కారం ఏంటీ? అని సుమిత్ర అడగ్గా.. దీనికి పరిష్కారం ఏం లేదు, జాతకం ప్రకారం జరగాల్సిందేనని అంటాడు పంతులు. నెల రోజుల్లో బావతోనే నా పెళ్లి జరుగుతుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నీ బుద్ధి నాకు తెలుసు.. దానికి నేను అడ్డుపడతానని అనుకుని కార్తీక్ జాతకం ఇస్తుంది పారిజాతం. ఎక్కడ బావకి నేను పెళ్లాన్ని అయిపోతానోనని జాతకం చూపిస్తున్నావా అని అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ జాతకం ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందన దశరథ అడగ్గా.. చూడనివ్వమని చెబుతుంది దీప.
పదిమందికి సాయం చేసే గుణం, సంసార జీవితం బాలేదు, అన్నీ కష్టాలే.. రాజా లాంటి బతుకు వద్దు అనుకున్నాడు, గొప్పింటికి అల్లుడు కావాల్సినవాడు.. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి మనసున్న మనిషిగా మిగిలాడు. కానీ జీవితంలోకి వచ్చిన అమ్మాయిది ఖచ్చితంగా రాణి లాంటి జాతకం. కానీ ఏదో ఒకరోజు కష్టాలన్నీ దాటుకుని గొప్పస్థాయికి వెళ్తాడని చెబుతాడు పంతులు గారు. మా బావ జాతకంలో పెళ్లిరాత ఎలా ఉందో చూడమని జ్యోత్స్న అడగ్గా.. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందని పారు మండిపడుతుంది. ఒక పెళ్లా? రెండు పెళ్లిళ్లా? అని జ్యోత్స్న అడగటంతో పారు సీరియస్ అవుతుంది. నెల రోజుల్లో నీ పెళ్లి అని సుమిత్ర అనగా.. నేను కూడా సిద్ధంగా ఉన్నాననే చెబుతుంది జ్యోత్స్న. నా చేత తాళి కట్టించుకోవడానికి నువ్వు ఏం చేయబోతున్నావా అని భయంగా ఉందని అనుకుంటాడు కార్తీక్.
భోజనం తినకుండా శౌర్య గోల గోల చేస్తుంది. ఇంతలో కార్తీక్ రావడంతో అతని చేయి పట్టుకుంటుంది శౌర్య. దాంతో నొప్పితో విలవిలలాడిపోతాడు కార్తీక్. వీడికి, వీళ్ల నాన్నకి ఏం చెప్పలేం.. దేవుడిచ్చిన బంధాలు జీవితాంతం నాతోనే ఉండాలని అనుకుంటున్నానని కాంచన బాధపడతాడు. నా కన్నతల్లిగా నీకు అన్ని హక్కులు ఉన్నాయని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న ఇంతలా నీ వెంట ఎందుకు పడుతుంది? ప్రేమ ఒక్కటే కారణం కాదు.. ఇంకేదో ఉంది. నీకు, జ్యోత్స్నకి, దీపకి మధ్య ఏదో కథ జరుగుతోందని కాంచన చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.
కార్తీక్‌ని పెళ్లి చేసుకోకపోవడం వల్ల జ్యోత్స్న ఏం నష్టపోయింది? ఏం లేదు కదా? దీప మీద ఎందుకు పగ సాధించాలి? పెళ్లయిన మగాడి వెనుక ఎందుకు పడాలి? ఈ నిజం ఏంటో నాకు చెప్పరని అంటుంది కాంచన. అగ్రిమెంట్‌కి, దీపకి ఏంటీ సంబంధమని నిలదీస్తుంది. జ్యోత్స్న మిమ్మల్ని వదిలిపెట్టడం కాదు.. మీరే ఆ ఇంటిని వదలడం లేదని మండిపడుతుంది. పుట్టింటి కోసమే నీ కోడలు కష్టపడుతోందని కార్తీక్ చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. తన కారణంగా ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి.. వాటిని కలపాలని ఇదంతా చేస్తోందని చెబుతాడు కార్తీక్.
పెళ్లి గురించి పంతులుగారు చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తున్న జ్యోత్స్నకి వాళ్ల ఫ్రెండ్ ఫోన్ చేసి నా కూతురు బర్త్ డేకి రమ్మని పిలుస్తుంది. నీకు కూడా పెళ్లయితే నా లాంటి కూతురో, కొడుకో ఉండేదని చెప్పడంతో త్వరలోనే మీ అందరి కోరిక తీరుస్తాని, నేను పెళ్లి చేసుకోబోతున్నానని జ్యోత్స్న అంటుంది. ఇంతలో పారు రావడంతో ఫోన్ పెట్టేస్తుంది. నీకు జ్యోత్స్న మీద ఫోకస్ ఎక్కువైంది. అది నా చెల్లెలు కాదు. దానిని నాకు సవతిని చేయాలని అనుకుంటున్నావా అని కార్తీక్‌పై మండిపడుతుంది దీప. ఇంతలో పారు ఫోన్ చేసి నీ సవతి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications