Karthika Deepam 2 April 29th: కార్తీక్- పారుల మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్న జీవితంలోకి కొత్త వ్యక్తి
Photo Courtesy: JioHotstar
బుల్లెట్ గాయంతో బాధపడుతున్న కార్తీక్‌ని డ్యూటీకి ఎందుకు పంపించావని కాంచనపై మండిపడతాడు శ్రీధర్. జ్యోత్స్నకి, దీపకి, కార్తీక్‌కి మధ్య ఏదో మనకి తెలియని కథ నడుస్తోందని కాంచన అనుమానిస్తుంది. మీరు కూడా కొద్దిరోజులుగా నీరసంగా కనిపిస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లమని కాంచనా చెప్పినా శ్రీధర్ వినిపించుకోడు. జ్యోత్స్న జాతకం చూసిన పంతులుగారు.. ఈ అమ్మాయికి ఒక నెల రోజుల్లో పెళ్లి జరుగుతుంది, లేకపోతే జీవితాంతం ఈమె కన్యగానే మిగిలిపోతుందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ జాతకం కూడా చూడమని పారిజాతం ఇవ్వడంతో ఇప్పుడు వాడి జాతకం ఎందుకని అడుగుతాడు దశరథ.
దీప కూడా చూడమని చెప్పడంతో పంతులుగారు చూస్తారు. ఇతనిది చాలా గొప్ప జాతకం.. అందరికోసం రాజాలాంటి జీవితాన్ని వదులుకుని సామాన్యుడిగా మిగిలిపోయాడు. కానీ ఎప్పటికైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడని పంతులుగారు చెప్పడంతో దీప సంతోషిస్తుంది. ఇంటికొచ్చిన కార్తీక్‌ని శౌర్య గట్టిగా పట్టుకోవడంతో నొప్పితో విలవిలలాడిపోతాడు. జ్యోత్స్న నీ వెంట ఎందుకు పడుతోంది? పెళ్లయిన వ్యక్తిని కోరుకోవడం ఏంటీ? అని కాంచన నిలదీయడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. పంతులుగారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుండగా జ్యోత్స్నని పారిజాతం ఆటపట్టిస్తుంది. జ్యోత్స్నని నాకు సవతిని చేయాలని అనుకుంటున్నావా అంటూ కార్తీక్‌పై మండిపడుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 29వ తేదీ 657వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న విషయంలో జాగ్రత్తగా ఉండమని దీపకి వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని అందరిలో బయటపెడితేనే కానీ ఈ గండం నుంచి గట్టెక్కలేమని అంటాడు. దీపకి ఓ మంచి చీర కొను.. అలాగే జ్యోత్స్న మనసు గురించి ఇంట్లో తెలిసిందనుకో దానిని చీరేస్తారని అంటుంది పారు. కార్తీక్ గాడు దీప కోసం ఓ చీర కొన్నాడని చెప్పి.. అది జ్యోత్స్న కట్టుకునేలా చేస్తే అసలు కథ నేను నడుపుతానని అంటాడు కార్తీక్. నువ్వు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నావని అంటుంది పారు. ఎన్నాళ్లు ఈ దొంగా పోలీస్ ఆట ఎందుకు? రేపే ఈ ఆటకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలని అంటాడు కార్తీక్. విషం పోసి పట్టించిన వాడితోనే విరుగుడు చేయించాలి... పారుతోనే జ్యోత్స్నకి బుద్ధి తెప్పించాలని అంటాడు కార్తీక్.
ఫ్రెండ్ కూతురి బర్త్ డే కోసం గిఫ్ట్ కొనడానికి షాప్‌కి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఓ అందమైన అమ్మాయి అబ్బాయి బొమ్మ ఉండటంతో దానిని కూడా ప్యాక్ చేయమని చెబుతుంది. అయితే అది మరొకరు కొనడంతో దీనిని మీకు ఇవ్వలేనని చెబుతాడు షాప్ ఓనర్. లేకపోతే మీరు ఆ కస్టమర్‌కి చెప్పి మాట్లాడితే నేను మీకు ప్యాక్ చేసి ఇస్తానని అంటాడు. దానికి సరేనన్న జ్యోత్స్న ఆ వ్యక్తి కోసం వెతుకుతుండగా.. అతను అక్కడికి వస్తాడు. ఈ గిఫ్ట్ నాకు కావాలని జ్యోత్స్న అడగ్గా.. నాది అని నేను ఒక్కసారి అనుకుంటే అది నేను కొన్నట్లేనని అంటాడు అవతలి వ్యక్తి. ఈ పీస్‌కి ఉన్న వాల్యూ మీద 10 వేల రూపాయలు ఎక్స్‌ట్రా ఇస్తానని అంటుంది జ్యోత్స్న. అయినా ఆ వ్యక్తి మాత్రం ససేమిరా అంటాడు.
ప్రతిదానిని డబ్బుతో కొనలేం.. 5 నిమిషాల ముందు ఈ బొమ్మ మీద ఎవరికీ ఏ రైట్స్ లేవు. కానీ ఇప్పుడు అది నాది అంటాడు. బోడి గిఫ్ట్ కోసం ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. నేను ఈ షాప్‌కి వచ్చి ఈ గిఫ్ట్ నచ్చింది కొనాలని అనుకున్నాను.. ఇప్పుడు దీనిని ఎలా ఇస్తానని అతను అడుగుతాడు. నచ్చింది కాబట్టి నువ్వు దానిని ఇచ్చేయాలని అంటుంది జ్యోత్స్న. నాకు నచ్చిన దానిని లక్ష రూపాయలు ఇచ్చినాసరే నేను ఇవ్వనని చెబుతాడు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోతున్నానని ఇలా మాట్లాడుతున్నావా అని జ్యోత్స్న అడగ్గా.. మీ ప్లేస్‌లో ఓ మగాడున్నా ఇలాగే మాట్లాడతా, నాది అనుకున్నది కర్చీఫ్ అయినా సరే మీరు డైమండ్స్ ఇచ్చినా నేను ఇవ్వనని తేల్చేస్తాడు. మనది కాదు అనుకున్న దాని మీద ఆశపడటం మానుకోండి.. లేకపోతే మనశ్శాంతి ఉండదని వార్నింగ్ ఇస్తాడు. తనకు బుద్ధి చెప్పిన వ్యక్తిని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది.
జ్యోత్స్న కాఫీ తాగుతూ ఉండగా కార్తీక్ ప్లాన్‌ని వర్కవుట్ చేస్తుంది పారిజాతం. ఈ చీర చాలా బాగుంది, దీనిని దీప కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. ఇదంతా చూసిన జ్యోత్స్న ఏం జరిగిందని అడుగుతుంది. నీకు నాతో మాట్లాడే తీరిక ఎక్కడుంది? ఉన్న సమయమంతా కార్తీక్ గాడి గురించి ఆలోచించడమే సరిపోతుందని అంటుంది. నువ్వు, దీపకి బావకి ఎంతో సపోర్ట్ చేస్తావో చేయ్.. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఒంటరిగా పోరాడుతూనే నేను ఇక్కడి వరకు వచ్చాను, మీకు భయపడను. ఈ చీర సంగతి ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. ఈ చీర కార్తీక్ గాడికి చాలా నచ్చింది. నేను దీపకి చీర పెట్టాలని అనుకున్నాను, ఆన్‌లైన్‌లో చూశాను.. ఈ చీరవాడికి బాగా నచ్చింది, వెంటనే ఆర్డర్ చేశానని చెబుతుంది పారిజాతం. దీప రాగానే కార్తీక్ గాడికి ఎంతో నచ్చిన ఈ చీరని కార్తీక్ గాడి చేతుల మీదుగా ఇప్పిస్తానని అంటుంది పారిజాతం.
ఆ వెంటనే జ్యోత్స్న చీర లాక్కుంటుంది. ఎవరికి ఏది సొంతం అవ్వాలో, దాని మీద దేవుడు ముందే వాళ్ల పేర్లు రాసి ఉంచుతాడని అంటుంది జ్యోత్స్న. దీప పేరు చెరిపేసి దీని మీద జ్యోత్స్న అని రాస్తాను. నేను కట్టుకుని వస్తాను, ఎవరు మురిసిపోతారో, ఎవరు తరించిపోతారో చూద్దామని చెబుతుంది. మనం అనుకున్న ప్లాన్ వర్కవుట్ కావడంతో పారిజాతం చాలా సంతోషిస్తుంది. ఉదయాన్ని ఈ విషయాన్ని కార్తీక్ గాడికి చెప్పడంతో కార్తీక్, దీపలు చాలా సంతోషిస్తారు. ఇంతలో శివన్నారాయణ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. జ్యోత్స్నకి ఒక పెళ్లి సంబంధం చూశాను, ఆ అబ్బాయి ఈరోజే వస్తాడని చెబుతాడు కార్తీక్. వీడు సంబంధం తెచ్చాడంటే ఆ వ్యక్తి చాలా మంచోడని అంటాడు దశరథ.
అబ్బాయి పెళ్లి తర్వాత మనతో పాటే ఉండాలని కూడా చెప్పావా? అని అడుగుతుంది సుమిత్ర. ముందు అబ్బాయి రాలేదు పిల్లని చూడలేదు. ఇద్దరికి ఒకొరికొకరు నచ్చాలి కదా? నువ్వు అప్పుడే అక్కడిదాకా వెళితే ఎలా అడుగుతాడు కార్తీక్. ఇంతలో ఓ వ్యక్తి రావడంతో ఈ అబ్బాయే పెళ్లికొడుకని చెబుతాడు కార్తీక్. వచ్చి రావడంతోనే అతను వరసలు పెట్టి పిలవడంతో పెళ్లికొడుకు నాకు నచ్చాడని చెబుతాడు దశరథ. జ్యోత్స్నకి ఎప్పుడు చెప్పావు? అది రెడీ అవుతుందా? అని కార్తీక్‌ని అడుగుతుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న అందంగా రెడీ అయి ఉంటుంది.
నా కోసం మా బావ సెలెక్ట్ చేసిన చీరను నువ్వెందుకు కట్టుకున్నావని దీప ప్రశ్నించగా.. భవిష్యత్తులో బావని కూడా నేను కట్టుకుంటానని జ్యోత్స్న చెప్పగా పారు, దీపలు షాక్ అవుతారు. ఈ చీర కట్టుకుని నువ్వు కార్తీక్ ముందుకు వెళ్లొద్దని చెబుతుంది పారిజాతం. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో దీప, పారులు సంతోషిస్తారు. ఇంతలో జ్యోత్స్న కార్తీక్ ముందుకు వస్తుంది. అది చూసి సుమిత్ర చాలా సంతోషిస్తుంది. మీకో సర్‌ప్రైజ్ అని పెళ్లికొడుకుని చూపించగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నాకు కాబోయే భర్తను వెతకమని నువ్వే నాకు చెప్పావు కదా అందుకే ఇతనని తీసుకొచ్చానని చెప్పడంతో జ్యోత్స్న కంగుతింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications