Karthika Deepam 2 May 1st: జ్యోత్స్న నోరుమూయించిన పారు, చావుబతుకుల్లో శ్రీధర్.. కార్తీక్‌కి గుండెకోత
Photo Courtesy: JioHotstar
రాజ్ తీసుకొచ్చిన పెళ్లికొడుకుని నచ్చలేదని ముఖం మీదే చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేనెందుకు నచ్చలేదని పెళ్లికొడుకు అడగ్గా.. పోరా అంటూ సీరియస్ అవుతుంది. ఆవిడ అరేయ్, ఒరేయ్ అంటోంది, డైలాగ్స్‌లో అలాంటివి లేవు కదా అని అనడంతో శివన్నారాయణ కుటుంబం ఉలిక్కిపడుతుంది. అసలు ఎవడ్రా నువ్వు అంటూ శివన్నారాయణ సీరియస్ అవ్వడంతో అతను ఆర్టిస్ట్ అని పారు, కార్తీక్‌లు చెబుతారు. అసలు ఇంత డ్రామా ఎందుకు ఆడావని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు.
జ్యోత్స్న తన పెళ్లి బాధ్యతను నా మీద పెట్టింది. పైగా నెల రోజుల్లో పెళ్లి జరగాలని పంతులు గారు జ్యోస్యం చెప్పారు. అందుకే అసలు జ్యోత్స్న మనసులో ఏముంది? పెళ్లికి సిద్ధమా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఇదంతా చేశానని అంటాడు కార్తీక్. నువ్వు ఒప్పుకుంటే మంచి పెళ్లి కొడుకుని తీసుకొస్తానని చెబుతాడు కార్తీక్. నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినా నాకు నచ్చరు.. ఎందుకంటే నేను నిన్నే ప్రేమిస్తున్నా, నీతోనే ఉంటానని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. దీప మెడలో తాళిని జ్యోత్స్న తెంచేయబోతుండగా దీప లాగిపెట్టి కొడుతుంది. దాంతో సుమిత్ర సీరియస్ అవుతుంది. కొట్టాల్సింది నువ్వు కాదు నేనంటూ జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 1వ తేదీ 659వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ కూతురు అంత తెగించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా అని దశరథను అడుగుతాడు శివన్నారాయణ. నేను తప్పు చేశాను.. చిన్నప్పటి నుంచి కార్తీకే నీ మొగుడని చెబుతూ వచ్చాను. అయినా మీరందరూ చెబుతుంటే ఇక నేనేం మాట్లాడను అంటాడు దశరథ. ఏమైనా సరే నాకు బావ కావాలి, బావనే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న తేల్చిచెప్పడంతో అంతా షాక్ అవుతారు. బావ అంటే ఇష్టం అనగానే నన్ను కొడుతున్నారు కానీ.. కూతురంటే ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని బావని ఒక్క మాటైనా అడుగుతున్నారా? అని అంటుంది జ్యోత్స్న. నువ్వంటే ఇష్టం లేదని నాతో చెప్పలేదని జ్యోత్స్న చెప్పగా.. నాతో చెప్పాడని పారు అనడంతో అంతా షాక్ అవుతారు.
జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని తనకి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని కార్తీక్ నాతో చెప్పాడు. జ్యోత్స్న మీద నాకెలాంటి ఫీలింగ్ లేదు.. తనని మరదలిగా తప్పించి భార్యగా చూడలేనని కార్తీక్ గతంలో చెప్పిన మాటల్ని చెబుతుంది పారు. లండన్ నుంచి కార్తీక్ ఇంటికి రాగానే వీడు జ్యోత్స్న గురించి చెప్పాడు.. నీకు మీకు ఈ విషయం కావాలనే చెప్పలేదని అంటుంది పారు. ఈ కుటుంబాలు రెండు ముక్కలైపోతాయి.. అది కాంచన- దశరథల కోరిక. దానికి తోడు జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటప్పుడు నేను వెళ్లి మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు అంటే ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడ్డాను. కార్తీక్ గాడిని బతిమలాడదామని అనుకున్నాను, కానీ తర్వాత జరిగిన పరిణామాలు, దీప మనింటికి రావడం మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఏదైనా తప్పుంటే అది నా తప్పేనని చెబుతుంది పారిజాతం.
మీ ఆలోచనల వల్ల నష్టపోయింది ఎవరు? నేనే కదా? మరి నాకు న్యాయం జరగాలి కదా అంటుంది జ్యోత్స్న. న్యాయం జరగాలంటే బావ నా మెడలో తాళి కట్టాలని చెబుతుంది. మరోసారి నీ నోటిలోంచి కార్తీక్‌ని పెళ్లి చేసుకుంటానన్న మాట వస్తే బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ మీద నాకు ప్రేముంది, ఆ ప్రేమను అడ్డుపెట్టుకుని నువ్వు ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే నేను క్షమించనని చెబుతుంది సుమిత్ర. దాంతో జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెట్టినందుకు కార్తీక్‌కి థ్యాంక్స్ చెబుతాడు శివన్నారాయణ. అది నాకు కాదు.. పారుకు చెప్పమని కార్తీక్ అనడంతో భార్యకు థ్యాంక్స్ చెబుతాడు పెద్దాయన.
నీ వల్ల మా కూతురి విషయంలో మాకు క్లారిటీ వచ్చిందని కార్తీక్‌తో అంటుంది సుమిత్ర. ఇది మన ఫ్యామిలీ.. బాధలైనా, కష్టాలైనా మనమే పంచుకోవాలని చెబుతాడు కార్తీక్. ఏం చేసినా మరదలిని దారిలోకి తీసుకొచ్చావని దశరథ అనగా.. కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు, ఇప్పుడే మొదలైంది. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయాలి.. ఇది మనందరికీ పెద్ద టాస్క్ అంటాడు కార్తీక్. జ్యోత్స్న మెడలో మూడు ముళ్లు పడితేనే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదని చెబుతాడు శివన్నారాయణ. అది నేను చూసుకుంటానని మనసులో అనుకుంటాడు కార్తీక్.
మా ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్‌కి వెళ్తున్నామని స్వప్న చెప్పడంతో ఎక్కడికి వెళ్లొద్దని అంటాడు శ్రీధర్. బయట పరిస్ధితులు బాలేదు. నువ్వు ఇంట్లోనే ఉండమని చెబుతాడు. ఆ మనిషిని చూస్తూ నేను ఉండలేను, నేను కాశీ విషయంలో మనసు మార్చుకోను, కాశీ ఇంట్లోంచి వెళ్లే వరకు నేను ఇంటికి రాను అంటుంది స్వప్న. ఇలా మొండిగా ఉంటేనే జ్యోత్స్నని ఆ వైరాగాడు కిడ్నాప్ చేశాడు. ఇంత వరకు వాడు పోలీసులకు కూడా దొరకలేదు. టైం బాగుంది కాబట్టి మీ అన్నయ్య సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చాడు.. అదే మీ కూతురిని కిడ్నాప్ చేశారని నాకు ఫోన్ వస్తే నేను తట్టుకోలేనంటూ గుండె పట్టుకుంటాడు. కూతురు బయటికెళ్తే క్షేమంగా తిరిగొస్తుందనే నమ్మకం లేదు.. నాకు నమ్మకం కలిగించే తోడు దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదు అంటాడు శ్రీధర్. నాన్న బాగానే ఉన్నాడు.. నవ్వుతూ తిరుగుతున్నాడని అనుకుంటున్నావు, నేను సంతోషంగా లేనని చెబుతాడు.
జ్యోత్స్న అన్న మాటలతో రగిలిపోతున్న దీప దగ్గరికి సుమిత్ర వచ్చి క్షమాపణలు చెబుతుంది. జ్యోత్స్న మాట్లాడింది తప్పే.. దాని వెనుక తల్లిగా నా పాత్ర కూడా ఉంది. మా పెంపకం మమ్మల్ని సవాల్ చేస్తోంది. కారులో గుండెపోటుతో కుప్పకూలిపోతాడు శ్రీధర్. దాంతో జనం గుమిగూడి అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. ఇంతలో జ్యోత్స్నతో గొడవపడిన కుర్రాడు ఇదంతా చూసి శ్రీధర్‌ని కారులోంచి బయటకు తీసి ఆసుపత్రిలో చేరేస్తాడు. శ్రీధర్ హాస్పిటల్‌లో ఉన్నట్లు కార్తీక్‌కి ఫోన్ రావడంతో షాక్ అవుతాడు. హాస్పిటల్‌లో తండ్రిని చూసి కంటతడి పెడతాడు కార్తీక్. ఆ వెంటనే శ్రీధర్‌ని కాపాడిన కుర్రాడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తూ.. అతనినే గుద్ధుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications