Karthika Deepam 2 May 2nd: శ్రీధర్‌ ఆరోగ్యంపై కార్తీక్‌కి డాక్టర్ షాకింగ్ న్యూస్... జ్యోత్స్నకి పారు డెడ్‌లైన్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న ప్రవర్తనతో శివన్నారాయణ రగిలిపోతాడు. తప్పు చేసింది నేను, చిన్నప్పటి నుంచి కార్తీకే నీ మొగుడని నేను చెబుతా వచ్చానని అంటాడు దశరథ. అందరూ నన్నే తప్పుబడుతున్నారు కానీ, నేనంటే ఇష్టం లేదని బావని ఎందుకు అడగటం లేదని నిలదీస్తుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు నాకు లండన్ నుంచి వచ్చినరోజే నువ్వంటే ఇష్టం లేదని పారు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మరి అప్పుడే ఈ నిజం ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మన రెండు కుటుంబాలు విడిపోతాయి. కాంచన- దశరథలు తీసుకున్న మాటలు గుర్తొచ్చి ఇదంతా జరగకుండా ఉండటానికే ఈ నిజం దాచానని చెబుతుంది పారు. నిజం చెప్పి మంచి చేశావని పారిజాతానికి శివన్నారాయణ థ్యాంక్స్ చెబుతాడు.

మా ఫ్రెండ్స్ అందరం టూర్‌కి వెళ్తున్నామని స్వప్న చెప్పడంతో ఎక్కడికి వెళ్లొద్దని కూతురికి వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతాడు శ్రీధర్. కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా గుండెపోటు రావడంతో కారులోనే కుప్పకూలిపోతాడు. జ్యోత్స్నతో గొడవపడిన కుర్రాడు ఇదంతా చూసి శ్రీధర్‌ని కాపాడతాడు. తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని ఫోన్ రావడంతో కార్తీక్ పరుగు పరుగున హాస్పిటల్‌కి వస్తాడు. శ్రీధర్‌ని చూడగానే ఎమోషనల్ అయినా కార్తీక్.. తన తండ్రిని కాపాడిన కుర్రాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 2వ తేదీ 660వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 660 May 2nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

శ్రీధర్‌ను కాపాడినందుకు సూరజ్‌కు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. ఇంతలో సూరజ్‌కు ఫోన్ వచ్చి మీటింగ్‌కు రాలేకపోయానని బాధపడతాడు. అదంతా విన్న కార్తీక్ బాధపడతాడు. అవకాశం కంటే ప్రాణం గొప్పది.. అవకాశం పోతే మళ్లీ వస్తుంది, ప్రాణం తిరిగిరాదు కదా? అయినా నేను అవన్నీ ఆలోచించలేదు. నా కళ్ల ముందే ఒక ప్రాణం పోతోంది.. ఒక మనిషిగా దానిని నేను కాపాడలేకపోతే వేస్ట్ కదా అని సూరజ్ అంటాడు. శ్రీధర్ గారి మొబైల్ నుంచి కాల్ చేశానని చెబుతాడు. చాలారోజుల తర్వాత ఒక మనిషిని కలిసినట్లుగా అనిపిస్తోంది.. ఎవరి స్వార్ధం కోసం వాళ్లు పరుగులు తీస్తున్నారు. మహా అయితే 108కి కాల్ చేస్తారు.. ఇంతపెద్ద ట్రాఫిక్‌లో అది వస్తుందో రాదో? ఈలోపు ప్రాణాలు పోతే ఏంటని ఆలోచించారని అంటాడు కార్తీక్.

మీరు కూడా మరొకరికి సాయం చేయండని సూరజ్ చెప్పడంతో.. మీ క్యారెక్టర్ చాలా గొప్పది, నా హార్ట్‌ని టచ్ చేసి.. మా నాన్న ప్రాణాలు కాపాడావు. నువ్వు నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటావని చెబుతాడు కార్తీక్. నువ్వు కూడా నా కొడుకు లాగే మాట్లాడుతున్నావని శ్రీధర్ అనడంతో .. నన్ను నేను అద్ధంలో చూసుకున్నట్లుగా ఉందని చెబుతాడు కార్తీక్. మీరు మాష్టారా అని సూరజ్ అడగ్గా.. నేను బిజినెస్ చేస్తుంటాను అని చెబుతాడు శ్రీధర్. మరి మిమ్మల్ని మాస్టారూ అని పిలుస్తున్నారు అని సూరజ్ అడగ్గా.. మా స్కూల్‌లో మాస్టారు కంటే మా నాన్నే ఎక్కువగా క్లాస్ పీకేవాడు. అప్పటి నుంచి మాస్టారు అని పిలవడం అలవాటైందని చెబుతాడు కార్తీక్.

నీ వల్ల బ్రదర్ మీటింగ్ పోయిందని కార్తీక్ అనడంతో శ్రీధర్ బాధపడతాడు. మెడిసిన్స్‌కి డబ్బులు ఎంత అయ్యిందని కార్తీక్ అడగటంతో.. మీరు అడగకూడనంత, నేను చెప్పకూడనంత అంటాడు సూరజ్. ఈ కుర్రాడిని చూస్తే నాకు దీప గుర్తొచ్చిందని అంటాడు కార్తీక్. ఈలోపు డాక్టర్ వచ్చి ఇప్పుడు మీకొచ్చింది మైల్డ్ స్ట్రోక్.. మరోసారి మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే చాలా కష్టం.. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, శ్రీధర్ షాక్ అవుతారు. మీ నాన్నగారు ఒక రెండ్రోజులు హాస్పటల్‌లో ఉండాలని డాక్టర్ చెప్పడంతో నేనుండలేనని అంటాడు శ్రీధర్. ప్రస్తుతానికి ప్రాబ్లమ్ లేదు.. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు డాక్టర్.

ఇంటికి దీప ఒక్కతే రావడంతో కాంచన షాక్ అవుతుంది. ఇద్దరూ కలిసే వెళ్లారు కదా? నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తాడు? ఆ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అని కాంచన అడగ్గా.. చిన్న గొడవ జరిగిందని చెబుతుంది దీప. ఈ మధ్య మీకంటే ఆ జ్యోత్స్న గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా.. నీకు కూడా చెప్పకుండా వీడు ఎక్కడికి వెళ్లాడు? అని అడుగుతుంది. ఆ వెంటనే శ్రీధర్‌కి ఫోన్ చేసి కార్తీక్ ఉన్నాడా? అని అడుగుతుంది... వాడు నా దగ్గరే ఉన్నాడని అంటాడు శ్రీధర్. మావయ్యగారి దగ్గరికి వెళ్తున్నట్లు బావ ఎందుకు చెప్పలేదని దీప ఆలోచిస్తుంది. శ్రీధర్ అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడంతో కాంచన మండిపడుతుంది. మీ అమ్మకి నేను ఎలాగూ సంతోషాన్ని ఇవ్వడం లేదు. బాధను మాత్రం ఎందుకు ఇవ్వడం, మన బాధ మాత్రం మనతోనే ఉండనీ అని కార్తీక్‌తో చెబుతాడు శ్రీధర్. ఆ వెంటనే తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్తాడు కార్తీక్.

ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ చిరాకు పడుతుంది జ్యోత్స్న. ఇంతలో పారు వచ్చి నేను, నా మనవడు, దీప కలిసి నిన్ను ఇరికించాం.. నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు చెప్పడం, కార్తీక్ సెలెక్ట్ చేశాడని చెప్పడం అంతా అబద్ధం. అసలు ఈ చీర కొన్నాదే నీకోసం.. ఇదంతా కార్తీక్ గాడి ప్లానే అని చెబుతుంది పారు. మీరంతా కలిసి నన్నేం చేద్దామనుకున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. ఇంట్లో వాళ్లకు నువ్వంటే ఏంటో తెలియాలి? నువ్వు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి కొడుకు ఇంట్లోకి రావాలి? ఏం చెబితే నువ్వు రెచ్చిపోతావో అదే చెప్పామని అంటుంది పారు.

ఎక్కడ చీరను దీప కట్టుకుంటుందోనని నువ్వే నా దగ్గరి నుంచి లాగేసుకున్నావు. బయటివాళ్లంతా నిన్ను చెడ్డదానిని అన్నా.. మీ తాత, మీ అమ్మ మాత్రం వెనకేసుకొచ్చేవాళ్లు. ఈసారి నీకు ఆ సపోర్ట్ కూడా లేకపోయిందని పారిజాతం చెబుతుంది. ఇక నువ్వు తలచుకోవడాలు లేవు.. తలవంచుకుని తాళి కట్టించుకోవడమే. ఈ 30 రోజులు పూర్తయ్యేసరికి నీ మెడలో తాళిపడుతుంది. ఈ కుమారి కాస్తా శ్రీమతి అవుతుందని పారిజాతం చెబుతుంది. నా పెళ్లి జరిగేది బావతోనే అని అంటుంది జ్యోత్స్న. తోక ఊపుకుంటూ చెప్పినమాట వినడం తప్పించి నీకు వేరే ఆప్షన్ లేదని పారు అంటుంది. బావని దీపని నమ్మొద్దు.. తర్వాత బాధపడతావు, నువ్వు నాకు సపోర్ట్ చేయమని జ్యోత్స్న అడుగుతుంది. తలవంచుకుని తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండమని పారిజాతం చెప్పగా.. అది జరగదని జ్యోత్స్న అంటుంది. దానిని జరిపిస్తాడు.. నా మనవడు మాట అనడు, అన్నాడంటే దాని మీదే నిలబడతాడు.. సరిగ్గా నెల రోజులు లెక్కపెట్టుకోమని చెబుతుంది పారు.

శ్రీధర్‌ని ఇంటికి తీసుకెళ్లి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతాడు కార్తీక్. నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నావని అడగటంతో నా కూతురి గురించేనని అంటాడు శ్రీధర్. ట్యాబ్లెట్స్ ఎలా వేయాలో స్వప్నకి చెబుతాడు కార్తీక్. దానితో పాటే నువ్వు మనశ్శాంతి కూడా ఇవ్వాలి.. ఈ మనిషి సగం జీవితం మనకోసమే బతికాడు. ఆయన కోసం ఇప్పుడు మనం బతకాలని చెబుతాడు కార్తీక్. పెద్దల గారాబం పిల్లల జీవితాల్ని నాశనం చేస్తాయి.. పిల్లల జీవితాలు బాలేదని నువ్వు బాధపడుతున్నావు. నా జీవితం నాకు నచ్చినట్లుగా లేదని చెల్లి బాధపడుతోంది. ఈ సమస్యలన్నీ ఎప్పుడు పోతాయోనని నేను బాధపడుతున్నాను అంటాడు కార్తీక్.

ఇంకెప్పుడూ నాన్నతో పోట్లాడనని స్వప్న చెప్పగా.. పొట్లాడితే ఆయన ఉండడని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇవన్నీ దేవుడిచ్చిన బంధాలు.. పోయిన తర్వాత ఫోటోకి దండేసి బాధపడతాం. నాన్నని జాగ్రత్తగా చూసుకో.. లేదంటే నేనే మా ఇంటికి తీసుకెళ్లిపోతానని కార్తీక్ చెప్పడంతో స్వప్న బాధపడుతుంది. అమ్మకేం చెప్పొద్దని శ్రీధర్ అనగా.. నిజం చెప్పాల్సిందేనని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X