Karthika Deepam 2 May 4th: శ్రీధర్ ఆరోగ్యంపై కాంచన ఆందోళన.. దీపపై జ్యోత్స్న ఫోకస్
Photo Courtesy: JioHotstar
తన తండ్రిని కాపాడినందుకు సూరజ్‌ను వెతుక్కుంటూ వెళ్తుండగా అతనినే గుద్ధుతాడు కార్తీక్. చేతిలోని మెడిసిన్ కవర్‌పై శ్రీధర్ పేరు ఉండటంతో అతనే తన తండ్రిని కాపాడాడని గ్రహించిన కార్తీక్.. వెంటనే థ్యాంక్స్ చెబుతాడు. అయితే దీని వల్ల సూరజ్‌కు ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయినట్లుగా తెలియడంతో కార్తీక్ బాధపడతాడు. అవకాశాలు మళ్లీ వస్తాయి.. కానీ ప్రాణాలు పోతే తిరిగి రావని సూరజ్ అంటాడు. చాలారోజుల తర్వాత ఒక మంచి మనిషిని చూశానని, మిమ్మిల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉందని అంటాడు కార్తీక్. మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ మాత్రమే వచ్చింది. ఈసారి కనుక హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, శ్రీధర్‌లు షాక్ అవుతారు.
బావ చేతిలో ఇరుక్కుపోవడంతో పాటు తల్లి చేతిలో తన్నులు తినడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. ఇంతలో పారు వచ్చి నెల రోజుల్లో నీకు పెళ్లి జరగడం ఖాయమని చెబుతుంది. దీప ఒక్కతే రావడంతో కార్తీక్ కోసం శ్రీధర్‌కి ఫోన్ చేస్తుంది కాంచన. వాడు నా దగ్గరే ఉన్నాడని సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్. తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లి స్వప్న, కావేరి, కాశీలకు జరిగింది చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నాన్న ప్రాణాలతో ఉండాలంటే ఆయన సంతోషంగా ఉండేలా చూసుకోవాలని.. లేదంటే మా ఇంటికి తీసుకెళ్లిపోతానని చెబుతాడు కార్తీక్. దాంతో స్వప్న కంటతడి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 4వ తేదీ 661వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అందరిముందు అవమానం జరగడంతో దాని గురించే ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. ఇంతలో శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, పారులు భోజనం తీసుకుని వస్తారు. ఆకలిగానే ఉంది కానీ నాకు జరిగిన అవమానంతో తినాలని అనిపించడం లేదని అంటుంది జ్యోత్స్న. కార్తీక్‌కి, జ్యోత్స్నకి పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది.. ఇది మరిచిపోవడానికి నీకు 365 రోజులు సరిపోలేదా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నీ ఆలోచన, నీ కోరిక ఇంకా తప్పు.. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారని దశరథ క్లాస్ పీకుతాడు. నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావని తెలిసిన వెంటనే యూటర్న్ తీసుకోవాలి.. ఎంత ఆలస్యం చేస్తే అంత దూరం వెనక్కి రావాలి, నీ జీవితంలో విలువైన సమయాన్ని ఎవరి కోసం వృథా చేయొద్దు. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకోమని చెబుతాడు శివన్నారాయణ.
మీ నాన్న వీలునామా కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలని భోజనం తినిపిస్తాడు పెద్దాయన. నువ్వు పద్ధతిగా ఉండాలన్నది మా కోరిక.. అప్పుడే మా పెంపకానికి విలువ అంటాడు దశరథ. ఇప్పటి వరకు జరిగినదంతా మరిచిపో.. రేపటి నుంచి కొత్త జీవితం మొదలుపెట్టమని సలహా ఇస్తాడు పెద్దాయన. కార్తీక్ ఆలస్యంగా ఇంటికి రావడంతో కొడుకుపై సీరియస్ అవుతుంది కాంచన. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లాలి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీనా? అని మండిపడుతుంది. ఇప్పుడే ఇంటికొచ్చిన మనిషిని ఇలా అడుగుతారా? అంటూ దీప అడగ్గా.. మీ అత్తయ్య ఆలోచించేది నీ గురించేనని అంటుంది అనసూయ.
నా గురించి మీరిద్దరూ గొడవ పడొద్దని చెబుతాడు కార్తీక్. మీ నాన్నని కలవడానికి వెళ్లినప్పుడు ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అంటుంది కాంచన. మీ నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించగా... ఆసుపత్రికి వెళ్లామని కార్తీక్ అంటాడు. ఆ మాటలతో కాంచన టెన్షన్ పడుతుంది. నాన్న బాగానే ఉన్నారు.. ఇంటి దగ్గర దించేసి వచ్చానని చెబుతాడు కార్తీక్. కాంచన భోజనం చేయనని చెప్పడంతో .. ఇంత ప్రేమ పెట్టుకుని ఆ మనిషిని ఎందుకు దూరం పెడుతున్నావని మండిపడతాడు కార్తీక్. నీ తండ్రి గురించి నేను శ్రద్ధ తీసుకోవడంలో తప్పేముందని అంటూ ఒట్టి అన్నమే తింటుంది కాంచన.
ఉదయాన్నే కార్తీక్‌ని పిలిచి లాగిపెట్టి కొడుతుంది కాంచన. మీ నాన్నకి గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పలేదని నిలదీయడంతో దీప, అనసూయలు షాక్ అవుతారు. అది మామూలు గుండెపోటు కాదు.. దేవుడిలా ఎవరో అబ్బాయి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయన ప్రాణాలు పోయేవని కాంచన అంటుంది. నువ్వు హాస్పిటల్‌కి వెళ్లేటప్పుడు నాన్నకి గుండెపోటు వచ్చిందని నాకు చెప్పాలి కదా? చచ్చిపోయిన తర్వాత చెప్పాలని అనుకున్నావా? కావేరి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి నిజాలన్నీ తెలిశాయి.. లేదంటే అన్నీ మీరు సీక్రెట్‌గా చేసేవాళ్లు. ఇది దాచుకునే విషయం కాదు. మా అన్నయ్యకి 10 ఏళ్ల వయసున్నప్పుడు మా అమ్మ గుండెపోటుతో చనిపోయింది. నిజం చెబితే తట్టుకోలేమని మా అమ్మ చచ్చిపోయిన విషయాన్ని మా నాన్న చెప్పలేదు. పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకున్నప్పుడు మా అన్నయ్యకి మా ఇంటి వంట మనిషి వచ్చి చెప్పింది. కనీసం మా అమ్మని చివరి చూపైనా చూసుకునే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతుంది కాంచన.
మీ నాన్నని వదిలేశాను.. కానీ నేను ఆయనతో కలిసి బతికాను. నీ తండ్రి చేసిన ప్రమాణాలు నీటి మీద రాతలే కావొచ్చు.. కానీ నేను చేసిన ప్రమాణాలు శిలాశాసనాలు. అందుకే మనిషిని వదిలేశాను కానీ మంగళసూత్రాన్ని వదిలేయలేదు. సౌభాగ్యాన్ని వదిలేశాను కానీ ఐదో తనాన్ని వదిలేయలేదు. నా తల్లి విషయంలో నా తండ్రి చేసిన తప్పు, నువ్వు నా విషయంలో చేయొద్దని కార్తీక్‌కి చెబుతుంది. జీవితాన్ని చాలా ప్రాక్టీకల్‌గా చూసుకుంటాను.. చావుకు భయపడను, కానీ మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనని బాధపడుతుంది కాంచన. నువ్వు తట్టుకోలేవని అలా చేశానని అంటాడు కార్తీక్. మీ నాన్నకి ఏమైనా అయితే నాకు భర్త లేకపోవడమే కాదు, నీకు తండ్రి ఉండడు, దీపకి మామగారు ఉండడు, శౌర్యకి తాత ఉండడు, మా నాన్నకి అల్లుడు ఉండడని బాధపడుతుంది కాంచన. మనిషి జీవితం కూడా తీగ లాంటిదే మొదలు తెగిపోతే అన్ని బంధాలు అగ్నిలో కలిసిపోయినట్లేనని చెబుతుంది.
కోపంలో నిన్ను గట్టిగా కొట్టానని బాధపడుతుంది కాంచన. నువ్వు అమ్మని తీసుకుని స్కూల్‌కి వెళ్లు.. నేను అమ్మా హాస్పిటల్‌కి వెళ్తామని చెబుతాడు కార్తీక్. శ్రీధర్‌ని తీసుకుని హాస్పిటల్‌కి రమ్మని కాశీకి ఫోన్ చేస్తాడు. నాకు హార్ట్ అటాక్ వచ్చిందని కాంచనకు ఎందుకు చెప్పావని కావేరిపై మండిపడతాడు శ్రీధర్. పెద్దమ్మ కోప్పడదని స్వప్న చెప్పగా.. మీ పెద్దమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదు. వద్దు అనుకున్న మనుషులకి ఏదైనా జరిగితే తట్టుకోలేదని చెబుతాడు. కాశీని నువ్వు వద్దు అనుకున్నావు కదా? కాశీకి ఏమైనా అయితే బాధపడతావా? లేదా? అని అడుగుతాడు శ్రీధర్. ఇంతలో కాశీ వచ్చి.. బావ హాస్పిటల్‌కు తీసుకురమ్మన్నాడని చెప్పడంతో స్వప్నతో కలిసి ఆసుపత్రికి బయల్దేరతాడు శ్రీధర్. హాస్పిటల్‌లో శ్రీధర్‌కి టెస్టులు చేసిన డాక్టర్.. ఆయన హార్ట్ చాలా వీక్‌గా ఉందని, మరోసారి స్ట్రోక్ వచ్చిందంటే బతకడం కష్టమని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. 15 రోజుల పాటు మెడిసిన్స్ వాడాలి, ఒత్తిడి తగ్గించాలి.. మరోసారి టెస్టుల తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేస్తామని చెబుతాడు డాక్టర్.
రోజులన్నీ మనవి కావు.. ఇప్పుడు నీ టైం నడుస్తోందని కదా నడిపించు. నా టైమ్ స్టార్ట్ అయినప్పుడు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు భయపడే పరిస్ధితి వస్తుందని పారికి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఈ పారిజాతం గట్టిగా చీరకొంగు బిగించిందంటే ఆ గాలికే రెండు అడుగులు వెనక్కి జరుగుతావని వార్నింగ్ ఇస్తుంది పారు. బావ ఆడుతున్న ఆటలో నువ్వు అరటిపండువి, నిన్ను ఆ దేవుడు కూడా బాగుచేయలేడని చెబుతుంది కార్తీక్. దీప ఒక్కటే రావడంతో కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది జ్యోత్స్న. దీప ఆడపులి పంజా విసిరిందంటే నువ్వు తట్టుకోలేవని చెబుతుంది పారు. భవిష్యత్తులో నువ్వు గుక్కపట్టుకుని ఏడుస్తావని హెచ్చరిస్తుంది పారు. దీప 24 క్యారెట్ల బంగారమని చెబుతుంది. నేను కూడా దీపని ఇలాగే మోశాను, గుడ్డిగా నమ్మాను.. చివరికి నాకు పెద్ద టోపీ పెట్టిందని అంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications