Karthika Deepam 2 May 6th: సీఈవో ఛైర్‌ కోసం జ్యోత్స్న స్కెచ్.. కార్తీక్, శివన్నారాయణలకు బోర్డ్ మెంబర్స్ షాక్

Photo Courtesy: JioHotstar

శ్రీధర్‌ని డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెబుతుండగా.. ఆఫీస్ నుంచి పదే పదే ఫోన్లు వస్తుండటంతో కాంచన సీరియస్ అవుతుంది. మీరు ఈ పరిస్దితికి రావడానికి కారణం మీ పిల్లలేనని మండిపడుతుంది. స్వప్నని ఆలోచించమని చెప్పి.. కార్తీక్, శ్రీధర్‌లను తీసుకుని శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది కాంచన. ఒకేసారి ముగ్గురు రావడంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది.

ఇకపై మా ఆయన సీఈవోగా ఉండడు, అలాగే నా కొడుకుని కూడా అగ్రిమెంట్ నుంచి రిలీజ్ చేయమని అడుగుతుంది కాంచన. శ్రీధర్‌ని సీఈవోగా నేను తప్పిస్తాను కానీ, అగ్రిమెంట్ విషయం జ్యోత్స్న చేతుల్లోనే ఉందని శివన్నారాయణ చెబుతాడు. నా మెడలో మూడు ముళ్లు పడే వరకు బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాదని తేల్చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ కూడా తన అగ్రిమెంట్‌కి కట్టుబడే ఉంటానని చెప్పడంతో కాంచన సైలెంట్ అయిపోతుంది. మావయ్య గారి కోసం మనిద్దరి కలిసి ఉన్నట్లుగా నటిద్దామని చెబుతాడు కాశీ. నెక్ట్స్ సీఈవో ఎవరో బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుందామని అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 6వ తేదీ 663వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 663 May 6th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న ఏదో పెద్ద ప్లాన్‌తోనే ఉంది మనందరితో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందని దీపతో అంటాడు కార్తీక్. నేను సీఈవో పోస్ట్‌లో కూర్చొంటానని ముందుజాగ్రత్త పడుతుందని అంటాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేసి మీ ఇద్దరితో మాట్లాడాలని దీపకి, కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కాంచన, శ్రీధర్‌లు మాట్లాడుకుంటూ ఉండగా.. జ్యోత్స్నకి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తుంది కాంచన. నా కొడుకు అభిమాన్యుడిలా జ్యోత్స్న వేసిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడని అంటుంది. పెళ్లయ్యే వరకు బావకి విడుదల లేదని కండీషన్ పెట్టింది.. కానీ మనోడు ఎందుకు బయటకు రావడం లేదు? రావడం లేదంటే ఏదో ఉంది? జ్యోత్స్న గీసిన గీతను దాటడం లేదంటే దాని వెనుక దీప ఉంది. నా నోటి కంటే నీ నోరుకి బలం ఎక్కువ కాబట్టి ఒకసారి నువ్వే గట్టిగా అడుగమని చెబుతాడు శ్రీధర్. దీప కోసమే కార్తీక్ ఇదంతా చేస్తున్నాడు.. కానీ ఇది మనకి తెలియని విషయం. కానీ ఇప్పుడు మనం ఇదంతా తెలుసుకోవాలని అంటాడు.

నేను ఇచ్చిన ఆఫర్‌కి మీరిద్దరూ వంటగదిలోకి వెళ్లి డ్యాన్స్ చేస్తానని అనుకున్నానని అంటుంది జ్యోత్స్న. నాకు పెళ్లయితే మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడం అంటే పెద్ద ఆఫర్ అని చెబుతుంది. మీరు ఎలాగూ థ్యాంక్స్ చెప్పరు.. అందుకే థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నేనే పిలిచాను. నువ్వు మావయ్య ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని ఇదంతా చేశావు. నేను తెలివిగా మీ ఇద్దరినీ లాక్ చేశాను. త్వరలోనే సీఈవో పోస్ట్ గురించి టాపిక్ తీసుకొస్తారు.. ఎలాగూ నాకే ఆ పోస్ట్ వస్తుందని అంటుంది జ్యోత్స్న. ఇది ఎందుకు రెచ్చిపోతుందని మండిపడుతుంది దీప. మాకు బంపరాఫర్ ఇచ్చావా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా? అని దీప ప్రశ్నిస్తుంది.

అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నాకు బానిసే.. నా మెడలో తాళిపడితే రెండు సమస్యలు తీరతాయి. మొదటిది నువ్వు వారసురాలివని అందరికీ తెలియడం, రెండోది బావ సీఈవో అవ్వడం. ఈ రెండు జరగాలంటే నా మెడలో తాళి పడాలి. అది బావే కట్టాలని మండిపడుతుంది జ్యోత్స్న. చెప్పుతెగేలా కొడతా... అసలు నువ్వెవరు మాకు ఆఫర్లు ఇవ్వడానికి నీ అగ్రిమెంట్‌కి కట్టుబడి ఉన్నామని అనుకున్నావా? దానిని దాటి మా బావ బయటికి రావాలంటే క్షణం పట్టదని ఛాలెంజ్ చేస్తుంది దీప. నాకు తిక్కరేగితే సరాసరి తాత దగ్గరికి వెళ్లి వైరాతో నువ్వు కలిసిపోయావని చెబుతానని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వాడి నెంబర్ బావ ఫోన్‌లో ఉంది.. వాడితో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడితే మీ బుర్ర గిరా గిరా తిరుగుతుందని అంటుంది దీప.

వాడు చెప్పలేదు అనుకో.. నేను డీఎన్ఏ దగ్గరి నుంచి కథ చెప్పడం స్టార్ చేస్తానని అంటాడు కార్తీక్. అలా చేస్తే మీ అత్త బతుకుతుందా అని జ్యోత్స్న అడుగుతుంది. మా వాళ్ల ప్రాణాల కోసమే మేం అన్నీ భరిస్తున్నాం.. అంతే తప్పించి నీ మాటకు మేం బందీలం కాదు, తెంపుకుపోవాలంటే క్షణం పట్టదు. నువ్వు ఇచ్చిన ఆఫర్లలో నేను ఈ ఇంటి వారసురాలిని అని చెప్పడం కూడా ఉంది. నువ్వు చెప్పకపోతే నేను ఇంటి వారసురాలిని కదా? నువ్వు చెప్పావని నేను మా అమ్మకి పుట్టానా? నువ్వు చెప్పావని నేను మా అమ్మని కాపాడానా? అని ప్రశ్నిస్తుంది దీప.

ఈ ఇంట్లో ఇప్పటికీ నా టైమే నడుస్తోంది.. ఎవరికీ ఏమీ కాదన్న కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నావని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నువ్వు కాబోయే పెళ్లికొడుకు కోసం కలలు కను.. నేను, దీప నీ పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి సాగనంపుతాం. దీపం ఉండగానే చక్కదిద్దుకునే పోలిక.. అన్నీ పారు పోలికలు, ఒక్కటి కూడా మా దాస్ మావయ్యది రాలేదని అంటాడు కార్తీక్. వస్తే మంచిదైపోయేదని చెబుతుంది దీప. నువ్వు సీఈవో కాదు కదా? ఆఫీస్ క్లర్క్ కూడా కాలేవు.. తాతతో మాట్లాడాల్సింది చాలానే ఉందని వెళ్లిపోతాడు కార్తీక్. నన్ను ఆపడానికి ఏం చేయాలో చేయ్.. నేనేం చేయాలో నాకు తెలుసని అనుకుంటుంది జ్యోత్స్న.

సీఈవో పోస్ట్ గురించి శివన్నారాయణ, దశరథలతో మాట్లాడతాడు కార్తీక్. సీఈవో అంటే మనలో నుంచా? బయటి నుంచా అనేది ఆలోచిస్తున్నా. కానీ జ్యోత్స్నకి మంచి సంబంధం చూడటం , దానికి పెళ్లి చేయడం పెద్ద సమస్య అయిపోయిందని అంటాడు శివన్నారాయణ. ముందు సీఈవోని చూడు.. నెలలోపే మన చుట్టాల్లో ఎవరున్నారో చూద్దామని చెబుతాడు. మనం యోగ్యుడైన కుర్రాడిని చూసి సీఈవోగా, నీ మనవరాలి భర్తగా ఉంటాడని అంటాడు కార్తీక్. ఈ ప్లాన్ బాగుందని పారు చెబుతుంది. అందరూ సరేనని చెప్పడంతో.. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో పోస్ట్‌కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వమని చెబుతాడు శివన్నారాయణ. వచ్చిన వాళ్లలో బెస్ట్ ఎవరో చూసి ఫైనల్ చేద్దాం.. అతని ప్రవర్తనను బట్టి మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దామని చెబుతాడు.

ఇందులో కొంత జ్యోత్స్నకి తెలియాలి. సీఈవోని సెలెక్ట్ చేయాలి, ఆ టీమ్‌లో నువ్వు ఉండాలి. అప్పుడు ఆమెకు నచ్చిన వ్యక్తే సీఈవో అవుతాడు, తర్వాత భర్త అవుతాడని చెబుతాడు కార్తీక్. అయితే నేనే జ్యోత్స్నకి చెబుతానని అంటాడు శివన్నారాయణ. దాని గురించి నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావని కార్తీక్‌పై మండిపడుతుంది పారు. ఖాళీగా ఉంటే బుర్ర కూడా సరిగా పనిచేయదు. అదే కంపెనీ వ్యవహరాలలో బిజీగా ఉంటే దీప జోలికి రాకుండా ఉంటుందని చెబుతాడు కార్తీక్. ప్లాన్ అదిరిపోయిందని అంటుంది పారు.

జ్యోత్స్న దగ్గరకి వచ్చిన సుమిత్ర.. మీ అత్తకి ఫోన్ చేసి సారీ చెప్పమని చెబుతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి సీఈవో పోస్ట్ గురించి మాట్లాడాలని అంటాడు. ఆ కాసేపటికే బోర్డ్ మెంబర్స్ వచ్చి కొత్త సీఈవో గురించి మాట్లాడాలని చెబుతారు. ఇదంతా నా పనేనని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కొత్త కుర్రాడిని చూసి బాధ్యతలు అప్పగిస్తామని చెబుతాడు శివన్నారాయణ. తొలుత దశరథగారు, తర్వాత కార్తీక్ గారు, జ్యోత్స్నగారు, తర్వాత మీ అల్లుడుగారిని సీఈవోని చేశారు. కానీ ఇప్పుడు కొత్త వారిని సీఈవోని చేస్తే మీ ఫ్యామిలీలో ఎవరికీ సామర్ధ్యం లేకే బయటివాళ్లని తెచ్చారని అనుకుంటారని అంటారు బోర్డ్ మెంబర్స్. ఇది మీరే మాట్లాడుతున్నారా? మీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా? అని కార్తీక్ ప్రశ్నించడంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. బయటివాళ్లే సీఈవో అనుకుంటే మేం ఉండాలో లేదో నిర్ణయం తీసుకుంటామని బోర్డ్ మెంబర్స్ తేల్చి చెబుతారు. బయటివాళ్లు లోపలికి వెళ్తారు.. లోపలి వాళ్లు బయటికి వెళ్తారని చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు.

సైలెంట్‌గా వచ్చి వార్నింగ్ ఇచ్చారు.. అనుచరుడు ఆవేశపడాలి కానీ, నాయకుడు ఆవేశపడకూడదని అంటాడు శివన్నారాయణ. కార్తీక్, దీపలు బయటికి వెళ్తుండగా జ్యోత్స్న వచ్చి.. ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చిటికె వేస్తే ఏదైనా అయిపోతుందని దీప ఊగిపోయింది. జరగబోయే బోర్డ్ మీటింగ్‌లో చాలా అద్భుతాలు జరుగుతాయని చెబుతుంది. దేనిని నువ్వు ఆపలేవని వార్నింగ్ ఇస్తుంది. శ్రీధర్‌ని కాపాడిన సూరజ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండగా జ్యోత్స్న చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X