Karthika Deepam 2 May 7th: సూరజ్ దెబ్బకి జ్యోత్స్నకి ముచ్చెమటలు... కార్తీక్ అగ్రిమెంట్‌కు కాంచన డెడ్‌లైన్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న మనందరితో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందని దీపతో అంటాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడాలని చెబుతుంది. మరోవైపు.. నా కొడుకు అభిమన్యుడిలా జ్యోత్స్న వేసిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడని కాంచనతో అంటాడు శ్రీధర్. దీప కోసమే కార్తీక్ ఈ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడం లేదని చెబుతాడు. దీప, కార్తీక్, జ్యోత్స్న మధ్య జరుగుతున్న కథను తెలుసుకోవాలని అనుకుంటాడు శ్రీధర్. నేను ఇచ్చిన ఆఫర్‌కి మీరిద్దరూ డ్యాన్స్ చేస్తారని అనుకున్నానని కార్తీక్, దీపలతో అంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నా బానిసే... నాకు పెళ్లయితేనే నువ్వు ఈ ఇంటి వారసురాలివని తెలుస్తుంది, బావ సీఈవోగా ఉంటాడని అంటుంది జ్యోత్స్న.
నువ్వు, వైరా కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారని మా తాతతో చెబుతా.. మా బావ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడిస్తానని వార్నింగ్ ఇస్తుంది దీప. నువ్వు సీఈవో కాదు కదా? ఆఫీస్ క్లర్క్ కూడా కాలేవని ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. దశరథ, శివన్నారాయణలతో కంపెనీ సీఈవోగా ఉన్న వ్యక్తే జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటాడని చెబుతాడు కార్తీక్. ఇంతలో బోర్డ్ మెంబర్స్ వచ్చి.. మీ కుటుంబం నుంచి కాకుండా బయటి నుంచైతే సీఈవోని ఒప్పుకోమని తేల్చిచెబుతారు. ఇదంతా జ్యోత్సే వెనుకుండి నడిపిస్తుందని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 7వ తేదీ 664వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అర్ధరాత్రి కారు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న సూరజ్‌ని చూసిన జ్యోత్స్న.. వాడి ఇగో మీద దెబ్బకొట్టాలని అనుకుంటుంది. లిఫ్ట్ ఇస్తున్నట్లు చెప్పి కారు ఎక్కించుకుంటుంది. నీ తల పొగరు దించుతానని అనుకుంటుంది. డబ్బులు తీసుకుంటేనే కారు ఎక్కుతానని తేల్చేస్తాడు సూరజ్. అలాగేనని చెబుతుంది జ్యోత్స్న. మరోవైపు.. ఈరోజు నాకున్న అన్ని డౌట్లు క్లియర్ చేసుకునే వెళ్తానని కాంచనతో చెబుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ వచ్చి ఈ టైం వరకు మా ఇంట్లో ఏం చేస్తున్నావని అడుగుతాడు. మన జీవితాలు ప్రెజర్ కుక్కర్‌లో బంగళాదుంపలా ఉడికిపోవడం కంటే మనందరికీ ఉపశమనం కావాలని అంటాడు శ్రీధర్.
జ్యోత్స్న పెళ్లి జరిగిన వెంటనే నీకు విడుదల.. అంటే నెల రోజుల్లో నీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. మరి నీ భార్యకు విడుదల ఎప్పుడు? అని ప్రశ్నిస్తుంది కాంచన. తను వేరు, నేను వేరు కాదు కదా అని అంటాడు కార్తీక్. భార్యకు ఆనందాన్ని పంచాలి కానీ కష్టాలు కాదని చెబుతుంది కాంచన. బావా నేను ఒకటే కదా? కష్టాలైనా సుఖాలైనా కలిసే మోస్తామని చెబుతుంది దీప. ఇప్పటికే నువ్వొక బరువుని మోస్తున్నావు.. ఈ అదనంగా మోసే బరువుని ఈరోజే దింపేసుకో. రేపటి నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్లొద్దని ఆర్డర్స్ వేస్తుంది కాంచన. బావ షరతులు నాకు కూడా వర్తిస్తాయి, జ్యోత్స్న పెళ్లయ్యే వరకు నేను కూడా వెళ్తానని చెబుతుంది దీప.
అయితే నీ భార్య నీతో కలిసి ఆ ఇంటికి ఎందుకు వెళ్లాలని శ్రీధర్ నిలదీస్తాడు. భర్తను వదల్లేక నాతో వస్తోందని.. ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డను వీపుకు కట్టుకుని యుద్దం చేసింది అని చెబుతాడు కార్తీక్. ఛిన్నాభిన్నమైన కుటుంబం కోసం యుద్ధం చేస్తున్నానని అంటాడు. నా వాళ్లంతా బాగుండాలనే స్వార్ధం.. కుటుంబం అంటే నన్ను కన్నవాళ్లు, వాళ్లని కన్నవాళ్లు, మా అమ్మ తోడబుట్టిన వాళ్లు, మన కోసం బతికేవాళ్లు అని చెబుతాడు కార్తీక్. ఇంతమంది బరువు నీకెందుకు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్.
జ్యోత్స్న మనుషుల్ని సాధించే రకం.. నెల రోజుల్లో పెళ్లి చేయాలి, ఇప్పుడు సీఈవో సమస్య అని అంటుంది కాంచన. ఓ మంచి కుర్రాడిని చూసి సీఈవోని చేయాలని అనుకున్నాం. కానీ దానిలో చిన్న మార్పులు జరిగేలా ఉన్నాయని చెబుతాడు కార్తీక్. ఎవరిని సీఈవో చేస్తే నీకెందుకు? జ్యోత్స్నని సీఈవో చేస్తే చేయని, బయటి నుంచి తెచ్చుకుంటే తెచ్చుకోని అని చెబుతుంది కాంచన. వాళ్ల బాధలేవో వాళ్లు పడతారు.. నెల రోజుల తర్వాత మీరిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెడతారు కదా? వీడికి అది తాతగారి ఇల్లు.. నువ్వు వాళ్లకి ఉచిత సేవలు చేయాలి? ఎందుకు నువ్వు మాటలు పడాలని ప్రశ్నిస్తుంది కాంచన. నీ భర్త అగ్రిమెంట్‌కి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది? నీ ఉచిత సేవలకు ఎక్స్‌పైరీ డేట్ వస్తుందని దీపని నిలదీస్తుంది కాంచన.
మిమ్మల్ని నమ్మించాలంటే మేం ఏం చేయాలని దీప అడగ్గా.. ఒట్టేయాలని శ్రీధర్ చెబుతాడు. జ్యోత్స్నకు పెళ్లి అయినా, కాకపోయినా నెల రోజులు తర్వాత ఆ ఇంటికి వెళ్లమని ఒట్టేయండి అని అంటాడు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మాటిచ్చారు కాబట్టి మనసు మార్చుకోకుండా బిడ్డతో ఇంటికి వచ్చారు.. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉందని చెబుతుంది కాంచన. నెల రోజుల తర్వాత ఏం జరిగినా మీరిద్దరూ ఆ ఇంటికి వెళ్లనని మాటివ్వాలని మండిపడుతుంది. దాంతో దీప వచ్చి కాంచన చేతిలో చేయ్యేసి మాటిస్తుంది. కార్తీక్ కూడా వచ్చి నా భార్యతో పాటు నేను కూడా మాటిస్తున్నానని అంటాడు. నా కొడుకు మాటిచ్చాడంటే మాట తప్పడని చెబుతాడు శ్రీధర్. చేయాల్సింది అంతా చేసి హాయిగా ఉందని అంటున్నాడని తండ్రిపై మండిపడతాడు కార్తీక్.
జ్యోత్స్నకి థ్యాంక్స్ చెబుతాడు సూరజ్. నన్ను అందరూ అపార్ధం చేసుకుంటారని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏం పనిచేస్తావని అడుగుతుంది జ్యోత్స్న. మనసుకు నచ్చిన పని చేస్తుంటానని సూరజ్ చెప్పగా.. వీడికి ఇగో మామూలుగా లేదుగా అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కారు వేరే రూట్‌లో వెళ్లడం గమనించిన సూరజ్. నేను వెళ్లాల్సింది మణికొండ అంటాడు. మీరు మణికొండ అన్నారా? నేను ఎల్‌బీ నగర్ అనుకుని డ్రాప్ చేస్తానని చెప్పానని ప్లేట్ తిప్పేస్తుంది. చాలా లాంగ్ వచ్చేసినట్లుగా ఉన్నామని జ్యోత్స్న చెప్పగా.. నన్ను మెయిన్ రోడ్‌లో దించమని అడుగుతాడు సూరజ్.
మీరే నడుచుకుంటూ వెళ్లిపోమని చెబుతుంది జ్యోత్స్న. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. ఆరోజు గిఫ్ట్ షాప్‌లో నాతో అనవసరంగా ఆర్గ్యూ చేశాడు.. వీడికి ఇలాగే జరగాలని అంటుంది. కారెక్కి కూర్చున్న జ్యోత్స్నకి తాళాలు, ఫోన్ కనిపించకపోవడంతో కంగారుపడుతుంది. దాంతో సూరజ్ తీశాడని చుట్టుపక్కల వెతుకుతుంది, అయినప్పటికీ అతను కనిపించకుండా పోవడంతో షాక్ అవుతుంది. ఏం దెబ్బ కొట్టావురా? నేను నీకు షాకివ్వాలని అనుకుంటే.. నువ్వే నాకు షాకిచ్చావని అనుకుంటుంది. నువ్వు నాకు దొరకాలి నా చేతిలో చచ్చిపోపతావని రగిలిపోతుంది.
మా అమ్మకి ఎందుకు మాటిచ్చావు? అని దీపని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నా తల్లి కోసం నువ్వు ఆలోచించినట్లే.. నీ తల్లి కోసం నేను ఆలోచిస్తున్నానని చెబుతుంది దీప. ఈ సమస్యకు జ్యోత్స్న పెళ్లి జరగడమే పరిష్కారం. అది మాట్లాడితే బావతో పెళ్లి అని ఎందుకు అంటుంది అంటే అందరినీ మెంటల్‌గా ప్రిపేర్ చేస్తుందని చెబుతుంది దీప. నేను ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ జ్యోత్స్నది. పెద్ద మేడం గారికి కళ్యాణ ఘడియలు దగ్గరపడ్డాయంటే వాడే వస్తాడు.. వెతుక్కుంటూ వచ్చి జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటాడని చెబుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ, సూరజ్‌ని తిట్టుకుంటూ ఉండగా.. ఒక ఆటో వస్తుంది. ఆ ఆటోలో సూరజ్ ఉంటాడు. వాడిని దించేస్తే నీకు 10 వేలు ఇస్తానని ఆటోవాడికి చెబుతుంది జ్యోత్స్న. అది కుదరదని ఆటోవాడు చెప్పడంతో తిట్టుకుంటూ ఆటో ఎక్కుతుంది జ్యోత్స్న. నేనేంటో నీకు తెలిసేలా చేస్తానని రగిలిపోతుంది.
జ్యోత్స్న ఇంటికి రాకపోవడంతో శివన్నారాయణ కుటుంబం కంగారుపడుతుంది. ఇంతలో కార్తీక్‌కి దశరథ ఫోన్ చేసి జ్యోత్స్న అక్కడికి వచ్చిందా? అని అడుగుతాడు. నాకేం తెలియదని కార్తీక్ చెబుతాడు. ఈ మతిలేని మనిషి మా అమ్మానాన్నలని ప్రశాంతంగా ఉండనీయదని రగిలిపోతుంది దీప. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications