Karthika Deepam 2 May 8th: కార్తీక్‌కి మాజీ భార్యని చేస్తానంటూ జ్యోత్స్న సవాల్.. సుమిత్ర ముందు ఇరికించిన దీప
Photo Courtesy: JioHotstar
అర్ధరాత్రి క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న సూరజ్‌ని చూసిన జ్యోత్స్న అతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని కారులో లిఫ్ట్ ఇచ్చి మనుషులు లేని ప్రదేశంలో దూరంగా దించుతుంది. నేను వేరే రూట్ వెళ్లాలని చెప్పి తప్పించుకుంటుంది. కారులో కూర్చోగానే తాళాలు, ఫోన్ కనిపించకపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. క్యాబ్స్ దొరకకపోవడంతో నడుచుకుంటూ వెళ్తుంది. కార్తీక్, దీపలు శివన్నారాయణ ఇంటి నుంచి వచ్చేయాలని కాంచన, శ్రీధర్‌లు కండీషన్ పెడతారు. నెల రోజుల్లో ఆ ఇంటితో బంధం తెంచుకుంటానని మాట ఇవ్వమని కాంచన అడగటంతో దీప ఒట్టు వేస్తుంది. ఆ వెంటనే కార్తీక్ కూడా ఒట్టు వేస్తాడు.
మా అమ్మకి ఎందుకు మాటిచ్చావని దీపపై మండిపడతాడు కార్తీక్. మా అమ్మ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు, నేను మీ అమ్మ గురించి ఆలోచించకూడదా అని అంటుంది దీప. నెల రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అందరినీ మెంటల్‌గా ప్రిపేర్ చేస్తోందని, మనం జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. నడుచుకుంటూ వెళ్తున్న జ్యోత్స్నకి ఒక ఆటో కనిపించడంతో ఎంతైనా ఇస్తాను నన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది. ఆటోలో సూరజ్ ఉండటంతో ఎక్కనని మారాం చేస్తుంది.. కానీ చేసేదేం లేక ఆటోలో కూర్చొంటోంది. జ్యోత్స్న ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కార్తీక్‌కి దశరథ కాల్ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 8వ తేదీ 665వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆటో దిగుతూ జ్యోత్స్నకి మొబైల్, కారు తాళాలు ఇచ్చేస్తాడు సూరజ్. మనం ఎదుటివాళ్లని మోసం చేయాలని చూస్తే మనమే ఇరుక్కుపోతాం. మన మధ్య జరిగిన పాత గొడవని సీరియస్‌గా తీసుకుని నన్ను ఏడిపించాలని లిఫ్ట్ ఇచ్చారు. అది నాకు అర్ధమై.. మరోసారి ఎవరిని ఎప్పుడూ ఇలా ఇబ్బంది పెట్టకూడదని అర్ధం కావడానికే ఇలా చేశానని అంటాడు సూరజ్. మిమ్మల్ని వదిలేసి నా దారి నేను పోవచ్చు.. కానీ ఈ ఏరియా మంచిది కాదు, అందుకే వెనక్కి వచ్చానని, ఆటోకి డబ్బులిచ్చేశానని చెబుతాడు. నీ ముష్టి నాకు అక్కర్లేదని జ్యోత్స్న అనడంతో నువ్వు నోరుజారితే నిన్ను ఇక్కడే దించేసి ఆటోని వెళ్లిపోమని చెబుతానని చేతిలో డబ్బులు పెడతాడు. నాకు మీ కారులో లిఫ్ట్ ఇచ్చినందుకు సర్వీస్ ఛార్జ్ అంటాడు సూరజ్. లైఫ్‌లో మళ్లీ దొరుకుతావు.. నీ కంట్లో నీళ్లు చూడకపోతే నా పేరు జ్యోత్స్నే కాదని అనుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న ఇంటికొచ్చేసరికి దీప కాల్ చేస్తుంది. నువ్వు నీ మొగుడి గురించి ఆలోచించుకో.. ఊళ్లో అందరి గొడవ నీకెందుకు. నాకు నచ్చినట్లు తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్తాను అడగటానికి నువ్వెవరు అంటుంది జ్యోత్స్న. మీ బావ భార్యని అని చెబుతుంది దీప. మధ్యలో మరో పదం యాడ్ చేసుకో.. మాజీ అనే పదం కలుపుకో, ఎందుకంటే అప్పటికే బావ నా భర్తగా ఉంటాడని అంటూ లోపలికి అడుగుపెట్టి షాక్ అవుతుంది. దీప తన ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేసిన మాటలన్నీ శివన్నారాయణ కుటుంబం వింటుంది. నువ్వు కనిపించడం లేదని కార్తీక్‌గాడికి ఫోన్ చేస్తే ఇక్కడ మేం ఏమైపోతామోనని మాకు ధైర్యం చెప్పడానికి వాళ్లిద్దరూ వచ్చారని అంటాడు దశరథ. మా ఫోన్లు లిఫ్ట్ చేయడానికి ఖాళీ లేదు.. కానీ దీప ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడానికి మాత్రం ఖాళీ ఉందా అంటూ సుమిత్ర సీరియస్ అవుతుంది.
ఆరోజు దీప నీతో ఫోన్‌లో తప్పుగా మాట్లాడితే దీపని తప్పుబట్టాను.. ఇప్పుడు నీ మాటలు వింటే అర్ధమవుతోంది, ఆ రోజు దీప మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అంటుంది సుమిత్ర. నీ మొగుడికి నీ పెళ్లాన్ని అవుతానని దీపతో చెప్పడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతుంది పారు. ఇంతకుముందే నీకు చెప్పినా నీ బుద్ధి మారలేదు.. కార్తీక్ గురించి తప్పుగా ఆలోచిస్తే నేను క్షమించనని సుమిత్ర తేల్చేస్తుంది. పైకి కనిపించను కానీ నేను చాలా మొండిదానిని, ఒకసారి వద్దు అనుకున్నానంటే అది రక్తం పంచుకున్న వాళ్లయినా సరే తీసి పక్కనపెడతానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ వైరాగాడు నిన్ను మళ్లీ కిడ్నాప్ చేశాడేమోనని భయపడ్డామని అంటుంది పారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లావు.. ఇప్పటి వరకు రాకపోతే కంగారుపడతామని అంటాడు దశరథ.
అసలు నువ్వు ఇప్పటి వరకు ఎక్కడ తిరిగావు అని మనవరాలిని శివన్నారాయణ నిలదీస్తాడు. మేం మా ఆనందాల్ని చంపుకుని ఆస్తులు, పరువుని సంపాదిస్తాం.. మీరు మీ ఆనందం కోసం వాటిని తగలెస్తారనరి ఫైర్ అవుతాడు. నీ గురించి మీ అమ్మ ఏడుస్తూ కూర్చొంది.. నేను తెలిసినవాళ్లందరికీ కాల్ చేస్తున్నాను, పద్ధతి లేని మా పెంపకాన్ని అందరూ తిడతారని మండిపడతాడు దశరథ. దీపతో మాట్లాడటానికి ఎత్తిన ఫోన్.. మేం చేసినప్పుడు ఏమైందని నిలదీస్తుంది సుమిత్ర. పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించరా? మరోసారి ఇలాంటిది రిపీట్ చేయనని అందరికీ సారీ చెబుతుంది జ్యోత్స్న.
నా జీవితంలో నా పిల్లల గురించి నేను ఎంతో బాధపడ్డాను.. ఇప్పుడు మనవరాలి కోసం బాధపడుతున్నానని అంటాడు శివన్నారాయణ. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని దశరథ అంటాడు. ఎంతసేపూ ప్రాబ్లమ్సే ఇంట్లోకి వస్తాయి.. అది కొందరు అర్ధం చేసుకుంటే చాలామంచిదని చెబుతాడు. కార్తీక్- దీపలు ఇంటికి వెళ్తుండగా జ్యోత్స్న సీరియస్ అవుతుంది. ఆరోజు మీ ఇంట్లో దీపకి కాల్ చేసి ఇరికించానని.. మీరిద్దరూ నా ఒరిజినాలిటి నా ఇంట్లో వాళ్లకి చూపించారు ఇది నేను గుర్తుపెట్టుకుంటానని వార్నింగ్ ఇస్తుంది. మేం వచ్చింది నీ కోసం కాదు.. అత్త కోసమని చెబుతాడు కార్తీక్. ఈవిడ గారిని ఎక్కడికి పోనివ్వొద్దు... గేటుకి గట్టిగా తాళాలు వేయమని అంటాడు.
అర్ధరాత్రి శివన్నారాయణ ఇంటి నుంచి వచ్చిన కార్తీక్, దీపలపై మండిపడుతుంది కాంచన. ప్రతిదానికి నీ పెళ్లాన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావు.. మా నాన్న, మా పిన్ని, అన్నయ్య, వదినలు ఇలాగే జ్యోత్స్నని మోసి దానిని ఒక ఉత్సవ విగ్రహం చేశారు. ఆడపిల్ల ఇంటికి రాలేదంటే తల్లిదండ్రులు కంగారుపడతారు కదా. మళ్లీ ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తే వదిలిపోద్ది అంటుంది కాంచన. మనల్ని పెద్దగా నోరు తెరవకుండానే పారు బుద్ధి చెప్పింది కదా అని దీపతో అంటాడు కార్తీక్. జ్యోత్స్నే అసలు మనవరాలని తెలిస్తే పారిజాతం గారు మన మీద పగపడతారని భయపడుతుంది. ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు.. జ్యోత్స్నని ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటుంది అంటాడు కార్తీక్.
ఈరోజు తనకి జరిగిన అవమానాల గురించి బాధపడుతున్న జ్యోత్స్న దగ్గరికి పారు వచ్చి నువ్వు నా మనవడిని, మనవరాలిని ఇబ్బంది పెట్టొద్దని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎంతకాలం నిద్రపోతావు.. మత్తులో నుంచి లేగు అంటుంది జ్యోత్స్న. దీప ఇంటి దగ్గరి నుంచి ఫోన్ చేసిందనుకుని నీ బుద్ధి చూపించావు, వాళ్లు తెలివిగా ఇరికించారు అంటుంది పారు. నువ్వు ఆపొచ్చు కదా అని జ్యోత్స్న చెప్పగా.. నువ్వు సుమిత్ర కూతురివి అంటుంది పారు. అదంతా అబద్దమని జ్యోత్స్న గట్టిగా చెప్పడంతో పారు షాక్ అవుతుంది. నా టైం బాలేదు.. ఒకవైపు పెళ్లి గోల, మరోవైపు సీఈవో గోల.. నేను పెళ్లి చేసుకోవడానికి ముందే సీఈవో అవ్వాలని చెబుతుంది జ్యోత్స్న.
నువ్వు సీఈవో అవ్వలేవు.. పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకోమని వార్నింగ్ ఇస్తుంది పారు. దీప అనాథ కాదు.. దానికి ఈ పారు ఉందని అంటుంది. ఆ దీప నాకు నా సొంత మనవరాలని చెప్పబోతుండగా పారు ఆగిపోతుంది. దీపే నా ప్రాణం, దీపే నా సర్వస్వం.. దీప జోలికి వస్తే ఈ పారిజాతం వస్తుందని వార్నింగ్ ఇస్తుంది. నీ అసలు మనవరాలు ఎవరో నీకు త్వరలోనే అర్ధమవుతుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలు బైక్‌పై వెళ్తుండగా కార్తీక్‌కి సూరజ్ కనిపిస్తాడు. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాపాడింది అతనే అని దీపకి పరిచయం చేస్తాడు దీప. మా మావయ్యగారిని కాపాడినందుకు దీప థ్యాంక్స్ చెబుతుంది. నేను మాస్ అయితే మనోడు పక్కా క్లాస్ అని అంటాడు కార్తీక్. మీరు సత్యరాజ్ రెస్టారెంట్‌కి సీఈవోగా పనిచేశారని నాకు తెలుసని అంటాడు సూరజ్. దాంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications