Karthika Deepam 2 May 9th: కార్తీక్, దీపలని కదిలించిన సూరజ్ గతం... స్వప్న- కాశీల కథ సుఖాంతం
Photo Courtesy: JioHotstar
ఆటో దిగుతూ జ్యోత్స్నకి కారు తాళాలు, ఫోన్ ఇచ్చి చేతిలో 100 రూపాయలు పెడతాడు సూరజ్. నిన్ను వదిలేసి వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ నువ్వు ఆడపిల్లవని తిరిగొచ్చానని వెళ్లిపోతాడు. జీవితంలో రెండు సార్లు దెబ్బకొట్టావు.. నీ కళ్లలో రక్తం తెప్పిస్తానని అనుకుంటుంది జ్యోత్స్న. అర్ధరాత్రి ఇంటికొచ్చిన జ్యోత్స్నకి దీప కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. నేను ఎక్కడ తిరిగితే నీకెందుకు? ఎప్పుడొస్తే నీకెందుకు? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మీ బావ భార్యగా కాల్ చేశానని అంటుంది దీప. దానికి ముందు మా బావ మాజీ భార్య అనే పదం చేర్చమంటూ లోపలి రాగా.. ఇంట్లో అందరినీ చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న.
ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారడం లేదు. ఈసారి కార్తీక్ జోలికి వెళితే నిన్ను వదిలేస్తానని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న ఏమైపోతే నీకెందుకు? అసలు ఆ ఫ్యామిలీని వదిలేయమని కార్తీక్‌పై మండిపడుతుంది కాంచన. కడుపుతో ఉన్న నువ్వెందుకు అర్ధరాత్రుళ్లు తిరుగుతున్నావని దీపపై ఫైర్ అవుతుంది. దీప, కార్తీక్‌ల జోలికి వెళ్లొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది పారు. ఉదయాన్నే ఇంటికొస్తున్న దీప, కార్తీక్‌లకు సూరజ్ కనిపించడంతో కార్తీక్ వెళ్లి పలకరిస్తాడు. మీరు సత్యరాజ్ రెస్టారెంట్‌కి సీఈవో అని సూరజ్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 9వ తేదీ 666వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శ్రీధర్‌ను కాపాడినందుకు గాను సూరజ్‌కు థ్యాంక్స్ చెబుతుంది దీప. నేను మాస్ కానీ మనోడు మాత్రం పక్కా క్లాస్ అంటాడు కార్తీక్. మీరు కూడా క్లాసే.. మీరు ఒకప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్‌కి సీఈవోగా ఉండేవారు కదా.. ఇప్పుడు డ్రైవర్ ఎందుకు అయ్యారని అడుగుతాడు సూరజ్. చెప్పుకునేంత దగ్గరైనప్పుడు ఖచ్చితంగా చెబుతానని అంటాడు కార్తీక్. సూరజ్ ఫుడ్ సెంటర్‌లో ఫుడ్ చూసి చాలా బాగుందని అంటారు కార్తీక్, దీప. కార్తీక్ డబ్బులు ఇస్తే వద్దు అన్నప్పటికీ .. కార్తీక్ మాత్రం ఇచ్చేస్తాడు. నిన్ను చూసి సాఫ్ట్‌వేర్ అనుకున్నా.. నువ్వేమో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నావేంటీ అని అడుగుతాడు కార్తీక్. ఒకటి అనుకున్నాను అది జరగలేదు.. మనసుకు నచ్చిన పనిమాత్రమే చేస్తానని చెబుతాడు సూరజ్.
నీకు ఏదైనా ఆఫర్ చూపిస్తే వెళ్తావా అని కార్తీక్ అడగ్గా.. ఒకరి కింద నేను పనిచేయనని సూరజ్ చెప్పడంతో నాది కూడా అదే పాలసీ, కాకపోతే కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టేశానని అంటాడు కార్తీక్. మీరు నాకంటే గ్రేట్ అంటాడు సూరజ్. నీకు పెళ్లయ్యిందా అని అడుగుతాడు కార్తీక్. నన్ను అర్ధం చేసుకునే అమ్మాయి ఇంత వరకు నాకు ఎదురుపడలేదు, లేదంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెబుతాడు సూరజ్. ఇతనికి అవకాశం మా నాన్నని కాపాడటం వల్లే పోయింది, మనం ఇతని రుణం తీర్చుకోవాలని దీపతో అంటాడు కార్తీక్. పెళ్లి ఎందుకు అయ్యిందని అడిగావని దీప ప్రశ్నించగా కార్తీక్ సమాధానం చెప్పడు.
మామయ్య ఆరోగ్యం బాలేదు కదా? ఇప్పుడు నీకు మరో పెళ్లి ఈ గోల వద్దని స్వప్నతో చెబుతాడు కాశీ. వచ్చిన అవకాశాన్ని నువ్వు బాగా వాడుకుంటున్నావని నానామాటలు అంటుంది స్వప్న. కాశీ చెప్పేది మీ నాన్న గురించే కదా అని కావేరి చెప్పగా.. కాశీ కనిపించకుండా పోతేనే అన్ని సమస్యలకు పరిష్కారం? అసలు నా తండ్రి గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నా తండ్రికి ఏమైనా అయితే నీకెంట్రా అంటూ నోరుజారుతుంది స్వప్న. నా తండ్రి చచ్చిపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయనని స్వప్న అనడంతో కావేరి లాగిపెట్టి పీకుతుంది. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అని కావేరి అనగా.. శ్రీధర్ వస్తాడు.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇన్నిరోజులు మీరు కలిస్తే బాగుంటుందని ఎదురుచూశాను, ఇక ఈ గొడవని సాగదీయొద్దని ఒక నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు శ్రీధర్. నాకు తెలిసి మనం కలిసుండే ఆఖరి రోజు ఇదే, రేపటి నుంచి నీ ముఖం కూడా చూడనని అంటుంది స్వప్న. నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు, నేనేం చేయలేనని అనుకుంటాడు కాశీ. ఆ వెంటనే కార్తీక్‌ని పిలుస్తాడు కార్తీక్. మళ్లీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. నేను ఈరోజు ఆవేశపడి కిందపడిపోతే మా ఆయనని ఎవరూ ముట్టుకోవద్దని మీ పిన్ని, మా నాన్నని ఎవరూ ముట్టుకోవద్దని నీ చెల్లి, మా మామగారు నాకు కూడా బాధ్యతేనని నీ బావమరిది.. ముగ్గురూ కలిసి నా ఫోటోకి దండవేస్తారోనని భయపడి నిన్ను రమ్మన్నాను అని చెబుతాడు కార్తీక్.
మీ చెల్లికి ఎంత ఆత్మాభిమానం అంటే .. మా నాన్న పోతే పోతాడు, అయినా నీతో కలిసుండనని కాశీతో చెప్పింది. నేనంటే మీ చెల్లికి అంత ప్రేమ. ఈరోజుతో నీ చెల్లి కాపురానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందేనని అంటాడు శ్రీధర్. ఓ తండ్రిగా నా కూతురికి కాశీ లాంటి భర్త ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగని నా కూతురు బాధపడటం నాకిష్టం లేదు, నా ఫోటోకి దండపడినా సరే చెబుతాడు. వీళ్లు విడిపోవాలా? కలిసుండాలా? అని నువ్వే తీర్పు ఇవ్వు. నా కూతురు లాగే నా గుండె కూడా నా మాట వినడం లేదని శ్రీధర్ బాధపడతాడు.
మా నాన్న బట్టలు, నీ బట్టలు సర్దుకుంటే మా ఇంటికి వెళ్దామని కావేరితో అంటాడు కార్తీక్. నువ్వు నీ ఏకాంతంలో బతకమని స్వప్నతో చెబుతాడు. కాశీ తప్పు చేశాడని స్వప్న చెప్పబోతుండగా.. ఈమాట ఎన్నిసార్లు చెబుతావు, మా అమ్మని చూసి నువ్వు కూడా అలాగే తయారు అవుతున్నావు. భర్తని వదిలేయడం ఒకటే కాదు.. భర్తకి ప్రమాదం వస్తే విలవిలలాడిపోతుం. భర్తకి సమస్య వస్తే తండ్రితో, అన్నతో మాట్లాడి పరిష్కరించింది. భర్తను వద్దనుకుంది కానీ అసహ్యించుకోలేదు, ఇప్పటికీ అన్ని విషయాలు వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ నుంచి ఆదర్శంగా నేర్చుకోమని చెబుతాడు కార్తీక్.
కష్టమొస్తే కన్నీరు తుడవటానికి, అండగా నిలబడటానికి నాకు మీ వదిన ఉంది.. మీరి నీ సంగతేంటీ? కానీ కాశీతో ఉంటే నీ జీవితం నువ్వు కోరుకున్నట్లే ఉంటుంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా.. ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. మీరు కలిసుంటే మా నాన్నని, మా పిన్నిని ఇక్కడే వదిలేసి వెళ్తాను లేదంటే మేం సర్దుకుపోతామని స్వప్నకి డెడ్‌లైన్ పెడతాడు కార్తీక్. ఆ వెంటనే కాశీ- స్వప్నలు పక్కకి వెళ్లి మాట్లాడుకుని వస్తారు. మేం కలిసే ఉంటామని స్వప్న చెప్పడంతో అంతా సంతోషిస్తారు. వీళ్లే మనల్ని గెలిపించారని శ్రీధర్‌తో అంటాడు కార్తీక్. కాశీ చేతిలో స్వప్న చేయి వేసి ఎప్పుడూ ఇలాగే కలిసుండాలని చెబుతాడు.
మన అమ్మానాన్న కలిసున్నారు కాబట్టే మన జీవితాలు బాగున్నాయి.. మనం కలిసుంటేనే మన పిల్లల జీవితాలు బాగుంటాయని కార్తీక్ చెబుతుండగా దాస్ చప్పట్లు కొడుతూ వస్తాడు. ఈ జనరేషన్‌కి నీ మాట టానిక్‌లాంటిదని చెబుతాడు. ఈ విషయాన్ని కాంచనకు చెప్పడంతో ఆమె కూడా సంతోషిస్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు.. అర్ధం చేసుకునే కూతురు ఉన్నందుకు అంటుంది కాంచన. నీకు కూడా అర్ధం చేసుకునే కొడుకున్నాడు.. అర్ధం చేసుకోవడమే కాదు, మనసున్నవాడు, మంచివాడు. నువ్వుగానీ, మావయ్య గానీ పరిష్కరించలేకపోయిన కాశీ- స్వప్నల సమస్యని పరిష్కరించి వచ్చాడని చెబుతుంది దీప. వీడు ఎంతసేపూ తన ఆనందాన్ని ఎదుటివాళ్ల నవ్వుల్లో చూసుకోవడమే తప్పించి వాడి నవ్వుల్లో ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని చెబుతుంది కాంచన. నేను చేస్తున్న పనికి ఓ అర్ధముంది, అది తెలిసినరోజున క్షణాల్లో ఈ బాధను మరిచిపోతావని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications