Karthika Deepam 2 May 11th: సుమిత్రను వెతుక్కుంటూ వచ్చిన కన్నతండ్రి.. రణరంగంలా శివన్నారాయణ ఇల్లు

Photo Courtesy: JioHotstar

డ్యూటీకి వెళ్తున్న కార్తీక్, దీపలకు దారిలో సూరజ్ కనిపించడంతో పలకరిస్తారు దీప, కార్తీక్. మా మావయ్య గారి ప్రాణాలు కాపాడినందుకు మా కుటుంబం నుంచి పెద్ద థ్యాంక్స్ అంటుంది దీప. నేను మాస్ కానీ, బ్రదర్ మాత్రం చాలా క్లాస్ అని సూరజ్‌ని ప్రశంసిస్తాడు కార్తీక్. మీరు గతంలో సత్యరాజ్ రెస్టారెంట్‌కి సీఈవో అని నాకు తెలుసని సూరజ్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. తన తండ్రిని కాపాడటం వల్లే సూరజ్‌కి మంచి అవకాశం మిస్ అయ్యిందని బాధపడ్డ కార్తీక్ .. అతని రుణం తీర్చుకోవాలని దీపతో చెబుతాడు.

మావయ్య గారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? లేదా అని స్వప్నని అడుగుతాడు కాశీ. మా నాన్న ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని నాతో తిరిగి కలిసిపోవాలని చూస్తున్నావా అని కాశీని అరేయ్ ఒరేయ్ అని మాట్లాడుతుంది స్వప్న. ఈ మాటలు విన్న కావేరి వచ్చి కూతురిని లాగిపెట్టి కొడుతుంది. ఇంట్లో పరిస్థితి చూసిన శ్రీధర్.. వెంటనే కార్తీక్‌ని పిలిచి పంచాయతీ పెట్టిస్తాడు. మీరిద్దరూ కలిసుంటే ఓకే లేదంటే మా నాన్నని, పిన్నిని మా ఇంటికి తీసుకెళ్లిపోతామని కార్తీక్ వార్నింగ్ ఇవ్వడంతో కాశీ, స్వప్నలు కలిసిపోతారు. ఈ విషయాన్ని కాంచనకు కార్తీక్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 11వ తేదీ 667వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 667 May 11th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్‌లు వెళ్లేసరికి ఓ పెద్దాయన గేటు బయట చూస్తుంటాడు. నీకు ఆయన తెలుసా అని పెద్దాయన అడగ్గా.. ఈ ఇంట్లో ఉన్న వాళ్లందరితో నాకు పరిచయం ఉందని చెబుతాడు కార్తీక్. అందరి గురించి చెబుతున్నావు కానీ సీతమ్మ గురించి చెప్పడం లేదని అడుగుతాడు పెద్దాయన. ఆవిడ నిజంగా సీతమ్మేనని చెబుతాడు కార్తీక్. నేనే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తానని కార్తీక్ వస్తుండగా... పెద్దాయనతో కలిసి వస్తున్న కార్తీక్‌ని చూసిన పారిజాతం షాక్ అవుతుంది. అతనిని దక్షిణామూర్తి అని గుర్తుపట్టి... ఇతను ముసలోడికి ఎదురుపడితే రక్తపాతమేనని భయపడుతుంది. ఆయన లోపలికి రాకుండా ఆపాలని పరిగెత్తుకుంటూ వస్తూ శివన్నారాయణను ఢీకొడుతుంది పారు.

ఇంతలో నీకొక సర్‌ప్రైజ్ తీసుకొచ్చానని కార్తీక్ చెబుతాడు. దక్షిణామూర్తిని చూడగానే శివన్నారాయణ రగిలిపోతాడు. ఇతను నా స్నేహితుడు కాదు నా శత్రువు అని కోప్పడతాడు. పరిచయం చేయడానికి కూడా పనికిరాని బంధువు.. బయటికి నడువు అంటూ సీరియస్ అవుతాడు. నేను వచ్చింది నీకోసం కాదని దక్షిణామూర్తి చెబుతుండగా.. నీకు సంబంధించిన వాళ్లు ఈ ఇంట్లో లేరని అంటాడు శివన్నారాయణ. ఎవరో ఏంటో తెలియకుండా పెద్దాయనని లోపలికి తీసుకొచ్చావు.. ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవకి కారణమయ్యావని కార్తీక్‌పై ఫైర్ అవుతుంది దీప.

ఇంతలో లోపలికి వచ్చిన సుమిత్ర.. దక్షిణమూర్తిని చూడగానే హారతి పళ్లెం కిందపడేస్తుంది. బాగున్నావా అని సుమిత్రను దక్షిణామూర్తి అడగ్గా.. బాగున్నావా అని కాదు, బతికున్నావా అని అడగండి అని అంటుంది సుమిత్ర. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదని చెబుతుంది. నాకు అర్హత ఉంది.. ఎందుకంటే నేను నీకు తండ్రిని అంటాడు దక్షిణామూర్తి. ఆ మాటలు వినగానే జ్యోత్స్న, దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. పేరు పెట్టిన తండ్రికి కూతురిని పేరు పెట్టి పిలిచే అధికారం ఉండదా? అని అడుగుతాడు దక్షిణామూర్తి.

నా కూతురు చచ్చిపోయిందని నెత్తిమీద నీళ్లు పోసుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ అధికారం. బతికున్న కూతురికి కర్మకండలు జరిపినప్పుడు ఎక్కడ చచ్చింది నీ మమకారం అని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నీ ఇంటి గుమ్మంలో నిలబడ్డానని నిందలన్నీ నా మీద వేయొద్దని అంటాడు దక్షిణామూర్తి. నీ నట్టింటిలో నిలబడినా నేను ఇలాగే మాట్లాడతానని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నా జీవితంలో ఎదురైన చెడు సంఘటనల వెనుక ఒక శిలాశాసనం ఉంది.. దాని మీద గతంలో గాయాలు రక్తంతో రాయబడి ఉన్నాయని శివన్నారాయణ చెప్పడంతో కార్తీక్, దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు.

నాకు ఏదో ఆరోగ్య సమస్య వచ్చి నా పేరు నేను మరిచిపోవచ్చు కానీ నీ పేరు మాత్రం మరిచిపోనని అంటాడు శివన్నారాయణ. నువ్వు ఏదో ఉత్తముడివి అని మురిసిపోవద్దని వార్నింగ్ ఇస్తాడు దక్షిణామూర్తి. మన కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనని అంటాడు దక్షిణామూర్తి. అతని మీద చేయి ఎత్తబోతుండగా తండ్రిని దశరథ అడ్డుకుంటాడు. మీకు దండం పెడతాను.. ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతాడు దశరథ. అల్లుడు అని దక్షిణామూర్తి పిలవబోతుండగా.. నువ్వు నాకు తండ్రివి అయితేనే కదా, నా భర్తని అల్లుడు అని పిలవడానికి అని అంటుంది సుమిత్ర. నా తండ్రి చచ్చిపోయాడు, నువ్వు కూతురిని చంపేసుకున్న రోజునే.. నా తండ్రిని నేను చంపేసుకున్నానని చెబుతుంది సుమిత్ర.

నా భర్తను నా కళ్లముందే అవమానిస్తే నేను క్షమించలేనని తేల్చేస్తుంది సుమిత్ర. దానికి నీ భర్తే కారణమని అంటాడు దక్షిణామూర్తి. కొన్నేళ్ల క్రితం జరిగిన పాత గొడవలకి తిరిగి ప్రాణం పోయెద్దని అంటాడు దశరథ. మేం ఇంకా మనుషుల్లాగే ఉన్నాం.. నీలా మారిపోయామని ఆశతో వచ్చావా అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. మన ఊరి స్మశానంలో నువ్వు నా కోసం కట్టిన సమాధిలో నీ కూతురు నిద్రపోతుందని సుమిత్ర చెప్పడంతో దక్షిణామూర్తి బాధపడతాడు. సుమిత్ర ఈ శివన్నారాయణ కోడలు.. మామగారి పౌరుషానికి ఏమాత్రం తీసిపోదని అంటాడు శివన్నారాయణ. నీ కోడలి ఒంట్లో ఉన్నది ఈ దక్షిణామూర్తి రక్తం.. అది పౌరుషంగా ఉండక, తలదించుకోదని చెబుతాడు దక్షిణామూర్తి.

వయసుతో వచ్చిన పెద్దరికం వల్ల ఆగిపోతున్నాను.. లేదంటే ఈరోజు నీ రక్తంతో గుమ్మాన్ని కడిగేవాడిని అని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నిన్ను నాన్న అని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉందని అంటుంది సుమిత్ర. నువ్వు నాకోసమే వచ్చి ఉంటే.. మళ్లీ ఈ జన్మలో రాకు, నీ కూతురు చచ్చింది అనుకునే ఉండు, లేదంటే ఇప్పుడే తలబాదుకుని చచ్చిపోతానని తలబాదుకుని కిందపడిపోతుంది సుమిత్ర. నా భార్యను ముట్టుకోవద్దు.. ఈ చేతులతోనే కదా కర్మకాండలు చేశావు, సుమిత్ర నీ కూతురిగా చచ్చిపోయింది, నా భార్యగా మాత్రమే బతికుందని రగిలిపోతాడు దశరథ.

నేను ఈరోజు వెళ్లిపోతున్నాను.. కానీ మీరే నా ఇల్లు వెతుక్కుంటూ వస్తారని అంటాడు దక్షిణామూర్తి. తాతలో ఆవేశం చూసిన కార్తీక్‌కి ఏమీ అర్ధం కాదు. సుమిత్రను చూసుకుంటున్న దీపను పక్కకి నెట్టేస్తుంది జ్యోత్స్న. ఆ వెంటనే దక్షిణామూర్తిని వెతుక్కుంటూ కిందకి వెళ్తున్న దీపకి శివన్నారాయణ కనిపించడంతో ఆగిపోతుంది. తాత ఉన్నాడంటే మా అమ్మకి ఫ్యామిలీ కూడా ఉండే ఉంటుంది వాళ్ల గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది దీప. అత్త పుట్టింటి వాళ్లు ఎవరూ లేరు, అంతా చనిపోయారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో ఇప్పుడే అర్ధమైందని అంటాడు కార్తీక్. మా అమ్మ పుట్టింటి వాళ్ల గురించి తెలుసుకోవాలని చెబుతుంది దీప. కానీ ఎవరు చెబుతారని కార్తీక్ అడగ్గా.. పారిజాతం గారికి అంతా తెలిసే ఉంటుందని అంటుంది దీప.

సుమిత్ర అత్త పుట్టింటి గురించి చెప్పమని పారును అడుగుతాడు కార్తీక్. అదో పెద్ద కథ.. తెలుసుకోకపోవడమే మంచిదని అంటుంది పారు. ఒక ఫ్యామిలీ బతికున్న నిజం.. ఒక జనరేషన్‌కి తెలియనివ్వలేదంటే అంత పెద్ద గొడవ ఏంటీ? వాళ్లది ఏ ఊరు? ఎంతమంది ఉంటారు? అని అడుగుతాడు కార్తీక్. ఇవన్నీ చెబితే మీ తాత ఊరుకోడని చెబుతుంది. దక్షిణామూర్తి గురించి పారు చెబుతుండగా శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఆ మనిషి పేరు కానీ, ఆ గతం కానీ నీ నోటివెంట బయటకు రావడానికి వీల్లేదు.. లేదంటే వాళ్లకు విధించిన శిక్షే నీకు విధిస్తానని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. చెప్పమని నిన్ను ఎవరు అడిగారని పెద్దాయన నిలదీయగా.. జ్యోత్స్న అడిగిందని ఇరికిస్తుంది పారు. మీ అమ్మకి పుట్టిల్లు లేదు వాళ్లంతా ఏనాడో చచ్చిపోయారని చెబుతాడు. అసలు దక్షిణామూర్తిని ఎవరు తీసుకొచ్చారు అని శివన్నారాయణ అడగ్గా.. బావే తీసుకొచ్చాడని చెబుతుంది జ్యోత్స్న. మనమంతా ఒకటే కుటుంబం.. రెండు కుటుంబాలు అనే పరిస్ధితి తీసుకురావొద్దు.. వెతుక్కుంటూ స్నేహితులే కాదు, శత్రువులు కూడా వస్తారని సీరియస్ అవుతాడు శివన్నారాయణ ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X