Karthika Deepam 2 May 13th: దీపే వారసురాలని తెలుసుకున్న పారు.. దశరథను అడ్డు తప్పించిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి గురించి ఈ ఇంట్లో మాట్లాడటానికి వీల్లేదని శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. తాత దగ్గర నన్నెందుకు ఇరికించావని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నా మనవడు, మనవరాలిని ఎందుకు ఇరికిస్తాను, అందుకే నిన్నే ఇరికించానని అంటుంది పారు. అయితే నీకు కళ్లు తెరిపించే టైం వచ్చిందని చెప్పి పారును ఓ చోట దాక్కోమని దాస్‌కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కూతురికి ఏమైందోనని కంగారుగా వస్తాడు దాస్. నేను చేసిన తప్పులన్నీ బయటపడిపోతే నాకు ఏదైనా అవుతుందని ఏడుపు నటిస్తుంది జ్యోత్స్న. దాంతో నీకేం కాదు.. నిన్ను యువరాణిలా చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడు కదా అంటాడు దాస్. ఆ మాటలు విన్న పారు షాక్ అవుతుంది. అంటే జ్యోత్స్నే నా అసలు మనవరాలని తెలుసుకుంటుంది.
ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? బావ, దీప నిన్ను ఆడుకున్నారని అంటుంది జ్యోత్స్న. నా కన్నకొడుకే నన్ను మోసం చేశాడని ఫైర్ అవుతుంది పారు. దీపకి అన్నం తినిపిస్తున్న కార్తీక్ దగ్గరికి వెళ్లి నీ భార్య అన్నం తింటుందిలే అంటూ రగిలిపోతుంది. పెళ్లయి, పిల్లల్ని కంటే నీకు కూడా ఈ బాధ తెలిసేదని అంటాడు కార్తీక్. అయితే చేసుకో.. పిల్లల్ని కంటానని జ్యోత్స్న అనడంతో దీప మండిపడుతుంది. పారు అక్కడ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. సుమిత్ర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెబుతాడు. దాంతో నీకు ఈ శివన్నారాయణ కుటుంబం మాత్రమే ఉంది. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతామని అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 13వ తేదీ 669వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను దీపని ఏడిపిస్తున్నానని ఇదంతా ఆ మాయలోడు కార్తీక్‌గాడు చేశాడని అంటుంది పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సిందని అంటుంది జ్యోత్స్న. మరి సుమిత్రకి ఆపరేషన్ ఎలా జరిగింది. నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? నువ్వు బోన్‌మ్యారో మీ అమ్మకి ఇచ్చావు? నువ్వు దాస్ కూతురివి అయితే నీ బోన్‌మ్యారో తీసుకున్న సుమిత్ర చావలేదు? దాస్ చెప్పింది అబద్ధమా? నువ్వు చెప్పింది అబద్ధమా? నువ్వు దాస్ కూతురివా? సుమిత్ర కూతురివా? అని పారు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
ఆపరేషన్‌కి కన్నకూతురే బోన్‌మ్యారో ఇచ్చింది.. నేను కన్నకూతురిని అని చెప్పానా అని అంటుంది జ్యోత్స్న. కన్నకూతురు ఎక్కడుందో నీకు తెలుసా అని పారు అడగ్గా.. తెలుసుకుని ఏం చేస్తావని అంటుంది జ్యోత్స్న. పగ అలాగే ఉంది.. చిన్నప్పుడు వదిలేసిన ప్రాణాన్ని ఇప్పుడు తీస్తానని చెబుతుంది పారు. శివన్నారాయణ మనవరాలు ఎవరు? అని రగిలిపోతుంది. ఇంతలో దీపికి మంచినీళ్లు తాగుతుండగా ఎక్కిళ్లు వస్తాయి. నన్ను పారిజాతం గారు గట్టిగానే తలచుకుంటున్నట్లుగా ఉంది. నాకెందుకో ఆమె ప్రవర్తన తేడాగా ఉంది. నేను తన మనవరాలిని కాదన్న నిజం తెలిసిపోయుండొచ్చని అంటుంది దీప.
దాస్ మావయ్యతోనే చెప్పించి ఉంటుందని చెబుతుంది. ఏం చేసినా పారు అంత తేలికగా నమ్మదు.. నువ్వే అసలైన వారసురాలివని దీప చెప్పదు, సాక్ష్యం ఉన్నా పారు నమ్మదని అంటాడు కార్తీక్. పారు ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మదు.. జ్యోత్స్న మాట అస్సలు వినదని చెబుతాడు. నేనే పారిజాతం గారి మనవరాలినని దాస్ బాబాయ్.. పారిజాతంగారికి చెప్పాడు. అదే విషయం పారిజాతం గారు జ్యోత్స్నకి చెబితేనని అడుగుతుంది దీప. నీ గురించి ఏం చెప్పినా నమ్మకుండా పారుని లాక్ చేశాడని అంటాడు కార్తీక్.
ఆ శివన్నారాయణ గారి మనవరాలని జ్యోత్స్నని అడుగుతుంది పారు.. చెబితే గుండె ఆగిపోతుందని అంటాడు జ్యోత్స్న. శివన్నారాయణ గారి అసలైన మనవరాలు.. సుమిత్ర- దశరథల కూతురు, ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప అని జ్యోత్స్న చెప్పడంతో పారు ఉలిక్కిపడుతుంది. సుమిత్ర కూతురు దీపా? నేను చంపమని సైదులుగాడికి ఇచ్చింది దీపా? దశరథ కూతురు బతికే ఉందని దాస్ చెప్పింది దీప గురించా? అంటే దాస్‌కి తెలిసి నాతో అబద్థం చెప్పాడా అని రగిలిపోతుంది పారు. ఇదంతా బావ ప్లాన్ అని చెబుతుంది జ్యోత్స్న. నిన్ను నేను ఎలా నమ్మాలని పారు అడగ్గా.. నమ్మించడానికి నా దగ్గర ఆధారం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ తీసి చూపిస్తుంది జ్యోత్స్న.
మమ్మీకి ఆపరేషన్ అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించాను.. అప్పుడే తెలిసింది దీపే అసలైన వారసురాలని. ఇప్పుడంటే క్లారిటీ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించాను కానీ, దీపే అసలైన వారసురాలని నీ కొడుకు నాతో ఎప్పుడో చెప్పాడని అంటుంది జ్యోత్స్న. మరి నాకెందుకు చెప్పలేదని పారు అడగ్గా.. నీకు నోట్లో నిజం ఆగుతుందా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దీప నా మనవరాలని కార్తీక్ .. దాస్‌తో చెప్పించాడు. నువ్వు అదే నిజమనుకుని రెచ్చిపోయావని సీరియస్ అవుతుంది జ్యోత్స్న. నీకు కార్తీక్ గాడికి, దీపకి, దాస్ గాడికి అందరికీ తెలిసే ఈ కథ నడిపించారని అంటుంది పారు.
నిన్ను వెర్రిదానిని చేసి ఆడించారు.. ఇక్కడ నట సార్వభౌమ కార్తీక్, మహానటి దీప.. సహజ నటి జ్యోత్స్న, ఉత్తమ సహాయ నటుడు దాస్ ఇంతమంది ఘనమైన నటులున్నారని తెలుసుకున్నాని రగిలిపోతుంది పారు. నేను సెంటిమెంట్‌కి లొంగిపోయానే కానీ.. నేను బై బర్త్ విలన్‌నే, నా కొడుకు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. ఒక్కొక్కరిని తొక్కిపట్టి నార తీస్తానని రగిలిపోతుండగా.. అప్పుడు వాళ్లు కూడా ఓపెన్ అవుతారు. మిగతా వాళ్లందరికీ నిజం చెబుతారు. అప్పుడు ఏ చేతులతో అయితే దీపని బుట్టలోంచి తీశావో.. తిరిగి నిన్నే మనవరాలి స్థానంలో కూర్చోబెట్టమంటారు. మరి నా ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని అడుగుతుంది పారు.
అందరికీ దీప గురించి నిజం తెలిసేలోపు.. ఆస్తిని నా పేరు మీద రాయించుకోవాలి, బావతో నా పెళ్లి జరగాలని అంటుంది జ్యోత్స్న. అయితే కార్తీక్ గాడిని మనవరాలిగా చేసుకోవాలన్న ఆలోచన మాత్రం వదిలేయమని చెబుతుంది పారు. ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు... గేమ్ నేను ఆడతాను, మనిద్దరం కలిసి ఈ ఇంటి చరిత్ర మార్చాలని అంటుంది జ్యోత్స్న. ఇన్నాళ్లూ నాతో ఆడుకున్నారు.. ఇప్పుడు నేనేంటో చూపిస్తానని చెబుతుంది పారు. ఏం తెలియనట్లు సైలెంట్‌గా ఉండమని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.
శివన్నారాయణకి ఫోన్ రావడంతో కోపంతో ఊగిపోతాడు. నెల్లూరు బ్రాంచిలో పెద్ద జరిగిందని.. నమ్మినవాళ్లే మోసం చేశారని చెప్పడంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. నేను నెల్లూరు వెళ్తానని దశరథ చెబుతుండగా.. రేపు బోర్డ్ మీటింగ్ ఉంది వెళ్లొద్దని చెబుతాడు కార్తీక్. నువ్వు, నాన్న చూసుకోండని చెబుతుండగా.. జ్యోత్స్న నవ్వుకోవడాన్ని దీప గమనించి అనుమానిస్తుంది. పారిజాతం గారు తేడాగా కనిపిస్తున్నారు. నాన్న నెల్లూరుకి వెళ్లడం కూడా జ్యోత్స్న ప్లాన్‌లాగే ఉందని కార్తీక్‌తో దీప అంటుంది. నెల్లూరు నీ ప్లానేనా అని పారు అడగ్గా సైలెంట్‌గా ఉండమని చెబుతుంది జ్యోత్స్న.
శౌర్యతో కాంచన ఆడుకుంటూ ఉండగా.. కార్తీక్, దీపలు నవ్వుకుంటారు. ఇంతలో అత్తవాళ్ల నాన్న దక్షిణామూర్తి గురించి నీకు తెలుసా అని కార్తీక్ అడగ్గా.. కాంచన ఉలిక్కిపడుతుంది. ఆ మనిషి నీకెలా తెలుసు అని కాంచన అడగ్గా.. తాత ఇంటికి వచ్చాడని చెబుతాడు కార్తీక్. ఇన్నేళ్ల తర్వాత ఆ మనిషి మళ్లీ ఎందుకు వచ్చాడని ప్రశ్నిస్తుంది కాంచన. ఆ తాత గురించి ఎవరికీ ఎందుకు తెలియనివ్వడం లేదని అడుగుతుంది దీప. ఎవడే తాత అంటూ కాంచన ఫైర్ అవుతుంది. ఆయన గురించి నన్ను అడిగితే నేను చచ్చినంత ఒట్టని కాంచన వార్నింగ్ ఇవ్వడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications