Karthika Deepam 2 May 14th: సుమిత్ర కోసం తలవంచిన శివన్నారాయణ.. సీఈవోగా జ్యోత్స్న, షాక్‌లో కార్తీక్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నే తన మనవరాలని తెలుసుకున్న పారిజాతం.. మరి సుమిత్రకు బ్యోన్‌మారో ఎవరిచ్చారు? ఆమెను ఎవరు కాపాడారని ప్రశ్నిస్తుంది. కన్నకూతురే కాపాడిందని జ్యోత్స్న చెప్పగా.. ఆ కన్నకూతురు ఎవరో? ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతుంది పారు. ఎవరది.. నాలో పగ అలాగే ఉంది, అప్పుడు తప్పించుకుంది ఈసారి మాత్రం చంపేస్తానని అంటుంది పారు. నేను చెబితే నీ గుండె పగిలిపోతుందని అంటుంది జ్యోత్స్న. ఏం పర్లేదు చెప్పమని పారు అనగా.. సుమిత్ర - దశరథల కూతురు, శివన్నారాయణ మనవరాలు ఎవరో కాదు దీప అని జ్యోత్స్న చెప్పగా పారు గుండె పట్టుకుంటుంది.
ఇన్నాళ్లూ దాస్, కార్తీక్, నువ్వు, దీపలకు ఈ నిజం తెలిసే కథ నడిపించారా అని మండిపడుతుంది పారు. అసలు కార్తీక్ గాడి ప్లాన్ ముందు మనమంతా పాత్రధారులుగా మిగిలిపోయామని రగిలిపోతుంది. నీకు ఏం తెలియనట్లే ఉండు.. ఇకపై గేమ్ నేను ఆడతాను, ఆస్తి మొత్తం కొట్టేయాలని అంటుంది జ్యోత్స్న. నెల్లూరు బ్రాంచిలో స్కామ్ జరిగినట్లు ఫోన్ రావడంతో శివన్నారాయణ పూనకంతో ఊగిపోతాడు. అక్కడేం జరిగిందో తెలుసుకోవడానికి దశరథ బయల్దేరతాడు. అయితే బోర్డ్ మీటింగ్‌లో దశరథను లేకుండా చేయడానికే జ్యోత్స్న ఇలా చేసిందని కార్తీక్, దీపలు అనుమానిస్తారు. ఇంటికెళ్లిన తర్వాత దక్షిణామూర్తి గురించి కార్తీక్, దీపలు అడగగానే కాంచన కోపంతో ఊగిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 14వ తేదీ 670వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి గురించి నన్నే కాదు.. ఎవరిని అడగొద్దని కార్తీక్‌కి క్లాస్ పీకుతుంది కాంచన. అత్తయ్య - తాతయ్య కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. అత్త కళ్లు తిరిగి పడిపోయిందని కార్తీక్ చెప్పడంతో అర్జెంట్‌గా అన్నయ్యకి ఫోన్ చేయమని అడుగుతుంది కాంచన. మావయ్య నెల్లూరులో చిన్న ప్రాబ్లమ్ ఉంటే వెళ్లారు. రేపు బోర్డ్ మీటింగ్ ఉంది, కొత్త సీఈవో వచ్చే వరకు బాధ్యతలు ఎవరు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటారని చెబుతాడు కార్తీక్. ఆ వ్యవహారాల్లో మీరిద్దరూ కలగజేసుకోవద్దు.. దూరంగా ఉండమని కాంచన వార్నింగ్ ఇస్తుంది. దక్షిణామూర్తి తాత పేరు ఎత్తగానే అందరూ అంత సీరియస్ అవుతున్నారని కార్తీక్‌ని అడుగుతుంది దీప.
దీనిని బట్టి గతంలో ఏదో జరగకూడనిదే జరిగి ఉండొచ్చని అంటుంది. ఇకపై దక్షిణామూర్తి తాత గురించి ఆలోచించడం మానేస్తే మంచిదని అంటాడు కార్తీక్. నాకొక తాత ఉన్నాడని తెలిసి వాళ్ల వివరాలు తెలుసుకోకుండా ఎలా ఉంటామని అంటుంది దీప. తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుందో చూశావు కదా? మీ అమ్మే వద్దనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీతో నీకెందుకు. ముందు ఆ జ్యోత్స్న సంగతి తేల్చాలి.. ఇక్కడ సమస్యల్ని పరిష్కరించిన తర్వాత నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని దీపతో అంటాడు కార్తీక్. తాత ఫ్యామిలీని కూడా మనం ఏదో ఒకరోజు కలుస్తామన్న నమ్మకం ఉందని అనుకుంటుంది దీప.
దక్షిణామూర్తి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది సుమిత్ర. అక్కడికి టిఫిన్ తీసుకుని జ్యోత్స్న, పారులు వస్తారు. మనల్ని ఆపే గతం కంటే మనల్ని ముందుకు నడిపించే వాస్తవమే మంచిదని సుమిత్రకు టిఫిన్ తినిపిస్తుంది జ్యోత్స్న. నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావని అంటుంది కార్తీక్. కంపెనీకి కొత్త సీఈవోని ఎంపిక చేస్తున్నారు.. బయటివాళ్లు ఉండకూడదని బోర్డ్ మెంబర్స్ అంటున్నారు, మన ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ సీఈవో ఎవరు అవుతారో నాకు తెలియడం లేదని జ్యోత్స్న చెబుతుండగా అది నీకెందుకు అని శివన్నారాయణ సీరియస్ అవుతాడు.
నా మనసులో మాట చెప్పకునే హక్కు నాకు లేదా అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నాకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు, అలాగే సీఈవో గురించి కూడా అంటున్నారు. ఆ ఇద్దరూ ఒక్కరే ఎందుకు కాకూడదని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పెద్దాయనకు కార్తీక్ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. తాత్కాలికంగా ఎవరో ఒకరు సీఈవోగా ఉండాలి, నేను సీఈవోగా ఉండకూడదా అని అంటుంది జ్యోత్స్న. దానికి సుమిత్ర ఉండొచ్చు అని చెబుతుంది. మా ఆలోచన కూడా అదేనని, మేం కూడా ఇలాగే అనుకున్నామని శివన్నారాయణ చెబుతాడు. అయితే వెంటనే అలాగే చేసేయండి అంటుంది పారు. దశరథ ఊళ్లో లేడు.. వాడికి ఒక మాట చెప్పాలని అంటాడు శివన్నారాయణ. ఆయనతో నేను మాట్లాడతాను.. ఇది ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు దీని అవసరం ఎవరు తీరుస్తారని అంటుంది సుమిత్ర.
నేను సీఈవోగా ఉండే అర్హత కానీ, నేను సీఈవోని సెలెక్ట్ చేసే కమిటీలో ఉండే అర్హత కానీ నాకు లేవని అంటుంది జ్యోత్స్న. ఇది మీ మనవరాలి కోరిక కాదు.. మీ కోడలి కోరిక.. అది ఏమడిగితే అది చేయమని శివన్నారాయణని అడుగుతుంది సుమిత్ర. ఒక్కగానొక్క మనవరాలివి తిట్టినా, పెట్టినా అన్నీ నీకేనని చెబుతుంది పారిజాతం. దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని అంటాడు శివన్నారాయణ. మైండ్ గేమ్ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు బావ నువ్వు నన్ను ఆపలేవని అనుకుంటుంది జ్యోత్స్న.
కారులో కార్తీక్‌తో కలిసి ఆఫీసులో వెళ్తుండగా ఈరోజు ఏం జరగబోతుందో నీకు తెలుసా? అని అడుగుతుంది జ్యోత్స్న. ఏం జరిగినా ఆపాలంటే ఒక్కటే మార్గం.. నన్ను పెళ్లి చేసుకోమని అంటుంది. నెల రోజుల్లో మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెబుతుంది. వచ్చేవన్నీ మంచి ముహూర్తాలే.. నీ పెళ్లి మా మేనత్త కల, అలాగే ఈ కుటుంబాల్ని కలిపే వేదిక, బాగా గ్రాండ్‌గా జరుగుతుంది, మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేస్తానని అంటాడు కార్తీక్. నువ్వు నా మెడలో తాళి కడుతుంటే.. దీప నా జడ ఎత్తి పట్టుకుంటుంటే అని జ్యోత్స్న అంటుంది. నెల రోజులు గడువు పూర్తయ్యే లోపు అన్నీ తగ్గిపోతాయని చెబుతాడు కార్తీక్. ఈరోజు ఆఫీసులో జరగబోయేది చూసిన తర్వాత అంతా నీకే తెలుస్తుందని అనుకుంటుంది జ్యోత్స్న.
బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్‌ను లేకుండా చేయడానికి కారులో ఫోన్ తీసుకురమ్మని చెబుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న రెస్టారెంట్‌కి కొత్త సీఈవో రావాల్సి ఉంది.. కానీ కొత్తవారిని తీసుకురాలేం కదా? కొత్త సీఈవో వచ్చే వరకు ఆ బాధ్యతల్ని ఎవరో ఒకరికి అప్పగించాలని అంటాడు. మొబైల్ కోసం కారు మొత్తం వెతికినా దొరకపోవడంతో కార్తీక్‌కి అనుమానం వచ్చి లోపలికి వచ్చేసరికి కొత్త సీఈవో వచ్చే వరకు ఆ బాధ్యతల్ని జ్యోత్స్నకి అప్పగిస్తున్నానని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అవుతాడు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆర్డర్స్ వేస్తాడు. కాబోయే కొత్త సీఈవోని మనతో పాటు జ్యోత్స్న కూడా సెలెక్ట్ చేస్తుందని చెబుతాడు.
దీపకి కాల్ చేసిన జ్యోత్స్న వెంటనే ఫోన్ సుమిత్రకి ఇవ్వమని చెబుతుంది. జ్యోత్స్న సీఈవో రెస్టారెంట్స్‌కి సీఈవోగా నన్ను అపాయింట్ చేశారు, కొత్త సీఈవోని సెలెక్ట్ చేసే కమిటీలో నన్ను కూడా వేశారని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న దీప షాక్ అవుతుంది. దీపని రవ్వ కేసరి వేయమని ఆర్డర్స్ వేస్తుంది సుమిత్ర. ఏం తెలియనట్లు దీప దగ్గరికి వెళ్లి జ్యోత్స్న నీకు ఏం చెప్పలేదా? అని అడుగుతుంది. పెద్దయ్య గారి నిర్ణయాన్ని ఎవరు కాదంటారని అంటుంది దీప. నువ్వెవరో బయటపడేలోపు ఈ ఇంటికి, ఈ ఆస్తికి నా మనవరాలిని శాశ్వతమైన వారసురాలిని చేస్తానని అనుకుంటుంది పారు. జ్యోత్స్నని సీఈవోని చేయడంపై శివన్నారాయణని ప్రశ్నిస్తాడు కార్తీక్. తాను ఏ పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెబుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications