Karthika Deepam 2 May 15th: జ్యోత్స్నతో దీప సవాల్.. చక్రం తిప్పిన కార్తీక్, జ్యోత్స్న సీఈవో ఆశలు గల్లంతు

Photo Courtesy: JioHotstar

దక్షిణామూర్తి గురించి ఎవరినీ ఏం అడగొద్దని కార్తీక్, దీపలకు కాంచన క్లాస్ పీకుతుంది. మనం ఇక మూర్తి తాత గురించి ఆలోచించడం మంచిది కాదని దీపతో అంటాడు కార్తీక్. మా అమ్మ పుట్టింటి వాళ్లు బతికే ఉన్నారని తెలిసిన తర్వాత వదిలేయడం సరికాదని చెబుతుంది దీప. జ్యోత్స్నకి పెళ్లి చేసి, నిన్ను ఆ ఇంటికి వారసురాలిని చేయడమే నా లక్ష్యం.. ఈ పనుల తర్వాతే ఏదైనా అని తేల్చేస్తాడు కార్తీక్. సీఈవో కుర్చీపై కన్నేసిన జ్యోత్స్న పారు సాయంతో సుమిత్రను బుట్టలో పడేస్తుంది. కూతురు సీఈవో అవుతుందని, తన కోసం చేయమని సుమిత్ర అడగటంతో శివన్నారాయణ సరేనంటాడు. తమ పథకం వర్కవుట్ అయినందుకు పారు- జ్యోత్స్నలు చాలా సంతోషిస్తారు.

ఉదయాన్నే బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్, జ్యోత్స్నలు కారులో వెళ్తుండగా తనను పెళ్లి చేసుకుంటే కంపెనీకి సీఈవోగా, నాకు భర్తగా ఉంటావని అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నీ పైత్యం, నీ పొగరు అంతా దించేస్తానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్ మొదలు కావడానికి ముందు కార్తీక్‌ను అక్కడి నుంచి బయటికి పంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. తన ఫోన్ కారులో ఉండిపోయిందని దానిని తీసుకురమ్మని చెబుతుంది. కార్తీక్ ఫోన్ కోసం వెతికేలోపు.. బోర్డ్ మెంబర్స్‌ని రెచ్చగొట్టి తానే సీఈవోగా ఉండేలా శివన్నారాయణ నిర్ణయం తీసుకునేలా చక్రం తిప్పుతుంది జ్యోత్స్న. కార్తీక్ లోపలికి వచ్చేసరికి నిర్ణయం జరిగిపోవడంతో షాక్ అవుతాడు. దీపకి ఫోన్ చేసిన జ్యోత్స్న తన తల్లికి ఫోన్ ఇవ్వమని చెప్పి.. నేను సీఈవోని అయ్యానని చెప్పడంతో పారు, సుమిత్రలు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 15వ తేదీ 671వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 671 May 15th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నను సీఈవోని చేయడంపై శివన్నారాయణను ప్రశ్నిస్తాడు కార్తీక్. తాను సీఈవో కావాలని అనుకుంటున్న కోరికను నా ముందే వాళ్ల అమ్మతో చెప్పింది. కొత్త సీఈవోని సెలెక్ట్ చేద్దాం.. అతను సీఈవో మాత్రమే కాదు, నా భర్త అని చెప్పింది అంటాడు శివన్నారాయణ. మనం అనుకున్నది జ్యోత్స్నకి ఎవరు చెప్పారని కార్తీక్ డౌట్ పడతాడు. అదే నాకు తెలియడం లేదు.. కొత్త వాళ్లని ఎంపిక చేయొచ్చు, కానీ మన మీద ఎప్పుడైతే బోర్డ్ మెంబర్స్‌కి నమ్మకం పోతుందో అప్పుడే మనం ఓడిపోయినట్లు. జ్యోత్స్నను సీఈవోని చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది.. అదే సుమిత్ర. తనను ఆనందంగా ఉంచమని డాక్టర్ గారు చెప్పారు కదా? కూతురు సీఈవోగా ఉంటే సుమిత్ర ఆనందంగా ఉంటుందని నాకు తెలిసింది. స్వయంగా నా కూతురిని సీఈవోని చేయమని సుమిత్ర అడిగింది.. నా కోడలి కోసమే జ్యోత్స్నని సీఈవోని చేశానని అంటాడు శివన్నారాయణ.

ఇంతలో దశరథ రావడంతో నెల్లూరులో మన బ్రాంచ్ పరిస్ధితి ఏంటీ? అని అడుగుతాడు శివన్నారాయణ. అంతా బాగానే ఉందని అంటాడు దశరథ. జ్యోత్స్న చాలా తెలివిగా అందరినీ చీట్ చేసింది.. నెల్లూరు బ్రాంచ్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు, తనను సీఈవోగా నాన్న ప్రమోట్ చేయడని ఒక చిన్న ప్రాబ్లమ్‌ని సీరియస్ ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసిందని చెబుతాడు దశరథ. నువ్వు వెళ్లిన తర్వాత అత్తని ఎమోషనల్‌గా లాక్ చేసింది. అత్త కోసం తాత మనసు మార్చుకున్నాడు. నేను ఎక్కడ అడ్డుపడతానోనని నన్ను కూడా లేకుండా చేసిందని చెబుతాడు కార్తీక్. టెంపరరీగానే కదా? కొత్త సీఈవోని తీసుకొస్తేనే దీనికి ప్రాబ్లమ్ అంటాడు కార్తీక్. మనకిప్పుడు పనిచేసేవాడు మాత్రమే కాదు.. పనికొచ్చేవాడు కావాలని చెబుతాడు దశరథ. జ్యోత్స్న పెళ్లే అన్నింటికి పెద్ద సొల్యూషన్ అంటాడు కార్తీక్.

సీఈవో కావడంతో జ్యోత్స్న, పారులు ఎంజాయ్ చేస్తుంటారు. నాకు కావాల్సింది సీఈవో పోస్ట్ కాదు.. ఛైర్మన్ పోస్ట్ అంటుంది జ్యోత్స్న. మొదట్లోనే నువ్వు జాగ్రత్త పడుంటే ఎప్పుడో సాధించే దానివి అని అంటుంది పారు. దీప ఎంత మంచిదైనా తను ఆడదే కదా? తన పుట్టింటి ఆస్తి దాస్ కూతురికి పోతుందంటే చూస్తూ ఊరుకుంటుందా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఈ లోపు పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీదేనని అంటుంది. కంపెనీకి కాబోయే సీఈవోనే ఈ ఇంటికి కాబోయే అల్లుడని నువ్వే మీ అమ్మతో చెప్పావు కదా అని చెబుతుంది పారు. నేను సీఈవోగా ఉంటానంటే ఓకే అంటారా? అదే కొత్త సీఈవో వచ్చే వరకు ఉంటానంటే ఓకే అని చెబుతారు.

కొత్త సీఈవోని నేనే సెలెక్ట్ చేయను.. ఈ ఆస్తి నాదే, బావ నా వాడేనని జ్యోత్స్న చెబుతుంది. నీకు ఇంకా కార్తీక్ మీద ఆశ చావలేదా? అని పారు సీరియస్ అవుతుంది. ఇక మీదట కూడా బావని ఎలా భర్తని చేసుకోవాలా అన్న దాని మీదే ఆలోచిస్తున్నాను. అది జరగాలంటే దీప ఉండకూడదు. నేను వారసురాలిగా ఉండాలన్న కూడా దీప ఉండకూడదు.. నా నెక్ట్స్ టార్గెట్ కూడా అదేనని చెబుతుంది జ్యోత్స్న. కార్తీక్ గాడి జోలికి వెళ్లిందంటే దీని జీవితం నాశనమే, దీప ఊరుకోదని పారు టెన్షన్ పడుతుంది.

కార్తీక్, దీపలు ఇంటికి వెళ్తుండగా.. నేనే మిమ్మల్ని దించుతానని అంటుంది జ్యోత్స్న. సవాళ్లు చేయడం తప్పించి మీరిద్దరూ గెలవలేరని చెబుతుంది. నిన్ను ఇంకా అధికారికంగా సీఈవోని చేయలేదు కదా? అంటాడు కార్తీక్. నెల రోజుల్లో పెళ్లి చేస్తానని మీరిద్దరూ నాకు వార్నింగ్ లాంటి ప్రామీస్ చేశారు.. ఆ ప్రామీస్ ఏమైందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నెల రోజుల్లో మీరు నా పెళ్లి చేయలేకపోతే ఏం చేస్తారు? ఓడిపోతే ఏం చేస్తారని జ్యోత్స్న రెచ్చగొడుతుంది. మా బావ మాటిచ్చినట్లు నెల రోజుల్లోగా నీ పెళ్లి చేస్తాం.. ఓడిపోతే నువ్వు ఏది అడిగితే అది ఇస్తామని దీప అంటుంది. నా మాట కూడా అదేనని కార్తీక్ చెప్పడంతో ఆట ఇప్పుడు మజాగా ఉందని అంటుంది జ్యోత్స్న. ఈ మాటలన్నీ విన్న శ్రీధర్ షాక్ అవుతాడు. శ్రీధర్ డ్రాప్ చేస్తానని చెబుతున్నా వినకుండా నేను డ్రాప్ చేస్తానని అంటుంది జ్యోత్స్న.

మనం ఊహించిన దానికన్నా వాళ్ల ముగ్గురి మధ్య ఏదో జరుగుతోందని కాంచనతో అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ రావడంతో నేను నీతో మాట్లాడాలని కొడుకుని బయటికి తీసుకెళ్తాడు. ఇక జ్యోత్స్న సీఈవో అవుతుంది, ఆ తర్వాత పెళ్లయి పోతుంది.. అప్పుడు నువ్వు మీ ఆయన కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టమని దీపతో అంటుంది కాంచన. మళ్లీ ఇంకెప్పుడు ఆ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదని చెబుతుంది. అత్త మాటలు తేడాగా ఉన్నాయని దీప అనుమానిస్తుంది.

నువ్వు, దీపలు జ్యోత్స్నతో మాట్లాడటం నేను విన్నానని శ్రీధర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నెల రోజుల్లో పెళ్లి జరగకపోతే ఏమిస్తారు? నిన్ను తన మెడలో తాళి కట్టమని అడుగుతుంది? కడతావా? అని శ్రీధర్ అడగటంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ అగ్రిమెంట్లు, ఈ ఛాలెంజ్‌లు ఎందుకు? దీప నీ జీవితంలోకి రాకముందు కార్తీక్ వేరు.. ఇప్పుడున్న కార్తీక్ వేరు. దీప ఎవరు? అన్న క్వశ్చన్ మార్క్‌కి నాకు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వడం లేదని అంటాడు శ్రీధర్. దీపకి ఆ ఇంటికి సంబంధం ఉందని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. నా దీప కోసం నేను.. నా కోసం దీప బతుకుతున్నాం. ఏదో రోజు ఈ కథ గురించి నీకే తెలుస్తుంది.. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరమని చెబుతాడు కార్తీక్. నా కొడుకు అగ్రిమెంట్ అనే జైలు నుంచి బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నానని అంటాడు శ్రీధర్.

జ్యోత్స్నని సీఈవోగా ప్రకటిస్తూ శివన్నారాయణ మాట్లాడుతుండగా దశరథ అడ్డుపడతాడు. ముందురోజు మీటింగ్‌లో నేను లేను.. నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయని అంటాడు దశరథ. ఓ నిర్ణయం ఆదేశంగా మారాలంటే అందరూ ఏకీభవించాలి కదా అని చెబుతాడు కార్తీక్. మన ఫ్యామిలీలో నుంచి ఒకరు సీఈవో కావాలి అంతేకదా? ఆ ఒక్కరు జ్యోత్స్ననే ఎందుకు కావాలి.. మరొకరు ఎందుకు కాకూడదని దశరథ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్‌ని సీఈవోని చేయాలని బోర్డ్ మెంబర్స్ ప్రశ్నిస్తారు. నేను ఈ బాధ్యతల్ని తీసుకోలేనని కార్తీక్ తేల్చేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X