Karthika Deepam 2 May 16th: సీఈవోగా దీప.. కార్తీక్ దెబ్బకు పారు, జ్యోత్స్నలకు మైండ్ బ్లాక్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని సీఈవో చేయడంపై శివన్నారాయణ, కార్తీక్, శ్రీధర్‌లు మాట్లాడుకుంటారు. సుమిత్ర కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని కార్తీక్‌కి చెబుతాడు శివన్నారాయణ. నెల్లూరు నుంచి వచ్చిన దశరథ.. అక్కడ ఏ ప్రాబ్లమ్ లేదని చిన్న సమస్యేనని తండ్రికి చెబుతాడు. నువ్వు వెళ్లిన తర్వాత అత్తని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి, బోర్డ్ మెంబర్స్‌ని తనవైపుకు తిప్పుకుందని అంటాడు కార్తీక్. జ్యోత్స్న పెళ్లి కావడమే వీటన్నింటికీ సొల్యూషన్ అని చెబుతాడు. సీఈవో కావడంతో పారు, జ్యోత్స్నలు ఎంజాయ్ చేస్తుంటారు. నా టార్గెట్ సీఈవో పోస్ట్ కాదు.. ఛైర్మన్ కుర్చి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే కంపెనీతో పాటు ఈ ఆస్తి మొత్తం నీదేనని చెబుతుంది పారు. ఈ కంపెనీని, ఈ ఆస్తినే కాదు బావని కూడా వదలను అంటుంది జ్యోత్స్న. ఇవన్నీ జరగాలంటే దీప ఉండకూడదు.. నా నెక్ట్స్ టార్గెట్ అదేనని అంటుంది.
కార్తీక్, దీపలు ఇంటికి వెళ్తుండగా నేను డ్రాప్ చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. నెల రోజుల్లోగా నాకు పెళ్లి చేయకపోతే మీరిద్దరూ ఏం చేస్తారని జ్యోత్స్న అడగ్గా.. నువ్వు అడిగింది ఇస్తానని చెబుతుంది దీప. ఈ మాటలన్నీ విన్న శ్రీధర్ షాక్ అవుతాడు. ఇంటికొచ్చి జరిగినదంతా కాంచనకు చెబుతాడు. దీనిపై కార్తీక్‌ని తండ్రి నిలదీయగా.. వీటి గురించి ఏదో ఒకరోజు నీకే తెలుస్తుందని అంటాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్‌లో జ్యోత్స్నని సీఈవోగా అనౌన్స్ చేస్తుండగా దశరథ అడ్డుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 16వ తేదీ 672వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్‌ని సీఈవోగా ఉండమని బోర్డ్ మెంబర్స్ అడగటంతో తన వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ఆ పదవిని తీసుకోలేనని, ప్రస్తుతానికి బోర్డ్‌కి సలహాదారుగా మాత్రమే ఉంటానని చెబుతాడు కార్తీక్. మన ఫ్యామిలీలో సీఈవోగా ఇంకెవరున్నారు.. అసలు జ్యోత్స్న సీఈవోగా ఉండటంలో నీ అభ్యంతరం ఏంటని శివన్నారాయణ నిలదీయడంతో నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలని చెబుతాడు దశరథ. ఈరోజే జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో ఎవరన్నది నిర్ణయిస్తానని బోర్డ్ మెంబర్స్‌కి చెప్పి కొడుకుని పక్కకి తీసుకెళ్తాడు దశరథ.
ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా ఉన్నావు బావ.. జ్యోత్స్నని సీఈవోగా చేయడాన్ని ఎవరూ ఆపలేరని చెబుతుంది జ్యోత్స్న. నేను తప్పించి ఈ ఇంట్లో సీఈవోగా చేయడానికి ఎవరున్నారని శ్రీధర్‌ని అడుగుతుంది జ్యోత్స్న. మీ అమ్మ సుమిత్ర చేయొచ్చు కదా? చెల్లెమ్మ బాగా చదువుకుంది తనెందుకు కాకూడదని శ్రీధర్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం గతాన్ని మైండ్‌లో పెట్టుకుని తీసుకోవాలి, జ్యోత్స్నకి కార్తీక్ అంటే ఇష్టం. కానీ కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి మనమంతా ఒప్పుకోకపోవడంతో తను మరో పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు తనను సీఈవోని చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదని అంటాడు దశరథ.
ఇంతలో కార్తీక్ వచ్చి మావయ్య చెప్పింది ఒకసారి ఆలోచించమని అంటాడు. నా కోడలి ముఖంలో సంతోషం చూడాలని అనుకున్నాను, జ్యోత్స్నని సీఈవోని చేస్తే సుమిత్ర ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి కాబోయేవాడిని సీఈవోని చేస్తానని చెబుతాడు శివన్నారాయణ. అప్పుడు జ్యోత్స్న ఈ జన్మలో పెళ్లి చేసుకోదని అంటాడు కార్తీక్. మీ మాటలు మంచిదే కానీ.. నేను సుమిత్రకు ఇచ్చిన మాటని ఏం చేయాలని పెద్దాయన అడగ్గా.. కార్తీక్ ఓ ప్లాన్ చెబుతాడు.
మీ నిర్ణయం కోసం అందరం వెయిట్ చేస్తున్నామని శివన్నారాయణతో అంటుంది జ్యోత్స్న. పదవికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదు.. అర్హత కూడా ఉండాలి కదా అని దశరథ చెబుతాడు. మీ కూతురికి మించిన అర్హత ఇంకెవరికీ ఉంటుంది.. ఉంటే వాళ్లకే అప్పగించండి అని చెబుతాడు బోర్డ్ మెంబర్. ఆల్రెడీ ఫోన్ చేశాను.. వస్తున్నారని చెప్పడంతో బోర్డ్ రూమ్‌లోకి పారిజాతం వస్తుంది. గ్రానీని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు ఇంతగా కోరుకుంటుంటే నేను కాదనలేకపోతున్నానని అంటుంది పారు. నువ్వు కాస్త తప్పుకుంటే వెనుక ఉన్నవాళ్లు ముందుకొస్తారని కార్తీక్ చెప్పడంతో వెనుక దీప ఉంటుంది. ఆమెను చూడగానే పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు.
పనివాళ్లు ఈ మీటింగ్ హాల్‌లోకి రావాల్సింది కాఫీలు, టీలు కావాలా అని అడగటానికి, మనతో పాటు సమానంగా కూర్చోవడానికి కాదని దీపని అవమానిస్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో సీరియస్ అయిన దశరథ.. దీప పనిమనిషి కాదు జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి కాబోయే సీఈవో అని చెబుతాడు. ఆ మాటలు వినగానే పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇప్పుడు నా మనవరాలికి అన్యాయం జరిగేలా ఉందని ఎలాగైనా అడ్డుపడాలని అనుకుంటుంది పారు. సీఈవో అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. క్లీనింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదని దీపని అవమానిస్తుంది జ్యోత్స్న. దీపని సీఈవో పోస్ట్‌కి నేను ప్రతిపాదిస్తున్నానని చెబుతాడు దశరథ.
నా భార్యమీ సీఈవో కావాలని కోరుకోవడం లేదు.. దశరథ గారే ఫోన్ చేసి పిలిపించారని చెబుతాడు కార్తీక్. దీప కడుపుతో ఉంది.. తనకి ఈ పనులన్నీ ఎందుకని అంటుంది పారు. దీప మీద నాకు నమ్మకం ఉంది, తను ఈ సంస్థని సీఈవోగా నడిపిస్తుందని అంటాడు దశరథ. దీప సీఈవోగా ఉండటం నాకు ఇష్టం లేదని అంటాడు బోర్డ్ మెంబర్ ధరణి. దీపని సీఈవోని చేయాలన్న డాడీ నిర్ణయం చెల్లదని అంటుంది జ్యోత్స్న. దీప పరాయిది కాదు.. తను నా కూతురు అని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా చెల్లెలి కోడలు నాకు కూతురే కదా అని దశరథ కవర్ చేస్తాడు. మాకెవ్వరికీ అభ్యంతరం లేదని బోర్డ్ మెంబర్స్ చెప్పగా.. నాకు అభ్యంతరం ఉందని అంటుంది జ్యోత్స్న.
ఓటింగ్ పెట్టి ఎవరిని సీఈవో చేయాలని అనుకుంటే వాళ్లని చేయమని జ్యోత్స్న చెప్పడంతో శివన్నారాయణ ఓకే చెబుతాడు. అలాగే కార్తీక్‌కి కూడా ఓటు హక్కు ఉంటుందని అంటాడు శివన్నారాయణ. ఇవన్నీ నాకెందుకు అని దీప అడగ్గా.. జ్యోత్స్నని అడ్డుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదని అంటాడు కార్తీక్. దీపని ఇక్కడికి తీసుకొచ్చే ముందు నాకు మెసేజ్ చేయొచ్చు కదా అని పారుపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. పారు ప్రవర్తనతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. చీటీలు నువ్వే తీసి నాకు ఇవ్వమని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. వరుసగా మూడు ఓట్లు జ్యోత్స్నకే రావడంతో ఆమెను సీఈవోగా చేసేయమని అంటుంది పారు. అయితే ఆ తర్వాతి నుంచి వరుసగా దీపకి ఓట్లు రావడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications