Karthika Deepam 2 May 18th: కార్తీక్, దీపలను విడదీసిన జ్యోత్స్న... బెడిసికొట్టిన శివన్నారాయణ పథకం

Photo Courtesy: JioHotstar

బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్‌ని సీఈవోగా ఉండమని బోర్డ్ మెంబర్స్ అడగటంతో తాను ఉండలేనని తిరస్కరిస్తాడు. సీఈవోగా జ్యోత్స్న పేరును అనౌన్స్ చేయబోతుండగా దశరథ అడ్డుపడతాడు. నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలని శివన్నారాయణని పక్కకి తీసుకెళ్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. జ్యోత్స్నని కనుక సీఈవోని చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదని శివన్నారాయణకు చెబుతాడు దశరథ. కార్తీక్ కూడా అదే మాట చెప్పి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని అంటాడు.

బోర్డ్ మీటింగ్ మొదలవ్వగానే జ్యోత్స్న రెస్టారెంట్‌కి కాబోయే సీఈవో ఎవరన్న దానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకరికి ఫోన్ చేశాం.. వచ్చేస్తున్నారని దశరథ అనగానే పారు ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వెనకాలే దీప ఉండటంతో పారు, జ్యోత్స్నలు ఉలిక్కిపడతారు. జ్యోత్స్న, దీపలలో ఒకరు సీఈవో అవుతారని, ఓటింగ్ పెడతాడు. ఓటింగ్‌లో దీపకి ఎక్కువ ఓట్లు రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 18వ తేదీ 673వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 673 May 18th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కొత్త సీఈవో కోసం జరిగిన ఓటింగ్‌లో జ్యోత్స్న, దీప ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయి. దాంతో ఇద్దరినీ సీఈవోలుగా ఉంచొచ్చని చెబుతాడు కార్తీక్. శివన్నారాయణ కూడా దానికి ఓకే చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కంపెనీని నడిపించే సమర్ధత ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉందో వాళ్లే సీఈవో అవుతారని చెబుతాడు శివన్నారాయణ. దానిని ఎలా నిర్ణయిస్తారు? ఇంటర్వ్యూ చేస్తారా? అని అడుగుతుంది జ్యోత్స్న. మీ ఇద్దరికి పరీక్ష పెడుతున్నా.. హైదరాబాద్‌లో మనకున్న రెస్టారెంట్స్‌లో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి దీపకి, మరొకటి జ్యోత్స్నకి ఇస్తాం. వీళ్లిద్దరికీ రెండు వారాలు టైం ఇస్తాం. రెస్టారెంట్స్‌కి సంబంధించిన పూర్తి బాధ్యతలు వాళ్లవే.

ఈ రెండు వారాల్లో వాళ్లే నిర్ణయాలు తీసుకుని ఎవరు కస్టమర్లను రప్పిస్తారో వాళ్లే విజేత. రెస్టారెంట్స్‌ని నష్టాల్లో నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారో వాళ్లే విజేత. వాళ్ల సొంత తెలివితేటలకు, సమర్ధతకు ఇదే అసలైన పరీక్ష. మళ్లీ రెండు వారాల తర్వాత బోర్డ్ మీటింగ్ జరుగుతుంది, అప్పటి వరకు ఎవరి రెస్టారెంట్ లాభాల్లో ఉంటుందో వాళ్లనే సీఈవోలుగా చేస్తాను. అప్పటి వరకు వీళ్లిద్దరూ టెంపరరీ సీఈవోలుగా పనిచేస్తారు, మా సలహాలు కూడా ఇస్తామని చెబుతాడు శివన్నారాయణ. దీనికి మీరిద్దరూ ఓకేనా అని పెద్దాయన అడగ్గా.. జ్యోత్స్న, దీపలు ఓకే చెబుతారు.

పోటీకి నేను ఓకే కానీ.. నాది ఒక కండీషన్. నువ్వు ఇంతకు ముందు ఈ కంపెనీకి సీఈవో కాబట్టి.. నీ సలహాలతో దీప గారు చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఈ రెండు వారాలు నువ్వు దీపకి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెబుతుంది. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తనే గెలుస్తుందని చెబుతాడు కార్తీక్. నువ్వు దీప విడిపోవాలని జ్యోత్న్న అనగానే అంతా షాక్ అవుతారు. ఈ పోటీ జరుగుతున్న రెండు వారాలు నువ్వు నీ భార్య కలిసుండకూడదని చెబుతుంది. అప్పటి వరకు బావ మనింట్లోనే ఉంటాడని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

నాతో పోటీ చేసే సమర్ధత దీపకి ఉంటే ఓకే.. లేదంటే పోటీ నుంచి తప్పుకోమనండి అని జ్యోత్స్న సవాల్ చేస్తుంది. నేను ఒప్పుకుంటున్నానని దీప చెప్పడంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. ఈ రెండు వారాలు నీకు దూరంగా ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని చెబుతుంది. దీప, కార్తీక్‌లు భార్యభర్తలు.. పైగా దీప ప్రెగ్నెంట్ ఈ టైంలో భర్త అవసరం ఉంటుందని చెబుతాడు శ్రీధర్. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ముడిపెట్టొద్దు.. దీపని ఇంట్లో కూర్చోమనండి అని చెబుతుంది జ్యోత్స్న.

జ్యోత్స్న పెట్టిన కండీషన్స్ నాకు నచ్చలేదు.. కాకపోతే ఇది మీ ఇద్దరి నిర్ణయాల మీద ఆధారపడింది. కావాలంటే నీ నిర్ణయం వెనక్కి తీసుకోమని చెబుతాడు శివన్నారాయణ. దీపని జ్యోత్స్న రెచ్చగొడుతోంది.. తొందరపడొద్దని కార్తీక్‌తో అంటాడు దశరథ. పరిస్ధితులు మన చేయి దాటిపోయిందని అంటాడు కార్తీక్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను, నువ్వు చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని చెబుతుంది దీప. అగ్రిమెంట్ రాయిస్తే సంతకాలు పెట్టడానికి మేమిద్దరం రెడీ, క్లాజ్‌లు మాత్రం క్లియర్‌గా ఉండాలి. బావ, దీప కలిసుండకూడదని చెబుతుంది జ్యోత్స్న. రేపు ఉదయం ఫైల్స్‌ మీద సంతకాలు పెట్టి మీ పనులు స్టార్ట్ చేయమని చెబుతాడు శివన్నారాయణ.

పోటీ ఈ క్షణం నుంచే మొదలవుతుంది.. నువ్వు ఈ క్షణమే దీపని వదిలేసి వచ్చేయాలని కార్తీక్‌కి చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందని దీపతో పారు అంటుంది. దీప చిన్న పిల్ల కాదు.. పోటీలో గెలిచి సీఈవో పోస్ట్‌ని భర్తకి గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటోందని చెబుతుంది పారు. మనకి మంచి రోజులు మొదలయ్యాయి.. నేను పెట్టిన కండీషన్‌కి ఒప్పుకుని దాని తలకొరివి అదే పెట్టుకుంది. ఇక నుంచి వాళ్లని ఆడుకుంటానని చెబుతుంది.

సీఈవో ఎవరు అయ్యారు? ఆ పోస్ట్ ఆ మహాతల్లికే ఇచ్చేస్తే ఎవరి నెత్తి మీద కాకుండా ఆఫీసులో కూర్చొంటుందని శ్రీధర్‌తో అంటుంది కాంచన. నువ్వు అడిగినా మావయ్య నీకు చెప్పడని కాంచనతో అంటుంది జ్యోత్స్న. నీ పెళ్లి తర్వాత నిన్ను మేనకోడలిగా చూస్తానని అంటుంది కాంచన. మేనకోడలిగా ఏంటీ? కోడలిగానే చూస్తావని జ్యోత్స్న అనడంతో కాంచన నాలుక కోసేస్తానని సీరియస్ అవుతుంది. నా పెళ్లి త్వరలోనే జరుగుతుంది. నీ ఆశీర్వాదం లేకుండా నా పెళ్లి జరగదని అంటుంది జ్యోత్స్న. నేను, నీ కొడుకుని తీసుకుపోతున్నానని కార్తీక్ చేయి పట్టుకుని జ్యోత్స్న చెప్పడంతో కాంచన సీరియస్ అవుతుంది.

రెండు వారాల పాటు బావ మా ఇంట్లోనే ఉంటాడు, దీప మా ఇంటికి రాదని జ్యోత్స్న చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. నీ కోడలిని నాకు సీఈవోగా పోటీకి పెట్టారు. ఎవరో ఒకరు వచ్చే వరకు నేను సీఈవోగా ఉంటానని చెప్పినా వద్దు అన్నారు. దీప సీఈవో అన్నారు.. వంటగదిలో వంట చేసుకునే వాళ్లు కూడా అర్హతకు మించి ఆశపడుతున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు మాట్లాడుతున్నది నా భార్య గురించి అని మరిచిపోతే.. నువ్వు ఎవరన్నది నేను కూడా మరిచిపోతానని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. దీప, జ్యోత్స్నలకు సమానంగా ఓట్లు వచ్చాయని చెబుతాడు శ్రీధర్. కడుపుతో ఉన్నావు కదా? నీకు ఎలక్షన్స్ పోటీలు అవసరమా అని మండిపడుతుంది కాంచన.

మా ఇద్దరికీ రెండు వారాలు రెండు రెస్టారెంట్స్ ఇచ్చారు. ఎవరైతే ఆ రెస్టారెంట్‌ని లాభాల బాట పట్టిస్తారో వాళ్లే జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి పర్మినెంట్ సీఈవో అని చెబుతుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు ఉన్న దరిద్రాలు చాలవని కొత్తది తగిలించుకుని వచ్చారని కాంచన సీరియస్ అవుతుంది. పోటీలో ఉన్న ఈ రెండు వారాలు దీప, బావలు వేర్వేరుగా ఉండాలని నేను కండీషన్ పెట్టాను. దీనికి దీప ఒప్పుకుందని జ్యోత్స్న చెప్పడంతో.. నువ్వు అందరి కోసం ఆనందాలు త్యాగం చేస్తున్నావని అనుకున్నాను, కానీ జీవితాల్ని త్యాగం చేయొద్దని మండిపడుతుంది కాంచన. వెంటనే ఈ విషయం గురించి దశరథకు ఫోన్ చేయబోతుండగా కార్తీక్ ఫోన్ లాక్కుంటాడు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది, కంపెనీని ఈవిడ గారి చేతుల్లో పెడితే ఉద్యోగులంతా అడుక్కుతినాలని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X