Karthika Deepam 2 May 20th: సూరజ్ జీవితాన్ని నాశనం చేసిన జ్యోత్స్న.. కార్తీక్ కళ్ల ముందే అరాచకం
Photo Courtesy: JioHotstar
నా కొడుకుని, కూతురిని విడదీయడానికి నువ్వెవరు అంటూ జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. ఈ విషయాన్ని మీ నాన్నతోనే తేల్చుకుంటానని దశరథకి ఫోన్ చేయబోతుండగా కార్తీక్ లాక్కుంటాడు. మన ఉద్యోగుల క్షేమాన్ని, కంపెనీని దృష్టిలో పెట్టుకుని మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నామని కాంచనకు నచ్చచెబుతాడు కార్తీక్. రెండు వారాలలో వచ్చేస్తానని దీపకి, కాంచనకి చెప్పి బయల్దేరతాడు కార్తీక్. కొడుకుని జ్యోత్స్న తీసుకెళ్తూ ఉండటంతో తల్లి బాధపడుతుంది. భార్యాభర్తల్ని వేరు చేస్తావా అంటూ జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది సుమిత్ర. నేనేం విడదీయలేదు.. పోటీలో నుంచి తప్పుకోమంటే తప్పుకోకుండా దీప ఇక్కడి వరకు తెచ్చుకుందని అంటుంది జ్యోత్స్న. పెద్దవాళ్లుగా మేం రేపు ముఖాలు చూసుకోలేమని తల్లి బాధపడుతుండగా నేను ఆల్రెడీ కాంచన అత్తకి జరిగినదంతా చెప్పానని అంటుంది జ్యోత్స్న.
నా చెల్లికి, దీపకి నేను సంజాయిషీ ఇచ్చుకోవాలని కార్తీక్ ముందు దశరథ బాధపడుతూ కాంచనకి ఫోన్ చేస్తాడు. తన కొడుకు, కోడల్ని విడదీసినందుకు కాంచన రగిలిపోతూ శివన్నారాయణని, దశరథని నానామాటలు అంటూ కంటతడి పెడుతుంది. కూతురి బాధ చూసిన శివన్నారాయణ కూడా వెక్కి వెక్కి ఏడుస్తాడు. మీ వల్ల నా కూతురితో మాటలు పడ్డాను... మీరేం చేస్తారో తెలియదు నా బిడ్డ మళ్లీ నవ్వుతూ కనిపించాలని కార్తీక్, దశరథలపై సీరియస్ అవుతాడు. ఉదయాన్నే దీప, కాంచనలు ఇంట్లో కనిపించడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 20వ తేదీ 675వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బయట ఒక బ్యాగ్ ఉందని దానిని తీసుకొస్తే అందరికీ సమాధానం చెబుతానని అంటుంది కాంచన. మా అందరి కోసం మీరు ఏదో తీసుకొచ్చారు? ఇప్పుడే దానిని తీసుకొస్తానని అంటుంది పారు. ఇంత బరువుగా ఉంది.. ఇందులో ఏమున్నాయని అడుగుతుంది పారు. బట్టలు అని కాంచన చెప్పగా.. మా అందరి కోసం బట్టలు కొన్నావా? అని అడుగుతుంది పారు. నా కొడుకు క్యాంప్‌కి వెళ్లాడు.. రెండు వారాల వరకు రాడు, వేసవి సెలవులకి శౌర్యని తీసుకుని మా అక్క అనసూయ ఊరెళ్లింది. కొడుకు, మనవరాలు లేని ఇంట్లో కోడలితో కలిసి ఉండలేక నా కొడుకు, నా ఇంటికి వచ్చే వరకు పుట్టింటిలో ఉందామని వచ్చానని చెబుతుంది కాంచన. ఈ మాటలతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. రెండు వారాలు కాదు.. రెండు నెలలు ఉంటానన్నా నాకు ఏ అభ్యంతరం లేదని చెబుతాడు శివన్నారాయణ. నేను కూడా ఒప్పుకుంటున్నానని అంటాడు దశరథ.
ఇదంతా చీటింగ్ నేను ఒప్పుకోనని అంటుంది జ్యోత్స్న. అత్త ఓకే.. దీప ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది. కార్తీక్‌ని తీసుకొచ్చినప్పుడు నేను ఏమైనా అన్నానా? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. దీపకి నాకు పోటీ జరుగుతుందని జ్యోత్స్న చెబుతుంది. పోటీకి దీనికి సంబంధం లేదు.. వాళ్లబ్బాయి క్యాంప్ నుంచి వచ్చే వరకు వీళ్లు ఇక్కడే ఉంటారని అంటాడు కార్తీక్. మీ డ్రైవర్ కూడా వాళ్ల ఫ్యామిలీని తీసుకొచ్చుకోవచ్చు కదా అని అడుగుతుంది కాంచన. మా పెద్ద మేడం గారి కండీషన్‌ని నేను అస్సలు జవదాటనని కార్తీక్ అంటాడు. తర్వాత దీప, కాంచనలు లోపలికి వెళ్తారు. కూతురి ముఖంలో ఆనందం చూసిన శివన్నారాయణ కొడుక్కి థ్యాంక్స్ చెబుతాడు. జరిగినదానికి కాంచన ముఖం చూడలేనని అనుకున్నాను, కార్తీక్ ఇచ్చిన సలహాతో నా బాధపోయిందని అంటాడు. అన్ని సమస్యలకు వాడి దగ్గర పరిష్కారాలు ఉంటాయి, ఎవరికి ఎలా చెప్పాలో వాడికి చెప్పాలని అంటాడు దశరథ.
కాంచన, దీపలు సరాసరి ఇంటికి రావడంతో జ్యోత్స్న, పారులు రగిలిపోతారు. మనం ఇలాగే ఉంటే వాళ్లు సిక్స్‌ల మీద సిక్స్‌లు కొడుతూనే ఉంటారని చెబుతుంది పారు. తప్పు చేసింది నువ్వే.. ఇంటికెళ్లి కాంచనను రెచ్చగొట్టావు, దాని ఎఫెక్టే ఇదని అంటుంది. దీపని అర్జెంట్‌గా తరిమేయాలి, అది ఇంట్లో ఉంటే నేను ఓడిపోతానని బాధపడుతుంది జ్యోత్స్న. ఆఫీస్ నుంచి తరిమేయమని చెబుతుంది పారు. నువ్వు మొసలి, నేను నీళ్లు.. ఆ కార్తీక్ గాడు ఉత్తమ భర్త, దీప ఉత్తమ భార్య వారిద్దరూ కలిసి ఉత్తమ విలన్ డమ్మీనే అంటుంది పారు. దీపని ఎక్కువ రోజులు ఆఫీస్‌లో ఉండనివ్వనని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఆఫీస్‌లో చూసుకో.. నేను ఇంట్లో చూసుకుంటా, దానిని రెండ్రోజుల్లో దుకాణం సర్దుకుపోయేలా చేస్తానని అంటుంది పారు. ఇదంతా బావే చేస్తున్నాడని జ్యోత్స్న చెప్పగా.. వాడు పద్దతిగా చేస్తే, మనం పద్ధతి దాటి చేద్దామని అంటుంది పారు.
దక్షిణామూర్తి ఇంటికొచ్చాడని కార్తీక్ చెప్పాడని దశరథను అడుగుతుంది కాంచన. కొన్ని విషయాలు మనం తలచుకోకూడదు.. ఎందుకంటే అది గాయం, వదిలేయమని చెబుతాడు దశరథ. ఆఫీస్‌కి వెళ్దామని దీపని అడుగుతాడు దశరథ. నేను కూడా వస్తానని అంటుంది జ్యోత్స్న. మీరిద్దరూ ఈ పోటీ మొదలైన తర్వాత మొదటిసారి ఆఫీసుకు వస్తున్నారని దేవుడికి దండం పెట్టుకుని రమ్మని చెబుతాడు దశరథ. దీంతో దీప వెళ్లి కాంచన ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ పోటీలో నువ్వు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెబుతుంది కాంచన. నేను కూడా నీ కోడలే గెలవాలని కోరుకుంటున్నానని పారు చెప్పగా.. కార్తీక్‌కి అనుమానం వస్తుంది. తర్వాత దీప .. సుమిత్ర ఆశీర్వాదం తీసుకోబోతుండగా.. ఏమని దీవించాలో అర్ధం కానీ పరిస్ధితి అని అంటుంది సుమిత్ర.
నీ కూతురిని ఓడించమని నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటోందని జ్యోత్స్న అంటుంది. ఇది గెలుపు కోసం కాదు.. మానసిక ధైర్యం కోసమని చెబుతుంది దీప. నువ్వు జ్యోత్స్నకు కన్ను కొట్టడం నేను చూశానని కార్తీక్ అనడంతో పారు షాక్ అవుతుంది. వీడికి అనుమానం వచ్చింది జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది పారు. తర్వాత సుమిత్ర ఆశీర్వాదాలు తీసుకుంటుంది జ్యోత్స్న. కన్నతల్లి ఆశీర్వాదాలు ఎప్పటికీ వృథా కావని అంటాడు కార్తీక్. దీపకి ఆల్ ది బెస్ట్ చెప్పిన కాంచన.. పోటీ ఎంత గట్టిగా ఉన్నా సరే, ప్రత్యర్ధి ఎంత బలవంతుడైనా సరే మనం మాత్రం తగ్గొద్దని అంటుంది. దీపని తీసుకుని నువ్వు వేరే కారులో వెళ్లండి, నేను బావ వేరే కారులో వెళ్తామని చెబుతుంది జ్యోత్న్స.
కార్తీక్, జ్యోత్స్నలు కారులో వెళ్తుండగా జ్యోత్స్నకి సూరజ్ కనిపించడంతో సడెన్ బ్రేక్ వేస్తుంది. ఈ ప్లాట్‌ఫాం గాడు నన్ను అవమానించి, నడిరోడ్డు మీద నడిపిస్తాడా అంటూ రగిలిపోతుంది జ్యోత్స్న. వెంటనే కారు దిగిన జ్యోత్స్న ఎవరికో ఫోన్ చేస్తుంది. వెంటనే కార్తీక్ వచ్చి ఆఫీస్‌కి వెళ్దామని చెబుతుంది. కాసేపట్లో నీకో సినిమా చూపిస్తానని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కారులో వచ్చిన ఆఫీసర్లు.. సూరజ్ దగ్గరికి వెళ్లి ఎవరి పర్మిషన్ తీసుకుని ఇక్కడ స్టాల్ పెట్టావని అడుగుతారు. ఇలాంటి స్టాల్ పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయని మాకు కంప్లయంట్ వచ్చిందని చెబుతారు ఆఫీసర్లు. కంప్లయంట్ ఇచ్చింది ఎవరని సూరజ్ అడిగేలోగా.. మొత్తం సరకు మొత్తాన్ని కింద పడేస్తారు.
అది చూసిన కార్తీక్.. అతను నాకు బాగా తెలిసిన మనిషి ముందు జరిగేది ఆపమని అంటాడు జ్యోత్స్న. ఆమె వినకపోవడంతో కార్తీక్ నేరుగా వెళ్లి ఆఫీసర్లతో మాట్లాడతాడు. ఇదంతా నీ పనా? మర్యాదగా ఆపమని సూరజ్ అంటాడు. అక్రమంగా పెట్టుకుంటే దేవుడు కూడా ఆపలేడని చెబుతుంది జ్యోత్స్న. వారిద్దరూ బావా మరదళ్లని తెలుసుకున్న సూరజ్ షాక్ అవుతాడు. వీడొక పొగరుబోతు.. నా మీదే వీడు అహంకారం చూపించాడని అంటుంది జ్యోత్స్న. ఆ రోజు గిఫ్ట్ షాపులో నాతో గొడవ పెట్టుకుంది నువ్వే, ఆ తర్వాత లిఫ్ట్ ఇస్తానని చెప్పి రాంగ్ అడ్రస్‌లో డ్రాప్ చేసిందని చెబుతాడు సూరజ్. ఆ రోజు వీడి వల్ల ఇంటికి లేట్‌కి వచ్చాను, తిట్లు తిన్నానని చెబుతుంది జ్యోత్స్న. వీడెంటో నాకు చూపించాడు.. నేనంటో వీడికి చూపించాడని అంటుంది జ్యోత్స్న.
వీడు సిటీలో ఎక్కడా స్టాల్ పెట్టలేడు, వీడు పొగరుబోతు, అయినా చిటికె వేస్తే కూలిపోయే జీవితం వీడిది. ఇలాంటి వాడి ముందు తగ్గి ఉండాల్సిన అవసరం ఈ జ్యోత్స్నకి లేదని చెబుతుంది. టైం వచ్చినప్పుడు ఆవిడ లెక్క నేను సరిచేస్తానని సూరజ్ అంటాడు. అతని చేతిలో 100 రూపాయలు పెట్టి.. డబ్బున్నవాడితో, అధికారం ఉన్నవాడితో పెట్టుకోకూడదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నేను నీకు హెల్ప్ చేస్తానని కార్తీక్ చెబుతుండగా ఈ సంగతి నేను చూసుకుంటానని అంటాడు సూరజ్. చేసిన తప్పుని సరి చేసుకుంటావా లేదా అని జ్యోత్స్నపై మండిపడతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications