Karthika Deepam 2 May 21st: సీఈవోగా ఛార్జ్ తీసుకున్న దీప.. ఫస్ట్ డేనే జ్యోత్స్నకి చుక్కలు

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే ఇంట్లో దీప, కాంచన కనిపించడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మా అబ్బాయి క్యాంప్‌కి వెళ్లాడు.. అతను వచ్చే వరకు నేను, నా కోడలు నా పుట్టింటిలోనే ఉంటామని కాంచన చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. దీపతో నాకు పోటీ జరుగుతోంది.. నువ్వు ఒకే కానీ, తను ఉండటానికి వీల్లేదని అంటుంది జ్యోత్స్న. నా కూతురు, ఆమె కోడలు ఇక్కడే ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని శివన్నారాయణ అంటాడు. సుమిత్ర, దశరథలు కూడా సరేనని అనడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. కాంచన ముఖంలో తిరిగి ఆనందం తీసుకొచ్చినందుకు దశరథకు థ్యాంక్స్ చెబుతాడు పెద్దాయన. ఇదంతా కార్తీక్ గాడి ప్లాన్.. ఎవరికి ఎలా చెప్ాపలో వాడికి తెలుసని అంటాడు దశరథ.

ఆఫీస్‌కి వెళ్తూ వెళ్తూ.. కాంచన, సుమిత్ర, దశరథల ఆశీర్వాదాలు తీసుకుంటుంది దీప. ఆమెను చూసి జ్యోత్స్న కూడా సుమిత్ర ఆశీస్సులు తీసుకుంటుంది. కార్తీక్- జ్యోత్స్న కారులో వెళ్తుండగా జ్యోత్స్నకి సూరజ్ కనిపిస్తాడు. వెంటనే అతనికి బుద్ధి చెప్పాలని అనుకుని ఆఫీసర్లకు ఫోన్ చేసి అతని ఫుడ్ స్టాల్‌ని పీకేయిస్తుంది. నువ్వు నాకు చేసిన అవమానానికి ఇది నా రివేంజ్ అంటాడు. కార్తీక్ ముందే ఇదంతా జరుగుతున్నా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. నేను చిటికెస్తే కూలిపోయే జీవితం నీది.. నువ్వు నాతో గొడవ పడతావా అంటూ సూరజ్‌ చేతిలో 100 రూపాయలు పెట్టి వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 21వ తేదీ 676వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 676 May 21st 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఫైల్ మీద సంతకం చేసిన జ్యోత్స్న.. నువ్వు కూడా సంతకం పెట్టమని దీపకి ఇస్తూ నీకు సైన్ చేయడం వచ్చా అని అవమానిస్తుంది. దీప ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకుందని అంటాడు కార్తీక్. ఏదో ఎంబీబీఎస్ చదివిందని చెబుతావేంటీ బావా అంటుంది జ్యోత్స్న. ఉదయాన్నే స్కూల్‌కి రెడీ చేయడానికి అమ్మ.. యూనిఫాం ఇస్త్రీ చేయడానికి పనిమనిషి, లంచ్ బాక్స్ పెట్టడానికి ఆయా, స్కూల్‌ దగ్గర దించడానికి 25 లక్షల రూపాయల కారు, 2 లక్షల ఫీజులు కట్టే ఒక స్కూల్.. ఇదంతా చేస్తే నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావు. ఇవేవీ లేని ఒక పేదింటి అమ్మాయి జీవితం ఎలా మొదలవుతుందో తెలుసా? ఉదయాన్నే లేవాలి.. ఇత్తడి చెంబుతో తన భోజనం తనే వండుకోవాలి.

చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత పుస్తకాల సంచి, అట్టలేసినా నలిగిపోయిన పుస్తకాలు పెట్టుకుని ఒక చిన్న సైకిల్ మీద ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌కి రోజూ తనే తొక్కుకుంటూ వెళ్లాలి. ఒక్కోసారి ఊళ్లో కరెంట్ ఉండదు. ఇంటికొచ్చి కిరోసిన్ దీపం పెట్టుకుని హోంవర్క్ చేసుకోవాలి. చదువును అంతగా ప్రేమించే మనిషి తండ్రి తనకోసం పడుతున్న కష్టాన్ని చూసి 5వ తరగతిలోనే చదువు వదిలేసింది. నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో.. తనకి 5వ తరగతి కూడా అంతే. నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఇవ్వలేదు.. కానీ దీపకి తన ఒంటి మీద వేసుకున్న యూనిఫాంతో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెబుతాడు కార్తీక్. అందుకే దీపకి 5వ తరగతి ఆఫ్ట్రాల్ కాదని క్లాస్ పీకుతాడు.

దీప సంతకం పెట్టగానే.. కే దీప అని ఉండటంతో కే అంటే ఏమిటీ? అని అడుగుతుంది జ్యోత్స్న. కే అంటే కార్తీక్.. అదే నా చిరునామా అని చెబుతుంది దీప. ఈరోజు నుంచి మీరిద్దరూ టెంపరరీ సీఈవోలని చెబుతాడు శివన్నారాయణ. ఈ కేబిన్ పర్మినెంట్ సీఈవోది.. మీ ఇద్దరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, రెస్టారెంట్‌ని ఎలా డెవలప్ చేస్తారో మీ ఇష్టమని అంటాడు. ఈ పోటీలో ఎవరు గెలుస్తావని అనుకుంటున్నావని తండ్రిని అడుగుతాడు దశరథ. విన్నర్ ఎవరో టైమే డిసైడ్ చేస్తుందని అంటాడు శివన్నారాయణ.

దీపకి, జ్యోత్స్నకి ఎదురెదురు టేబుల్స్ ఉంటాయి. దీప అని నేమ్ బోర్డ్ చూసిన కార్తీక్.. తన షర్ట్‌తో తుడుస్తాడు. ఎదుటివాళ్ల బతుకుల్ని రోడ్డు మీద పడేసినవాళ్లు బతికినట్లు చరిత్రలో లేదని అంటాడు కార్తీక్. మా పేటలో ఒక పొగరుబోతు అమ్మాయి ఉంది. దానికి డబ్బుందని ఇగో ఎక్కువ. దాని అహంకారం మొత్తం పూలు అమ్మేవాళ్ల మీద, పండ్లు అమ్మేవాళ్ల మీద చూపిస్తుందని చెబుతాడు. ఆ మాటలు విన్న జ్యోత్స్న.. మనం ఇక్కడ చేయాల్సిన పని అది కాదని చెబుతుంది.

మీ ఇద్దరికీ ఏ రెస్టారెంట్స్ ఇచ్చారో చూడమని కార్తీక్ చెప్పగా.. జ్యోత్స్నకి పంజాగుట్ట రెస్టారెంట్ ఇస్తారు. నీకు ఏదని కార్తీక్ అడగ్గా.. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉందని దీప చెప్పగా.. జ్యోత్స్న నవ్వుకుంటుంది. కొందరికీ ఆకలి అన్ని నేర్పిస్తే.. కొందరికీ అవసరాలు అన్నీ నేర్పిస్తుంది. దీప కూడా అన్నీ నేర్చుకుంటుందిలే అని కార్తీక్ క్లాస్ పీకుతాడు. దీపకి మైత్రివనం అనే ఏరియాలో ఉన్న రెస్టారెంట్ ఇవ్వడంతో ఇక్కడ బాగా కాంపిటీషన్ ఉంటుంది, కానీ గెలవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెబుతాడు. ఈ రెండు వారాలు ఏదైనా జరగొచ్చు.. నేనైతే ఓడిపోనని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X