Karthika Deepam 2 May 22nd: జ్యోత్స్నని పిన్ని అని పిలిచిన శౌర్య.. జ్యోత్స్నకి సుమిత్ర మాస్ వార్నింగ్
Photo Courtesy: JioHotstar
ఆఫీసులో పోటీకి ఒప్పుకుంటూ ఫైల్స్ మీద సంతకం చేస్తారు దీప, జ్యోత్స్న. అయితే దీప తెలుగులో సంతకం చేయడంతో ఆమెను ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప చదువుకోవడానికి ఎలా కష్టపడింది? తండ్రి కోసం తనకు ఎంతో ఇష్టమైన చదువుని ఎలా వదులుకున్నది చెబుతాడు. ఆఫీసులో ఎదురెదురుగా దీప, జ్యోత్స్న కూర్చొంటారు. దీపకి కార్తీక్ సైట్ కొట్టడంతో ఆమెపై మండిపడుతుంది జ్యోత్స్న. దీంతో భార్యను తీసుకుని గార్డెన్‌లో కాఫీ తాగుతూ పోటీ గురించి మాట్లాడతాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న వచ్చి నా ప్రత్యర్ధితో నువ్వు మాట్లాడటానికి వీల్లేదని అంటుంది.
శ్రీధర్, కాంచన, శౌర్య ఆడుకుంటూ ఉండటంతో ముగ్గురిని బయటకు గెంటాలని అనుకుంటుంది పారు. శ్రీధర్ దగ్గరికి వెళ్లి నానామాటలు అనడంతో కాంచన క్లాస్ పీకుతుంది. ఎలాగైనా సరే ఈ గ్యాంగ్‌ని బయటకు పంపాలని అనుకుంటుంది. ఆఫీసులో ఫైల్స్, మెనూ ఇతర వివరాలన్నీ లాప్‌టాప్‌లో పెట్టి దీప ముందు పెడతాడు మేనేజర్. తనకు కంప్యూటర్ వాడటం రాదని దీప చెప్పగా.. మెయిల్ ఐడీతో ఇవన్నీ ఓపెన్ చేయాలని చెబుతాడు. అయితే దీప తన దగ్గర ఓటర్ ఐడీ మాత్రమే ఉందని చెప్పడంతో స్టాఫ్ ముందు ఆమె పరువు తీసేస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 22వ తేదీ 677వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీపకి లాప్‌టాప్ గురించి తెలియకపోవడంతో ఆమెను అవమానిస్తుంది జ్యోత్స్న. ఎవరికి ఏ పని తెలుసో అదే ఇవ్వాలని మేనేజర్ మీద కోప్పడుతుంది. చింత చిగురు పప్పు ఎలా చేయాలి? కొబ్బరిపాలతో బిర్యానీ ఎలా చేయాలి? అనేది అడిగితే మేడం చెబుతారని సెటైర్లు వేస్తుంది. లాగిన్ అవ్వాడాలు, ఆన్‌లైన్‌లో సాఫ్ట్ కాపీల కోసం ట్రై చేయడాలు ఎందుకు అంటుంది. మెయిల్ ఐడీ లేని మేడం గారే సీఈవో అయినప్పుడు.. నేనేందుకు సీఈవో కాలేనని అనిపిస్తుందా అని మేనేజర్‌ని అడుగుతుంది. దానికి మేనేజర్ అవునని అంటాడు.
ఇంట్లో పనిచేసుకునే పనిమనిషిని తీసుకొచ్చి సీఈవోని చేయడం ఏంటీ మా ఖర్మ కాకపోతే.. సీఈవో పోస్ట్ అంటే సాంబార్ పెట్టడం కాదు, దానికొక అర్హత ఉంది. నీలాంటి వారు సీఈవో అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. నీ ప్లేస్‌లో నేనుంటే వెంటనే ఇవన్నీ వదిలేసి వెళ్లిపోయేదానిని. నీకు చేతకాదు అని నీ చుట్టూ ఉన్న వాళ్లందరికీ తెలుసు. హౌస్ కీపింగ్‌కి మాత్రమే పనికొచ్చే నీలాంటి వాళ్లని సీఈవో పోస్ట్‌కి ప్రతిపాదించిన వాళ్లకి చెప్పాలి. యూనివర్సిటీలో చదువుకున్న నేను.. లాప్‌టాప్ ఓపెన్ చేయడం రానీ మేధావితో తలపడుతున్నానని సిగ్గుగా ఉందని అంటుంది జ్యోత్స్న.
ఇదంతా చూసిన కార్తీక్.. నాని అనే ఆఫీస్ బాయ్‌ని పిలిచి నీకు మెయిల్ ఐడీ ఉందా? అని అడుగుతాడు? అతను ఉందని సమాధానం చెప్పడంతో ఎలా క్రియేట్ చేసుకున్నావని అడుగుతాడు కార్తీక్. నా ఫ్రెండ్ చెప్పాడని అతను చెబుతాడు. మనకి తెలియని విషయం ఏదైనా ఉందంటే దానికి ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. వాడు కూడా మన కోసం ఒక మెయిల్ క్రియేట్ చేయొచ్చు, మన ఫోన్‌కి పంపొచ్చు అంటాడు. ఇది అర్ధం చేసుకున్న దీప.. తన మొబైల్ చెక్ చేసుకోగానే అందులో మెయిల్ ఐడీ ఉంటుంది. ఈ మాత్రానికే మనుషులు ఊరికే కంగారుపడిపోతారని చెబుతాడు కార్తీక్. నాకు మెయిల్ ఐడీ ఉంది యాప్ ఓపెన్ చేయమని దీప చెబుతుంది. నువ్వే క్రియేట్ చేశావా అని కార్తీక్‌ను జ్యోత్స్న.. మాట్లాడొద్దు అన్నావు, సలహాలు ఇవ్వొద్దు అన్నావు. పాపం నాని ఏదో కన్‌ఫ్యూజన్‌లో ఉంటే క్లారిటీ ఇచ్చానని చెబుతాడు కార్తీక్.
బావ సాయం చేశాడు కాబట్టి గండం దాటేశావు, ఇకపై అన్నీ గండాలే.. ఎలా దాటుతావోనని దీపకి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు పోటీలో గెలిచి సీఈవో అయిపోయి.. నీ కన్నవాళ్లకి దగ్గరవుదామని అనుకుంటున్నావా? నీ తల్లిని అమ్మా అని పిలవడం కాదు కదా? కనీసం దగ్గరకి కూడా రానివ్వనని అంటుంది జ్యోత్స్న. కన్నతల్లికి కన్నబిడ్డ దూరం అయిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూడాలి. నువ్వు ఏడుస్తూ నా ముందు మోకాళ్ల మీద నిలబడి ఏడుస్తూ దండం పెట్టుకుని జ్యోత్స్న నేను ఓడిపోయాను అని అందరికీ వినపడేంత గట్టిగా చెప్పేరోజు త్వరలోనే వస్తుంది. నువ్వే కూతురివని తెలియని నీ తండ్రి.. నువ్వెందుకు పనికిరావని నిన్ను ఇంట్లో నుంచి ఆఫీస్‌లోంచి గెంటేసే రోజు కూడా అతి త్వరలోనే వస్తుంది వెయిట్ చేయమని వార్నింగ్ ఇస్తుంది.
కాశీకి స్వప్న కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కొంచెం కాఫీ నాకు కూడా ఇస్తావా అని అడగటంతో ఇద్దరూ చెరిసగం తాగుతారు. భార్యాభర్తల బంధం చాలా కమర్షియల్ అయిపోయింది. అమ్మాయిలకు కొన్ని, అబ్బాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయి. కోరికలతో బతకడమే జీవితం అయిపోయింది. అమ్మానాన్నలు కొట్టినా తిట్టినా భరిస్తాం.. ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చేది వాళ్లే. కానీ ఒక్కసారి మనకి జాబ్ రాగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దానితో పాటు ఆవేశాన్ని, అహంకారాన్ని తెచ్చుకుంటాయి.. అప్పటి నుంచే అసలైన కథ మొదలవుతుంది. మన జీవితంలో మన ఛాయిస్ ఇష్టం నుంచే మొదలవుతుంది. ఎంతసేపు మన ఇష్టాలు, మన ఛాయిస్‌ల గురించే ఆలోచిస్తాం. ఎదుటి వ్యక్తి ప్రేమను అర్ధం చేసుకోలేనంత దూరం వెళ్లిపోతున్నాం. అమ్మానాన్న, బెస్టీ ఒక మాట అంటే పడతాం.. లైఫ్ పార్ట్‌నర్ అంటే పడం. అందుకే వివాహ బంధానికి బ్రేకప్ చెబుతున్నారు. విడిపోతే ఇద్దరూ ఇబ్బందిపడతారు. పిల్లలుంటే ఈ బాధ ఇంకా ఎక్కువ. పెళ్లికి కూడా గ్యారెంటీ ఉండాలని చెబుతుంది స్వప్న.
శ్రీధర్ వెళ్తానని చెబుతుండగా.. నువ్వు కూడా మాతో పాటే ఉండమని అడుగుతుంది శౌర్య. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి.. మీ తాత, మీ చిన్న నానమ్మ, మీ అత్త, మీ మావయ్యలని వచ్చేయమని అంటూ పారిజాతం సెటైర్లు వేస్తుంది. అందరిని ఆదరించేంత పెద్దమనసు నీకున్నా.. వచ్చేంత చిన్న మనసు నాకు లేదని అంటాడు శ్రీధర్. మావయ్య తన వాళ్ల కోసం ఎంత దూరమైనా పోతాడని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న పిన్ని మమ్మల్ని హాలిడేస్‌కి పిలిచిందని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో శౌర్య షాక్ అవుతుంది. నీకు నేను పిన్నిని అవుతానని శౌర్యకు చాక్లెట్ ఇస్తుంది జ్యోత్స్న.
ఫస్ట్ డే ఆఫీస్ ఎలా గడిచిందని కాంచన అడగ్గా.. ఈ మాట నన్ను అడిగే ఉంటే బాగుండేది. వీళ్లని చూస్తుంటే ఏదో గొడవ జరిగినట్లే ఉందని కాంచన భయపడుతుంది. బావ జాలిపడి తాళి కట్టాడు అనుకుందాం.. చదువు సంధ్యా లేని పల్లెటూరి మొద్దును నువ్వెలా ఒప్పుకున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. నాలుక తిరిగినట్లుగా నోరు మాట్లాడితే దెబ్బలు ఒంటికి తగులుతాయని వార్నింగ్ ఇస్తుంది కాంచన. పోటీలో నిలబడాలంటే సమఉజ్జీలు కావాలి.. లేకపోతే నా కోడలు ఆఫీస్‌లో అదరగొడుతుందని అత్త అనుకుంటుంది. మీరే అర్హతకు మించి ఆశపడ్డారు.. కార్పోరేట్ ఆఫీస్‌లో పనిచేయడం అంటే కిచెన్‌లో కూరగాయలు కట్ చేయడం అనుకుంటుంది నీ కోడలు. లాప్‌టాప్ చూడగానే అమ్మగారికి చేతులు వణికాయి. కనకపు సింహాసనం మీద అన్నట్లుగా ఉందని జ్యోత్స్న అనడంతో సుమిత్ర మండిపడుతుంది.
తాబేలు, కుందేలు కథ తెలుసు కదా? 2025లోనూ తాబేలు గెలిచింది.. గర్వం ఏదో ఒక రోజు తలవంచుకుంటుంది. ఆ కార్పోరేట్ ఆఫీస్‌లో పనిచేసేది కూడా కిచెన్‌లో వంట గురించే. నా భార్యకు ఉన్నత విద్య లేదు.. కానీ ఉన్నతమైన సంస్కారం ఉంది. ఓర్పు, సహనంతో ఉండటం వచ్చు.. సహనాన్ని మంచితనాన్ని ఆడుకోవద్దు. నా భార్య తాబేలు లాంటిది, కుందేలు మీద గెలుస్తుంది. అప్పుడు నా భార్య ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుందని అంటాడు కార్తీక్. ఈ పోటీలో నీ గెలుపు.. నీ టాలెంట్‌తో తెచ్చుకోవాలి.. అవతలి వాళ్లని కించపరిచేలా ఉండకూడదు. ఏం జరిగినా ఆఫీస్‌లోనే వదిలేయ్.. నువ్వు ఏం చేసినా భరిస్తానని అనుకోవద్దు. నాలో ఉన్న మొండిదానికి కన్నవాళ్లనే కాదు.. కడుపున పుట్టినవాళ్లని కూడా మరిచిపోగల శక్తి ఉందని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. మనం కష్టపడి నేర్చుకుంటే అదే వస్తుంది, నువ్వు గెలవాలని నీ మామగారిగా నేను కోరుకుంటున్నానని చెబుతాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications