Karthika Deepam 2 May 23rd: బెడిసికొట్టిన జ్యోత్స్న, పారుల పథకం.. సుమిత్ర ఒడిలో నిద్రపోయిన దీప
Photo Courtesy: JioHotstar
దీపకి లాప్‌టాప్ గురించి తెలియకపోవడంతో స్టాఫ్ ముందు అవమానిస్తుంది జ్యోత్స్న. దాంతో ఓ ఆఫీస్ బాయ్‌ని పిలిచిన కార్తీక్.. నీకు మెయిల్ ఐడీ ఉందా? అని అడుగుతాడు. ఉంది సార్ నాకు నా ఫ్రెండ్ చెప్పాడని అంటాడు ఆ కుర్రాడు. మనకి ఏదైనా తెలియకపోతే ఫ్రెండ్స్ ఫోన్ చేసి మెయిల్ ఐడీ మెసేజ్ చేస్తారని గట్టిగా చెబుతాడు. ఇది అర్ధం చేసుకున్న దీప వెంటనే తన ఫోన్ చెక్ చేసుకోగా మెయిల్ ఐడీ ఉంటుంది. దాని సాయంతో ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తుంది దీప. మన అవసరం మనకి అన్ని నేర్పిస్తుందని జ్యోత్స్నకి క్లాస్ పీకుతాడు కార్తీక్. బావ సాయం చేసినా నిన్ను గండాలు వెంటాడతాయి. నువ్వు పోటీలో ఓడిపోయి.. మోకాలిపై కూర్చోని నన్ను వదిలేయమని బతిమలాడే రోజు వస్తుందని దీపకి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
భార్యాభర్తలుగా కలిసిపోయిన కాశీ- స్వప్నలు పెళ్లి గురించి, వైవాహిక బంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటిలో శ్రీధర్, శౌర్య, కాంచన ఆడుకుంటూ ఉండగా పారు చూసి ఈ బ్యాచ్‌ని ఎలాగైనా గెంటేయాలని అనుకుంటుంది. మాతో పాటే ఉండమని శ్రీధర్‌ని శౌర్య అడగ్గా.. మీ తాతే కాదు, మీ చిన్న నాయనమ్మ, మీ అత్త, మీ మావయ్యల్ని కూడా రమ్మను అంటూ చిన్నపిల్లని అడ్డుపెట్టుకుని నానామాటలు అంటుంది పారు. దానికి శ్రీధర్, కాంచన కౌంటర్ వేస్తారు. ఇంతలో అక్కడికొచ్చిన జ్యోత్స్నని శౌర్య పిన్ని అని పిలవడంతో అంతా షాక్ అవుతారు. ఆఫీస్‌లో దీపకి అవమానం జరిగిందని తెలుసుకున్న సుమిత్ర.. కన్నవాళ్లనే దూరం పెట్టాను, నిన్ను కూడా దూరం పెడతానని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు పోటీలో గెలవాలని నీ మామగారిగా కోరుకుంటున్నానని అంటాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 23వ తేదీ 678వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీప, బావ మనతో కలిసి భోజనం చేస్తానంటే నేను ఒప్పుకోనని చెబుతుంది జ్యోత్స్న. అంటే వాళ్లని ఇంకా నువ్వు పనివాళ్లుగానే చూస్తున్నావా? యజమానుల పక్కన కూర్చొని తింటే మేడం గారి హోదా తగ్గిపోతుందా అని ఫైర్ అవుతుంది కాంచన. మనం తర్వాత ఎందుకు తినాలి.. ఇది నా తాత ఇల్లు అంటాడు కార్తీక్. నువ్వు పనివాడివి కదా అని పారిజాతం అనగా.. శివన్నారాయణ సీరియస్ అవుతాడు. మీ గొడవలన్నీ ఆఫీస్‌లో చూసుకోండి.. ఇంట్లో మాత్రం నువ్వు కొడుకు కూతురివి, వాడు కూతురి కొడుకు.. నాకు ఇద్దరూ సమానమే. ఇంట్లో ఉన్నన్ని రోజులూ కలిసే తింటామని అంటాడు శివన్నారాయణ. ఇది మరి ఇంత శాడిస్ట్‌లా తయారైందని కాంచన మండిపడుతుంది. కొత్తగా అయ్యేది ఏముంది? బై బర్త్ నీ మేనకోడలు అదేనని అంటాడు కార్తీక్.
చూస్తుంటే అందరూ కలిసిపోయేలా ఉన్నారని పారుతో అంటుంది జ్యోత్స్న. మనం ఉండగా కలవనిస్తామా? ఎలా విడగొట్టాలో మనకి తెలుసు కదా అంటుంది జ్యోత్స్న. భోజనాల దగ్గర కూడా దీపని అవమానించేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. భోజనం అంటే ఎంత తింటున్నాం అని కాదు.. ఏం తింటున్నాం అన్నదే ముఖ్యమని అంటాడు కార్తీక్. నువ్వు ఇంటి దగ్గర ఎవరి దగ్గర పడుకుంటావని శౌర్యని అడుగుతుంది జ్యోత్స్న. అమ్మానాన్నలతో పడుకుంటాను, అప్పుడప్పుడు నానమ్మ దగ్గర పడుకుంటానని చెబుతుంది శౌర్య. మనం ఎక్కడ పడుకుంటామని కార్తీక్‌ని శౌర్య అడగ్గా.. నా రూమ్‌లో అంటాడు కార్తీక్. నీ రూమ్‌లో వేరేవాళ్లకి పర్మిషన్ లేదని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
పోటీలో నిబంధనలు ఎక్కడైనా వర్తిస్తాయి. వాటిని దాటితే పోటీలో నుంచి తప్పుకున్నట్లే అంటుంది జ్యోత్స్న. శౌర్య నీ గదిలో పడుకుంటుంది పర్లేదా అని సుమిత్రను దశరథ అడగ్గా.. దీపని కూడా పడుకోమనండి, నాకు ఏ అభ్యంతరం లేదని చెబుతుంది సుమిత్ర. నేను కార్తీక్, నాన్న గదిలో పడుకుంటామని దశరథ చెబుతాడు. నీకు తోడుగా నేను పడుకుంటానని జ్యోత్స్నతో కాంచన అంటుంది. కాంచన కనుక జ్యోత్స్న గదిలో పడుకుందంటే జ్యోత్న్నని ఎటూ కదలనివ్వదని భయపడుతుంది పారు.
కాశీని వెనక నుంచి వచ్చి హత్తుకుంటుంది స్వప్న. మనం హనీమూన్‌కి వెళ్దామని స్వప్న అడగ్గా.. మావయ్యగారి హెల్త్ బాలేదు, ఇలాంటి టైంలో వద్దని చెబుతాడు కాశీ. మనల్ని వెళ్లమని చెప్పిందే నాన్న అని అంటుంది స్వప్న. మనం వెళ్లిన తర్వాత వాళ్లకి ఏమైనా జరిగితే, కార్తీక్ బావ ఉన్నాడు కదా అని మావయ్య చెప్పి ఉంటాడు. కానీ తనకు ఉండాల్సిన పనులు తనకి కూడా ఉన్నాయి.. మనం ఎవరికీ భారం కాకూడదు. మన బాధ్యతల్ని ఎవరి మీదా వదిలేయొద్దని చెబుతాడు కాశీ. నేను మీ అమ్మానాన్నలతో మాట్లాడతానని అంటాడు. మళ్లీ నీతో ప్రేమలో పడిపోతానని భయంగా ఉందని కాశీని హత్తుకుంటుంది స్వప్న.
హడావుడిగా నడుచుకుంటూ వెళ్తున్న జ్యోత్స్నని దీప ఆపి బుగ్గ గిల్లుతుంది. ముందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి.. నువ్వు నాకు బుజ్జమ్మవే, నచ్చితే పలుకు లేదంటే లేదు అంటుంది దీప. ఇది ఆఫీస్‌లో నాతో ఛాలెంజ్ చేసింది. నువ్వు నా కన్నతల్లికి దగ్గరవ్వాలనే ఆశతో ఉన్నావు, అది ఈ జన్మలో జరగదని చెప్పిందని కార్తీక్‌తో అంటుంది దీప. కానీ 24 గంటలు గడవకముందే మా అమ్మతో ఇదే నన్ను దగ్గర చేసిందని అంటుంది దీప. ఏదో ఒక విషయంలో మీకు మంచి జరిగిందని సంబరపడొద్దు.. మీకు ముందుంది ముసళ్ల పండగ అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు ఏం చేసినా దాని వల్ల మంచే జరుగుతుందని అంటాడు కార్తీక్.
ఈ బుజ్జమ్మ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించకపోతే మనం ఈ ఇంటికి వచ్చేవాళ్లం కాదు. మనం ఈ ఇంటికి రాకపోయుంటే ఈవిడ గారు ఎలాంటిదో అందరికీ తెలిసేది కాదని చెబుతాడు కార్తీక్. సీఈవో పోస్ట్ విషయంలో పంతానికి పోయుండకపోతే పై చదువులు చదువుకున్న మేడం గారితో 5వ తరగతి చదువుకున్న నేను పోటీ పడేదానిని కాదని అంటుంది దీప. దానిలో కూడా రూల్ పెట్టి నన్ను, నిన్ను విడగొట్టాలని చూసింది.. కానీ నా కూతురు, నేను తాత ఇంటికి వచ్చాం. మీ అమ్మా నువ్వు నీ పుట్టింటికి వచ్చాం.. చిన్న మరదలి పుణ్యమా అని కుటుంబమంతా కలిశాం. ఇద్దరం కలిసి థ్యాంక్స్ చెప్పాలని జ్యోత్స్న బుగ్గ గిల్లుతారు కార్తీక్, దీప.
ఇంత సంబరపడొద్దు.. నెల రోజుల్లో నా పెళ్లి చేస్తానని అన్నారు. రోజులు గడుస్తున్నాయి, కానీ మీ నుంచి ఏ అప్‌డేట్ లేదని మండిపడుతుంది జ్యోత్స్న. నీ జాతకం ప్రకారం కళ్యాణం కూడా కక్కులాగే వచ్చేలా ఉందని అంటాడు కార్తీక్. నా మెడలో తాళి పడనివ్వను, నీ వల్ల కాదని చెబుతుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు చేసిన ఛాలెంజ్‌లు చాలు.. నీది భస్మాసుర హస్తం, నీ అంతట నువ్వే నాశనమైపోతావని అంటాడు కార్తీక్. నేను నాశనమయ్యే పరిస్ధితి వస్తే నాతో పాటు మీరూ పోతారని అంటుంది జ్యోత్స్న. నేను రంపం లాంటోడిని, పాము లాంటి నువ్వు.. నన్ను చుట్టుకోవాలని చూస్తే నువ్వే చస్తావని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. వాళ్లు నీతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని జ్యోత్స్నతో అంటుంది పారు. ఆఫీస్‌లో నేను ఆడుకున్నాను.. ఇంట్లో వాళ్లు ఆడుకున్నారని చెబుతుంది జ్యోత్స్న. చూస్తుంటే సుమిత్రకి దీప మరింత దగ్గరయ్యేలా ఉందని అనుకుంటుంది పారు.
కడుపుతో ఉన్నావు కింద పడుకోకూడదని దీపతో చెబుతుంది సుమిత్ర. నా తల్లి ఒడిలో పడుకుని కబుర్లు చెప్పాలని అనుకున్నాను.. పోనీలే ఆ అదృష్టం నాకు దక్కకపోయినా నా కూతురికి దక్కిందని అనుకుంటుంది దీప. నాకు అప్పుడు మా అమ్మతో ఉండాలని ఉండేది. ఏ అవసరం వచ్చినా అమ్మా అమ్మా అంటూ తిరిగే నేను అమ్మను అవుతున్నానని అంటే నన్ను నేనే నమ్మలేని అనుభూతి. ప్రతిరోజూ రాత్రి అమ్మ ఒడితో తలపెట్టుకుని అమ్మ కథలు చెబుతుంటే వింటూ నిద్రపోయేదానిని. నీకు చెప్పే కథలు నీ కడుపులోని బిడ్డ కూడా వినేదని మా అమ్మ చెప్పేదని గుర్తుచేసుకుంటుది సుమిత్ర.
నా అదృష్టం నీ కడుపులో ఉన్నంత వరకే ఉంది.. ఎప్పుడైతే నీ కడుపులో నుంచి బయటికొచ్చానో నీకు దూరమైపోయానని బాధపడుతుంది దీప. నిన్ను అడగటానికి నీ కన్నతల్లి లేదు కదా? అందుకే నేను అడుగుతున్నానని చెబుతుంది సుమిత్ర. నువ్వు నాకు అమ్మమ్మవి అయితే నువ్వు మా అమ్మకి ఏమవుతావని అడుగుతుంది శౌర్య. అమ్మని అవుతానని సుమిత్ర చెప్పడంతో దీప ఎమోషనల్ అవుతుంది. అయితే మా అమ్మకి అమ్మ ఉన్నట్లే కదా? అని శౌర్య అడగ్గా.. ఉన్నట్లే అని అంటుంది సుమిత్ర. నీ మనసులో ఏముందని సుమిత్ర అడగ్గా.. అమ్మ ఒడితో తల పెట్టుకుని హాయిగా పడుకోవాలని ఉందని చెబుతుంది దీప. నన్నే నీ కన్నతల్లి అనుకో.. నా ఒడిలో నిద్రపోమ్మని చెబుతుంది సుమిత్ర. దాంతో దీప కంటతడి పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications