Karthika Deepam 2 May 25th: దీపపై దశరథ తండ్రి ప్రేమ.. కొడుకుపై శివన్నారాయణలో పెరిగిన అనుమానం

Photo Courtesy: JioHotstar

దీప, కార్తీక్, కాంచన అత్తలు మనతో భోజనం చేయడానికి ఒప్పుకోనని అంటుంది జ్యోత్స్న. నువ్వు కొడుకు కూతురివి, వాడు నా కూతురి కొడుకు .. నా దృష్టిలో ఇద్దరు సమానమేనని అంటాడు శివన్నారాయణ. వీళ్లంతా కలిసిపోయేలా ఉన్నారని పారు, జ్యోత్స్నలు కుళ్లుకుంటూ ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ నువ్వు ఎక్కడ పడుకుంటావని శౌర్యని అడుగుతుంది జ్యోత్స్న. అమ్మానాన్నల దగ్గర పడుకుంటానని చిన్నారి చెప్పడంతో మీ అమ్మానాన్న ఈరోజు వేర్వేరుగా పడుకుంటారని అంటుంది జ్యోత్స్న. అయితే దీప, శౌర్యలు నా దగ్గర పడుకుంటారని సుమిత్ర అంటుంది. అలాగే కార్తీక్, నేను నాన్న గదిలో పడుకుంటామని దశరథ చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.

కోపంగా తన గదిలోకి వెళ్లబోతున్న జ్యోత్స్నని దీప ఆపుతుంది. నువ్వు ఏం చేసినా నాకు మంచే జరుగుతుందని జ్యోత్స్న బుగ్గ గిల్లుతుంది దీప. మనిద్దరం హనీమూన్‌కి వెళ్దామని కాశీతో అంటుంది స్వప్న. ప్రస్తుతం మావయ్య గారికి హెల్త్ బాగుండటం లేదు.. ఇంకెప్పుడైనా వెళ్దామని అంటాడు కాశీ. సుమిత్ర ఒడిలో పడుకున్న శౌర్యని చూసి సంబరపడిపోతుంది దీప. నేనే నీ కన్నతల్లిని అనుకో నీకేం కావాలని అడుగుతుంది సుమిత్ర.. నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని దీప చెప్పడంతో సుమిత్ర సరేనని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 25వ తేదీ 679వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 679 May 25th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర ఒడిలో తలపెట్టి పడుకున్న దీపని చూసిన జ్యోత్స్న రగిలిపోతుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావో లేదో అడగటానికి వచ్చానని చెబుతుంది. ఇప్పుడు మా అమ్మకి అమ్మమ్మే అమ్మ అని చెబుతుంది. అనుకున్నది సాధించావని దీపని చూసి మండిపడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, దశరథలు ఇదంతా చూసి సంతోషిస్తాడు. ఇది చూసి మనకెంత ఆనందంగా ఉందో, జ్యోత్స్నకి అంత కోపంగా ఉండి ఉంటుందని దశరథ అంటాడు. ఆ వెంటనే ఈ సన్నివేశాన్ని ఫోటో తీసుకుంటాడు. కోపంగా రూమ్‌లోకి వచ్చిన జ్యోత్స్నని చూసి పడుకోమని చెబితే ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది కాంచన. నాకు నిద్ర రావడం లేదని జ్యోత్స్న చెప్పగా.. పెళ్లయిన ఆడపిల్లలకి ఇలాగే ఉంటుంది, ఆ లక్షణాలు కూడా ఇవేనని చెబుతుంది కాంచన.

అర్ధరాత్రి వరకు నిద్రపట్టదు.. చుట్టూ జనాలు ఉన్నా వాళ్లు మాత్రం నిద్రపోదని చెబుతుంది కాంచన. నా పెళ్లి బాధ్యతలు నీ కొడుకే తీసుకున్నాడు, త్వరగా చేయమని చెప్పమని అంటుంది జ్యోత్స్న. నువ్వు తెలివైన దానివి కాబట్టి.. మీ నాన్నని, తాతని వదిలేసి ఆ భారం నా కొడుకు నెత్తిన పెట్టావని చెబుతుంది కాంచన. నేను పెట్టలేదు.. నీ కొడుకే పెట్టేలాగా చేశాడని అంటుంది. వాడు మాత్రం ఏం చేస్తాడు.. గాలిపటం వెనుక దారంలాగా వాడిని పట్టుకుని తిరుగుతున్నావు కదా అని అంటుంది. పెద్దోళ్లు పిల్లల్ని మోసం చేస్తే మా జీవితాలు ఇలాగే ఉంటాయని చెబుతుంది జ్యోత్స్న. అన్నీ అనుకున్నట్లు సక్రమంగా నువ్వు చేసుంటే నీ కొడుకు నాకు మొగుడు అయ్యేవాడు, నువ్వు నా అత్తగారివి అయ్యే దానివి అంటుంది.

నీలాంటి రాకాసి నా కోడలు అయ్యుంటే నా కొడుకుని వేపుకుని తినేదానివి అంటుంది కాంచన. ఆ దీప నీ కొడుకుని పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తుందా ఏంటీ? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అది నీకంటే 100 రెట్లు మంచిదని చెబుతుంది. నా మెడలో తాళి కట్టుంటే నీ కొడుకు రాజాలా బతికేవాడని అంటుంది జ్యోత్స్న. తాళి కట్టలేదని నా కొడుకుని పనివాడిని చేశావా అని ప్రశ్నిస్తుంది కాంచన, అది నీ కొడుకు జీవితం మీద దీప రాసిన తలరాత అంటుంది జ్యోత్స్న. అసలు మా వదినకున్న సగం నీరసం.. నీ మీద పెట్టుకున్న బెంగేనని చెబుతుంది కాంచన.

మా వదినకి వెన్నుపోటు పొడిచింది నువ్వేనని చెబుతుంది జ్యోత్స్న. మీ నాన్నకి, తాతకి ఫోన్ చేస్తే కానీ నువ్వు ఊరుకోవని కాంచన చెప్పడంతో దెబ్బకి జ్యోత్స్న పడుకుంటుంది. ఉదయాన్నే గంట శబ్ధం విన్న జ్యోత్స్న కోపంగా కిందకి వెళ్లి చూస్తే దీప కనిపిస్తుంది. నన్ను పడుకోనివ్వకుండా ఈ గోల ఏంటీ. దీప చక్కగా పూజ చేసి చంటిదానిని కూడా తన బాటలో నడిపిస్తోంది. అందుకే అంటారు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. పుట్టింటిలో అడుగుపెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంలో మార్చేసింది నా కూతురు అంటాడు దశరథ. ఆ మాటలు విన్న జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.

డాడీకి నిజం తెలిసిపోయి ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. జ్యోత్స్న గురించి చెప్పాల్సిన మాటలు దీప గురించి చెబుతున్నావేంటీ? అని కాంచన అడుగుతుంది. దీప గురించి చెప్పాల్సిన మాటలే దీప గురించే చెబుతున్నాడని అంటుంది కాంచన. మా అమ్మ దశరథ తాత కూతురు, సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకి అమ్మని శౌర్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుండగా జ్యోత్స్న ఆపి.. మాట్లాడాల్సింది నువ్వు కాదు, మా డాడీ అంటుంది. నీకు మా అమ్మ అక్క అవుతుందని శౌర్య చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. మా అమ్మకి అమ్మనాన్నలు ఉన్నారు.. నాకు అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నారని చెబుతుంది.

నీ కూతురు ఏం మాట్లాడుతుందో నీకు అర్ధమవుతుందా అని దీపని పారు ప్రశ్నిస్తుంది. మమ్మీకి నిజం తెలిసిపోయినట్లుగా ఉంది. అందుకే రాత్రి దీపని ఒడిలో పడుకోబెట్టుకుందని అనుకుంటుంది జ్యోత్స్న. దీప కడుపుతో ఉంది.. తల్లిదండ్రులు లేని లోటుతో తను బాధపడుతోందని సుమిత్ర చెప్పింది. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనని సొంత కూతురిలాగా చూసుకుందాం, అలాగే పిలుద్దామని చెప్పానని దశరథ కవర్ చేస్తాడు. దీప సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుందని అంటుంది సుమిత్ర. కానీ చూసేవాళ్లకు అలా అనిపించడం లేదని చెబుతుంది జ్యోత్స్న. దీపే అసలు కూతురని, నువ్వు కాదని అనిపిస్తోందా? మావయ్య అత్తయ్య కలిసి మా ఆవిడకి కోరిక తీరుస్తుంటే పంచాయతీ పెడతారేంటీ? అని మండిపడతాడు కార్తీక్. జ్యోత్స్నకి మాత్రం దశరథ మీద అనుమానం వస్తుంది. దశరథ ప్రతిసారి దీపని కూతురని చెబుతున్నాడు. వీడి ప్రేమ బాగానే ఉంది కానీ జ్యోత్స్న తట్టుకోలేకపోతోందని బాధపడతాడు శివన్నారాయణ.

స్వప్న, కాశీలు కలిసిపోవడంతో దాస్ సంతోషిస్తాడు. అయితే మీరిద్దరూ మా చేతిలో బిడ్డను పెట్టడం లేదని మండిపడతాడు. ఈ మాటలన్నీ స్వప్న వింటుంది. దాస్ వెళ్లిపోగానే మావయ్య నీతో ఏం చెప్పాడని అడుగుతుంది స్వప్న. పిల్లల గురించి అడిగాడు.. ఇప్పుడే తొందర ఏముందిలే అని చెప్పానని అంటాడు కాశీ. ఉండి లేదన్నావా? అని స్వప్న అడుగుతుంది. అయితే తొందరపడమంటావా అని కాశీ చిలిపిగా అడుగుతాడు. పాపం వాళ్లేదో ఆడుకోవడానికి బుజ్జి పాపాయిని అడుగుతున్నారు.. ఇచ్చేద్దామా అని స్వప్న అడగ్గా ఇచ్చేద్దామని చెబుతాడు కాశీ.

కాంచన, శివన్నారాయణలు మాట్లాడుకుంటూ ఉండగా దీప వచ్చి గుడికి వెళ్లొస్తానని చెబుతుంది. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? కార్తీక్ నువ్వు వెళ్లొచ్చు కదా అని అంటుంది కాంచన. నువ్వు చెప్పావు కదా అని దీప సరేనని అంటే పెద్ద మేడం గారు రంగంలోకి దిగుతారని అంటాడు కార్తీక్. ఇదంతా చూసి మావయ్య ఊరుకుంటాడా? దానికి దీనికి సంబంధం ఏంటీ? వాళ్లిద్దరూ భార్యాభర్తలు అంటాడు. ఈసారి అత్త అడుగుతుంది.. అప్పుడు పెద్ద మేడం గారు తన తెలివితేటలకు పనిపెడతారు.. దీపతో కార్తీక్ బావ వెళ్లడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ సీఈవో పోటీలో దీప ఓడిపోయానని చెప్పమంటుంది అంటాడు కార్తీక్. నువ్వు గుడికి వెళ్తు.. నేను మాత్రం రానని చెబుతాడు.

నా మనసు పూర్తిగా చదివేసినట్లు నీకు నువ్వే మాట్లాడితే ఎలా? నువ్వు, దీప గుడికి వెళ్లొచ్చు అని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా మంచితనాన్ని మీరంతా అర్ధం చేసుకోవడానికి టైం పడుతుందని చెబుతుంది, మీరిద్దరూ గుడికి వెళ్లడానికి ఓకే కానీ గంటలో తిరిగొచ్చేయాలని చెబుతుంది జ్యోత్స్న. ఆ వెంటనే దీపని తీసుకుని గుడికి బయల్దేరతాడు కార్తీక్. ఈ గంట మీరు రావడానికే, పోవడానికే సరిపోతుందని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X