Karthika Deepam 2 May 26th: కార్తీక్ కళ్లముందే దక్షిణామూర్తికి ప్రమాదం.. బద్ధ శత్రువుకి శివన్నారాయణ రక్తదానం
Photo Courtesy: JioHotstar
సుమిత్ర ఒడిలో తల పెట్టుకుని పడుకున్న దీపని చేసి జ్యోత్స్న రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తల్లి ఒడిలో పడుకున్న కూతురిని చూసి కార్తీక్, దశరథలు చాలా సంతోషిస్తారు. నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్న జ్యోత్స్నకి క్లాస్ పీకుతుంది కాంచన. నువ్వు సక్రమంగా ఉండుంటే నీ కొడుకు నాకు మొగుడయ్యేవాడని చెబుతుంది జ్యోత్స్న. నీలాంటి కోడలితో నేను వేగలేనంటూ దండం పెడుతుంది కాంచన. నువ్వు పడుకుంటావా? లేక మీ తాతని, నాన్నని పిలవనా? అని కాంచన బెదిరించడంతో పడుకుంటుంది జ్యోత్స్న.
ఉదయాన్నే గంట కొడుతున్న శబ్ధం రావడంతో జ్యోత్స్న చిరాకు పడుతూ నిద్రలేస్తుంది. ఇల్లంతా పొగ, గంటల శబ్ధం మధ్యలో దీప కనిపించగానే అందరూ మెచ్చుకుంటారు. కూతురిని చూసి దశరథ పొంగిపోతూ నోరుజారతాడు. దాంతో అందరికీ అనుమానం వస్తుంది. ఇంతలో శౌర్య మాట్లాడుతూ.. సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకి తల్లి, నేను మనవరాలిని అనడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇక్కడున్నన్ని రోజులు దీపకి తల్లిదండ్రులు లేని లోటు తెలియకూడదని నేను, సుమిత్ర అనుకున్నామని దశరథ చెబుతాడు. అయితే దీప మీద తన కొడుకు ఎక్కువగా అభిమానం చూపించడంతో శివన్నారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు, స్వప్నలు పిల్లల్ని కనాలని కాశీతో దాస్ చెబుతుండగా స్వప్న వింటుంది. పిల్లలు కావాలట ఇచ్చేద్దామా అని కాశీ అడగ్గా.. ఇచ్చేద్దామని భర్తను హత్తుకుంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 26వ తేదీ 680వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీప, కార్తీక్‌లు గుడి నుంచి వస్తుండగా దక్షిణామూర్తి వాళ్లని చూస్తాడు. కార్తీక్.. కార్తీక్ అని పిలుస్తూ వెళ్తుండగా ఆయనని కారు ఢీకొట్టడంతో తలకి పెద్దగాయం అవుతుంది. దాంతో కార్తీక్, దీపలు దక్షిణామూర్తిని ఆసుపత్రికి తీసుకురాగా.. ఆయన కండీషన్ చాలా క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెబుతారు. తాతకి సీరియస్‌గా ఉందన్న విషయం వాళ్లింటిలో తెలియాలని కార్తీక్, దీపలు అనుకుంటారు. డ్రైవర్‌ని దీని గురించి అడగ్గా.. తాను ఇక్కడ లోకల్ డ్రైవర్‌ని అని, ఆయన గురించి ఏ వివరాలు తనకు తెలియవని చెబుతాడు. తాత సొంతవాళ్లు ఇక్కడ ఎవరు? ఎక్కడున్నారు? అని కార్తీక్, దీపలు ఆలోచిస్తుంటారు.
శ్రీధర్ ఆరోగ్యం గురించి మాట్లాడటానికి అదే హాస్పిటల్‌కి శివన్నారాయణ వస్తాడు. వీలైనంత త్వరలో శ్రీధర్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్ చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. నేను మా వాళ్లతో మాట్లాడి సర్జరీ గురించి ఎప్పుడు మాట్లాడాలో చెబుతానని అంటాడు శ్రీధర్. గుడికి వెళ్లిన దీప, కార్తీక్‌లు రాకపోవడంతో జ్యోత్స్న, పారులు ఎదురుచూస్తుంటారు. వాళ్లిద్దరికీ అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదని వెంటనే కార్తీక్‌కి కాల్ చేస్తుంది జ్యోత్స్న. తాతకి యాక్సిడెంట్ జరిగిన విషయం చిన్న మరదలికి తెలిస్తే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లేనని అంటాడు కార్తీక్.
గుడిలో పూజ చేయించుకోవడానికి వెళ్లారా? హోమం చేయించుకోవడానికి వెళ్లారా? అని మండిపడుతుంది జ్యోత్స్న. మేం గుడిలో లేము.. తెలిసిన మనిషికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని అంటాడు కార్తీక్. వాడు అబద్ధం చెప్పడని పారు అనగా.. మరి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన మనిషి ఎవరు? అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. నా సర్జరీ గురించి చెప్పి అందరినీ కంగారు పెట్టొద్దు.. నేనే అందరికీ చెబుతానని అంటాడు శ్రీధర్. నాకున్న ధైర్యమే మీరు.. మన నమ్మకమే మన ఆరోగ్యం నాకేం కాదని అంటాడు శ్రీధర్.
హాస్పిటల్‌లో కార్తీక్, దీపలను శ్రీధర్, శివన్నారాయణలు చూసి షాక్ అవుతారు. గుడికి వెళ్తామని చెప్పి హాస్పిటల్‌కు ఎందుకు వచ్చారు? చేతికి ఆ రక్తం మరకలేంటీ? అని అడుగుతాడు శివన్నారాయణ. ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్‌కి బ్లడ్ చాలా పోయింది.. ప్రాణాలు కాపాడటం చాలా కష్టమని అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అర్జెంట్‌గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి.. అరెంజ్ చేయమని అంటాడు డాక్టర్. అసలేం జరిగిందని శివన్నారాయణ అడగ్గా.. గుడి నుంచి ఇంటికొస్తుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది. కళ్ల ముందు ఒక ప్రాణం పోతుండగా చూసి ఎలా వదిలేస్తాం.. అందుకే హాస్పిటల్‌లో జాయిన్ చేశామని చెబుతాడు కార్తీక్. మరి ఆయనకి యాక్సిడెంట్ అయిన విషయం వాళ్లింటిలో వాళ్లకి తెలుసా? అని పెద్దాయన అడగ్గా.. ఆ వివరాలు తెలియవని చెబుతాడు కార్తీక్.
నాది ఏ పాజిటివ్ బ్లడ్డే.. నేనిస్తానని అంటాడు శివన్నారాయణ. ఆ మాట వినగానే కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఓసారి పేషెంట్ పరిస్ధితి ఏంటో చూద్దామని శ్రీధర్ ఐసీయూలోకి వెళ్లి బెడ్ మీద దక్షిణామూర్తిని చూసి షాక్ అవుతాడు. అది చూసిన కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మీరేం చేస్తున్నారో మీకు అర్ధమవుతుందా అని కొడుకు, కోడల్ని అడుగుతాడు శ్రీధర్. ఏది కావాలని చేశారా? అన్నీ వాటంతట అవే జరుగుతున్నాయని అంటాడు కార్తీక్. మీ తాత నీకోసం బ్లడ్ ఇస్తానని ఎందుకు అన్నాడు? లోపల ఉన్నది నువ్వు కాపాడిన పేషెంట్ అని, కానీ అతను దక్షిణామూర్తి అని తెలియదు కదా? మీ తాత జీవితాంతం ద్వేషించే ఒకే ఒక్క మనిషి దక్షిణామూర్తి అంటాడు శ్రీధర్. మిగతా వాళ్ల విషయంలో కాస్తయినా కనికరం చూపిస్తాడేమో కానీ, ఇప్పుడు తన అగర్భ శత్రువుకి రక్తమిచ్చి కాపాడానని తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు.. దానికి కారణం నువ్వేనని తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు అని వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అని కార్తీక్ అడగ్గా.. నిజం చెప్పమని అంటాడు శ్రీధర్. నిజం తెలియడానికి ఆలస్యం అయ్యేకొద్ది ప్రమాదంలా మారుతుందని చెబుతాడు శ్రీధర్. ఇంతలో శివన్నారాయణ వచ్చి బ్లడ్ ఇచ్చేశానని అతనికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతనిని ఒకసారి చూద్దామని అంటాడు పెద్దాయన. దాంతో కార్తీక్, దీప, శ్రీధర్‌లు షాక్ అవుతారు. పెద్దాయన లోపలికి వెళ్తుండగా ఫోన్ రావడంతో అర్జెంట్‌గా అక్కడి నుంచి వచ్చేయడంతో అంతా రిలీఫ్ అవుతారు. నేను అర్జెంట్‌గా ఒకరిని కలవాలని శ్రీధర్‌ను తీసుకుని వెళ్తాడు. మావయ్య ఎవరికీ చెప్పడు కదా అని కార్తీక్‌తో దీప అంటుంది.
ఇంతలో ఇంటికి పరిగెత్తుకొచ్చిన శ్రీధర్.. నువ్వు అర్జెంట్‌గా ఇక్కడి నుంచి మీ ఇంటికి బయల్దేరమని అంటాడు. ఏ క్షణంలో అయినా నీ తండ్రికి, నీ కొడుక్కి గొడవ జరగొచ్చని చెబుతాడు శ్రీధర్. వాడు చక్కగా భార్యని తీసుకుని గుడికి వెళ్లాడని చెబుతాడు శ్రీధర్. దక్షిణామూర్తికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కార్తీక్, దీపలు ఆసుపత్రిలో చేర్పించారు. అదే టైంలో మేం అక్కడికి వెళ్లాం.. వాళ్లు చేర్పించిన పేషెంట్‌కి బ్లడ్ అవసరమని డాక్టర్లు చెబితే మీ నాన్న దక్షిణామూర్తికి బ్లడ్ డొనేట్ చేశాడని శ్రీధర్ చెబుతాడు. ఈ విషయం కార్తీక్, దీప, నాకు మాత్రమే తెలుసు.. మావయ్య గారికి తెలియదు. తను బ్లడ్ డొనేట్ చేసింది ఎవరికో అనుకుంటున్నారు. ఈ నిజం మావయ్య గారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుందని అంటాడు శ్రీధర్.
ఈ మాటలన్నీ దొంగచాటుగా విన్న పారు, జ్యోత్స్నలు సంబరపడిపోతారు. మనం ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్లే మనకి బంగారం లాంటి ఆఫర్ ఇచ్చారని అంటుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలని వదలకూడదని చెబుతుంది పారు. ఈ ఛాన్స్‌ని జ్యోత్స్న చాలా బాగా వాడుకుంటుందని అంటుంది. ఇంతలో దక్షిణామూర్తికి స్పృహ రావడంతో కార్తీక్, దీపలు వెళ్లిచూస్తారు. మీ కుటుంబానికి నేను శత్రువునని తెలిసినా రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు.. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని అంటాడు దక్షిణామూర్తి. నువ్వు రుణపడి ఉండాల్సింది నాకు కాదు.. మేం హాస్పిటల్‌లో జాయిన్ చేసింది మేమే, కానీ నీకు రక్తం ఇచ్చింది మా తాత శివన్నారాయణ. ఇప్పుడు నువ్వు కళ్లు తెరిచి మాతో మాట్లాడటానికి కారణం ఆయనే అంటాడు కార్తీక్. ఆ మాటలు వినగానే దక్షిణామూర్తి కంటతడి పెడతాడు.
నా చావు చూడాలనుకున్న ఆయన నాకు ప్రాణం పోశారా? నేను నమ్మలేను అంటాడు దక్షిణామూర్తి. దీనినే విధిరాత అంటారు.. మనం నమ్మకపోయినా ఎలా రాసుంటే అలా జరుగుతుందని చెబుతాడు కార్తీక్. నీకు అర్జెంట్‌గా బ్లడ్ ఎక్కించకపోతే చనిపోతావని డాక్టర్ గారు చెప్పారు.. సరిగ్గా అదే సమయంలో తాత ఎందుకు రావాలి? మీరు మీరు తేల్చుకోవాల్సిన రుణాలు మిగిలిపోయాయి కాబట్టి అని అంటాడు కార్తీక్. నీకు అని తెలియక మా తాత బ్లడ్ ఇచ్చాడు.. కానీ అడిగితే అబద్ధం చెప్పలేనని చెబుతాడు. డ్రైవర్‌ని అడిగితే మీ గురించి ఏం తెలియదు అన్నాడు.. ఎవరో చెబితే వాళ్లని పిలుస్తానని అంటుంది దీప.
నిజంగానే పిలుస్తావా? అయితే అడ్రస్ చెబుతాను వాళ్లని పిలవమని అంటాడు. ఆ అడ్రెస్ వినగానే అది మన తాత ఇల్లు అని చెబుతాడు కార్తీక్. ఆ ఇంట్లోనే నా కూతురు ఉంటుంది. వెళ్లి తనకి చెప్పండి.. వీలైతే దగ్గరుండి తీసుకురమ్మని చెబుతాడు దక్షిణామూర్తి. మా అత్త తప్పించి నీకు సంబంధించిన వాళ్లు ఎవరు లేరా అని కార్తీక్ అడగ్గా.. ఈ ప్రశ్న వెళ్లి మీ తాతని అడగమని అండాడు దక్షిణామూర్తి. నా ప్రాణాలు కాపాడటానికి మీరే కారణమయ్యారని తెలిస్తే మీ తాత మిమ్మల్ని క్షమించడు, మీరు వెళ్లిపోండి అని అంటాడు దక్షిణామూర్తి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications