Karthika Deepam 2 May 27th: కార్తీక్, దీపలని ఇరికించిన జ్యోత్స్న.. మనవడిని వెలేసిన శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

గుడికి వెళ్లి వస్తున్న దీప, కార్తీక్‌లను దారిలో దక్షిణామూర్తి చూసి కార్తీక్.. కార్తీక్ అని పిలుస్తూ పరిగెత్తుతాడు. కార్తీక్ తిరిగి చూసేసరికి దక్షిణామూర్తిని లారీ ఢీకొట్టడంతో కిందపడిపోయి రక్తం కారుతుంది. దాంతో వెంటనే పెద్దాయనని ఆసుపత్రిలో చేర్పిస్తారు కార్తీక్, దీప. తాత కుటుంబానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని డ్రైవర్‌ని కార్తీక్ అడగ్గా అతను తెలియదని చెబుతాడు. గుడికి వెళ్లి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కార్తీక్, దీపలకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. గుడి నుంచి వస్తుంటే తెలిసిన వాళ్లు ఒకరికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయనని ఆసుపత్రిలో చేర్పించామని చెబుతాడు కార్తీక్.

శ్రీధర్ గుండె బాగా వీక్‌గా ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని శివన్నారాయణతో చెబుతాడు డాక్టర్. అక్కడి నుంచి బయటికొస్తున్న శివన్నారాయణ, శ్రీధర్‌లకు కార్తీక్, దీపలు కనిపించడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఏం జరిగింది? చేతులకి రక్తం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. గుడి నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. అతనిని ఇక్కడే చేర్పించామని చెబుతుండగా డాక్టర్ వచ్చి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని చెబుతాడు. నాది ఏ పాజిటివ్ గ్రూపేనని నేను ఇస్తానని అంటాడు శివన్నారాయణ. యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసేందుకు లోపలికి వెళ్లిన శ్రీధర్‌కు ఐసీయూలో దక్షిణామూర్తి కనిపించడంతో షాక్ అవుతాడు. పరుగు పరుగున వచ్చి నువ్వు కాపాడింది, మీ తాతయ్యతో రక్తం ఇప్పించింది దక్షిణామూర్తి అని తెలిస్తే శివన్నారాయణ గారి కోపాన్ని తట్టుకోలేవని వార్నింగ్ ఇస్తాడు. ఇంటికొచ్చిన శ్రీధర్.. జరిగినదంతా కాంచనకి చెబుతుండగా జ్యోత్స్న, పారులు వింటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 27వ తేదీ 681వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 681 May 27th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన కార్తీక్‌తో నాకు భయంగా ఉందని అంటుంది దీప. దక్షిణామూర్తి తాతకు శివన్నారాయణ తాత బ్లడ్ ఇచ్చిన విషయం నీకు, నాకు, మా నాన్నకి, ఆసుపత్రిలో ఉన్న తాతకి తప్పించి ఎవరికీ తెలియదని అంటాడు కార్తీక్. కార్తీక్, దీపలు లోపలికి వచ్చేసరికి ఇంట్లో వాళ్లంతా కూర్చొని ఉంటారు. బావ చేసిన మంచి పనిని ప్రశంసించాలని జ్యోత్స్న వెయిట్ చేస్తోందని చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నకి ఏదో తెలిసిపోయిందేమోనని భయంగా చెబుతుంది దీప. ఈరోజు వీళ్లు ఒక ప్రాణాన్ని కాపాడారు.. అందరూ మెచ్చుకోవాల్సిందేనని జ్యోత్స్న చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. ఎవరో దారిపోయిన పోయేవారికి యాక్సిడెంట్ అయితే వాళ్లని హాస్పిటల్‌లో జాయిన్ చేయించి.. రక్తదానం ఇప్పించి ప్రాణాలు కాపాడారు. ఈ మంచి పనిలో తాతకి కూడా భాగం ఇవ్వాల్సిందే అంటుంది జ్యోత్స్న.

ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే తాతకే చెప్పాలి.. తాత బ్లడ్ ఇవ్వకపోయుంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదని చెబుతాడు కార్తీక్. నువ్వు చాలా మంచివాడివి, కానీ ఈరోజు నీ మంచితనం చూశానని అంటుంది జ్యోత్స్న. నాది కూడా ఏ పాజిటివ్ బ్లడ్ కాబట్టి వెంటనే ఇచ్చేశాను.. దానికి తోడు రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అంటాడు శివన్నారాయణ. రక్తదానం చేసినప్పుడు ఎవరికి రక్తదానం చేశావో చూడాల్సిందని జ్యోత్స్న అనడంతో కార్తీక్, దీప, శ్రీధర్, కాంచనలు షాక్ అవుతారు. నువ్వు తాతకి ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. అతనెవరికో మీ తాత బ్లడ్ ఇస్తే.. మీ అమ్మ.. మీ తాతకి ఎందుకు రుణపడి ఉండాలని ప్రశ్నిస్తుంది పారు.

కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కదా అని జ్యోత్స్న అనడంతో కార్తీక్, దీప, కాంచన, శ్రీధర్‌లు షాక్ అవుతారు. నేను నీకు క్లారిటీ ఇవ్వడానికి ముందు.. మనం దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్దామని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాట వినగానే శివన్నారాయణ కోపంతో ఊగిపోతాడు. దక్షిణామూర్తి అనే ఆయన నాకు తాత కాబట్టి అని జ్యోత్స్న అనగానే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. చచ్చిన మనిషితో బంధం కలుపుకోవాల్సిన అవసరం మనకి లేదని చెబుతుంది. అతనిని నువ్వు తండ్రి అనుకోకపోవచ్చు కానీ.. తాతకి వియ్యంకుడని అంటుంది. ఆ మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని మండిపడతాడు దశరథ.

మీరు వద్దు అనుకున్నా.. ఆ మనిషికి ఇంటికి ఏ బంధం లేదా అని జ్యోత్స ప్రశ్నిస్తుంది. సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే చచ్చినా చేయనని అంటాడు శివన్నారాయణ. అలాంటి పరిస్ధితే వస్తే సహాయం చేయడానికి ముందు ఈ శివన్నారాయణ చస్తే మేలని అనుకుంటానని అంటాడు. సాయం చేయడానికే నువ్వు ఇంత బాధపడితే.. అదే ప్రాణాలు కాపాడాల్సి వస్తే అని జ్యోత్స్న అడగ్గా.. నా కంఠంలో ఊపిరి ఉండగా భగవంతుడిని ఆ పరిస్ధితి తీసుకురావొద్దని వేడుకుంటానని చెబుతాడు శివన్నారాయణ. మీకు తెలియకుండా అలాంటి పని మీ చేత ఎవరైనా చేయిస్తే ఏం చేస్తారని జ్యోత్స్న అడగ్గా.. చెప్పు తీసుకుని కొడతానని అంటాడు శివన్నారాయణ. అయితే నీ మనవడిని కొట్టు అంటుంది జ్యోత్స్న.

తాత హాస్పిటల్‌లో బ్లడ్ ఇచ్చింది ఎవరికో కాదు దక్షిణామూర్తికి అని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని కార్తీక్‌ని నిలదీస్తాడు శివన్నారాయణ. నిజమేనని కార్తీక్ చెప్పడంతో మనవడిని లాగిపెట్టి కొడతాడు పెద్దాయన. వాడు నా శత్రువు అని తెలుసు.. అలాంటివాడి ప్రాణాలు నేనే కాపాడేలా చేశాడు నీ కొడుకు ఏం చేయమంటావు అని ప్రశ్నిస్తాడు. తెలిసికూడా నువ్వు రక్తం ఇవ్వకుండా ఆపలేదంటే ఆ మనిషితో బావ కలిసిపోయాడేమోనని పెద్దాయనని మరింత రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఆ దరిద్రుడిని తాత అని పిలిచిన నోటితోనే నన్ను కూడా తాత అని పిలుస్తావా? జీవితంలో క్షమించలేని తప్పు చేశావని మండిపడతాడు శివన్నారాయణ. నిన్ను జీవితాంతం వెలేయడానికి ఈ తప్పులు చాలని అంటాడు.

నాకంటే వాడే నీకు ఎక్కువైనప్పుడు బయటికి పో... శివన్నారాయణ అనే తాత నీకు ఉన్నాడని మరిచిపో అని కార్తీక్‌ని గెంటేస్తాడు శివన్నారాయణ. నీ మేనల్లుడు నాతో పాపం చేయించాడని సుమిత్రతో అంటాడు పెద్దాయన. నువ్వు కోరుకున్నట్లే నేను వెళ్లిపోతాను. కానీ నీతో కొంచెం మాట్లాడాలని శివన్నారాయణ కాళ్ల దగ్గర కూర్చొంటాడు. ఇప్పటి వరకు చేసింది చాల్లేదా అని మండిపడుతుంది జ్యోత్స్న. మరిచిపోతే అయిపోయే చిన్న విషయాన్ని అందరికీ చెప్పి బాధపెట్టింది నువ్వేనని అంటుంది కాంచన. మీరైతే నిజాలన్నీ చాటుగా చెప్పుకుంటారని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అంటే ఈ నిజం కాంచనకి తెలుసా అని పారు మరింత రెచ్చగొడుతుంది.

అత్తకి మావయ్య చెప్పాడని జ్యోత్స్న అంటుంది. శ్రీధర్‌కి తెలిసే వాళ్ల మావయ్య గారికి చెప్పలేదా అని ఫైర్ అవుతుంది పారు. కొడుకు చేసిన పాపాన్ని కడుపులోనే దాచుకోవాలని అనుకున్నాడు. కానీ కట్టుకున్న భార్య దగ్గర నిజం దాచలేకపోయాడని జ్యోత్స్న చెబుతుండగా కార్తీక్ కోపంతో ఊగిపోతాడు. పదేళ్ల వయసులో నువ్వు నేర్పించిన ధర్మాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నా.. ప్రాణం పోతుంటే మనిషిని కాపాడాలని చెప్పావు. అత్త ప్రాణాలు కాపాడిన దీపకి ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడ్డారు. నా ప్రాణాలు కాపాడిన జ్యోత్స్నకి నేను జీవితాన్ని ఇచ్చాను. నీ మనవడు రోడ్డుపక్కన చావు బతుకుల్లో ఉంటే దీపే కాపాడింది. నా చెల్లెలు ప్రాణాలు తీసుకోబోతుంటే స్వప్నకి-కాశీకి దీప పెళ్లి చేయించింది.

మా నాన్నకి, పారుకి దీపకి పడదు.. కానీ తను మాత్రం ప్రేమని పంచింది. మన శత్రువులు మనకి ఎంత అన్యాయం చేసినా ఎవరి మీదా మనం ప్రతీకారాలు తీర్చుకోలేదని గుర్తుచేస్తాడు కార్తీక్. నీలో ఉన్న మానవత్వాన్ని నువ్వు చంపుకోలేదు. నీకు మనిషి విలువ, ప్రాణం విలువ తెలుసు.. కొనఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే వాడి ప్రాణాన్ని కాపాడాలని నువ్వు చెప్పిన ధర్మంతోనే నేను బతుకుతున్నాను. ఆ ధర్మమే తప్పంటే చెప్పు.. ఇప్పటి నుంచి నా కళ్లముందు పోయే ఏ ప్రాణాన్ని కూడా కాపాడను అంటాడు కార్తీక్. రోడ్డు మీద నా కళ్లముందు రక్తం మడుగులో ఉన్న ఒక మనిషి ప్రాణం పోకూడదనే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. నా స్థానంలో నువ్వుంటే కాపాడతావా? చావని అని వదిలేస్తావా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.

మాటలతో మనిషిని మార్చాలని చూస్తున్నావా అని జ్యోత్స్న మండిపడుతుంది. అక్కడ చావు బతుకుల్లో ఉన్నది నీ తాత.. నీ తల్లిని కన్న తండ్రి అంటాడు కార్తీక్. నీ తండ్రి నీ దృష్టిలో చచ్చిపోయాడు.. నీ కళ్లముందే ఒక మనిషి ప్రాణం పోపతుంటే మనిషిని చూస్తావా? శత్రువుని చూస్తావా అని సుమిత్రను అడగటంతో ఆమె షాక్ అవుతుంది. ఈ ఇల్లు ఒక దేవాలయం.. ఇంట్లో ఉన్న వాళ్లంతా మానవత్వం ఉన్న వాళ్లే. దక్షిణామూర్తి తాత ఎలాంటి వాడో నాకు తెలియదు.. కానీ నువ్వు ఈరోజు అతనికి ప్రాణం పోసి, అతనికంటే గొప్పవాడివి అయిపోయావు అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X