Karthika Deepam 2 May 28th:కార్తీక్‌ని క్షమించిన శివన్నారాయణ.. తాత ముందు జ్యోత్స్న పాపాలచిట్టా విప్పిన సూరజ్
Photo Courtesy: JioHotstar
హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన కార్తీక్, దీపలు భయం భయంగా లోపలికి వెళ్తారు. అప్పటికే శివన్నారాయణ కుటుంబం మొత్తం హాల్‌లో కూర్చొని ఉంటుంది. మీరిద్దరూ చేసిన మంచి పనిని ప్రశంసించాలనే మనవాళ్లని ప్రిపేర్ చేశానని చెబుతుంది జ్యోత్స్న. ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే దానికి తాతకే చెప్పాలి.. ఆయన బ్లడ్ ఇవ్వకపోయుంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదని అంటాడు కార్తీక్. రక్తదానం చేసినప్పుడు నువ్వు ఎవరికి చేశావో కూడా చూడాల్సిందని జ్యోత్స్న అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మా అమ్మ కూడా తాతకి జీవితాంతం రుణపడి ఉండాలని జ్యోత్స్న అంటుంది.
కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, ముందు దక్షిణామూర్తి తాత దగ్గరికి వెళ్దామని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాట వినగానే శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నువ్వు హాస్పిటల్‌లో బ్లడ్ ఇచ్చింది దక్షిణామూర్తి తాతకేనని జ్యోత్స్న చెప్పడంతో రగిలిపోయిన పెద్దాయన.. కోపంతో మనవడి చెంప పగలగొట్టి జీవితంలో నీ ముఖం నాకు చూపించొద్దని గెంటేస్తాడు. చావు బతుకుల్లో శత్రువు ఉన్నాసరే అతనిని కాపాడాలని నువ్వు చెప్పిన ధర్మం ప్రకారమే నేను తాతని కాపాడానని శివన్నారాయణతో అంటాడు కార్తీక్. దక్షిణామూర్తి తాతతో నీకు ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆయనకి ప్రాణం పోసి నువ్వు అతని కంటే గొప్పవాడివి అయిపోయావని చెబుతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 28వ తేదీ 682వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించిన ధర్మం, పాటించమని చెప్పిన విలువలు తప్పంటే చెప్పు నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని కార్తీక్ వెళ్తిపోతుండగా శివన్నారాయణ అతని చేయి పట్టుకుని ఆపుతాడు. ప్రాణం పోసినవాడు శత్రువు కంటే గొప్పవాడు. నేను నా శత్రువుకి ప్రాణం పోసి అతని కంటే గొప్పవాడిని అయ్యాను. నువ్వు నా కళ్లు తెరిపించడంతో పాటు ఈ శివన్నారాయణ ఆదర్శాలను కూడా నిలబెట్టావని మనవడిని మెచ్చుకుంటాడు. నీ పెంపకం చూస్తుంటే నాకు గర్వంగా ఉందని కాంచనతో చెబుతాడు శివన్నారాయణ. సుమిత్ర, దశరథలు కూడా కార్తీక్ బుగ్గనిమిరి వెళ్లిపోతారు. శ్రీధర్ కూడా కొడుకుని హత్తుకుని.. మన చుట్టూ మన మేలుని కోరుకునేవారే కాదు.. మన నాశనాన్ని కోరుకునే వారు కూడా ఉంటారని జాగ్రత్తలు చెబుతాడు. పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా అలాగే తయారయ్యారని కాంచన అనడంతో పారు, జ్యోత్స్నలు రగిలిపోతారు.
కాశీ లోపలికి వస్తుండగా వేడి నీళ్లు తీసుకెళ్తున్న కావేరిని చూసి ఏం జరిగిందని అడుగుతాడు. స్వప్నకి బాగా జ్వరం వచ్చింది.. టాబ్లెట్స్ వేశాను, వేడినీళ్లు కాపడం పెడదామని వెళ్తున్నానని చెబుతుంది కావేరి. అయితే నేను పెడతానని వేడినీళ్లు తీసుకుని స్వప్న దగ్గరకి వెళ్తాడు. జ్వరంతో విలవిలలాడిపోతున్న స్వప్నని చూసి ఆమె కాళ్లు ఒడిలో పెట్టుకుని కాపడం పెడతాడు. అది చూసి స్వప్న పొంగిపోతుంది. మీ అమ్మగారు బతికుంటే నీలాంటి మంచి కొడుకుని కన్నందుకు సంతోషపడేదని చెబుతుంది స్వప్న. మా అమ్మ లేకపోతే ఏముంది.. నువ్వు ఉన్నావు కదా? దేవుడు నీ ద్వారా మా అమ్మకి తెలిసేలా చేస్తాడని అనడంతో స్వప్న కంటతడి పెడుతుంది.
శివన్నారాయణ ముందు కార్తీక్, దీపలను ఇరికించాలన్న ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో జ్యోత్స్న, పారులు రగిలిపోతారు. నేను అనుకున్నది జరగలేదని జ్యోత్స్న చెబుతుంది. ఆ కార్తీక్ గాడు పెద్ద మాయలోడు. మాటలతో మీ తాత మనసునే మార్చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది పారు. ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే.. ఆ కార్తీక్ గాడు నిన్ను వదిలిపెట్టడని చెబుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లోకి ఏ సమస్య అడుగుపెడుతుందోనని పారు అంటుండగా సూరజ్ అప్పుడే శివన్నారాయణ ఇంట్లోకి వస్తాడు. అతనిని చూడగానే కార్తీక్ చాలా సంతోషిస్తాడు. నువ్వేంటీ మా తాత ఇంటికి వచ్చావు అని ప్రశ్నిస్తాడు. నష్టపరిహారం కోసమని సూరజ్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
ఆ రోజు జరిగినదానికి నష్టపరిహారం కోసమే వచ్చాను, నేను ఈ ఇంటి పెద్దాయనతో మాట్లాడాలని చెబుతాడు సూరజ్. నీది సూపర్ టైమింగ్ బ్రదర్ అంటాడు. ఇంతలో దీప రావడంతో జరిగేది చూడమని చెప్పి అందరినీ పిలుస్తాడు. ముందు నీ మనవరాలిని పిలవమని అంటాడు. ఇంతలో శివన్నారాయణ వచ్చి ఎందుకలా కేకలు వేస్తున్నావు, ఈ అబ్బాయి ఎవరు? అని అడుగుతాడు. పెద్ద మేడం గారు వస్తే అందరికీ క్లారిటీ వస్తుందని అంటాడు కార్తీక్. ఇంతలో కిందకి వచ్చిన జ్యోత్స్న.. ఇంట్లో సూరజ్‌ని చూసి షాక్ అవుతుంది. జ్యోత్స్న కోసం ఈ ఇంటికి వచ్చిన మొట్టమొదటి వీఐపీ ఇతనే అంటుంది పారు. ఇంతకుముందు కూడా పోలీసులు వచ్చారని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
మంచి విషయాల్నే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.. ఇంతకీ ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడని పారు అడగ్గా.. కంప్లయంట్ ఇవ్వడానికి అని సూరజ్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీ మనవరాలు జ్యోత్స్నగారి వల్ల నాకు నష్టం జరిగింది, నష్టపరిహారం కోసం వచ్చానని అంటాడు సూరజ్. జ్యోత్స్న వల్ల నీకేం నష్టం జరిగిందని దశరథ అడగ్గా.. మార్కెట్ రోడ్‌లో ఉన్న సూరజ్ హెల్దీ ఫుడ్స్ నాదే, జ్యోత్స్న గారు బలవంతంగా ఖాళీ చేయించారు. ఖాళీ చేయించడం కంటే నాశనం చేయించారని చెబితే బాగుంటుందని అంటాడు సూరజ్. ఆ మాటలతో రగిలిపోయిన జ్యోత్స్న.. ఎవర్రా నాశనం చేసింది అంటూ మండిపడుతుంది.
ఆప్ట్రాల్ రోడ్డు పక్కన జ్యూస్ అమ్ముకునే వీడు మనింటికొచ్చి గొడవ చేయడమా? వీడెంత వీడి బతుకెంత? ఎస్ఐగారికి ఫోన్ చేసి వీడి మీద న్యూసెన్స్ కేసు పెట్టమని చెప్పండి, నాలుగు లాఠీ దెబ్బలు పడితేనే ఇలాంటి వాళ్లకి బుద్ధి వస్తుందని అంటుంది జ్యోత్స్న. నేను ఇచ్చిన పని కంప్లయంట్ ఇవ్వడం మాత్రమేనని చెబుతాడు సూరజ్. తప్పు చేసిన వాళ్లకి శిక్షపడాలన్నదే ఈ శివన్నారాయణ నీతి ఏం జరిగిందో చెప్పమని అంటాడు శివన్నారాయణ. నాకు నష్టం జరిగింది, నష్టపరిహారం కావాలని అడుగుతాడు సూరజ్. మార్కెట్ రోడ్డులో నా స్టాల్ పెట్టుకోవడానికి వెండర్ కార్డ్, బిజినెస్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక రోజున మున్సిపల్ ఆఫీసర్ వచ్చి నా స్టాల్‌ని కంప్లీట్‌గా డామేజ్ చేశారు. చేశారు కాదు.. జ్యోత్స్న గారు చేయించారని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
ఫేక్ లైసెన్స్‌లతో ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ పెడితే ఇలాగే ఖాళీ చేయిస్తారని అంటుంది జ్యోత్స్న. మీరే ఇదంతా ఖాళీ చేయించారు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉందని అంటాడు సూరజ్. ఆ సాక్ష్యం ఏంటీ? అని జ్యోత్స్న అడగ్గా.. ఆ సాక్ష్యం ఇదేనని కార్తీక్ వైపు చూపించడంతో అంతా షాక్ అవుతారు. నా స్టాల్‌ని మున్సిపాలిటీ వాళ్లు ఖాళీ చేయిస్తున్నప్పుడు కార్తీక్ గారు అక్కడే ఉన్నారు. నేనే ఇదంతా చేపించానని జ్యోత్స్న గారే నాతో చెప్పారు, దీనికి కార్తీక్ గారే సాక్ష్యమని అంటాడు సూరజ్. సూరజ్ చెప్పేది నిజమేనా అని శివన్నారాయణ అడుగుతుండగా ఏం చెప్పొద్దని జ్యోత్స్న సైగలు చేస్తుంది. సూరజ్ చెప్పేది నిజమే, పెద్ద మేడం గారే సూరజ్ స్టాల్‌ని తీయించేశారని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
నేను నిన్ను తిట్టించానని, నువ్వు నన్ను తిట్టించాలని అనుకుంటున్నావా? అని కార్తీక్‌పై రగిలిపోతుంది జ్యోత్స్న. అన్నింటికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి.. స్టాల్‌ని కూల్చేస్తున్న వీడియోలు శివన్నారాయణకి చూపిస్తాడు సూరజ్. పబ్లిక్‌లో నేను సంపాదించుకున్న పరువు పోయింది, నా స్టాల్ నాశనమైంది. మేడంగారు నా మీద కోపంతో నా ఒంటి మీద, నా కడుపు మీద కొట్టారు. దాని కింద కామెంట్స్‌ని కార్తీక్ చదివి వినిపించడంతో సుమిత్ర రగిలిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications