Karthika Deepam 2 May 29th: జ్యోత్స్న బతుకు మీద కొట్టిన సూరజ్.. సీఈవో నుంచి వెయిటర్‌గా జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించిన మంచి, మానవత్వం తప్పని చెబితే నేను ఇప్పుడే వెళ్లిపోతాను. కొనఊపిరితో ఉన్నది శత్రువే అయినా సరే కాపాడమని నువ్వు చెప్పినది అబద్ధమైతే ఇప్పుడే వెళ్లిపోతానని అంటాడు కార్తీక్. దాంతో మనవడిని ఆపిన శివన్నారాయణ.. నువ్వు నా ధర్మాన్ని, నా విలువలని కాపాడావని మెచ్చుకుంటాడు. కాంచన పెంపకంపైనా ప్రశంసలు కురిపిస్తాడు. స్వప్నకి జ్వరం రావడంతో ఆమెకు దగ్గరుండి కాళ్లకు కాపాడం పెడతాడు కాశీ. భర్త తన మీద చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతుంది స్వప్న.

మనం వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టిందని పారుతో అంటుంది జ్యోత్స్న. ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను కార్తీక్ గాడు వదిలిపెట్టడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది పారు. నీకు కొత్తగా ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని పారు చెబుతుండగా.. సూరజ్ ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. అతనిని చూసిన కార్తీక్.. ఎందుకొచ్చావని అడగ్గా నా నష్టపరిహారం కోసమని చెబుతాడు. ఇంతలో కార్తీక్ అందరినీ పిలవడంతో జ్యోత్స్న కూడా వచ్చి షాక్ అవుతుంది. మీ మనవరాలు నా పొట్ట మీద కొట్టిందని, నా స్టాల్‌ను బలవంతంగా ఖాళీ చేయించిందని వీడియోతో సహా చూపిస్తాడు సూరజ్. అది చూసిన శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 29వ తేదీ 683వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 683 May 29th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నేను ఎంతో కష్టపడి క్వాలిటీ ఫుడ్ సప్లయ్ చేస్తుంటే జ్యోత్స్న గారు చేసిన పని వల్ల నేను దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. మేడం గారు చేసిన ఒక ఫోన్ కాల్ ఖరీదు.. నా ఫు‌ట్‌పాత్ వెండర్ జీవితం, జనంలో సంపాదించుకున్న నమ్మకం. నాకు న్యాయం కావాలి, సరైన సమాధానం కావాలి, జరిగిన దానికి నష్టపరిహారం కావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తానని చెప్పారు కదా మీ మాట నిలబెట్టుకోండి, మీ పెద్దరికాన్ని కాపాడుకోండి అని శివన్నారాయణని అడుగుతాడు సూరజ్. అన్ని ఇప్పటికిప్పుడే అంటే బాగోదని కార్తీక్ చెబుతాడు. సాయంత్రం వరకు టైం ఇస్తాను.. ఈ లోపే మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని సూరజ్ వెళ్లిపోతాడు.

వాడి మాటలు నమ్మొద్దు.. బయటివాళ్లకే బావ సపోర్ట్ చేస్తాడు. అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాల్ని మనం ఎంకరేజ్ చేస్తే రోజుకొకడు ఇంటికొచ్చి ఇలాగే గొడవ చేస్తాడని అంటుంది జ్యోత్స్న. నువ్వు అర్జెంట్‌గా తట్టాబుట్టా సర్దుకుని ఏ ప్రపంచ యాత్రకో పొమ్మని జ్యోత్స్నపై మండిపడుతుంది పారు. జరిగిన దానిలో నా తప్పేం లేదని అంటుంది జ్యోత్స్న. నీ తప్పు లేకపోతే ఇల్లు వెతుక్కుంటూ వాడు నీకోసం ఎందుకు వస్తాడని ప్రశ్నిస్తుంది పారు. దారినపోయే దరిద్య్రాలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నావు.. వాడు ఎవడైనా సరే నువ్వెందుకు గొడవపడ్డావు. ఎప్పుడూ ఏదో ఒక పెంట.. అయితే కార్తీక్‌గాడితో, లేదంటే దీపతో, వైరాగాడితో. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి.. గొడవ పెట్టుకోవడానికి మరొకరు అంటుంది పారు.

వాడితో ప్లాట్‌ఫాం బతుకే అయినా మాటలు మాత్రం మీర్జాపూర్ జమీందార్‌లా ఉంటాయి. అలాంటి నేల టికెట్ గాడికి మనలాంటి డబ్బున్న వాళ్లంటే ఈర్ష్య. మనం ఖరీదైన జీవితాన్ని గడుపుతుంటే చూసి ఓర్చుకోలేడని అంటుంది జ్యోత్స్న. మనం గాజులాంటి వాళ్లం.. ఎవరు రాయి విసిరినా పగిలేది మన అద్దమే అంటుంది జ్యోత్స్న. ఈసారి మాత్రం పగిలేది వాడికి అని చెప్పడంతో పారు టెన్షన్ పడుతుంది. మర్యాదగా సారీ చెప్పమనగా.. ఆ పని నేను చచ్చినా చేయనని అంటుంది జ్యోత్స్న. ఇది ఎప్పుడూ ఇంతే.. ఏదో ఒక పనిచేయడం అందరి చేతా తిట్లు తినడమని మండిపడుతుంది.

అసలు నీకు, ఆ ఫుట్‌పాత్ వెండర్‌కి గొడవ ఏంటీ? అతని స్టాల్‌ని నువ్వెందుకు ఖాళీ చేయించావని అడుగుతారు శివన్నారాయణ, దశరథ. వీడియోతో సహా ఆధారాలు చూపిస్తుంటే సీరియస్‌గా తీసుకోవద్దు అంటావేంటీ అని కాంచన మండిపడుతుంది. మనం ఉన్నది ఏఐ టెక్నాలజీలో అలాంటివి నాకు ఫేవర్‌గా వంద చూపిస్తాను, నువ్వు నమ్ముతావా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. తప్పు నీదేనని మీ బావే సాక్ష్యం చెప్పాడు కదా అంటుంది సుమిత్ర. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుంటే లోకం చూడలేదు అన్నట్లుగా ఉంది. నువ్వు చేసిన పని వీడియోతో సహా బయటపడినప్పుడు నిజం ఒప్పుకోవాలని చెబుతాడు కార్తీక్.

మీ ఆవిడని సీఈవో చేయడానికి నా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదని అంటుంది జ్యోత్స్న. గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదని చెబుతుంది పారు. ఏదైనా చిన్న తప్పు జరిగినా బయటి వాళ్ల ముందు మనవాళ్లని తక్కువ చేయకూడదు కదా అని చెబుతుంది పారు. అసలేం జరిగింది? ఆ అబ్బాయి జ్యోత్స్నకి ఎలా తెలుసు? ఎందుకు తన ఫ్రూట్ స్టాల్ పాడు చేయాలని అనుకుంది అని అడుగుతాడు శివన్నారాయణ. కేవలం ఇగో వల్లే ఇదంతా జరిగిందని కార్తీక్ చెబుతాడు. అయితే వాళ్ల మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా అని అడుగుతాడు శివన్నారాయణ. వాడికి తెలియని కథలు ఏముంటాయి.. ప్రతి ఒక్కరి కథలోనూ వాడుంటాడని అంటుంది పారు.

దాంతో శివన్నారాయణ దగ్గర పెన్ను తీసుకుని జ్యోత్స్న, సూరజ్‌ల మధ్య ఏం జరిగిందో అర్ధమయ్యేలా చెబుతాడు కార్తీక్. మీకు పక్కవాళ్ల వస్తువుల మీద అంత మోజు ఎందుకు? ఆ రోజు అలా మొదలైన గొడవని జ్యోత్స్న మరిచిపోలేదు. కారులో ఎక్కించుకుని రాంగ్ ప్లేస్‌లో వదిలిపెట్టింది. వాడు నా కారు కీస్, మొబైల్ తీసుకుపోయాడని చెబుతుంది జ్యోత్స్న. మీరు పగ తీర్చుకోవాలని అనుకున్నారు. అతను మీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇదంతా మైండ్‌లో పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేసి అతని స్టాల్ తీయించేసిందని చెబుతాడు కార్తీక్. బొమ్మల షాపులో మొదలైన గొడవ ఇంట్లో పంచాయతీ వరకు వచ్చిందని అంటాడు.

నువ్వు అడిగింది అందరూ ఇచ్చేయలా? ఇవ్వకపోతే పగ సాధిస్తావా? తప్పు దీనిదేనని తేలింది కదా మీరే సరిచేయమని చెబుతుంది సుమిత్ర. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోవడం కూడా ఒక తప్పే, దీనికి మనందరికీ శిక్ష పడాల్సిందేనని అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న దగ్గరికి వెళ్లిన దీప.. నువ్వు చేసే పనులకు నా కుటుంబం బాధపడుతుందని అంటుంది. నేను చేసింది తప్పేనని ఆ సూరజ్ కాళ్లు పట్టుకోమని దీప చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. సూరజ్ గాడు ఒక శాడిస్ట్.. అర్ధరాత్రి నన్ను రోడ్డు మీద వదిలేశాని అంటుంది జ్యోత్స్న. నా భర్త మంచివాడు కాబట్టి.. నువ్వేం చేసినా క్షమించాడు. కానీ సూరజ్ మా బావ లాగా అంత ఓర్పు, సహనం ఉన్న మనిషి కాదు.. నువ్వు సారీ చెప్పకపోతే వాడే నీ జుట్టుపట్టుకుని కాళ్ల మీద పడేస్తాడని చెబుతుంది దీప. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదని అంటుంది జ్యోత్స్న.

సూరజ్‌ని పిలిపించి నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలు ఇస్తాడు శివన్నారాయణ. అయితే నాకిది సరిపోదని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. న్యాయం చేయలేదన్న చెడ్డపేరు మనకు వద్దని సుమిత్ర చెప్పడంతో ఇంకో 5 లక్షల రూపాయలు తీసుకురమ్మని పారుకి చెబుతాడు శివన్నారాయణ. డబ్బా కొట్టుకు 10 లక్షలా? అంటుంది పారు. కొన్నింటికి మనం విలువ కట్టలేమని చెబుతాడు పెద్దాయన. ఆ 10 లక్షలు కూడా నాకు సరిపోదని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నాకు డబ్బులు అవసరం లేదు, నేను నష్టపోయిన డబ్బు కంటే.. నష్టపోయిన మర్యాదే విలువైనది. నాకు నష్టపరిహారంగా నా మర్యాదని నాకు ఇప్పించండి అంటాడు సూరజ్.

అతను నా చేత సారీ చెప్పించుకోవాలని అనుకుంటున్నాడని జ్యోత్స్న అనడంతో .. సారీ సరిపోదని అంటాడు సూరజ్. మరి నీకు న్యాయం ఎలా చేయాలి? సూరజ్ విషయంలో నేను తప్పుచేశానని మా జ్యోత్స్న ఫ్లెక్సీ నీ షాప్ ముందు పెట్టమని అనేలా ఉన్నావని అంటాడు కార్తీక్. అదే చేయించమని చెబుతాడు సూరజ్. దీనికి నేను ఒప్పుకోను.. మా ఇంటి పిల్ల ఫోటోని ఫ్లెక్సీ వేయించమంటావా? ఇంకా నయం మా జ్యోత్స్నతో జ్యూస్‌లు సర్వ్ చేయమని చెప్పలేదని అంటుంది పారు. మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉందని అంటాడు సూరజ్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X